మతాంతర వివాహంపై మియాన్మార్ బౌద్ధుల ఆంక్షలు


యాంగాన్ లో బౌద్ధ గురువుల సమావేశం, మధ్యలో విరాతు

యాంగాన్ లో బౌద్ధ గురువుల సమావేశం, మధ్యలో విరాతు

తమిళనాడులో పి.ఎం.కె పార్టీ తరహాలోనే మియాన్మార్ లో బౌద్ధ మత పెద్దలు మహిళా స్వేఛ్ఛపై ఆంక్షలకు తెగబడుతున్నారు. బౌద్ధ యువతులను ఇతర మతాల యువకులు వివాహం చేసుకోకుండా ఆంక్షలు విధించే చట్టం ముసాయిదాను దేశ వ్యాపిత బౌద్ధ సాధువుల సమ్మేళనం ఒకటి ప్రభుత్వానికి సమర్పించబోతోంది. తీవ్రవాద భౌద్ధమత గురువుల ఆధ్వర్యంలో బౌద్ధ సన్యాసులు సమావేశమై ఈ మేరకు గురువారం నిర్ణయం తీసుకున్నారు. బౌద్ధ యువతులు ఇతర మతాల యువకులను పెళ్లి చేసుకోకుండా ఆంక్షలు విధించడానికి ఈ ముసాయిదా అవకాశం కల్పిస్తోంది. బౌద్ధ జాతీయతను కాపాడే పేరుతో మధ్య యుగాల భూస్వామ్య అణచివేతను స్త్రీలపై తిరిగి రుద్దడానికి ప్రయత్నాలు చేయడం పట్ల మియాన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సూన్ సూక్యి ఆందోళన ప్రకటించారు.

మియాన్మార్ రాజధాని యాంగాన్ లో గురువారం దేశం నలుమూలల నుండి వచ్చిన 1530 మంది సీనియర్ బౌద్ధ సన్యాసులు సమావేశం అయ్యారు. తీవ్రవాద మతగురువుగా ప్రసిద్ధి పొందిన బౌద్ధ గురువు విరాతు ప్రతిపాదించిన మతాంతర వివాహ ఆంక్షల చట్టం గురించి ఈ సమావేశంలో చర్చించారు. బౌద్ధ యువతులు ముస్లిం యువకులను వివాహం చేసుకోకుండా ఆంక్షలు విధించడానికి మాత్రమే విరాతు చట్టం ముసాయిదాను ప్రతిపాదించగా, సమావేశం ముగిసేసరికి అన్ని ఇతర మతాలతో వివాహ సంబంధాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా విరాతు కి ఉన్న అతివాద ముద్రను మిగిలినవారంతా లాగేసుకున్నట్లయింది.

బౌద్ధ సన్యాసుల ముసాయిదా ప్రకారం ఇక నుండి బౌద్ధేతర పురుషులు ఎవరైనా బౌద్ధ స్త్రీని వివాహం చేసుకోవాలంటే అతను బౌద్ధ మతానికి మారాలి. అంతే కాకుండా సదరు యువతి తన తల్లిదండ్రుల వద్ద నుండి అనుమతి తీసుకోవాలి. అంతటితో ఆగలేదు. స్ధానిక అధికారుల దగ్గర్నుండి కూడా సదరు యువతి అనుమతి పొందాలి. ఇవన్నీ పూర్తయితేనే ఒక బౌద్ధ స్త్రీ తాను ఇష్టపడిన బౌధ్ధేతర వ్యక్తిని వివాహం చేసుకోవడానికి వీలవుతుంది. ఇవి ఎలాగూ జరిగేవి కావు. మొదట తల్లిదండ్రులు అనుమతి ఇవ్వరు. వారిని ఎలాగో ఒప్పించినా అధికారులు అంగీకరించరు. వారు అంగీకరించకుండా ఉండేలా బౌద్ధ మత పెద్దలు తగిన ఏర్పాట్లు ఎలాగూ చేస్తారు. కాబట్టి బౌద్ధ యువతి తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశం దాదాపు రద్దయినట్లే.

