స్నోడెన్: అమెరికాకు ఇండియా జో హుకుం


Salman Khurshid with U.S. Secretary of State John Kerry -The Hindu

Salman Khurshid with U.S. Secretary of State John Kerry -The Hindu

భారత పాలకులు తమ విధేయతను మరోసారి రుజువు చేసుకున్నారు. భారత దేశంలో రాజకీయ ఆశ్రయం ఇవ్వాలని కోరిన ఎడ్వర్డ్ స్నోడెన్ విన్నపాన్ని భారత ప్రభుత్వం తోసి పుచ్చింది. ఇంకా ఘోరం ఏమిటంటే అసలు అమెరికా చేస్తున్నది గూఢచర్యమే కాదట!? మేము అన్ని దేశాల ప్రజల సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ సంభాషణలపై గూఢచర్యం చేస్తున్నమాట నిజమే అని స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఒప్పుకున్నా భారత పాలకులకు అది నిజం కాదని నమ్మదలుచుకున్నారు. ఇంత దివాళాకోరు పాలకులు మనల్ని పాలిస్తున్నందుకు భారతీయులు సిగ్గుపడాలా?

“ఎడ్వర్డ్ స్నోడెన్ నుండి జూన్ 30 తేదీతో ఈ రోజు మాకొక లేఖ అందిందని నేను నిర్ధారించగలను. అందులో రాజకీయ ఆశ్రయం కోరుతూ విన్నపం ఉన్నది” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పాడని ది హిందు తెలిపింది. “ఆ విన్నపాన్ని జాగ్రత్తగా పరిశీలించాము. ఆ పరిశీలన తర్వాత సదరు విన్నపాన్ని అంగీకరించడానికి మనకు ఏ కారణమూ లేదని నిర్ణయించుకున్నాము” అని ఆయన తెలిపారు.

అమెరికా తన పాస్ పోర్ట్ రద్దు చేయడంతో మాస్కో విమానాశ్రయం లోని ట్రాన్సిట్ జోన్ లో చిక్కుకుపోయిన ఎడ్వర్డ్ స్నోడెన్ వికీలీక్స్ న్యాయ సలహాదారు సారా హేరిసన్ ద్వారా రాజకీయ ఆశ్రయం కోరుతూ 20 దేశాలకు వినతిపత్రాలు ఇచ్చారు. అందులో ఇండియా కూడా ఒకటి. ఇతర దేశాలు: ఆస్ట్రియా, బొలీవియా, బ్రెజిల్, చైనా, క్యూబా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐర్లండ్, నెదర్లాండ్స్, నికరాగువా, నార్వే, పోలండ్, స్పెయిన్, స్విస్ కాన్ఫెడరేషన్, వెనిజులా.

ఎడ్వర్డ్ స్నోడెన్ చిక్కుకుపోయిన షెర్మెట్యెవో విమానాశ్రయం వద్ద రష్యా ఎంబసీ ఒకటి ఉంది. సదరు ఎంబసీ అధికారికి సారా హేరిసన్ ఈ 20 దేశాల రాయబారులకు ఇవ్వాల్సిందిగా ఎడ్వర్డ్ స్నోడెన్ వినతి పత్రాలను అందజేశారని వికీ లీక్స్ ప్రకటించింది. వినతి పత్రం అలా అందిందో లేదో దానిని జాగ్రత్తగా పరిశీలించి తిరస్కరిస్తున్నామని ఇలా చెప్పేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే ఇండియాకు ఇది సిగ్గు చేటు. కాగా ఇది, అమెరికాకు తాము అనుంగు విధేయులమని బహిరంగంగా చెప్పుకోవడం తప్ప మరొకటి కాదు.

నిజానికి భారత పాలకుల నుండి ఇంతకంటే గొప్ప స్పందన వస్తుందని ఆశించలేము. భారత దేశ వనరులను, ప్రజల ఆదాయ వనరులను కూడా విదేశీ కంపెనీలకు అప్పజెప్పే పాలకులు ఒక విదేశీ పౌరుడికి అండగా నిలుస్తారని ఎలా ఆశించగలం?

ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడి దగ్గర్నుండి విదేశీ మంత్రి వరకు ప్రపంచ దేశాలను హెచ్చరించిన సంగతి విదితమే. ఆ హెచ్చరికకు జడిసే మన పాలకులు స్నోడెన్ కు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించారని తెలియడానికి పెద్దగా అవగాహన అవసరం లేదు. ఆశ్రయం ఇవ్వకపోతే పోయేరు, కనీసం భారత ప్రజల సెల్ ఫోన్, ఇంటర్నెట్ సంభాషణలపై నిఘా పెట్టడం వెంటనే నిలిపేయాలని ఎందుకు కోరరు? దాదాపు ఐరోపా దేశాలన్నీ అమెరికాను ఈ మేరకు డిమాండ్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడే స్వయంగా ఫ్రాన్స్ ప్రజలపైనా, తమ రాయబార కార్యాలయాలపైనా నిఘా వేయడం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జర్మనీ, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ తదితర దేశాలతో పాటు యూరోపియన్ పార్లమెంటు నాయకులే అమెరికా ముందు ఈ డిమాండు ఉంచారు. ఐరోపా దేశాల డిమాండును పరిశీలిస్తున్నట్లు అమెరికా బదులిచ్చింది కూడా. భారత నాయకులు కనీసం అదైనా చేయలేరా?

