తనచేత అస్త్ర సన్యాసం ఎలా చేయించాలో నేరుగా పాండవుల చెంతనే గుట్టు విప్పిన కురు పితామమహుడు భీష్ముడు. ఆ విధంగా ఆయన తన పాండవ పక్షపాతాన్ని ఎటువంటి శషభిషలు లేకుండా చాటుకున్నాడు. అయితే అది వ్యక్తిగతమే. ఆయన యుద్ధం చేసినంతవరకు కౌరవుల తరపున చేలెరేగి పోరాడాడు. ఆయన యుద్ధ కౌశల విశ్వరూపానికి తట్టుకోలేకనే పాండవులు ఆయన్ని ఎలా కూల్చివేయాలో భీష్ముడినే సలహా కోరినట్లు మహా భారతం చెబుతోంది.
కౌరవులకు భీష్ముడు ఎలాగో, బి.జె.పికి అద్వానీకి అలాంటివారు. ఆర్.ఎస్.ఎస్ సంస్ధ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చడం కోసం పురుడు పోసుకున్న జన సంఘ్, భారతీయ జనతా పార్టీ రెండింటి వ్యవస్ధాపనలోనూ అద్వానీకి భాగస్వామ్యం ఉన్నది. అలాంటి వ్యక్తి అస్త్ర సన్యాసం చేయవలసిన క్షణాన పునరుజ్జీవనాన్ని కాంక్షించడమే కాక అందుకు అడ్డు వచ్చిన స్వపక్షీయులను వెన్నుపోటు పొడవడానికి సైతం వెనుదీయలేదని కార్టూన్ సూచిస్తోంది.
కానీ అద్వానీ వైపు నుండి చూస్తే ఇలా భావించడం అన్యాయమేనేమో! అద్వానీయే లేకపోతే బి.జె.పిలో మోడి స్ధానం ఇప్పుడు ఎక్కడ ఉండేది? ఆ లెక్కన మోడి గురు ద్రోహానికి పాల్పడినట్లు కాదా?
ఎవరు వెన్ను పోటు పొడిచినా, ఇంకెవరు ద్రోహానికి పాల్పడిన ఇవి పదవీ రాజకీయాలే తప్ప ప్రజల రాజకీయాలు మాత్రం కాదు. అవినీతి పంకిలంలో సాగుతున్న కొట్లాటలకు జనం వగచనేల? దోపిడీదారుల రాజకీయాలు ఇంతకంటే సుందరంగా ఎప్పుడు ఏడ్చాయి గనక!
చోడ్ దో లోగోన్ కా ఖయాల్ !
కిస్సా కుర్సీ కా ,
నేతా కోయీ భీ హో !
వో ఆమ్ ఆద్మీ కే లియే బన్ గయా అంగూర్ !
సుధాకర్ గారూ మీ కవితకు అర్ధం? (నాకు హిందీ రాదులెండి)
జనం సంగతి ఎవడికి పడుతుంది ?!
పదవి మీదే నేతల గురి !
ఏ నాయకుడైనా ,
సామాన్యుడికి అందని ద్రాక్ష పండే !