ఆర్టీఐ చట్టం? ఏం జోకా? -కార్టూన్


The Hindu

The Hindu

“ఏయ్! ఆర్టీఐ చట్టమా? ఏం జోకా – మీరు తెలుసుకోవాలని మేము ఏదైతే అనుకుంటున్నామో ఆ సమాచారం అంతా ఇస్తూనే ఉన్నాం కదా…”

ప్రజల్ని రాజకీయ పార్టీలు ఎలా పరిగణిస్తాయో ఈ కార్టూన్ చక్కగా చెబుతోంది. వారి దృష్టిలో ప్రజలు ఏమీ తెలియని దద్దమ్మలు. గొర్రెల కాపరి కాపలా కర్రని అనుసరించే గొర్రెల మంద. ఎక్కువ తెలుసుకుంటే గొంతెమ్మ కోర్కెలు కోరే వాజమ్మలు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో కూడా తెలియని నిరక్షర కుక్షులు. తమ ఓటు శక్తి గురించి తెలియక క్వార్టర్ బీరు బాటిల్ కీ, పొడవాటి ఎర్ర నోటుకీ అమ్ముకునే తెలివి హీనులు. ఎండా, వానా కురుస్తున్నా లెక్క చేయకుండా చాంతాడంత క్యూల్లో నిల్చుని ఓట్లు గుద్దే అమాయక జీవులు. అలాంటి వారికి తమ సమాచారం ఇచ్చామంటే ఇంకేమన్నా ఉందా? తేలికై పోమూ? ఎంత సి.ఐ.సి ఐతే మాత్రం, తమ పార్టీల సమాచారన్ని కూడా ఇలాంటి జనానికి ఇవ్వాలని ఎలా చెబుతుంది?

పారదర్శక పాలన గురించి పుస్తకాలు రాస్తూ, నినాదాలు ఇచ్చే పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రజలకి తమ పార్టీల సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయంటే ప్రజల్ని నిజంగా ఎవరు గౌరవిస్తున్నారో ఇట్టే అర్ధం అవుతోంది. డాక్టరీ చదువుని నోట్ల కట్టల కోసం కాకుండా గిరి పుత్రుల జీవితాల కోసం అంకితం చేసిన ఒక బినాయక్ సేన్, బెంగాల్ భూములు దక్కాల్సింది భూమి లేని కూలీలకే తప్ప సలీం, టాటా లాంటి కంపెనీలకు కాదని చెప్పటమే కాక అందుకోసం ఆయుధం పట్టి వ్యక్తిగత సుఖాల్ని తృణప్రాయంగా త్యాగం చేస్తున్న వేన వేల కిషన్ జీలు, వీరే ప్రజల భావాలకు, ఆకాంక్షలకు, శక్తి యుక్తులకు నిజంగా విలువ, గౌరవం ఇచ్చే ప్రజా నాయకులు!

