ఇండియన్లూ, ధ్యాంక్స్! -ఒబామా (వ్యంగ్యం)


రూపాయి విలువ దయనీయమైన పరిస్ధితిలో కొట్టుమిట్టాడుతోంది. రూపాయి విలువ తగ్గడం అంటే మన కొనుగోలు శక్తి తగ్గిపోవడం. అనగా మనం సంపాదించే ఆ నాలుగు రూకలకు ఇంకా ఇంకా తక్కువ సరుకులు రావడం. బెత్తెడు వేతనాల మధ్యతరగతి జీవులకు మరిన్ని కష్టాలు, మరిన్ని మానసిక (సామాజిక) వేదనలు, మరిన్ని అప్పులు, మరిన్ని….

కూలి జనం పరిస్ధితి ఇంకా ఘోరం. తాగుబోతు భర్తలు, తాగుబోతు తండ్రులను కలిగి ఉన్నవారి పరిస్ధితి చెప్పనే అవసరం లేదు.

రూపాయి విలువను కాపాడడానికి రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకుంటోందని పత్రికలు చెబుతున్నా, ఆ జోక్యం వాస్తవంలో రూపాయి ఒకేసారి భారీగా పడిపోడానికి బదులు కొద్ది కొద్దిగా పడిపోడానికి సహాయపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఫేస్ బుక్ లో దొరికింది ఈ అద్భుతమైన వ్యంగ్య రసాత్మక అంతర్జాల గ్రాఫిటీ సహిత వ్యాఖ్యానం! ఫేస్ బుక్ లో ‘మేడ్ ఇన్ ఇండియా’ పేజీ నిర్వాహకులు ఒక చేదు వాస్తవాన్ని జనం దృష్టికి తెచ్చినందుకు అభినందనీయులు.

బొమ్మ పైన క్లిక్ చేస్తే పెద్ద బొమ్మ చూడవచ్చు.

From facebook/made.in.india

From facebook/made.in.india

ఈ బొమ్మను అనువదిస్తే…

Dollar vs Rupee

7 thoughts on “ఇండియన్లూ, ధ్యాంక్స్! -ఒబామా (వ్యంగ్యం)

 1. అవును. నిజమే మరి. పాలకుల విధానాల వల్లే దేశం ఇలా అస్తవ్యస్తంగా ఉందని అనుకుంటాం. కానీ కొంతమంది ఆలోచనాపరులు కూడా దేశానికి చేస్తున్న మేలు ఏమీలేదనిపిస్తోంది.
  ఐతే జనాన్ని ఆలోచించే అవకాశాన్ని ఇవ్వకుండా….విష ప్రచారం చేయడం వల్లనే ఇదంతా…

  అవును….కోక్, పెప్పి, లాంటి వాటిని కొనడం తగ్గించాలని ఒక ఉద్యమమే రావాల్సిన అవసరం ఉందనుకుంటా.
  దేశ ఆర్ధిక రంగానికే కాదు. వ్యక్తి ఆరోగ్యానికి కూడా అది ఎంతోమేలు.

 2. వ్యంగ్యమేమిటండీ ఇది వాస్తవమైతే!… కాదు .. కాదు వ్యంగ్యం వాస్తవమైంది… .లేదు. ….. లేదు వాస్తవం వ్యంగ్యమైంది!

 3. sir these are the not the imported products and these are made in country and the companies mentioned above are foreign direct investments in India. These products are not like petroleum products , gold and fertilizers which we import resulting in trade deficit and causing the devaluation of the rupee….i think it is technically in correct…..i any thing wrong in my way of understanding means please correct me

 4. Hi Pavan

  In a way you are right. The point here is that these listed companies in the figure are just symbolic. Not the whole.

  Another thing is, these companies also export their profts to their home countries, which means our govt will be forced to shed some of it’s forex reserves.

 5. పాలకులు, పాలసీల కంటే ఫారిన్ వస్తువులంటే మనలో ఉన్న వ్యామోహం మొదటి కారణం. ఆమలాపురానికి దారెటో తెలియని అమాయకుడు కూడా అమెరికా వస్తువని చెప్పగానే ఆబగా కొనేస్తాడు. http://www.screentalent.wordpress.com

 6. సందేశం క్లుప్తం, యదార్ధం !
  అదే, ప్రపంచీకరణ పరమార్ధం !
  మన’ బంగారం’ మంచిది కాకపొతే ,
  స్వర్ణ కారుడిని తిడితే ఏమర్ధం ?!

 7. మన ప్రభుత్వాలన్నీ దళారీ స్వభావానికి చెందినవేగా. అందుకే . ప్రజలు ఏమైనా పర్వాలేదు మాకేంటి అనుకొంటాయి. వాటి స్వలాభం కోసం దేశాన్ని నాశనం చేయటానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయి.. దేశం బాగుండాలి అని కోరుకునేవాళ్ళు ఆచితూచి పనిచేస్తున్నారు.అందువల్లే ఇలాంటి పరిస్థితి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s