134 మంది పట్టే విమానంలో రెండు రోజుల్లో 15,000 మంది గుజరాతీ యాత్రీకులను నరేంద్ర మోడి రక్షించారట! గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గారు స్వయంగా ఈ విషయం చెప్పుకుంటూ అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఎన్నికల ప్రచారానికి 5,000 మందికి పైగా హిందూ భక్తులు దుర్మరణం చెందినట్లు భయపడుతున్న కేదార్ నాధ్ వరద భీభత్సం కంటే మించిన సదవకాశం నరేంద్ర మోడి గారికి దొరక్కపోవడం అత్యంత అమానుషం కాగా, సాధ్యా సాధ్యాలు పరిశీలించకుండానే మోడీ భక్తాగ్రేసరులు ‘రాంబో ప్రచారాన్ని’ నెత్తినేసుకుని వ్యాపింపజేయడం మరింత పరిహాస భాజనం.
వినాయక విగ్రహాలు పాలు తాగుతున్నాయని వైరల్ ప్రచారాలకు లంకించుకుంటే అమాయక జనం నమ్మి పాలు పడితే పట్టొచ్చు గాక! ఆధునిక మోటారు వాహనాలకు గుర్రపు రధాల ఆకారాలు తొడిగి అశ్వమేధ యాగం తరహాలో రధ యాత్రలు చేస్తే మత విద్వేషంతో కుత్తుకలు ఉత్తరించుకోవచ్చు గాక! గోధ్రా రైలు దహనానికి పాల్పడింది ముస్లింలేనన్న విష ప్రచారాన్ని నమ్మి మారనకాండకు తెగబడవచ్చు గాక! కానీ విమానం సంగతి, హెలికాప్టర్ల సంగతి, ప్రయాణికుల సంఖ్యను పొల్లు పోకుండా రికార్డు చేసే బస్సులు, రైళ్ల సంగతి తెలిసినవారు ఎవరైనా మోడి ఒక్కరే రెండు రోజుల్లో 15,000 మందిని గుజరాత్ కి తీసుకెళ్లారంటే నమ్మగలరా? అదీ సుశిక్షిత సైనికులే రేయింబవళ్లు కష్టపడినా, ఆర్మీ హెలికాప్టర్లు నిరంతరం షటిల్ చేస్తున్నా పట్టుపని కొద్ది వేలమందిని మాత్రమే ఉత్తర ఖండ్ నగరాల వరకు మాత్రమే రోజుకి రక్షించగలుగుతున్నారని తెలిసినప్పుడు?
ఇంతా చేసి నరేంద్ర మోడి గారు చేసిందేమిటి? కేంద్ర ప్రభుత్వ వారింపులను పెడచెవిన పెట్టి విమానంలో కూర్చుని ఏరియల్ సర్వే చేయడం. వి.ఐ.పిల సందర్శన వల్ల సహాయ కార్యక్రమాలు క్లిష్టంగా మారాయనీ, రాష్ట్ర ప్రభుత్వ నాయకులు, అధికారుల సమయం వి.ఐ.పిల కోసం కేటాయించవలసి వస్తోందని కాబట్టి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవ్వరూ ఉత్తర ఖండ్ రావద్దని కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఒక పక్క మొట్టుకుంటున్నా వినకుండా మోడి తన ఏరియల్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను 15,000 మందిని రక్షించానని చెప్పుకోడానికి ఆయన స్వయంగా విమానం నడుపుకుంటూ బాధితుల్ని తీసుకెళ్లలేదు, పోనీ, ఆయన తన విమానంలో ఏ బాధితుడినీ ఎక్కించుకున్నట్లు కూడా పత్రికలు చెప్పలేదు. మరి 15,000 మందిని రక్షించినట్లు, అది కూడా రెండు రోజుల్లో, ఆయన ఎలా చెప్పుకోగలరు?
వరద బాధితుల సహాయార్ధం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 25 కోట్లు సహాయం ప్రకటించింది. పేద రాష్ట్రం అని చెప్పే బీహార్ 5 కోట్లు ప్రకటించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు కూడా తలా 10 కోట్లు సాయం ప్రకటించాయి. కానీ అత్యంత సంపన్నవంతమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రం గుజరాత్ అని చెప్పుకునే నరేంద్ర మోడి ప్రకటించిన సహాయం కేవలం రు. 2 కోట్లు! హిందువులకు ముఖ్యమైన పరమ ఆరాధ్యనీయమైన నాలుగు పుణ్య క్షేత్రాలు (చార్ ధాం) కలిగి ఉన్న రాష్ట్రానికి ఒక హిందూవాద ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం రు. 2 కోట్లు?! హిందువులన్నా, హిందూ భక్తులన్నా నరేంద్ర మోడి గారికి ఎంత గౌరవమో కదా!