Indan Embassy in Washington

Indan Embassy in Washington

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అటు అమెరికాకు ఇటు స్నోడెన్ కూ ఒక ఆఫర్ ఇచ్చారు. స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇస్తామని ఆయన చెబుతూ దానికి ఒక షరతు విధించారు. ఆ షరతు ప్రకారం ఇకముందు తన వద్ద ఉన్న అమెరికా రహస్యాలను బహిరంగ పరచనని స్నోడెన్ హామీ ఇవ్వాలి. అమెరికాతో వ్యాపార, రాయబార సంబంధాలను కాపాడుకుంటూనే, స్నోడెన్ కు ఆశ్రయం ఇచ్చామన్న ప్రతిష్టను సొంతం చేసుకోడానికి పుతిన్ ఈ ఎత్తుగడ వేశారు. దీనికి అంగీకరిస్తే స్నోడెన్ కష్టం వృధా అయినట్లే. (పుతిన్ ఆఫర్ ని స్నోడెన్ తిరస్కరించి రాజకీయ ఆశ్రయం కోసం రష్యాకు ఇచ్చిన వినతిని ఉపసంహరించుకున్నారు.) కానీ సమస్యను తమ చేతుల్లోకి తీసుకోవడానికి పుతిన్ చేస్తున్న కృషిని ఇక్కడ ప్రధానంగా గుర్తించాలి. ఈ మాత్రం ధైర్యం ఇండియా పాలకులు ఎందుకు చేయలేరు? ఇండియా గొప్పలు చెప్పుకుని ఉబ్బిపోయే వారు ఆలోచించవలసిన అంశం ఇది.

ఇదేమీ చేయకపోగా మన విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ “ఇది నిజానికి దొంగతనంగా వినడం కాదు” అని అనడానికి సాహసించారు. ఇది అమెరికాని పూర్తిగా వెనకేసుకు రావడం తప్ప మరొకటి కాదు. “ఇది స్క్రూటినీ కాదు. వాస్తవ సందేశాలను చూడడం కాదు. కాల్స్, ఈమెయిల్స్ తదితర సంబాషణల పాటర్న్ ను విశ్లేషించడం మాత్రమే. ఎవరి పాఠ్య సందేశాన్ని గానీ, సంబాషణను గానీ వినడం కాదిది” అని ఖుర్షీద్ నమ్మ బలుకుతున్నారు. ఇలా చేయడం వలన టెర్రరిస్టు దాడులను అరికట్టారని కూడా ఖుర్షీద్ అమెరికాకు సర్టిఫికేట్ ఇచ్చేశారు. కానీ వాస్తవం ఏమిటంటే అమెరికా ఎన్.ఐ.ఏ అధిపతి స్వయంగా అమెరికన్ కాంగ్రెస్ కి ఇచ్చిన సాక్ష్యంలో తాము మెసేజ్ లు, ఈ మెయిళ్ళు కూడా చదువుతామని తెలిపారు. మన విదేశీ మంత్రి పత్రికలు చదవరు అనుకోవాలా లేక కాంగ్రెస్ లో అమెరికా అధికారులు ఇచ్చే సాక్ష్యం కంటే తమకు అమెరికన్లు చెప్పే కల్లబొల్లి కబుర్లే నిజం అని వారు నమ్మదలిచారా?

విచిత్రం ఏమిటంటే అమెరికా, వాషింగ్టన్ లోని ఇండియా ఎంబసీ పైన కూడా నిఘా పెట్టిందని తెలిసినా మన పాలకులకు కోపం రాకపోవడం. ప్రజల సంబాషణలపై అమెరికా ప్రిజమ్ ద్వారా నిఘా పెట్టిందని వెల్లడి అయినప్పుడు కిమ్మనని ఐరోపా దేశాలు తమ ఎంబసీలపై కూడా నిఘా పెట్టిందని తెలిసాక ఆగ్రవేశాలు ప్రకటించాయి. వెంటనే సమాధానం చెప్పాలని కోరాయి. భారత విదేశీ మంత్రి అలా చేయకపోగా అమెరికాకు సర్టిఫికేట్ ఇవ్వడానికే ఆసక్తి కనబరిచడం దారుణం!

4 thoughts on “స్నోడెన్: అమెరికాకు ఇండియా జో హుకుం

  1. India manchithanam aney musugunu kappukunna piriki & swaardha paalakulunna desam. I love India but i am not proud to be. Nenu naa desanni elaa chudaalanukovatam ledhu. Ekkada chusina kumbakonaalu,avineethi ela cheppukuntu pothey lekkalennani.
    Mana paalakulu elaantiki spandisthaaranukovadam ma amaayakathwam. They are very busy.

  2. salman khurshid ki mati braminchinattu vundi, afganistan lo chikitsa chesukunte nayam. vela mandhi pranalu tisina simi (indian mujahideen) ni terrorist organisation kadu cultural organization ani supreme court ni (as defence lawyer to simi) oppinchadaniki prayatninchina mahanubavudu, mana priyatama videsanga mantri, ippudu bharateeyulanandarni guddi varini cheyadaniki veera poratam chestunnaru. ayana prayatnalaki maji usa mitrudaina osama bin laden, allah asisulu vundalani korukundam!!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s