గోపీనాధ్ ముండే! ఈయన 2009లో మహారాష్ట్ర లోని బీడ్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయిన బి.జె.పి నాయకుడు. లోక్ సభలో బి.జె.పి పార్లమెంటరీ పార్టీకి ఈయన ఉపనాయకుడు కూడా. 2009 ఎన్నికల్లో 19 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశానని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చిన ముండే ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ తాను లోక్ సభ ఎన్నికలకు 8 కోట్లు ఖర్చు చేశానని అసలు నిజం వెళ్ళగక్కారు.
ఈయన మర్చిపోయి నిజం మాట్లాడలేదు. ‘సభలో ఎన్నికల అధికారులు ఎవ్వరూ లేరని ఆశిస్తున్నాను’ అని కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారాయన. అంటే ఎన్నికల అధికారులకు లేదా రాజ్యాంగ బద్ధ సంస్ధకు అధికారికంగా అబద్ధాలు రాసిచ్చానని వాస్తవానికి అంతకు అనేక రెట్లు ఖర్చు పెట్టానని ముండే నేరుగానే సభికులకు చెప్పదలిచారు. పైగా ఎన్నికలు మరో 6 నెలలు మాత్రమే ఉన్నందున తనకేమీ ఫర్వాలేదని భరోసా కూడా వ్యక్తం చేశారు. వీళ్ళు పదే పదే గౌరవం ప్రకటించే రాజ్యాంగ సంస్ధలు సూత్రాలు అంటే ఈ నాయకులకు ఎంత చిన్న చూపో చెప్పడానికీ ఇది చిన్న ఉదాహరణ మాత్రమే.
కానీ వీరికి రాజ్యాంగం కావాలి. అది ప్రజలను నియంత్రించాలి తప్ప తమను నియంత్రించకూడదు. తన కుటుంబం ఆస్తిపాస్తులన్నీ కలిపినా 2 కోట్లు మాత్రమే అని చెప్పిన గోపీనాధ్ ముండే 8 కోట్లు ఎలా ఖర్చుపెట్టగలిగారు? అక్రమ ఆస్తులు ఎవరిదగ్గర పేరుకుపోయాయో, అవినీతికి కాపలాదారులు ఎవరో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా? నిన్న మొన్నటివరకూ కాంగ్రెస్ నాయకుల అవినీతి పైన ఉభయ సభల్లో నిప్పులు చెరిగిన భారతీయ జనతా పార్టీకి గోపీనాధ్ ముండే ఉపనాయకుడు మరి!
కోట్లు ఖర్చు పెట్టి లక్షలు మాత్రమే పెట్టానని చెప్పుకోవలసి వస్తున్నందున ఎన్నికల సంస్కరణలు కావాలని ముండే డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చేస్తూ ఆయన నోరు తెరిస్తే ఇదిగో ఇలా కార్టూన్ లో చూపినట్లు డబ్బు కట్టలే కనిపిస్తాయి. అందుకే ఆయనకి ఎన్నికల సంస్కరణలు కావాలి. ప్రజలను మోసం చేయడానికి, ఆ మోసాలు బైట పడకుండా ఉండడానికీ ఎన్నికల సంస్కరణలు కావాలి. అవినీతి డబ్బు పోగేసుకుని బడా పెట్టుబడిదారులుగా అవతరించడానికి వీరికి ఆర్ధిక సంస్కరణలు కావాలి. ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి అధికారం కావాలి, వారు తిరగబడితే అణచివేయడానికి టాడా, పోటా లాంటి నల్ల చట్టాలు కావాలి.
ప్రియమైన విశేఖర్ గారు మీరు తెలుగు పాఠకులకు అంతర్జాతీయ విషయాలను సులభంగా అంధిస్తున్న సమాచారం చాలా ఉపయోగంగా ఉంది. మీకు కృతజ్ఞతలు..మీకు వీలైతే నిన్న (30-6-13) రోజు హిందు పేపర్లో వచ్చిన “night of horror” ఆర్టికల్ ను తెలుగులోకి అనువధించగలరు.
డేవిడ్ గారు ఈ ఆర్టికల్ చూశాను. అనువదించాలని మరో ఇద్దరు కోరారు. సాయంత్రం వీలు చూసుకుని ఆ పని చూస్తాను.
విశేఖర్ గారు నా బ్లాగ్ లో ఇండియన్ ఆర్మీ అసహ్యకరమైన మరో ముఖం అనే పోస్ట్ రాసాను వీలైతే దానిని మీ బ్లాగ్ లో ప్రచురించండి. లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
విశేఖర్ గారు నా బ్లాగ్ లో ఇండియన్ ఆర్మీ అసహ్యకరమైన మరో ముఖం అనే పోస్ట్ రాసాను వీలైతే దానిని మీ బ్లాగ్ లో ప్రచురించండి. లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://david-vennela.blogspot.in/2013/07/blog-post.html