రాంబో తరహాలో 15,000 మందిని కాపాడానని చెప్పుకుంటున్న మోడి గారికి, ఆయన భక్తాగ్రేసరులకు ఉత్తర ఖండ్ లో వాస్తవ పరిస్ధితి ఏమీ పట్టదా? అక్కడ వివిధ విభాగాల సైనిక బలగాలు బాధితులను కాపాడడానికి రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. నాలుగు నుండి పన్నెండు అడుగుల మేర ఇసుక మేట వేసిన ప్రాంతాలలో చనిపోయిన వారి లెక్క తెలియక అనేకమంది ఎదురుతెన్నులు చూస్తూ బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. రోడ్ల సంగతి సరేసరి, కాలి దారులు కూడా తెగిపోయి ఇరుకున్నవారిని కనీసం హెలిపాడ్ల వద్దకు తీసుకురావడానికి ప్రమాదకర లోయల వెంబడి, తెగిపోయిన రోడ్ల వెంబడి రోప్ వేలు నిర్మించదానికే సైన్యం అనేక వ్యయ ప్రయాసలకు ఓరుస్తోంది. కొండలు, రోడ్లు, దారులు కోసుకుపోయి ఉపరితలం గరుకుగా మారడం వలన ‘రోప్ వే’లలో ప్రతి రెండు రౌండ్లకు తాళ్ళు మార్చవలసిన పరిస్ధితిని సైనికులు ఎదుర్కొంటున్నారు. ఆర్మీ లోని డాక్టర్ యువతి ఒకరు నెలలు నిండిన గర్భవతి ఒకరికి పురుడు పోయడానికి 25 కి.మీ కాలి నడకన వెళ్లవలసిన దయనీయ స్ధితి నెలకొని ఉన్నది.
మోడి గారి విమానాన్నే తీసుకున్నా, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం దానిలో పట్టేది విడతకు 134 మంది. మొదటి గుజరాత్ విమానం శనివారం 134 మందిని గుజరాత్ తెచ్చింది. మోడి తాను 15,000 మందిని కాపాడానని చెప్పింది ఆదివారం. 15,000 మందిని తీసుకురావడానికి ఆ లెక్కన గుజరాత్ విమానం 36 గంటల్లో 115 సార్లు అటూ ఇటూ తిరిగి ఉండాలి. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు లో 36 గంటల్లో అసలు ఇన్ని విమానాలు దిగాయా? ఒక విమానం 36 గంటల్లో 115 సార్లు తిరగగలదా?
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ ప్రకారం జాతీయ శక్తులన్నీ కలిసి ఒక్క శనివారమే 10,000 మందిని మాత్రమే ఖాళీ చేయించగలిగాయి. రెండు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ చేయించింది 17,000 మందిని. వీరిలో గుజరాతీయులే 15,000 మంది ఉన్నారంటే నమ్మశక్యమేనా? నిపుణుల అంచనా ప్రకారం ఇలాంటి ఆపత్సయాల్లో సేవలు అందించడానికి శిక్షణ తీసుకున్న సైన్యానికి కూడా 36 గంటల్లో 15,000 మందిని రక్షించడం సాధ్యం కాదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే శనివారం వరకు గుజరాత్ చేరిన 2000 చిల్లర ప్రజల్లో 1200 మంది ఉత్తర ఖండ్ కల్పించిన ఏర్పాట్లను వినియోగించుకుని గుజరాత్ చేరారు. ఆదివారం ఉదయం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ చేరిన 400 మంది యాత్రికులు తమ ఏర్పాట్లేవో తాము చేసుకున్నారు తప్ప ప్రభుత్వాలపై ఆధారపడలేదు. ఇక నరేంద్ర మోడి గారు రక్షించింది ఎవరిని?
ఆర్మీ, ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నేషనల్ డిసాస్టర్ సెక్యూరిటీ ఫోర్స్…. వీరు వాస్తవానికి శ్రమిస్తున్నది! ప్రశంసలు ఎవరికైనా దక్కాలంటే వీరికి దక్కాలి. వారి వెన్ను తట్టి ప్రోత్సాహం ఇవ్వాలి. వెల్లువత్తుతున్న విమర్శలు వారి వరకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకుని వారికి ఎంత సహాయం అవసరమో అంత సాయం అందివ్వాలి. ముఖ్యంగా తగిన నైతిక మద్దతు వారికి ఇవ్వాలి.
కానీ మోడి చేసిందేమిటి? ఒక పక్క బాధితులను కాపాడడానికి సైన్యం శ్రమిస్తుంటే, కాశ్మీర్ బోర్డర్ లో సైనికుడి తలను పాక్ సైనికులు ఎత్తుకుపోయిన ఘటనను ప్రస్తావించిన పెద్ద మనిషి నరేంద్ర మోడి! తల ఎత్తుకుపోయిన కొద్ది రోజులకు పాక్ ప్రధానికి విలాసవంతమైన విందు ఇచ్చారని విమర్శలు? ‘ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్’ అని చెప్పడానికి కూడా వీలు లేని అసభ్యమైన, అమానవీయమైన చేపల వేట కాదా ఇది? గోధ్రా దహనం సాకు చూపి వేలాది అమాయక ప్రజలను ఊచకోత కోయించినవారికి, దానిని సమర్ధించేవారికి ఈ అనైతిక ఓట్ల వేటలో తప్పు కనపడకపోవచ్చు!
