గుజరాత్ ముఖ్యమంత్రి, తమ తరపున భావి ప్రధానిగా బి.జె.పి నిలపనున్నదని పత్రికలు ఊహిస్తున్న నేత అయిన నరేంద్ర మోడి మెడపై మరో కత్తి వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇష్రత్ జహాన్, ఆమె స్నేహితుడు ప్రాణేశ్వర్ పిళ్లై అలియాస్ జావేద్ షేక్, మరో ఇద్దరు యువకుల బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఆయన పేరు వినిపిస్తోంది. కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో, గుజరాత్ పోలీసులు కలిసి ఉమ్మడిగా చేసిన కుట్ర ఫలితంగా నలుగురు అమాయకులు బూటకపు ఎన్ కౌంటర్ లో చనిపోయారని సి.బి.ఐ ఛార్జీ షీటులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ బూటకపు ఎన్ కౌంటర్ కు గుజరాత్ ముఖ్యమంత్రి అనుమతి ఉన్నదని కేసులో నిందితుడైన పోలీసు అధికారి డి.జి.వంజార చెప్పినట్లుగా మరో పోలీసు అధికారి తన సాక్ష్యంలో పేర్కొన్నట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.
ఇష్రత్ జహాన్, ప్రాణేశ్వర్ పిళ్ళై అలియాస్ జావేద్ షేక్, జీషన్ జోహార్, అంజాద్ ఆలీ రాణా అనే నలుగురు యువతీ యువకులు లష్కర్-ఏ-తోయిబా టెర్రరిస్టులనీ, వారు నరేంద్ర మోడిని హత్య చేయడానికి వస్తుండగా తాము పట్టుకున్నామనీ, తమపై వారు దాడి చేయడంతో ఎదురు కాల్పులు జరిపామనీ, ఆ కాల్పుల్లో వారు చనిపోయారని గుజరాత్ పోలీసులు ఒక కధ వినిపించారు.
ఇది కేవలం కట్టు కధ అనీ, వాస్తవానికి ఆ నలుగురుని వేరు వేరు చోట్ల నుండి పట్టుకొచ్చారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 2009లో తేల్చి చెప్పింది. మూడు రోజులపాటు వారిని బందీలుగా ఉంచుకుని, మత్తు ఇచ్చి, కళ్ళకు గంతలు కట్టి తెచ్చి దారుణంగా చంపారని తెలిపింది. దానితో గుజరాత్ హై కోర్టు కేసు విచారణను సి.బి.ఐకి అప్పజెప్పింది. సుదీర్ఘ విచారణలో అనేకసార్లు కోర్టు చేత మొట్టికాయలు తిన్న అనంతరం సి.బి.ఐ జులై 3 తేదీన చార్జి షీటు దాఖలు చేసింది.
ఈ ఛార్జీ షీటులో ఇద్దరు గుజరాత్ ఐ.పి.ఎస్ అధికారులు డి.జి.వంజార (డి.ఐ.జి), పి.పి.పాండే (అడిషనల్ డైరెక్టర్ జనరల్) నిందితులుగా సి.బి.ఐ స్పష్టం చేసింది. ఎస్.పి లు ఎన్.కె.అమీన్, జి.ఎల్.సింఘాల్, జె.జి.పర్మర్, తరుణ్ బారోట్ లను కూడా నిందితులుగా సి.బి.ఐ పేర్కొంది. ఐ.బి అధికారులు ఎటువంటి ఆధారాలు లేకుండా పుట్టించిన ఒక బూటకపు హెచ్చరిక (alert) ను ఆధారం చేసుకుని గుజరాత్ పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టారని సి.బి.ఐ చార్జి షీటులో పేర్కొంది.
గుజరాత్ లో డి.ఎస్.పి గా పని చేసి రిటైర్ అయిన డి.హెచ్.గోస్వామి ఇచ్చిన సాక్ష్యంలో నరేంద్ర మోడి ప్రస్తావన ఉన్నట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ఎన్ కౌంటర్ జరిగిన 2004లో ఆయన క్రైమ్ బ్రాంచిలో పని చేశారని తెలుస్తోంది. సి.ఆర్.పి.సి సెక్షన్ 164 కింద ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టులో ఇచ్చిన సాక్ష్యంలో ఆయన డి.జి.వంజారతో పాటు నరేంద్ర మోడి, అప్పటి గుజరాత్ హోమ్ మంత్రి అమిత్ షా ల పేర్లు పేర్కొన్నారు.
