“అది కేవలం ముందు జాగ్రత్త కోసమే, వారి ఎన్నికల ఖర్చు పైన ఆర్.టి.ఐ దస్త్రం పడేస్తామని వారికి తెలుసు!”
సమాచార హక్కు చట్టం పోయి పోయి రాజకీయ పార్టీల మెడకు చుట్టుకుంటోంది. ఏ పార్టీలయితే ప్రజలకు ప్రభుత్వం నుండి సమాచారం పొందే హక్కు ఉన్నదని సభలపై బల్లలు గుద్ది మరీ వాదించాయో, ఆ పార్టీలే ఇప్పుడు ఆ చట్టం తమకు వర్తించదని వాదిస్తున్నాయి. ప్రభుత్వాల ఆధారిటీని ఒక ప్రత్యేక (unique) పద్ధతిలో పార్టీలు తమ గుప్పెట్లో పెట్టుకుంటాయని, కనుక అవి కూడా ప్రజా సంస్ధలేనని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) ఫుల్ బెంచి తీర్పు చెప్పడంతో పార్టీలకు ఇప్పుడు మరికొన్ని అసంబద్ధ వాదనలు చేసే భారం వచ్చిపడింది.
సి.ఐ.సి తీర్పుని కాంగ్రెస్ పార్టీ అడ్డంగా తిరస్కరించింది. సి.పి.ఐ (ఎం) పార్టీ కూడా దాదాపు అదే తీవ్రతతో తీర్పును వ్యతిరేకించింది. తమ విరాళాల గురించి జనానికి చెప్పవలసిన అవసరం లేదు పొమ్మంది. ఇక జె.డి(యు), ఆర్.జె.డి లాంటి పార్టీల సంగతి చెప్పనే అవసరం లేదు. రాజకీయ పార్టీలు తమ విరాళాల వివరాలను, ఆదాయం, ఖర్చుల వివరాలను ప్రజలకు ఎందుకు చెప్పాలో సి.ఐ.సి సవివరంగా తన తీర్పులో తెలియజేసింది.
సి.ఐ.సి తీర్పులో లేవనెత్తిన వివిధ అంశాలకు ఏ పార్టీ ఇంతవరకు సరయిన సమాధానం ఇవ్వలేదు. పార్లమెంటరీ పార్టీల సంస్ధాగత ఎన్నికలే అత్యంత నామమాత్రంగా, ఒక విధమైన నియంతృత్వ పద్ధతిలో జరుగుతుంటాయి. తమ కార్యకర్తలకే జవాబు ఇవ్వని పార్టీలు ప్రజల పట్ల జవాబుదారీగా వ్యవహరిస్తాయని ఊహించడం అత్యాశేనేమో. అందుకే సి.ఐ.సి తీర్పును అమలు చేయాలని ప్రజలు పార్టీలపై ఒత్తిడి తేవాలి.
రాజకేయ పార్టీలు ప్రజా సంస్ధలేనని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) ఫుల్ బెంచి తీర్పు చెప్పడం సరి అయినదని నేను అనుకోవడం లేదు. ఈ కేసులో సమాచారం అడిగిన వారికి సిపిఎం సమాదానం ఇస్తూ పార్టీకి ప్రభుత్వం నుండి లభించిన భూమి వివరాలను, పార్టీకి వచ్చిన వివరాలను అందించింది. ఆ విషయాన్ని గమనించాలి. పూర్తి వివరాలు సిపిఎం వాదనలను ఇక్కడ చూడండి http://www.rti.india.gov.in/cic_decisions/CIC_SM_C_2011_000838_M_111223.pdf
మరియు http://cpim.org/content/cic-order