కేదార్ నాధ్ ను ముంచెత్తిన జల ప్రళయం ఎలా జరిగి ఉండవచ్చో ఊహిస్తూ నిపుణులు ఒక వీడియో రూపొందించారు. ఆ వీడియోను హెడ్ లైన్స్ టుడే పత్రిక తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేయగా యాహూ న్యూస్ షేర్ చేసింది. వీడియోను ఈ బ్లాగ్ లో పబ్లిష్ చేసే మార్గం దొరకలేదు. అందువలన లింక్ మాత్రమే ఇస్తున్నాను. వీడియోను ‘ఎందుకో ఏమో?’ గారు కింద వ్యాఖ్య ద్వారా అందించారు. కాబట్టి లింక్ ను తొలగించి వీడియో ఇస్తున్నాను.
–
–
మేఘ ప్రళయం ద్వారా ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీటిని పొదువు కున్న మందాకిని ఎత్తైన శిఖరాల నుండి ప్రవహించడం వలన భారీ జల శక్తిని (hydro power) సంతరించుకుంది. ఆ శక్తి తనకు అడ్డు వచ్చిన గ్రామాలను తుడిచిపెడుతూ కేదార్ నాధ్ ను అన్నివైపుల నుండి చుట్టుముట్టి ముంచేసిందని ఈ వీడియో వివరిస్తోంది. అంతటి శక్తికి కూడా కేదార్ నాధ్ ఆలయం, దాని చుట్టుపక్కల నిర్మాణాలు నిలిచి ఉండడం ఒక విశేషం.
హిమాలాయల సానువులు పర్యావరణ పరంగా ఎందుకు సున్నితమైనవో ఈ వీడియో వివరిస్తుంది. కేదార్ నాధ్ ఆలయం అత్యంత సున్నితమైన ప్రాంతంలో నిర్మించబడి ఉండడం వలన ప్రభుత్వాలు ఎల్లవేళలా తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన ఆగత్యాన్ని ఈ వీడియో గుర్తుకు తెస్తుంది.
అంతటి శక్తికి కూడా కేదార్ నాధ్ ఆలయం, దాని చుట్టుపక్కల నిర్మాణాలు నిలిచి ఉండడం ఒక విశేషం. aalayam okkate migilindi chuttu pakkala emi migalaledu
30 km ki okati choppuna hydro power projects kadite yedo okaroju aa gudi kooda mungutundi
ఎ.ఏ గారు
కృతజ్ఞతలు. మీరిచ్చిన వీడియోను టపాలో పోస్ట్ చేస్తాను.