- ఇష్రాత్ జహాన్ కుటుంబం
- ఎన్కౌంటర్ స్పెషలిస్టు డి.జి.వంజార
- డెక్కన్ క్రానికల్ నుండి
- యు.పి.ఎ, ఎన్.డి.ఎ ల రాజకీయ క్రీడ
- రాజకీయ క్రీడలో సమిధలు
ఎన్.డి.టి.వి ప్రకారం:
ఎన్ కౌంటర్ జరగడానికి రెండు రోజుల ముందు జూన్ 12, 2004 తేదీన గోస్వామి తన సీనియర్ పోలీసు అధికారి జి.ఎల్.సింఘాల్ తో కలిసి అహ్మదాబాద్ లోని క్రైమ్ బ్రాంచి కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం గం. 7:30 – గం. 8:30 ల మధ్యలో వారు ఆ కార్యాలయానికి వెళ్ళగా ఆ సమయంలో అక్కడ ఇష్రత్ ఎన్ కౌంటర్ చేయబోతున్న విషయమై చర్చ నడుస్తోంది. ఇంటలిజెన్స్ బ్యూరో గుజరాత్ స్టేషన్ చీఫ్ గా ఉన్న రాజేంద్ర కుమార్ తో ఐ.పి.ఎస్ అధికారులు డి.జి.వంజార, పి.పి.పాండేలు ఇష్రత్ బృందాన్ని ఎలా ఎన్ కౌంటర్ చేయాల్సిందీ చర్చిస్తున్నారు.
చర్చ జరుగుతుండగా “ముఖ్యమంత్రితో ఈ విషయం మాట్లాడండి” అని రాజేంద్ర కుమార్ వంజార తో అంటుండగా గోస్వామి విన్నారు. ఆ తదుపరి రోజు గోస్వామి, సింఘాల్ తో కలిసి మళ్ళీ క్రైమ్ బ్రాంచి కార్యాలయానికి వెళ్లారు. ఇష్రత్ బృందాన్ని ఎన్ కౌంటర్ చేయడం పట్ల సింఘాల్, వంజారతో తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే వంజార్ సింఘాల్ అభ్యంతరాలను లక్ష్యపెట్టలేదు. “నాకు ముఖ్యమంత్రి, హోమ్ మంత్రుల నుండి అనుమతి లభించింది” అని వంజార పేర్కొన్నట్లు గోస్వామి తన సాక్ష్యంలో తెలిపారు.
అంటే అర్ధం స్పష్టమే. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, అప్పటి హోమ్ మంత్రి అమిత్ షా ల ప్రత్యక్ష అనుమతితోనే ఐ.బి అధికారులు, గుజరాత్ పోలీసు అధికారులు కుట్ర చేసి ఇష్రత్ బృందాన్ని బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేశారని గోస్వామి సాక్ష్యం ద్వారా అర్ధం అవుతోంది. ఐ.బి అధికారి రాజేంద్ర కుమార్ ఆధారాలు లేకపోయినా ఇష్రత్ బృందానికి టెర్రరిస్టులు అనే ట్యాగ్ తగిలించి లష్కర్-ఏ-తోయిబా సభ్యత్వం కూడా అంటగట్టి వారు మోడిని హత్య చేయబోతున్నారు అని ఒక బూటకపు హెచ్చరికను సృష్టించారని సి.బి.ఐ చెబుతున్నట్లుగా ఇప్పటికే పత్రికలు తెలిపాయి. అమాయక ముస్లిం యువతి, యువకులు ఒక భారీ రాజకీయ అధికార చదరంగంలో ఎలా పావులు కాగలరో, పావులుగా మారి కూడా టెర్రరిస్టులుగా ఎలా ముద్ర పడగలరో దీని ద్వారా అర్ధం చేసుకోవచ్చు.
అయితే, తన చార్జి షీటులో ఇష్రత్ బృందం టెర్రరిస్టులా కాదా అన్న విషయాన్ని సి.బి.ఐ చర్చించలేదని తెలుస్తోంది. ఇష్రత్ బృందం ఎన్ కౌంటర్ వాస్తవమైనదా లేక బూటకమా అన్నదే తాము తేల్చమని కోరాము తప్ప వాళ్ళు టెర్రరిస్టులా కాదా అని కోరలేదని, కాబట్టి టెర్రరిస్టు కోణం వదిలి ఎన్ కౌంటర్ కోణం పైనే దృష్టి కేంద్రీకరించి విచారణ పూర్తి చేయాలని గుజరాత్ హై కోర్టు సి.బి.ఐ ని గట్టిగా హెచ్చరించిందని కొద్ది వారాల క్రితం పత్రికలు నివేదించాయి.