ఇంతకీ గుజరాత్ లో నరేంద్ర మోడి మూడు సార్లు గెలిచింది ఇలాగేనా? ఎన్నికల ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలను నరేంద్ర మోడీకి అప్పగించింది కూడా ఇందుకేనా? ఇలాగే, ఇందుకే అయితే గుజరాత్, భారత దేశం వేరు వేరని ఆయన, బి.జె.పి తెలుసుకునే రోజు త్వరలోనే రావచ్చు.
కేదారనాథ్ ఆలయాన్ని బాగుచేస్తానని మోడీ స్వయంగా ముందుకు వచ్చిన విషయం మీరు ప్రస్తావించలేదు .
రెండు రోజుల్లో 15000 తీసుకొచ్చానని మోడీ స్వయంగా చెప్పుకున్నట్టు ఎక్కడ చదవలేదు , అదంతా మీడియా ఊహాగానం . ఎక్కడన్నా లింక్ లు ఉంటె ఇవ్వగలరు , నేను ఈ వరం రోజుల్లో మోడీ స్వయంగా చెప్పుకున్నట్టు చదవలేదు .
మోడీ ట్విట్టర్ లో చేసిన కామెంట్
Met Vijay Bahuguna ji. Conveyed to him that Gujarat is ready to take responsibility of renovating the Kedarnath temple complex.
http://www.thehindu.com/news/national/congress-upset-at-modis-rambo-claim/article4843797.ece
http://bit.ly/17vMPNG
సురేష్ గారు మోడి చేసినవి, చేయనివి ఇంకా రాశాను. అవెందుకో మీ దృష్టికి వచ్చినట్లు లేదు.
sir visekar garu na doubts ki samadhanam ivvagalaru
1. mee drushtilo godhra train kalcheyadam muslims kaka inkevaru chesaru?
2. sit clean chit ichina tarvatha kuda , ayaney gujarat riots ki karanam annattu rasaru, deeniki mee daggara vunna adaram yendhi?
3. modi aerial survey chesinattu mi daggara adaram vunda ? sonia gandhi chesina aerial survey valla army sayam alasyam ayyi 100 la mandhi chanipoyaru, victims ki cheralsina tindhi, gudda delhi nunchi pampakunda , rahul gandhi spain (birthday party) nunchi tirighi vache daka wait chesaru.
4.modi gujarathi aa kada ani chusi varini surakhshitha prantaniki taralinchaledu, 15000 mandhi anedhi congress paid english media srushti.
5. godhra train sangathana , + gujarat riots gurinchi mi konam lo oka article rayandhi
I do not understand why the hell gujarat should take the responsibility of restoration of the temple ? unless it is a publicity stunt ? every stsate is capable of doing what they have to do…i will spit on modi if he gives such statements on tirumala…
శాయి భార్గవ గారు, నేను రాసేవాటికి పత్రికలు, వివిధ కమిటీలు, నిపుణులు ఇచ్చే నివేదికలు తప్ప ప్రత్యేక ఆధారాలేవీ ఉండవు.
గోధ్రా రైలు దహనంలో ఎటువంటి కుట్ర లేదని, అది కేవలం ఒక ప్రమాదం అని రైల్వే శాఖ నియమించిన జస్టిస్ యు.సి.బెనర్జి కమిటి తేల్చింది. స్ధానిక ముస్లింలే దానికి కారణం అని ప్రచారం చెయ్యడంలో మతతత్వ వాదులకు రాజకీయ ప్రయోజనం ఉంది. కాబట్టి వారికి నివేదికలతో పనిలేదు.
సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ సరికాదని సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరి చెప్పారు. మోడిని బోనులో నిలబెట్టేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. సిట్ కూడా తాను పూర్తిగా క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆ తర్వాత చెప్పింది.
హత్యాకాండను న్యూటన్ సిద్ధాంతం చెప్పి మోడి బహిరంగంగా సమర్దించారు.
నరోదపాటియా హత్యాకాండ కేసులో జీవిత శిక్ష పడిన బాబూ బజరంగి, తనను మోడి ఎలా కాపాడిందీ తెహెల్కా కెమెరా ముందు స్పష్టంగా చెప్పాడు.
కాంగ్రెస్ ఎం.పి ఎహసాన్ జాఫ్రి కి.మీ దూరంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూం కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పోలీసులు రాకుండా మోడి ఎలా అడ్డుకున్నదీ ఆయన భార్య సాక్ష్యాలు ఇచ్చింది.
హత్యాకాండకు సహకరించాలని మోడి స్వయంగా ఆదేసాలు ఇచ్చిన విషయాన్ని ఆ మీటింగుకి హాజరయిన పోలిసు అధికారి సంజీవ్ భట్ స్వయంగా సుప్రీమ్ కోర్టుకి అఫిడవిడ్ ద్వారా వివరించారు. ఆయన అఫిడవిట్ ను సిట్ తీసుకోలేదు. ఆయన సాక్ష్యాన్ని కుంటిసాకు చెప్పి పరిగణించలేదు.
