ఋతు పవన రాగాలు, భరత జీవన విరాగాలు


భారత దేశ ప్రజల బతుకు చిత్రంలో ఋతుపవనాల రంగులకు ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో చెప్పలేము. కేరళలో అడుగుపెట్టి అటు అండమాన్, ఇటు ఉత్తరాఖండ్ ల వరకూ భరత ఖండం అంతా విస్తరించే నైరుతి ఋతుపవనాలైనా, హిమాలయాల చల్లదనాన్ని కారు మబ్బుల ద్వారా దక్షిణాదికి మోసుకొచ్చే ఈశాన్య ఋతుపవనాలైనా భారత దేశంలోని సకల ఉత్పత్తి రంగాలకు జీవ గర్రలు. నీటి పారుదల సౌకర్యం కలిగిన పొలాలకు కూడా ఈ రెండు పవనాలు తెచ్చే వానలే నదులు, రిజర్వాయర్లను నింపి నీటిని తెస్తాయి.

వానలు కురిసి పొలాలు పండితే రైతు, కూలీల ఇళ్ళు తర, తమ స్ధాయిల్లో కళకళలాడతాయి. వీళ్ళు కళకళలాడితేనే వ్యాపారాలు పుంజుకునేది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు తదితర సేవా రంగాల దగ్గర్నుండి వస్తూత్పత్తి మాన్యుఫాక్చరింగ్ రంగం వరకూ ఋతుపవనాలు తెచ్చే సిరి సంపదల పైనే ఆధారపడతాయి. అందుకే భారత దేశానికి ఋతుపవనాలు వస్తే లోకల్ సిటీ పత్రికలు, ఛానెళ్ల నుండి, అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికలు, ఛానెళ్లు, ఇప్పుడు ఇంటర్నెట్ పత్రికల వరకు ఒక పెద్ద వార్తగా కవర్ చేస్తాయి.

ప్రతికూలతలు కూడా చెప్పుకోవాలి. ఋతుపవనాలు తెచ్చే వరదలు రాజకీయ నాయకులకు, పవర్ బ్రోకర్ లకు సిరులు కురిపిస్తాయి. వరద బాధిత ప్రాంతాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఎక్కువ సాయం కేంద్రం నుండి అందుతుంది. ఈ సాయం చేరేది వరద భాదితులకు కాదని, శవాల మీద పైసలు ఎరుకునే బాపతుకోసమేనని ప్రత్యేకంగా చెప్పాలా? చిత్రం ఏమిటంటే ఋతుపవనాలు తాము రాకుండా ప్రజలకు తెచ్చే కరువు కోసం కూడా కేంద్ర సహాయం అందుతుంది. ఇది కూడా….

అందుకని దళారీలకు ఋతుపవనాలు వచ్చినా పండగే, రాకపోయినా పండగే మరి!

ఋతుపవనాలు ప్రజల్లో ఒక లాంటి జీవకళను తెస్తాయి. వెలుగు, చీకట్లను నింపుతాయి. వర్షంలో తడవాలని కోరుకునే పసి పిల్లల నుండి, వారిని అదిలించే పెద్దల దాకా వారి వారి పనుల్లోకి ఋతుపవనాలు చురుకుదనాన్ని తెస్తాయి. ఆకాశాన హరివిల్లు విరిస్తే అది తమకే అనుకునే పసి ప్రాయపు తుళ్లిపోతల్ని కూడా ఋతుపవనాలు తమ వెంట తెస్తాయి.

ఈ ఫోటోలను బోస్టన్ గ్లోబ్ పత్రిక అందించింది.

One thought on “ఋతు పవన రాగాలు, భరత జీవన విరాగాలు

  1. భారతదేశ ఆర్థికరంగానికి రైతు వెన్నెముక అయితే ఆ రైతంగానికి ఈ ఋతుపవనాలే జీవనాధారాలు.వారికి నిజమైన శతృవులు ఈ రాజకీయ దళారులు! విముక్తి ఎన్నడో!?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s