ఇష్రత్ బృందం ఎన్ కౌంటర్ విషయంలో ఐ.బి అధికారుల పాత్ర గురించి మొన్నటి చార్జి షీటులో సి.బి.ఐ చర్చించలేదు. కానీ వారి పేర్లను ప్రస్తావించింది. ఐ.బి అధికారుల పాత్రను తాము అనుబంధ చార్జి షీటులో పొందుపరుస్తామని సి.బి.ఐ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. రాజకీయ కోణంతో పాటు అన్నీ కోణాలనూ తాము విచారిస్తామని సి.బి.ఐ చీఫ్ రాజేంద్ర సింగ్ చెప్పినట్లు ది హిందు తెలియజేయడం గమనార్హం.
విశేఖర్ గారు. ఒక్క ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటరే కాదు. సరిగ్గా విచారణ చేస్తే….చాలా వరకూ బూటకంగానే తేలుతాయి.
అంతకు ముందు హరేన్ పాండ్య హత్య కేసులోనూ……పాతబస్తీకి చెందిన కొందరు అమాయకులను బలి చేశారని ఆరోపణలు వచ్చాయి.
పౌరులకు రక్షణ కల్పించాల్సిన రాజ్య వ్యవస్థే హింసకు పాల్పడడం దురదృష్టకరం.
మన రాష్ట్రంలోనూ నిన్ననే చూశాం కదా. గంటి ప్రసాదం గారిని దారుణంగా హతమార్చారు.
అన్నట్లు….మీరు ప్రసాదం గారి హత్యపై ఓ పోస్టు రాస్తారని ఆశించాను.
అమాయక యువతి, యువకులు ఒక భారీ రాజకీయ అధికార చదరంగంలో ఎలా పావులు కాగలరో, పావులుగా మారి కూడా టెర్రరిస్టులుగా ఎలా ముద్ర పడగలరో అర్ధం చేసుకోవచ్చు ekkada jarigina ade jarugutundi. ani అర్ధం చేసుకోవచ్చు
వాళ్ళు అమాయకులయితే ఖచ్చితంగా విచారణ జరగవలసిందే .
కాని డేవిడ్ హేడ్లి ఇచ్చినా స్టేట్మెంట్ ప్రకారం , ఇష్రాత్ సూసైడ్ బాంబర్ అని తెలుస్తుంది .
అంటే ఇష్రాత్ బృందం గురించి ఆల్రెడీ తెలుసు. వాళ్ళు కరుడు గట్టిన టెర్రరిస్ట్లు అని అర్ధం అవుతుంది .
నలుగురు ని పనిగట్టుకుని ఒక ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ చేయిన్చాడానికి పూనుకున్నాడని చెప్పడం హాస్యాస్పదం అవుతుంది .
అంతకన్నా వేరే పనులు ఉండవా ఒక ముఖ్యమంత్రికి ?
డేవిడ్ హీడ్లీ ఇచ్చిన సమాచారం ఇంటలిజెన్స్ బ్యూరో కి చాలా కాలం ముందే తెలుసు . కావాలంటే ఈ చర్చ ని చుడండి .
http://live.indiatimes.com/#top
ఇదంతా మోడీ హవా అని అడ్డుకోడానికి కాంగ్రెస్ , పిచ్చివిజయ్ సింగ్ చేసే నాటకాలు .
వాళ్ళు టెర్రరిస్ట్ లు అయితే మాత్రం ఎన్కౌంటర్ చేసి చంపేస్తారా అని అడగొచ్చు .
ఒక common man గా చెప్పాలంటే , అది తప్పైనా అదే కరెక్ట్ అనిపిస్తుంది . ఎందుకంటే ఎన్నో కారణాలు , వ్యవస్థ మీద ఉన్న అపనమ్మకం కుడా కావచ్చు .
idi congress adutunna natakam , vaallu minority vote la kosam terrorist lani kuda vishnu murthi maro avataram ani cheptaru. dont fall in congress gimmics. she is cold blooded terrorist thats why ib killed her. otherwise why the hell they kill her. is killing is like playing chess? or what those officers would gain by killing? there are lot of ishrat jahans in india , one is that salman khurshid, that traitor once was a defence lawyer to simi (indian mujahidin) terrorist organization who killed 1000’s of innocents and tried to lift ban on it many times by supreme court. now he is external affairs minister. wow fantastic!!!!!! defnetly he will sell military, cables info to al-qai-da.