మోడి పాత్ర ఉందని జనం నమ్మడానికి ఈ సాక్ష్యాలు చాలు.
కొన్నిసార్లు కోర్టులు శిక్ష వేయదలిస్తే కాస్త సాక్ష్యం ఉన్నా చాలు. సాక్ష్యం లేకపోయినా సృష్టించేవారు ఉంటారు. అనేకసార్లు ప్రబల సాక్ష్యాలు ఉన్నా వాటిని తీసిపారేయడానికి అనేక లూప్ హోల్స్ చట్టాల్లొ ఉన్నాయి. కాబట్టి రేపు మోడికి పాత్రలేదని సుప్రీం కోర్టే చెప్పినా ఆశ్చర్యం లేదు.
ఈ దేశ చట్టాలు ధనిక వర్గాల ప్రయోజనాలు కాపాడడానికే తప్ప న్యాయాన్ని కాపాడి అన్యాయాన్ని శిక్షించడానికి కాదు. అవి పుస్తకాలకే పరిమితం అని నాకు అనిపిస్తుంది.
మోడి ఏరియల్ సర్వే విషయం దాదాపు పత్రికలు, చానెళ్లనీ కవర్ చేసాయి. బహుశా మీరు గమనించలేదేమో.
గోధ్రా, గుజరాత్ హత్యాకాండలపై ఆర్టికల్స్ గతంలో రాసాను. కొత్త సందర్భం వస్తే రాస్తాను.
sir visekar garu ee website lo chala kluptamga , hindu lanti paper la reference tho patu ichunnaru , asakti vunna yadala chadavagalaru
http://www.gujaratriots.com/
aina ee sangathana patla dwandwa abhiprayalu vunnayi. yedhi nammalo teliyatledhu. sir miru international sangatanala patla rase articles (eenadu lo) oka academician drustya raste inka vupayogakaramga vuntundhi. indian foreign policy, international relations pai marinni articles rayadalacha prardhana. thank you. godhra , gujarat riots pai miru rasina articles yokka link + mi english articles yokka link ni ivvagalaru
***** గోధ్రా రైలు దహనానికి పాల్పడింది ముస్లింలేనన్న విష ప్రచారాన్ని నమ్మి మారనకాండకు తెగబడవచ్చు గాక!****
…… adi matonmadam to rechi poina kondaru muslims pani ani andariki telusu… రైల్వే శాఖ నియమించిన జస్టిస్ యు.సి.బెనర్జి కమిటి minarity votla kosam ituvanti nivedikalu ippincharu ante… godhra sanghatana visha pracharam ite… tarvata jarigina allarlaki modi bhadyudannadi kuda visha pracharame….
గుజరాత్ మారణ హొమం గురించి ‘ హైదరాబాద్ బుక్ ట్రస్టు ‘వారు సుప్రిం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ క్రిస్ణయ్యర్ నాయకత్వంలో ఫాక్ట్ ఫైండింగ్ టీం ప్రచురించిన పుస్తకం చూడండి.
savaala meda chillara erukuntaru antaaru vartalu kuda erukovachu
అవును. మోడి, ఓట్లు ఏరుకుంటున్నట్లు!
ప్రకృతి భీభత్సంలో వేలాదిమంది చనిపోయినపుడు దానిని వార్తగా చూడలేనివారికి ఏదో సమస్య ఉన్నట్లే భావించాలి.
modi undi votelu erukotaanike vartalu chustaaniki erataaniki kaadu
నిజం ఇంత త్వరగా అంగీకరించినందుకు మీరు అభినందనీయులు.
దీన్నిక పొడిగించకండి!