5 thoughts on “ఆర్టీఐ చట్టం? ఏం జోకా? -కార్టూన్

 1. సి ఐ సి అడుగుతున్నఏమిటి? రాజకీయ పార్టీలు తమ అన్ని కార్యకలాపాల వివరాలు. ఏ సమావేశంలో ఎవరు ఏమి మాట్లాడారు. సమావేశంలోని మినట్స్ కావాలంటే ఎలా ఇస్తారు. పారీ తన సభ్యులకు జవాబుదారి అవుతుంది గాని ప్రజలందరికి జవాబు చెప్పవలసిన అవసరం లేదు. ఆ మాటకొస్తే కిషంజీలు రేపు ఎవరిని చంపుదామని నిర్నయించారో చెబుతారా?
  బెంగాల్ నందు పేద ప్రజలకు కాదని టాటాలకు, సలీంలకు భూమి ఇవ్వలేదు. రాష్ట్రాన్ని పారిశ్రమికంగా అభివ్రుద్దిలోకి తేవడానికి అవసరమై ఇచ్చింది. బలవంతంగా ఎవరి దగ్గరా గుంజుకోలేదు. భూములు కోల్పోయిన వారికి మిగతా అన్ని రాష్ట్రాలకన్న మెరుగైన ప్యకేజి ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. ప్రజలకు లేనిపోని భయాలు కల్పించి తిరుగుబాటు చేసి మమతతో చేతులు కలిపి కొంతలో కొంతైనా ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని దించి కిషన్ జీ లు ఏచెసారో దాని ఫలితాలేటో అందరికీ తెలిసి వస్తున్నయి. మీ బ్లాగులోనె ఆవిషయాలు చూస్తున్నాము. బెంగాల్ నందు వామ పక్ష ప్రభుత్వాన్ని దించి మమతను గద్దెనెక్కించిన కిషంజీలు అంతకు తగిన మూల్యాన్ని చెల్లించారు లేదా? వారెన్నటికీ సి ఐ సి అడుగుతున్నఏమిటి? రాజకీయ పార్టీలు తమ అన్ని కార్యకలాపాల వివరాలు. ఏ సమావేశంలో ఎవరు ఏమి మాట్లాడారు. సమావేశంలోని మినట్స్ కావాలంటే ఎలా ఇస్తారు. పారీ తన సభ్యులకు జవాబుదారి అవుతుంది గాని ప్రజలందరికి జవాబు చెప్పవలసిన అవసరం లేదు. ఆ మాటకొస్తే కిషంజీలు రేపు ఎవరిని చంపుదామని నిర్నయించారో చెబుతారా?
  బెంగాల్ నందు పేద ప్రజలకు కాదని టాటాలకు, సలీంలకు భూమి ఇవ్వలేదు. రాష్ట్రాన్ని పారిశ్రమికంగా అభివ్రుద్దిలోకి తేవడానికి అవసరమై ఇచ్చింది. బలవంతంగా ఎవరి దగ్గరా గుంజుకోలేదు. భూములు కోల్పోయిన వారికి మిగతా అన్ని రాష్ట్రాలకన్న మెరుగైన ప్యకేజి ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. ప్రజలకు లేనిపోని భయాలు కల్పించి తిరుగుబాటు చేసి మమతతో చేతులు కలిపి కొంతలో కొంతైనా ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని దించి కిషన్ జీ లు ఏచెసారో దాని ఫలితాలేటో అందరికీ తెలిసి వస్తున్నయి. మీ బ్లాగులోనె ఆవిషయాలు చూస్తున్నాము. బెంగాల్ నందు వామ పక్ష ప్రభుత్వాన్ని దించి మమతను గద్దెనెక్కించిన కిషంజీలు అంతకు తగిన మూల్యాన్ని చెల్లించారు లేదా? వారెన్నటికీ ప్రజల భావాలకు, ఆకాంక్షలకు, శక్తి యుక్తులకు నిజంగా విలువ, గౌరవం ఇచ్చే ప్రజా నాయకులు కాలేరు.

 2. అశోక్ గారు, కిషన్ జీ పార్టీ పార్లమెంటరీ పార్టీ కాదు. ఆ పార్టీ ప్రభుత్వం నుండి భూములు, సౌకర్యాలు పొందడం లేదు. ఆ పార్టీ అసలు పార్లమెంటరీ వ్యవస్ధనే నమ్మడం లేదని ఆ పార్టీ నాయకుల ప్రకటనలు చెబుతాయి. కాబట్టి పార్లమెంటరీ పార్టీలను కిషన్ జీ పార్టీతో పోల్చడం కుదరదు.