ఒక బౌద్ధ యువతికి వివాహ వయసు వచ్చాక తన భాగస్వామిని ఎంచుకోవడంలో ఇన్ని ఆటంకాలు ఏర్పరచడం అత్యంత తిరోగామి చర్య. స్త్రీల మానవ హక్కులకు తీవ్రంగా అణచివేసే చర్య. స్త్రీల భావోద్వేగాలకు ఏమాత్రం విలువ ఇవ్వని చర్య. స్త్రీలు మళ్ళీ తమ తల్లిదండ్రులు, పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే సమాజం అదుపాజ్ఞలలో బంధించి ఉంచడానికే మియాన్మార్ చట్టం ఉద్దేశించబడింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

“మేము ఒక బృందాన్ని ఏర్పరిచాము. అందులో లాయర్లు, విద్యా కోవిదులు, బౌద్ధ గురువులు ఉంటారు. వీరంతా కలిసి మన జాతీయులను కాపాడుకోడానికి తగిన ముసాయిదాను రూపొందిస్తారు” అని బౌద్ధ సన్యాసుల సమ్మేళనం ప్రతినిధి చెప్పాడని ది హిందు తెలిపింది. మియన్మార్ దేశీయులు, బౌద్ధులు ఒకటే అన్నట్లుగా ఈ ప్రతినిధి భావిస్తున్నారని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. మియన్మార్ లో 90 శాతం మంది బౌద్ధులే అయినప్పటికీ 10 శాతం ముస్లింలు మరియు క్రైస్తవులు కూడా ఉన్నారు. బౌద్ధేతరులు మియాన్మార్ జాతీయులు లేదా దేశీయులు కాదన్న భావన అన్యాయం కాగా, ఈ భావన బౌద్ధ స్త్రీల అణచివేతకు దారి తీయడం ఆందోళనకారకం. నిజానికి బౌద్ధ స్త్రీఊ స్వేచ్ఛా వాయువులు పీల్చకుండా ఉండడానికి బౌద్ధ మత సెంటిమెంటును ఉపయోగిస్తున్నారనడం సబబు.

మియాన్మార్ లో మత విద్వేషంతో ముస్లింలపై దాడి చేయడం దశాబ్దాలుగా జరుగుతోంది. ముఖ్యంగా రోహింగ్యా ముస్లింలు తమ దేశం వారు కాదని మియాన్మార్ జాతీయ ప్రభుత్వమే ప్రకటించడంతో వారు దేశ రహితులుగా మిగిలిపోయారు. దానితో వారిపై నిత్యం బౌద్ధులు సాగిస్తున్న హింసాత్మక దాడులకు ప్రభుత్వమే పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు అవుతోంది. గత సంవత్సరం జూన్ నెలలో రాఖినే రాష్ట్రంలో రోహింగ్యాలపై జరుగుతున్న దాడుల్లో 167 మంది చనిపోగా 1,25,000 మంది నిరాశ్రయులయ్యారు. అప్పటి నుండి అడపా దడపా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

తాము తయారు చేసిన ముసాయిదాను చట్ట సభల సభ్యులంతా ఆమోదించాల్సిందేనని బౌద్ధ గురువులు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. “మా ముసాయిదాను వ్యతిరేకించే ఎం.పిలు ఎవరో తెలుసుకోగోరుతున్నాము. వారెవరో తెలుసుకుంటే వారిని 2015 ఎన్నికల్లో గెలిపించవద్దని మేము ప్రజలకు చెబుతాము” అని మాలామ్యినే మఠాధిపతి విమల బుద్ధి ప్రకటించారు. తమ జాతీయులను (nationals), మతాన్ని కాపాడుకోడానికి చర్యలు తీసుకుంటూనే ఇతర మతాలపై దాడులు జరగకుండా చూడడం ముఖ్యం అని బౌద్ధ గురువులు బోధిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్ధితి అందుకు భిన్నంగా ఉన్నది.