కామాన్ మ్యాన్ అయిన వారికి తప్పైనది మల్లీ అదే కరెక్ట్ ఎలావుతుందో అర్దం కావటం లేదు. ఒకరికి వర్తించినది ఇంకొకరి ఎందుకు వర్తించదొ మరి? అంటే ఇక్కడ పౌరులంతా ఒకటి కాదన్నమాట. కానట్లైతే ఈ కామన్ మ్యాన్ ఎవరు? ఇతను ఏదో ఒక వర్గం వల్లనో లేక గ్రూప్ వల్లనో ప్రబావితం అయి ఉంటాదు? అంటే వాటి కి చెంది వుంటాడు. అప్పుడు అతను ఆ వర్గద్రుక్పదం లోంచి చూస్తాడు. ఆ వర్గ ప్రయొజనాలని కాపడే సంఘటనలన్ని అతనికి కరక్టే. సహజ న్యాయ సూత్ర్రలప్రకారం కాదు. మరి చట్టాలెందుకు? ఇష్టం లేని వాన్ని తీసుకెల్లి ఎన్ కౌంటర్ చెయ్యొచ్చా? ఆ ఇష్టం లేని వాల్లలో ఎవరైనా వుండొచ్చు, అంటె ఈ కామన్ మ్యాన్ కూడా? అప్పుడు ఇతనికి న్యాయం అక్కర్లెదన్నమాట?
పైన ఉదాహరించిన విషయానికి ఒక ఎగ్సాంపల్ ఏమిటంటె ఎన్.డి.ఎ పాలనలో పొటొ చట్టాన్ని తెచ్చినపుడు ఎం.డి.ఎం కే నాయకుడు వి.గోపాలస్వామి ఆ ప్రభుత్వంలో బాగస్వామి. అయితే, ఆయన ఆచట్టానికి ఓటు చేసి ఇటు రాగానే అప్పటి తమిళ నాడు ప్రభుత్వం ఆయన్ని అదే చట్టం కింద అరెస్ట్ చేసింది.
వాళ్ళు టెర్రరిస్టులు అవునా, కాదా అన్నది ప్రశ్న కాదు. కోర్టు అదే అంది. ఎన్ కౌంటర్ మాత్రం ఫేక్, దానికి మోడీ అనుమతి ఉందా, లేదా అన్న కోణంలోనే చూడాలి? టెర్రరిస్టులు అయినంత మాత్రానా ఎన్ కౌంటర్ చేయాలా? మోడీ పాత్ర ఉన్నట్లు అర్థం అవుతోంది. కాబట్టి ఆయన మీద కూడా విచారణ జరగాలి.
టెర్రరిస్టులు అయినంత మాత్రానా ఎన్ కౌంటర్ చేయాలా? vaddu gudi laantidi katti poojiddaaam
ఈ అర్ కె గారు బలే తమషా చెస్తున్నారండి! ఆయన వాక్యలు చాల జొక్ గా ఉంటున్నాయి.
ఆయనకి తెలుసో లేదో గానీ, గుజరాత్ హై కోర్టు కూడా ఆ ప్రశ్నే అడిగింది. ‘టెర్రరిస్టులు ఐతే బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేస్తారా?’ అని. వంజారా అండ్ కో డిఫెన్స్ లాయర్ల కి ఈయన సలహాలు ఉపయోగపడవచ్చు.
yendhi sir miru cheppedi , terrorist lu manushulu kadu , alanti varu poteney prasantanga vuntaru prajalu. vaallani champinanduku satkarinchakunda police lani avamanistunnaru……… ade vaallu yakkado bomb petti oo 20 mandhini champunte…….appudu ila matlada galtara. aina terrorist okadu pote 10 madhi vastaru, terrorism moolaanni nasanam cheste inkodu radu. vari motive india mottanni islamize cheyyalani. laden said ” india was unfinished chapter” i.e nothing but ” they dont islamized india completely like bangladesh, pakistan, indonesia, etc so vaallaki aa motive vunnanta varaku + aa motive ki native fundamentalist muslims help chesenta varaku ee islamic terrorism agadu. vaallu bomb petti 10 madhini champite manam vaallani 100 mandhini champali why because variki telisina basha adokkate – terror
@ rk and sai bhargav …..
@ టెర్రరిస్టుకు గుడి కట్టి పూజించండి. …. టెర్రరిస్టులకు గుడి కట్టమని ఎవరూ అనడం లేదు కదా. ప్రజాస్వామ్య వాదులెవరైనా అడుగుతున్నది ఏంటంటే …మన సమాజంలోని ఒక వ్యక్తిని టెర్రరిస్టు అనే పేరుతోనో ….విప్లవ కారుడు అనే పేరుతోనో ఎన్ కౌంటర్ చేయడం సమంజసం కాదు అని మాత్రమే.
ఒక వ్యక్తిని టెర్రరిస్టు అవునా తేల్చాల్సింది ఎవరు…పోలీసులో… ప్రభుత్వ అధికారులో…రాజకీయ నాయకులో, ముఖ్యమంత్రులో కాదు.