visekar garu are you communist ? can we expect your opinion on religion, modi, islam and hinduism. mee articles batti miru anni economics , peda , dhanika vargala madhya sangarshaney tappa inkemi ledu anna yochana miku vunnattu anipinchindhi. adhi nijamena ? modi pai chala sarlu miru negative ga chepparu mee articles lo. yenduko telusukovalani bignasa ? thank you for your blog
ప్రియమైన వి.శేఖర్ గారు, నమస్కారం. గోద్రా అంటే అదేదో నరేంద్ర మోడీ, హిందువుల చేత ముస్లింల ఫై చేయించిన హత్యాకాండగ మీరు వర్ణిస్తున్నారు. మీరు కూడా సిక్యులరిస్ట్ అని చాటుకోడానికి తెగ తపన పడుతున్నారు. దురదృష్ట వశాత్తు హిందువుల జన్మస్థానమైన ఈ దేశంలో, వారి జీవన విధానం పై వారే సిగ్గుపడేలా చేయడానికి ఆనాటి నెహ్రు నుండి కాంగ్రెస్ ప్రయత్నిస్తూనే వుంది. అమ్మ సోనియా నాయకత్వంలో ఇప్పుడు ఆ ప్రయత్నాలు యుద్ద ప్రాతిపదికపై జరుగుతున్నాయి. స్వయంగా తన నాయకత్వంలో NAC, NGOs, Paid Media మరియు కొన్ని Human Rights సంస్థలు Vatican ఆర్ధిక సహాయంతో తమవంతు పాత్రను పోషిస్తున్నాయి.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చదువుకొని లోక పరిజ్ఞానం తో పాటు స్వేఛ్చ వున్నమీలాంటి వారు కుడా జన్నాన్ని తప్పుదోవ పట్టించాలని చూడడం. నిజమే హిందువులు తిరగబడ్డారు. కోపంతో, కసితో ముస్లింలపై దాడి చేసారు. కాని ఎందుకు..? అమానవీయంగా, మృగ్యంగా, క్రూరంగా.. వేకువ నిద్రలో వున్న 2000 వేలకు పైగా వున్న హిందువులపై దాడి చేసి, 58 మంది పిల్లలు, ఆడవారు, వృద్ధులు, యువకులని సజీవంగా తగలబెట్టారు. అదికూడా ప్రణాళికాబద్ధంగా. అందుకే హిందువులు తిరగబడ్డారు. అయితే దానికి మోడీ మద్దతు ఇచ్చి వుండచ్చుగాక. ఇలాంటి వాస్తవాలు ఎందుకు వివరించలేక పోతున్నారో మీరే ఆలోచించుకోవాలి. అయినా ఎక్కడో ఎవరో తగలబెట్టబడ్డారని, తమ స్వంత ప్రాంతంలో దోపిడికాబడ్డారని కదా మనం హాయిగా వార్తలు రాసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాం. మన కుటుంబంలోవారిపై అలా దాడి చేయబడితే కదా మనకు నొప్పి తెలియడానికి. Paid Media లింకులతో పనిలేదు ఇక్కడ. వాస్తవాలు కావాలి. ఆకోణంలో కూడా మీరు ఆలోచిస్తారని కోరుకుంటూ సెలవు.
sai bhargav నా సంగతి కాసేపు పక్కనబెడదాం.
మీరు చెప్పండి. సమాజంలో ఇన్ని సమస్యలకు కారణం ఏమిటని మీ ఉద్దేశ్యం? కుల వివక్ష, లింగ వివక్ష, ప్రాంతీయ విభేదాలు, పేద-ధనిక తారతమ్యాలు, అవినీతి, పేదరికం… వీటన్నింటికి మూలం ఎక్కడుంది? అసలు ఈ సమస్యలకు పరిష్కారం ఉందంటారా? ఉంటే ఏమిటది?
మోడి గురించి రాసినప్పుడల్లా ఆయనను ఎందుకు వ్యతిరేకించాలో కూడా రాశాను కదా! ఆయనది గుజరాత్, నాది ఆంధ్ర. కాబట్టి ఆయనతో నాకు వ్యక్తిగత వైరం ఉండే అవకాశాలు లేవు. ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఒక డివైజివ్ ఫోర్స్. ప్రజల మధ్య ఉన్న విశ్వాసాల తేడాలను విద్వేషంగా మార్చి రాజకీయ లబ్ది పొందే పార్టీకి నాయకుడు. ఆ పార్టీలోని ఇతర నాయకులతో పోల్చినా ఆయన మ(మి)త తీవ్రవాది. అనగా right extrimist. ఆ ముసుగులో కార్యకర్తలను సమీకరించి స్వదేశీ, విదేశీ సూపర్ ధనిక వర్గాలకు సేవ చేయడం ఆయన విధానం. దేశ ప్రజలకు అది తీవ్ర నష్టకరం.
పేద, ధనిక వర్గాలు అనగానే ఎవరు పేద, ఎవరు ధనిక అన్న అవగాహనలో స్పష్టత ఉండాలి. ఒక పది కోట్లు ఎలాగో సంపాదించుకుని చిన్న కంపెనీ/ఫ్యాక్టరీ పెట్టుకుని ఓ యాభై మందికి ఉపాధి కల్పిస్తే ఆయన కూడా ధనికుడే. కాని ప్రస్తుత పరిస్ధితుల్లో ఆయన వల్ల దేశానికి లాభమే గాని నష్టం లేదు. అలాంటి ధనికులతో జనానికి పేచీ లేదు. పేచీ అల్లా సూపర్ ధనికులతోనే. అంబానీ, టాటా, బిర్లా, జిందాల్ ఇత్యాదులు. వీరికి దేశం అన్నా, ప్రజలన్నా నిబద్ధత ఉండదని గత ఆరేడు దశాబ్దాల చరిత్ర నిరూపించింది. విదేశీ కంపెనీలతో కుమ్మక్కై దేశ సంపదను దోచుకెళ్తుంటే సహకరించి జూనియర్ వాటా తిసుకొవడమే వీరు చేస్తున్నది.