మతాంతర వివాహాలపై ఆంక్షలు విధిస్తూ ప్రతిపాదిస్తున్న చట్టం పట్ల మియాన్మార్ ప్రజాస్వామిక ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూక్యి ఆందోళన ప్రకటించారు. 2015 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ధీన్ సీన్, ఆంగ్ సాన్ సూక్యీ తో తలపడవలసి ఉంది. సూక్యీ చేతుల్లో ఓటమి తప్పించుకోడానికి ధీన్ సీన్ మత సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూస్వామ్య-దళారీ పెట్టుబడుదారి-సామ్రాజ్యవాదుల అపవిత్ర కూటమి కోరల్లోనే కొనసాగుతున్న మియాన్మార్ ప్రజలు బౌద్ధ మత గురువులు ఏర్పరుస్తున్న వలలో పడకుండా తమ ప్రజాస్వామిక హక్కులను, ఆకాంక్షలను నెరవేర్చుకోడానికి కంకణబద్ధులు కావాల్సి ఉంది. మానవ హక్కులు ఒక ప్రమాణం మాత్రమే తప్ప చట్టం కాదని వ్యాఖ్యానిస్తున్న బౌద్ధ గురువుల నుండి తమ ప్రజాస్వామ్య హక్కులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని వారు గుర్తించాలి.

8 thoughts on “మతాంతర వివాహంపై మియాన్మార్ బౌద్ధుల ఆంక్షలు

  1. సాంత మూర్తులైన బౌధులు ఈ విధంగ దాడులు చేస్తున్నారు అంటె వారు mundu ఎన్ని దాడులకు గురయ్యారో..గొప్పకొసం లౌకికత పూత పూసుకున్న పత్రికలు అతువంటి విషయాలు బైటకు చెప్పకుండా …. ఇలా సగం సగం విషయలె చెపుతై లెండి …..

  2. నా వ్యాఖ్య ఎందుకు తొలగిందొ తెలియలదం లెదు… మళ్లీ చెప్తున్నాను … శాంత స్వభావంతొ ఉండె బౌధులు ఇలా దాడులకు దిగారంతె ముందు వాళ్లు ఎన్ని దాడులకు గురయ్యరో…. గొప్పకోసం లౌకిక వాదం ముసుగు వెసుకున్న పత్రికలు కొన్ని ఇలా సగం సగం సమచరం మత్రమె చెబుతు ఉంటై….

  3. మంచి చట్టం తెఛారు బౌద్ధులు. వారికి నా సుభాకాంక్షలు. నిజంగానె ప్రెమించుకునె వాల్లు ఇబ్బంధి పదినప్పటికి లవ్ జిహాద్ లాంటి వుగ్రవాధాన్ని ఈ చట్టం వల్ల పుర్థిగ నిరొదించచు. కెరల లొ కుద ఇలాంటి చట్తం వుంతె

  4. ఓహొ! ఇది మత ద్వేషమా? శత్రువు శత్రువు మనకు మిత్రులైనట్లు! తస్లిమా నజ్రూల్‌ మన వాల్లకు మిత్రులైనట్లు.ఈమె గురించి రెండు మాటలు తెలుసు కుంటె బాగుండు. ఆమె మతం కోసం మాతృ దేశానికి దూరమైందా లేదా మానవత్వం కోసం దూరమైందా? సాల్మన్‌ రష్దీ, తస్లిమా నజ్రుల్‌ స్వమతం చేత ద్వేషింపబడిన వారే! అందుకు కారణం వాల్లు మానవత్వాన్ని ప్రేమించిన వాల్లు కావడమే. ప్రజా హక్కుల గురించి ప్రజాస్వా మ్యాన్ని గురించిన అవగాహన ఉండడం వల్లే. అంగసాని సూకి పాతికేల్లకు పైన మ్యీయాన్‌ మార్‌ జైల్లో పడి ఉండడం ప్రజాస్వా మ్య వాది కావడం ఒక్కటే కారణం. తమకి మాత్రమే హక్కులుంటాయి మిగతా వాల్లకి ఉండవు అనుకోక పొవడం వల్లనే. లౌకీక వాధం మనదేశంలో ఇంత ఎగతాలికి గురికావడానికి కారణం అది మానవత్వం మీద ఆదార పడడమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s