మనకో రాజ్యాంగం ఉంది. న్యాయవ్యవస్థ ఉంది. న్యాయ విచారణ ప్రక్రియ ఉంది కదా.
కాబట్టి…..ఎవరైనా ఒక వ్యక్తి టెర్రరిస్టుగా అనుమానిస్తే అతన్ని అరెస్టు చేసి….సాక్ష్యాలను చూపించాలి. అతను టెర్రరిస్టేనని నిరూపించాలి. మరో వైపు నిందితునికి కూడా తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలి.
ఇలా న్యాయ విచారణ పూర్తయ్యాక అతను నేరస్తుడిగా నిరూపితమైతే అతనికి మరణశిక్ష కాదంటే చట్టంలోని మరో గరిష్ఠ శిక్ష ఏదైనా విధించవచ్చు. దాన్ని ఎవరూ వ్యతిరేకించరు. ( మరణ శిక్ష గురించి చర్చ వేరే అంశం.)
అలా కాకుండా…పోలీసులో ఎవరో ఒకర్ని అరెస్టు చేసి అతను కరడు గట్టిన టెర్రరిస్టు అని తేల్చేసి..ఎన్ కౌంటర్ పేరుతో కాల్చేస్తే అది న్యాయం కాదు. దాన్నే ప్రజాస్వామ్య వాదులు వ్యతిరేకించేది.
ఎందుకంటే ఒక్కో సారి అమాయకులు కూడా బలైపోయే ప్రమాదం ఉంది కదా.
ప్రజాస్వామ్య వాదులు వాదించేది…..ఆ అమాయకులు బలి కాకూడదనే. అంతే తప్ప టెర్రరిస్టులను కాపాడడానికి కాదు.
ఉదాహరణకు ఎవరైనా పోలీసు అధికారికో…మంత్రికో, ఓ రాజకీయ నాయకునికో..మీ మీదో లేక నా మీదో కోపం ఉందనుకోండి. తమ కింది పోలీసులతో చెప్పి మనల్ని అరెస్టు చేయించి….ఎన్ కౌంటర్ చేస్తే అది సమంజసమేనా….? ఆలోచించండి.
వందమంది దోషులు తప్పించుకున్నా…ఒక నిర్దోషి శిక్షింపబడరాదనేది మన న్యాయ సిద్ధాంతం కదా…
కాబట్టి ఎన్ కౌంటర్ అనేది ఎప్పటికీ అంగీకార యోగ్యం కాదు.
టెర్రరిస్ట్ లను హీరోయిన్స్ గా చేసి కీర్తిస్తుంటే ఇదే జరిగేది .
చట్టం లొసుగులు ఆధారం చేసుకుని ఈ రాజకీయ నాయకులు తప్పించుకుంటున్నారు .
చట్టాన్ని హేళన చేస్తూ ఇస్లామిక్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు .
బుద్దగయ , అక్షరధామ్, హైదరాబాద్ , కాశ్మీర్ , ముంబై .
కొన్నాళ్ళు అమాయకులను చంపేశారు అని గోల పెట్టారు , ఇప్పుడు టెర్రరిస్ట్ అని తెలిసేసరికి , టెర్రరిస్ట్ అయితే చంపేస్తారా ? అని మళ్లి ఇంకో గోల . ఏదైనా గోల చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు .
పాకిస్తాన్ బోర్డర్ గా ఉండి గుజరాత్ లో రక్షణ కలిపించడం సామాన్యం కాదు .
ఒక్కోసారి ఎన్కౌంటర్ కూడా మంచిదే . మనిషి మృగంగా మారినప్పుడు, మృగాన్ని ఎలా చంపుతారో ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది .
మన పుస్తకాలు knowledge పక్కన పెట్టి, ఒక మామూలు మనిషి వైపు నుండి ఆలోచిద్దాం .
encounters rajakeeya konamlone chestunnaru. kashmir lo kuda amayka muslim yuvakulanu kalchi champutunnaru.