ఈ అవగాహనకి నేనెలా వచ్చాను? పుస్తకాలు చదివాను. వివిధ ఆర్ధిక వేత్తలు రాసిన విశ్లేషణలు చదివాను. అంతర్జాతీయ విశ్లేషకుల పుస్తకాలు చదివాను. వివిధ దేశాల, సమాజాల రాజకీయ, ఆర్ధిక, సామాజిక చరిత్రలను అధ్యయనం చేశాను. ఈ క్రమం ఇంకా కొనసాగుతోంది. ఈ శాస్త్రాలను వేరు వేరుగా తెలుసుకోవడం ఒక విషయం అయితే, వాటన్నింటి మధ్య అంతర్లీనంగా ఉండే తాత్విక సంబంధాన్ని తెలుసుకోవడం మరో ముఖ్యమైన విషయం. (ఈ అంశాన్ని నా ఈనాడు ఆర్టికల్స్ లో కొంత వివరించాను.)
చాలామంది మీలాగానే తరచుగా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. మీరు యాంటీ-అమెరికానా? లేకా కమ్యూనిస్టులా? …ఇలాంటివి.
నా సమాధానం ఏమిటంటే… రాసేవాడు ఎవరన్నది పట్టించుకోవద్దు. రాసేది ఏమిటన్నదే పట్టించుకోవాలి అని. నేను రాసే విషయంలో అబద్ధాలు ఉంటే పట్టించుకోవాలి. వాస్తవాలు లేకపోతే అడగాలి. వాస్తవాన్ని మలిచి చెబితే నిలదీయాలి. ఒక విషయాన్ని పరిశీలించే విధానంలో తప్పు కనిపిస్తే తర్కించాలి. కాని ముద్రలు మాత్రం వేయొద్దు. నాకొక ముద్ర వేశారు అంటే మీరు కూడా ఒక ముద్రలో నుండి నన్ను చూస్తున్నారనే అర్ధం. అంటే మనిద్దరి మధ్య చర్చ, తర్కాలకు ఆస్కారం లేకుండా ముందుగానే ఒక గీతను మీరు గీసేస్తున్నారని అర్ధం.
ఒక వ్యక్తి దేవుడిని నమ్మితేనే అతన్ని మొత్తంగా హేతు విరుద్ధుడుగా తిరస్కరించడం ఎంత తప్పో, నమ్మని వాడిని సూపర్ అభ్యుదయవాదిగా మెచ్చి మెడల్స్ వేయడమూ అంతే తప్పు. ఒక అంశం పై సజావుగా ఆలోచించగలిగిన వ్యక్తి మరొక అంశంపై హేతువిరుద్ధంగా ఆలోచించవచ్చు. కాబట్టి నిరంతరం చర్చించుకోవడం, భావ సంఘర్షణ జరగడం అవసరం.
”మన కుటుంబంలోవారిపై అలా దాడి చేయబడితే కదా మనకు నొప్పి తెలియడానికి’. ఈ మాట మానవత్వం వున్న ప్రతి మనిషికి వర్తిస్తుంది కదా? అందరు మనుషులైనపుడు ఇన్ని రకాలైన విడదీసే (మతం పేరుతో, కులంపేరుతో ప్రాంతంపేరుతో, రంగు పేరుతో, వేష భాషలపేరుతో, పేద ధనిక,. . . ఇంకా ఎన్ని ఎన్ని రకాలుగ విడదీయలో) ముల్ల కంచెలు ఎందుకు? స్వార్ధం, ధ్వేషం ఎందుకు ఎక్కడ మొదలైంది? సాటి మనిషిని మనిషిగా చూడలేని తనానికి ఏమిటి పేరు? ముస్లింలైన, హిందువులైన మరొకరైనా ఎవరు ఎవర్ని ధ్వేషిస్తున్నారు. ఎవరితో మొదలైంది? అసలెందుకు మొదలవ్వాలి? అసలు చరిత్రలో ప్రతి తరములో, మనుషులు ఇన్ని రకాలుగ ఎందుకు వేరుపడి పోయారో తెలియక ఈ మతమైతే మంచిదేమో లేక ఆమతమైతే మంచిదేమో? ఇది మనుషులందరినీ ఏకం చేస్తుందేమో అని ఇంతమంది తాత్విక వై తాలికులు, “మంచి అన్నది పెంచుమన్న” అన్న గురజాడ, వేమన,పోతులూరి వీరభ్రంహేంద్రుడు, కభీరు, గురునానక్, బుద్దుడు లాంటి మహ మహులందరు ఎందుకు తలలు పీక్కున్నారు? పేడ్ న్యూస్ లు గొబెల్ ప్రచారాలు ఎవరు ఎవరి మీద చేసుకుంటున్న్నారో ప్రజలకి తెలియక తలలు పీక్కుంటున్నరు.పదిమంది కలసి ఒక్కన్ని చావబాదుతుంటే చూస్తు ఉండలేకపొవటం మానవత్వమవుతుంది. ఎందుకంటె, ఒక్కడు పది మందిని కొట్టలేడుకనుక. అలా ‘కొట్టేడు’ అనడం అబద్దమవుతుంది.
