రికార్డు స్ధాయికి ఫ్రాన్స్ నిరుద్యోగం


Trading Economics నుండి

Trading Economics నుండి

ఐరోపాలో జర్మనీ తర్వాత హెవీ వెయిట్ గా పేరు పొందిన ఫ్రాన్స్ లో కూడా ప్రజలు నిరుద్యోగ భూతాన్ని ఎదుర్కొంటున్నారు. గత 15 సంవత్సరాలలోనే అత్యధిక స్ధాయికి అక్కడి నిరుద్యోగం చేరుకుంది. 2013 మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) ముగిసేనాటికి ఫ్రాన్స్ లో 10.8 శాతం నిరుద్యోగం నమోదయిందని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్ధ INSEE గురువారం తెలిపింది.

1998 తర్వాత ఈ స్ధాయి నిరుద్యోగం నమోదు కావడం ఫ్రాన్స్ లో ఇదే మొదటిసారి. యూరో జోన్ ఋణ సంక్షోభం ధాటికి యూరోపియన్ దేశాలు విలవిల లాడుతున్నాయి. సదరు సంక్షోభం ఫ్రాన్స్ ను కూడా వదల్లేదని ఈ నిరుద్యోగం చెబుతోంది. ఫ్రాన్స్ ప్రభుత్వం కేవలం ఉద్యోగం కోసం ప్రయత్నించేవారి (active population) నుండి మాత్రమే నిరుద్యోగులను లెక్కిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి విసిగి వేసారి, ఇక వెతకడం మానేస్తే వారు నిరుద్యోగులు కానట్లే. కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన సంఖ్య కంటే ఇంకా ఎక్కువగానే అక్కడ నిరుద్యోగం ఉండే అవకాశం ఉన్నది.

2012 చివరి క్వార్టర్ లో ఫ్రాన్స్ నిరుద్యోగం 10.5 శాతంగా నమోదయింది. ఇది మొదట 10.6 శాతం అని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత 10.5 శాతానికి తగ్గించుకుంది. 2013 మొదటి క్వార్టర్ తో పోలిస్తే నిరుద్యోగం 0.3 శాతం పెరిగి 10.8 శాతానికి చేరుకున్నట్లు. గత సంవత్సరం మొదటి క్వార్టర్ లో నిరుద్యోగం 10 శాతంగా ఉంది. అంటే గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 0.8 శాతం పెరుగుదల నమోదయింది.

మేట్రోపాలిటన్ నగరాల వరకు చూస్తే నిరుద్యోగం 10.4 శాతం ఉందని INSEE తెలిపింది. 2012 చివరి క్వార్టర్ తో (10.1%) పోలిస్తే ఇది 0.3 శాతం ఎక్కువ. 2013 సంవత్సరంలో మిగిలిన క్వార్టర్లలో కూడా ఫ్రాన్స్ నిరుద్యోగం పెరుగుతుందని ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి 2012 సంవత్సరం చివరికల్లా నిరుద్యోగం పెరుగుదల అరికడతానని అధ్యక్షుడు ఫ్రాన్షా ఒలాండే (ఆంగ్లంలో -ఫ్రాంకోయిస్ హాలండే) వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేరకపోగా మరో సంవత్సరం నిరుద్యోగం పెరుగనుంది. పాలకుల వాగ్దానాలు ఏ దేశంలోనైనా ఇదే తంతు.

ట్రేడింగ్ ఎకనమిక్స్ సంస్ధ ప్రకారం చారిత్రకంగా ఫ్రాన్స్ నిరుద్యోగం 1996-2013 సంవత్సరాల మధ్య సగటున 9.48 శాతంగా ఉన్నది. 1997 జూన్ క్వార్టర్ లో అత్యధికంగా 11.2 శాతానికి చేరిన నిరుద్యోగం 2008 మార్చి క్వార్టర్ లో అత్యంత తక్కువగా 7.5 శాతంగా నమోదయింది.

ఋణ సంక్షోభం సాకు చూపి జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు కూడా అత్యంత కఠినమైన పొదుపు విధానాలను అమలు చేస్తున్నాయి. ఫిస్కల్ కన్సాలిడేషన్ అని చెబుతూ కోశాగార లోటు (fiscal deficit) తగ్గించడానికి ప్రభుత్వ వ్యయంలో కోత విధిస్తున్నారు. ప్రభుత్వ వ్యయం తగ్గించడం అంటే అన్నీ వర్గాలకు ఆయా వర్గాల ఆదాయాల నిష్పత్తిలో అది అమలు కాదు. కార్మికులు, ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు, సదుపాయాలు తగ్గించి ఆ వాటాను కంపెనీలకు తరలించడమే ఫిస్కల్ కన్సాలిడేషన్ లేదా పొదుపు విధానాలు (austerity measures) లేదా ఖర్చుల తగ్గింపు యొక్క లక్ష్యం.

ఫ్రాన్స్ నిరుద్యోగం పెరగడానికి కూడా ప్రధాన కారణం ఈ పొదుపు విధానాలే. ప్రభుత్వాలు ఎలాగూ ధనిక వర్గాల పక్షమే గనుక ప్రజల నిరుద్యోగం వారికి ఒక సమస్య కాదు.

One thought on “రికార్డు స్ధాయికి ఫ్రాన్స్ నిరుద్యోగం

  1. It is important to calculate yearly unemployment. That means graduates, from the previous year, could not get emloyement in this year. so that we can evaluate the growth rate of unemployment in any country.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s