సమాజంలోని ఒక వ్యక్తిని టెర్రరిస్టు అనే పేరుతోనో ….విప్లవ కారుడు అనే పేరుతోనో ఎన్ కౌంటర్ చేయడం evariki hobby kaadu
మనకో రాజ్యాంగం ఉంది. antakanna mugyamgaa santibadratalu unnai vatiki addu padite పోలీసులో… ప్రభుత్వ అధికారులో…రాజకీయ నాయకులో, ముఖ్యమంత్రులో కాదు. saamanyule aa pani chestaru
అమాయకులు బలి కాకూడదనే ante amaayakulani kakshya gatti evaranna champutunnaaraa comedy ga no saradako kakshya to no encounter cheyaru police duty lo bhaagam cm cheppadano politicians chepparano cheyaru
ఎవరైనా పోలీసు అధికారికో…మంత్రికో, ఓ రాజకీయ నాయకునికో..మీ మీదో లేక నా మీదో కోపం ఉందనుకోండి. తమ కింది పోలీసులతో చెప్పి మనల్ని అరెస్టు చేయించి….ఎన్ కౌంటర్ చేస్తే అది సమంజసమేనా…. police lu evadi kinda kiraayi rowdee lu kaadu arrestu lu encounter lu cheyataaniki alaa evaranna chestunnaaraa
…..ఎవరైనా ఒక వ్యక్తి టెర్రరిస్టుగా అనుమానిస్తే అతన్ని అరెస్టు చేసి….సాక్ష్యాలను చూపించాలి. అతను టెర్రరిస్టేనని నిరూపించాలి. areest chese lope vaadu e rdx o vadataadu saakshyaalu niroopanala daaka time undadu
బ్రిటిష్ వలసవాద కాలములొ కూడా, భారత దేశాన్ని ఎంత ఆర్దిక దోపిడి చేస్తున్నా, నేరస్తుల సంస్కరణలకు ప్రాదాన్యత ఇచ్చే వారు. ఇప్పుడు పాలకులు ఒక పక్క ప్రజా స్వామ్యమంటూనే ప్రజా ధనం నేర సంస్కరనలకు ఎందుకు కర్చు చెయ్యాలి అంటూన్నారు. ప్రజా ధనం దో చుకొని స్విస్ బ్యంకుల్లొ దాచు కొవటానికే సరి పొవటం లేదేమొ. ఇప్పుడు ఏకంగా ఎన్ కౌంటర్లే చెయ్యలంటున్నారు.
@ rk గారు
ఎన్ కౌంటర్ ఎవరికీ హాబీ కాదు…..
ఆర్ కే గారు. మీరు చెప్పేది నిజమైతే చాలా బాగుండేది. కానీ ఒక్క సారి కాశ్మీర్ లోనో….ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోండి. చత్తీస్ గఢ్ గిరిజనుల పరిస్థితి ఎలా ఉందో మీకు తెలీదా…?
ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు అక్కడ సాయుధ దళాల ఘూతుకాలకు తట్టుకోలేక…..ఆఖరికి నగ్నంగా నిరసన ప్రదర్శనకు సిద్ధపడ్డారంటే….పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోండి. కాశ్మీర్ లో వందలాది మంది యువకులు ఎన్ కౌంటర్ల పేరుతో అమానుషంగా హత్య చేయబడ్డారన్న సంగతి తెలుసా….?
@ police lu evadi kinda kiraayi rowdee lu kaadu arrestu lu encounter lu cheyataaniki alaa evaranna chestunnaaraa…( పోలీసులు ఎవరికింద కిరాయి రౌడీలు కాదు. అరెస్టులు ఎన్ కౌంటర్ లు చేయడానికి. అలా ఎవరైనా చేస్తున్నారా…?)
ఈ ప్రశ్న మీరు తెలీక అడిగితే…..మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అర్థం.
తెలిసే అడిగితే చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని అర్థం.
ఒక వేళ తెలీక అడిగితే…..పోలీసు వ్యవస్థ నిర్మాణం ఏమిటో….వారు ఎవరి కింద పనిచేస్తారో ఒక సారి తెలుసుకోండి. ( ఇక్కడ నేను చెప్పేది పోలీసులంతా చెడ్డవాళ్లు అని కాదు. మన చర్చ “పోలీసుల్లో మంచి వాళ్లు ఉన్నారా, లేదా?”…అని కాదు. ఎన్ కౌంటర్ల గురించి…అని గుర్తుంచుకోండి.).
ఇంటి స్థలాల కోసం పోరాడుతున్న పేదలపై…..ముదిగొండలో కాల్పులు జరిపిన వారిని ఏమనాలి.?
విద్యుత్ బిల్లులు తగ్గించండి అని అడిగినందుకు..హైదరాబాద్ లోనే పోలీసులు అసెంబ్లీ సాక్షిగా కాల్చిచంపారని…..తెలుసా…?
తమ పంటభూముల్ని సెజ్ ల పేరుతో….లాక్కోవద్దని అడిగినందుకు ఉత్తరాంధ్రలో ఎందరిని కాల్చిచంపారో తెలుసా…? ఇవన్నీ శాంతిభద్రతల కోసమేనా….?