visekar garu, mana desam charitra kramaanni gamaniste anni desalakante yantho mundanjalo vunna mana desam 20 th century natiki ardikamga , anni rangaallo chitiki poyindhi. anni rangallo ( mathematics , language, astrology, medicine etc ) lo no 1 ga vunna desamchivarikki beggar la tayarayyindhi. ye policy (communism?capitalism?chanakya sutraala?hindutva?) valla aa kalamlo india no1 ga vunnindhi. afgan nunchi burma varuku + bali nunchi tibet varaku vunna desam yenduku kunchincukupoyindhi ? kula vyavastha anni kaalaallo vunda? aite hinduvulu pelli tarvatha arundhati nakshatranni chupistaru, aa arundhati oka dalit, okkatiga vunna vedaanni 4 ga classify chesina vyasudu dalitude? ramayanaanni rasina valmiki kuda oka tribe ye? aite akaranamga ee kula vyavastha yala puttindhi, ye vidheshi saktulu daanni bala parichayi? nenu oc, but ambedkar veerabhimanini (konnititho yekibhavinchanu) , casteism antam kavadaniki oke okka solution intercaste marriages ( nenu tappakunda acharistanu). manam gajaniki 10 kotlu ichina mecca lo chinna gudi kattukodaniki gajam sthalam ivvaru, alantappudu ramudu puttina sthalam lo oka gudi kattukodaniki inni addamkulu yenduku ? dani kosam poradina bjp ( vote la kosame ayyundachu gaka!! ) tho yekibavinchadam yala tappavutundhi? secularism ante chala ardalunnayi ( ee rojullo), na drushtilo secularism ante anni matha abhiprayalani, manobavalani gowravinchadam. corporates ni nettina mosukoche bjp ante naku ishtam ledu but congress yokka muslim appeasement parakastaki cherina ee rojullo bjp lanti party aa konam lo avasarame anipistundhi!!!
sakuni, sanskrit grammer ashtadhyayi rachinchina panini, marenno saints, ancient indian medhavula janmasthalam gandhara ( neti afganistan) , na korikalla neti afganistan la repu india islam ane bhutam (political wing) valla raktasittam kakudadaney !!!
sai bhargav గారు, చరిత్రను మీరు చెప్పిన పద్ధతిలో నేను అర్ధం చేసుకోలేదు.
శాస్త్రాల అభివృద్ధి, సమాజ పరిణామం పరస్పరం విడదీయరానివి. ఐరోపా సాపేక్షిక అభివృద్ధికి కారణం అక్కడ సమాజం త్వరగా భూస్వామ్య దశను దాటి పెట్టుబడిదారీ దశకు చేరుకోవడం. అలా త్వరగా తదుపరి ఉన్నత దశకు చేరుకోవడానికి ఆ సమాజాల్లో వచ్చిన వివిధ విప్లవాలు కారణం. పారిశ్రామిక విప్లవం దగ్గర్నుండి భూస్వామ్య సంబంధాలను కూల్చివేసిన ప్రజాస్వామిక విప్లవాల వరకూ అక్కడి అభివృద్ధిని వేగవంతం చేసాయి.
మన దేశంలో భూస్వామ్య వ్యవస్ధ కూల్చివేత జరగలేదు. అంటే ప్రజాస్వామిక విప్లవం సంభవించలేదు. బ్రిటిష్ వాడు దేశాన్ని దురాక్రమించి తన ప్రయోజనాల కోసం ఇక్కడి భూస్వామ్య వ్యవస్ధను కాపాడారు. కొన్ని పైపై మార్పులయితే చేశారు, అదే సమయంలో ఇక్కడ పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెందకుండా అణచివేసారు. ఫలితంగా భారత పెట్టుబడిదారులు ఇప్పటికీ ఆ అణచివేత దశలోనే ఉన్నారు. వారి కార్యకలాపాలు ప్రధానంగా అమెరికా, ఐరోపా పెట్టుబడిదారీ వ్యవస్ధలకు (కంపెనీలకు) అనుబంధంగా అనుసంధానించబడి జరుగుతాయి. ఇది చూడాలంటే కాస్త శ్రద్ధగా పరిశీలించాలి. కొంత ఆర్ధిక, సామాజిక చరిత్రలను కూడా అధ్యయనం చేసి ఉండాలి. ఈ అంశాలు సోషియాలజీలో లభ్యం అవుతాయి.
ఈ విధంగా విదేశీ ఆర్ధిక వ్యవస్ధలకు అనుబంధించబడిన పెట్టుబడిదారులు, అర్ధ భూస్వాములే వివిధ పార్టీల కింద చీలి ఉన్నారు. వారి ప్రయోజనాలు అన్నీ ఒకటే. కాకపోతే వారిలో వారికి సంపదల పంపకంలో తేడా వచ్చి వివిధ పార్టీల రూపం ధరించారు. వీరు సొంత ప్రయోజనాల కోసం కొట్టుకున్నా, అవసరం అయితే ఒకటవుతారు. సిద్ధాంతాలు వల్లించే ఈ పార్టీలు తమకు లాభం వస్తుందనుకుంటే వాటిని వదిలేసి అవతలి పార్టీలోకి దూకడాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు.