  మూల్యం చెల్లించడం ఏమిటి? బలవంతపు విప్లవంతో వ్యవస్ధను మార్చేవారిని పాలకవర్గాలు చూస్తూ ఊరుకోవని మార్క్స్ నుండి మావో వరకు చెప్పినవారే. కిషన్ జీ పార్టీ పైన ద్వేషం వెళ్లబుచ్చుకునే తొందరలో ఆ సంగతి మర్చినట్లున్నారు. విప్లవం అంటే విందు భోజనం కాదని, పార్లమెంటరీ అధికారంతో ప్రజలకు కొంతలో కొంతైనా మేలు చేయడం కాదని పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు చెబుతాయో లేదో గానీ విప్లవ పార్టీలు మాత్రం చెబుతాయి. పార్టీల నాయకులు, కార్యకర్తలు అనేక త్యాగాలకు వెరవ కూడదని అవి చెబుతాయి. కనుక కిషన్ జీ మరణం మూల్యం కాదు. త్యాగం. అలాంటివి మునుముందు కూడా అనేకం జరుగుతాయి. పార్లమెంటరీ వ్యవస్ధలోని దోపిడీవర్గాల అణచివేత సాధనం పోలీసులు. కిషన్ జీని అలాంటి అనేకమందిని చంపింది వారే. దానిని మీరు మూల్యం అంటున్నారంటే మీరు ఎవరి పక్షం మాట్లాడుతున్నారో అర్ధం అవుతోంది. పార్లమెంటరీ బురద నుండి కొంతలో కొంతైనా మేలు చేద్దామనుకునేవారికి అది అర్ధం కాకపోవచ్చు. త్యాగాలను మూల్యాలుగా భావిస్తున్నందునే మౌలిక సిద్ధాంతం వదిలేసి పార్లమెంటరీ రొచ్చులోకి దిగారా అన్న సందేహం నాకిప్పుడు కలుగుతోంది.

  మెరుగైన ప్యాకేజి ఇస్తే జనం ఎందుకు తిరగబడ్డారు? వారిని పిట్టల్ని కాల్చినట్లు పోలీసులు ఎందుకు కాల్చి చంపారు? సింగూరు గ్రామానికి చీమ కూడ చొరకుండా ఎందుకు అష్ట దిగ్బంధనం చేయాల్సి వచ్చింది? నంది గ్రామ్ లో సి.పి.ఎమ్ కార్యకర్తలు సైతం ఖాకీ బట్టలు ధరించి జనం పై ఎందుకు కాల్పులు జరిపారు? పోనీ మీ పార్లమెంటరీ భాషలో చెప్పుకున్నా సి.పి.ఐ, సి.పి.ఎం కూడా తగిన మూల్యం చెల్లించాయి కదా? దాన్నెలా చూస్తారు మీరు?

  పారిశ్రామిక అభివృద్ధి ముప్ఫై యేళ్లుగా ఎందుకు జరగలేదు? వ్యవసాయాధారిత జనాన్ని పక్కన బెట్టి సలీం, టాటాలకి భూములు అప్పగిస్తే అది పారిశ్రామిక అభివృద్ధి ఎలా అవుతుంది? అసలు వ్యవసాయాధారిత దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుసరించాల్సిన మార్గం ఏమిటని మీ ఉద్దేశ్యం? వ్యవసాయ భూముల్ని లాక్కుని కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఎ.పి లో తప్పు బెంగాల్ లో రైటు ఎలా అయింది? సి.పి.ఎం పార్టీ చెప్పే బడా భూస్వామ్య, బడా పెట్టుబడిదారీ వర్గాల ఆధిపత్యం ఉన్నపుడు జరిగే పారిశ్రామిక అభివృద్ధిలో ప్రజలకు ఏ మాత్రం ఫలితం దక్కుతుందని మీ అవగాహన? దోపిడీ వ్యవస్ధను మౌలికంగా అలాగే ఉంచి పారిశ్రామిక అభివృద్ధి చేయడం ఎలా సాధ్యం? ఇవన్నీ మీరు లేదా పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు.

  బలవంతంగా ఎవరి దగ్గరా భూములు లాక్కోలేదనడం పచ్చి అబద్ధం. బహుశా మీకు విషయాలు తెలియకపోయి ఉండాలి. లేదా తెలిసీ అబద్ధం అయినా ఆడుతుండాలి. బలవంతంగా లాక్కోకుండానే అంత పోరాటం నడిచిందనీ, ఐనా ఎల్.డి.ఎఫ్ అధికారం కోల్పోయిందనీ మీరు చెప్పదలిస్తే అంతకు మించిన అబద్ధం మరొకటి ఉండబోదు. పత్రికల వార్తలు, ప్రజల కష్టాలు, మరణాలు అన్నింటినీ మీరు అబద్ధం చేసేస్తున్నారు. ఇది చాలా శోచనీయం.