@ అరెస్టు చేసే లోపు ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ తో పేలుస్తారు. సాక్ష్యాలను సేకరించే సమయం ఉండదు.
ఇక్కడ మీరు ఏ ఎన్ కౌంటర్ గురించి అంటున్నారో సందేహం కలుగుతోంది.
పార్లమెంటు మీద దాడి చేసిన ఉగ్రవాదులనో….ముంబైలో దాడి చేసిన ఉగ్రవాదులనో మన దేశ రక్షణ బలగాలు ఎదుర్కొనే క్రమంలో జరిగే ఎన్ కౌంటర్ ఒకటి…..
నక్సలైటు అగ్రనేతలు…లేదా సాధారణ కార్యకర్తలు పోలీసులకు పట్టుపడినపుడు కట్టేసి మరీ కాల్చిచంపి ఎన్ కౌంటర్ అని చెప్పే బూటకపు ఎన్ కౌంటర్ ఒకటి….
ఆఖరికి ఇష్రాత్ ఎన్ కౌంటర్ కూడా బూటకమే అని సీబీఐ చెప్పిన సంగతి గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పండి బూటకపు ఎన్ కౌంటర్లనేవి ఉంటాయని మీరు నమ్ముతున్నారా..లేదా..? అటువంటి బూటకపు ఎన్ కౌంటర్లనే ప్రజాస్వామ్య వాదులు వ్యతిరేకించేంది…
మీకు ఇంత వివరంగా ఎందుకు స్పందించాల్సి వచ్చిదంటే….మీరు ఎన్ కౌంటర్ సమంజసమే అని చెప్పడం ఆశ్చర్యమే కాదు, ఆవేదనను కలిగించింది.
మీరన్నట్లు సరదాగా ఎవరూ ఎన్ కౌంటర్ చేయరన్నట్లే….సరదాగా ఎవడు కూడా పోరాటబాటను ఎంచుకోడు.
ఇవాళ మనకందరికీ అందుబాటులో ఉన్న వ్యవస్థలు దేశమంతటా అందుబాటులో లేవు.
తినడానికి, తిండికి లేక, మామిడికాయల మధ్యలోని జీడిగింజలను ఉడకబెట్టుకొని తినేవారూ, దుంపలూ, ఆకులూ తినేవారూ ఉన్నారన్న సంగతి గ్రహించండి.
తిరుగుబాటు దారులూ, నక్సలైట్లూ మనదేశ పౌరులే….మనలాంటి మనుషులేనన్న సంగతి గ్రహించండి.
ఏ పరిస్థితులు వారిని ఆయుధం పట్టుకునేలా చేశాయో….ఆ అసలు మూలాల్ని పరిష్కరించాలి. అంతేకానీ
ఆకలి అని తిరగబడ్డ ప్రతీవాన్నీ ఎన్ కౌంటర్ చేయడమే పరిష్కారం అనుకుంటే….ఎలా….?
@vishekar, chandutulasi,Thirupalu:
మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారనిపిస్తుంది. ఎందుకంటే, మీరు 100 వివరణలు ఇచ్చినా , 101 ప్రశ్నతో వీరు సిద్ధంగా ఉంటారు. మీరు చెప్పేవన్నీ వీరికి తెలీక కాదు, వీరు అన్నీ తెలిసిన మహానుభావులు. కాకపోతే కొందరిని, కొన్ని విషయాల్ని ద్వేషించడంలో కొందరికి మహా సరదా ఉంటుంది. అది అంత వీజీ గా పోయేది కాదు.
ఉదాహరణకి, సంఝవ్ తా, మాలేగావ్, అజ్మీర్, మక్కా మసీదు బాంబు దాడుల్లో నిందితులుగా ఉన్న సాధ్వి ప్రగ్నా సింగ్, అసిమానంద, పురోహిత్ లాంటి వారిని పోలీసులు ఇష్రాత్ లాగే ఎంకౌంటర్ చేసి చంపేశారంకోండి , అప్పుడు చూడాలి. మీరు చెబ్తున్న మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లాంటివి తల కెత్తుకుని వీరు ఎంత బాగా వాదనలకు దిగుతారో.. కాబట్టి కొందరిని వారి స్వర్గంలోనే బతకనివ్వండి.