చరిత్ర నిర్మాతలు ప్రజలే. రాజులు, భూస్వాములు కాదు. మీరు చెప్పిన అరుంధతి, వాల్మీకి తదితరులు ఈ చరిత్రలో భాగం. కవులు కొన్ని కల్పనలు జోడించారు.
గుడి, మసీదు ఇలాంటివి ప్రజల విశ్వాసాలు. వీటిని రాజ్యపాలనలోకి చొప్పించకపోవడమే సెక్యులరిజం. భారత రాజకీయ పార్టీలు ‘అన్ని మతాలను సమాదరించడమే సెక్యులరిజం’ అని అర్ధం మార్చారు. కాంగ్రెస్ సెక్యులరిజం ఒక నాటకమని నా అభిప్రాయం. బి.జె.పి కి ముందు కూడా అనేక మత ఘర్షణలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఉందనేందుకు అనేక దృష్టాంతాలున్నాయి.
మీకు ముస్లింలంటే ద్వేషం అని మీ వ్యాఖ్యలో కనిపిస్తోంది. దానికి కారణం ఏమిటో మాత్రం కనపడలేదు. ఈ ద్వేషం అవసరం లేదని నా అభిప్రాయం. మీకు రాముడి గుడి ముఖ్యం. కాని నాకు ప్రజలకు కనీస అవసరాలు తీరడం, వారి శ్రమ ఫలితం వారికి దక్కడం ముఖ్యం. దానికి ప్రయత్నించేవారు ఎవరైనా వారికి నేను మద్దతు ఇస్తాను.
వివిధ అంశాలను కలపకుండా ఒక అంశాన్ని తీసుకుని చర్చించండి. అప్పుడు చర్చలో స్పష్టత ఉంటుంది.
సాయి భార్గవ గారు, కింద లేఖిని లింక్ ఇచ్చాను. దాన్ని ఉపయోగించి తెలుగులో వ్యాఖ్య రాయగలరు. ఆంగ్ల లిపిలో తెలుగు చదవడం చాలా కష్టం.
nice article…i really liked the way u depicted modi…మన తెలుగు నాయకులు ప్రవర్తించిన తీరు మరీ ఘోరం….వి.హెచ్ మరి.యు రమెష్ ల తీరు సిగ్గు చెటు తెలుగు వాల్లకు.
పార్టీల . వారి ప్రయోజనాలు అన్నీ ఒకటే. కాకపోతే వారిలో వారికి సంపదల పంపకంలో తేడా వచ్చి వివిధ పార్టీల రూపం ధరించారు. వీరు సొంత ప్రయోజనాల కోసం కొట్టుకున్నా, అవసరం అయితే ఒకటవుతారు. cpi bjp lu kalisi kontha kaaalam kindata hyd lo darnaa chesinatlu 2004 lo communist lu congress lu kalisi center lo govt form chesinappudu
విసెకర్ గారు మీ జవాబు కి థంక్స్. మిరనుకున్నత్తు నాకు ముస్లిం ల పట్ల యెటువంటి ద్వెషం లెదు. వారు పాతించె monotheism అనెది india lo లెనిధి యెమి కాదు (for ex – agoras, saivism sect and many more are monotheists ). there are many political reasons ( usa, russia etc ) behind trauma in afganistan , syria etc. my concern is ” if same repeats in india due to islamization of india by 2060 – india will became hell”. you may ask me why does it happens ? my answer is according to population projections in india by 2060 muslims will be majority – once if a country becomes muslim majority they will turn it into islamic nation. can you show me any muslim majority nation which is not islamic nation? no. its a duty of every muslim or able muslim to convert abode of war ( non islamic countries ) into islamic nation (abode of islam) through various means ( reference – pakistan or partition of india by Dr baba saheb ambedkar). thats why ambedkar favored to partition + some other intentions, i agree most of the politicians are like what you said and my concern is same like you ( + some more) i.e to not let india into the hands of talibans because economic equality without peace is sheer waste. you can teach to good people but cannot teach to taibans whose mind is pre occupied completely with their dream to make this world into abode of islam. . if a religion dont have any political intentions i dont care an iota on it but its not the case here. those talibans are in an illusion that the political side of islam (calipha system) had divine sanction and its their duty to implement it and my concern is to save india from such aggressors with insane ideology but nothing to do with innocent muslims. you just said problems but dont given any solutions in your perspective. very sorry that i write in english. i am amateur in lekhini and mistakes are coming while typing in lekhini. can you please post an article telling us how to use lekhini to type flawless or 0 error telugu like your articles. thank you
ఇంగ్లిష్ మీడీయా లీలలు.
http://epaper.timesofindia.com/Repository/ml.asp?Ref=VE9JQkcvMjAxMy8wNy8xNCNBcjAxMjEx&Mode=Gif&Locale=english-skin-custom
http://www.niticentral.com/2013/07/13/modis-reuters-interviewer-says-media-misinterpreted-his-remarks-103438.html
http://www.niticentral.com/2013/07/13/reuters-journalist-deletes-tweet-in-mystery-move-103683.html