 3. పెట్టుబడిదారీ దేశంలో పెట్టుబడిదారీ చట్టాలే ఉంటాయి కానీ సోషలిస్ట్ చట్టాలు ఉండవు. చట్ట ప్రకారం పని చేస్తే పాలక వర్గానికిలొంగిపోయినట్టేనని రంగనాయకమ్మ గారు “జన సాహితీతో మా విభేదాలు” పుస్తకంలో స్పష్టంగానే వ్రాసారు. ఈ చట్టాల మీద విశ్వాసం లేక సాయుధ పోరాటం చేసే ఒక నిషేధిత పార్టీని ఇవే చట్టాల ప్రకారం పని చేసే CPM లాంటి పార్టీలతో పోల్చడం అనవసరం కాదా?

 4. మన చర్చ టపా శీర్షిక పరిధిని దాటుతున్నప్పటికీ కొన్ని విషయాలు చర్చించవలసిన అవసరం ఉంది. నందిగాం సింగూర్లలో తప్పు జరిగింది. మీరన్నట్లు సిపిఎం మూల్యం చెల్లించారు. పారిశ్రామిక అభివృద్ధి కొరకైనప్పటికీ ప్రజలకు ఇష్టం లేనప్పుడు ప్రజా ప్రభుత్వం అనేది ప్రజలకు అవగాహన కల్పించి తీసుకోవాలి తప్ప గుంజుకోకూడదు. ఈ విషయం పార్టీ గుర్తించి తగు చర్య తీసుకునేలోపే జరగ కూడని నష్టం జరిగింది.
  టాటాలకు భూమి ఇచ్చే విషయంలో మావోయిష్టులు చేసిన పోరాటాన్ని వ్యతిరేకించడం లేదు. దానికి మమత లాంటి వారితో కలిసి భుజం, భుజం కలిపి సిపిఎం ని అధికారం నుండి తప్పించడం ఎంతవరకు సమంజసం. ఏమిసాధించారనేదే నా ప్రశ్న. ఇప్పుడు దేశంలో సాయుధ పోరాటానికి అనువైన పరిస్తితులు లేవు కనకే పార్లమెంటరీ విధానంలో ఉన్న అవకాషాలను వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళడమే మార్గం. అది కాదని మావోయిస్టులు చేస్తున్న పోరాటం సాధిస్తున్నదేమిటి? వర్గ శతృ నిర్మూలనలో అమాయకులను భలి ఇవ్వడమే. 1969 నుండి జరుగుతున్నదిదే కాదా? మీ అవగాహన ప్రకారం సిపిఎం ఒక బూర్జ్వా పార్టీ అయినప్పటికీ తృనమూల్ తో పోల్చితే ఏది ప్రజలకు తక్కువ నష్టం కలిగించేది అనేది కూడా చూడాల్సిన అవసరం లేదా? శతృవులెవరో, పోరాటంలో కలిసి రాగల మిత్రులెవరో అనే ఆలోచన లేకుండా చేసే పోరాటం ఇప్పటి ఫలితాలనే ఇస్తుంది. నాకు తెలిసిన కాలంలో సిపిఎం మిగతా బూర్జ్వా పార్టీలతో పోలిస్తే మావోయిష్టులను మితృలుగానే పరిగనించింది. కాని మావోయిష్టులే మిగతా బూర్జ్వా పార్టీలకన్న సిపిఎం తోటే ప్రజలకు ఎక్కువ ప్రమాదం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాదంటారా?

 5. పాలక వర్గంతో వర్గ సహకారం చెయ్యడమే కాకుండా, ఆ వర్గం నడిపే పార్లమెంట్‌లో స్థానాలు పొందిన పార్టీల గురించి చర్చ జరుగుతోంది ఇక్కడ. అటువంటి పార్టీలని వ్యతిరేకించే ఒక పార్టీ ఎన్ని తప్పులు చేసినా, వర్గ సహకారం అనేది కరెక్ట్ అయిపోదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s