ఇంటి స్థలాల కోసం పోరాడుతున్న పేదలపై…..ముదిగొండలో కాల్పులు
విద్యుత్ బిల్లులు తగ్గించండి అని అడిగినందుకు..హైదరాబాద్ లోనే పోలీసులు అసెంబ్లీ సాక్షిగా కాల్చిచంపారని…..తెలుసా…? evaru kaalpinchaaru 144 section pedite daaniki evaroo kaalchamani cheppakkarlaa
తమ పంటభూముల్ని సెజ్ ల పేరుతో….లాక్కోవద్దని అడిగినందుకు ఉత్తరాంధ్రలో ఎందరిని కాల్చిచంపారో తెలుసా…? ఇవన్నీ శాంతిభద్రతల కోసమే encounter lu kaaadu meru encounter lani ugravaadulani vidyut , bhoo udyamaalaki kalipi స్వర్గంలోనే . బతకoడి terrorist lani encounter lu chestaru meru cheppinavi evi encounter lu kaadu .
cheekati lo unna vaallaki pratidi encounter laage untundi
థాంక్యూ చీకటిగారు.. మేము ఎన్ని వివరణలు ఇచ్చినా.. మీరు ఇచ్చిన ఒకే ఒక్క సమాధానం అద్భుతంగా ఉంది.
terrorist lu aakali ani tiragabadi bombblast chestunnaara terrorist la gurinchi raasaa meru cheppe vaalla gurinchi kaadu vaalla gurinchi tarvaata
సాధ్వి ప్రగ్నా సింగ్, అసిమానంద, పురోహిత్ evaraina law break cheste phalitam okate untundi
ఈ అర్ కె గారు బలే తమషా చెస్తున్నారండి! ఆయన వాక్యలు చాల జొక్ గా ఉంటున్నాయి. aite enjoy
telugu vartalu antene comedy andulo naa vyaakyalu tamaashaa
మేము ఎన్ని వివరణలు ఇచ్చినా. mimmalni evaru . వివరణలు immannaaru meku meru gaa encounter ni police kaalpula ni kalipi raaste adi vivarama kaadu confusion aindi blog administrator garu meru vyakyalu raayamannaara vivaranalu raayamannaaraa vivaranalu vivaadaalau nakenduku vyaakyani pattukoni edo rasi deniko kalipi cheekati ani anyaayam ante etlaa 101 prasna adagtaaniki idemi iit coaching center kaaadu kada
నక్సలైట్లూ veella gurinchi nenu raasaanaa mee ishtaalani maa py ruddakandi vaalu videseeyulani e sannasodu annadu nenaite anledu nenu terrorist la gurinchi raste meru vaallani techi veellato kaliparu idi asalu tamaashaa bootakam chesaara natakam chesara annadi mukyam kaadu aa situation lo ki evarini vellodhani cheppakundaa 100 vivaranalu ichi dandaga . cheekati tvaraga velugu aite andariki aanandam manchdi kooda
When Ishrat was encountered, the very next day the mouthpiece of Lashkar-e-Taiba, “Taiba Bulletin” declared Ishrat as martyr. Various official documents confirmed her terror profile. Even Mohammed Daood Gilani a.k.a David Coleman Headley also confirmed her as a terrorist. Yet there is no relief for the patriotic police officers who sent them to hell. Oops, they sent them to Islamic paradise, full of former terrorists each surrounded by 72 virgins. The Muslim-bootlicker Govt, politicians, media and agencies’ problem is not that she is a terrorist, their problem is why she was killed before she executed her assignment! Why the hell she wasn’t allowed to murder Narendra Modi, that is the main problem of those shameless people.
..హైదరాబాద్ లో పోలీసులు కాల్చిచంపారని telusu vaallani akkadaki tesuku vellina vaallu power lo unna party ni dinchi opposition to kalisi seat lu panchukunnaarani telusu mallee ade pani repeat chestunnararani chestoone untaarani telusu
మేము ఎన్ని వివరణలు ఇచ్చినా ante meto paatu chaalamandi unnara vivarinchataaniki
ఆకలి అని తిరగబడ్డ ప్రతీవాన్నీ ఎన్ కౌంటర్ చేయడమే పరిష్కారం ani nenannani meru అనుకుంటే… etlaa maree anta _____- laaga unnaana
ఆఖరికి ఇష్రాత్ ఎన్ కౌంటర్ కూడా బూటకమే అని సీబీఐ చెప్పిన సంగతి గుర్తుంచుకోండి . ఇప్పుడు చెప్పండి బూటకపు ఎన్ కౌంటర్లనేవి ఉంటాయని మీరు నమ్ముతున్నారా..లేదా..? అటువంటి బూటకపు ఎన్ కౌంటర్లనే ప్రజాస్వామ్య వాదులు వ్యతిరేకించేంది… aite pk bansal kooda neetimantude ani cheppindi nammaalaa (antakamundu boforce lo rajiv gandhi ki ) repo yellundo ysj ni mopidevi ni kooda vadilestaru నమ్ముతున్నారా..లేదా..? ante naa nammakam evadiki kavali