చేపమందు అశాస్త్రీయం, ఏర్పాట్లు మీవే -లోకాయుక్త


Battina bros

బత్తిన సోదరులకు ఊహించని రీతిలో షాక్ లాంటిది ఎదురయింది. చేప మందు అశాస్త్రీయమని లోకాయుక్త కోర్టు చెప్పేసింది. ప్రైవేటు వ్యక్తుల కార్యకలాపాలకు ప్రభుత్వం నుండి సహాయం చేయడానికి వీలు లేదని తీర్మానించింది. బత్తిన సోదరులే చేపలు మింగడానికి వచ్చేవారికి తమ సొంత ఖర్చులతో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తేల్చి చెప్పింది. జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి గ్రౌండ్స్ లో జరిగే చేప మందు పంపిణీ కోసం మంచి నీరు, భద్రత, శుభ్రత లాంటి తగిన ఏర్పాట్లు వారు చేసుకోవాలని లోకాయుక్త స్పష్టం చేసింది.

ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు పంచిపెట్టే చేపమందు గురించి అందరికీ తెలిసిన విషయమే. మృగశిర కార్తెలో మాత్రమే పంపిణీ చేసే ఈ మందు వలన రోగులకు వ్యాధి తగ్గిన ఉదాహరణలు ఏమీ లేవు. గుణం కనిపించిందని చెప్పినవారు చేప మందుతో పాటు తమ తమ ఊళ్లలో వివిధ సంప్రదాయాలలో వైద్య చికిత్సలు తీసుకుంటున్నారని, ఆ చికిత్సల వల్ల గుణం కనిపించింది తప్ప చేపమందు వల్ల కాదని జన విజ్ఞాన వేదిక లాంటి సంస్ధలు ఆధారాలతో చెప్పినా అనేకమంది వారి మాటలను పట్టించుకోలేదు.

బత్తిన సోదరులైతే ‘జన విజ్ఞాన వేదిక’ (జె.వి.వి) వారు ఆజ్ఞానులని ప్రకటించేంతగా సాహసించారు. కానీ గతంలో హై కోర్టు ఇచ్చిన తీర్పు అలా లేదు. చేపమందు వాస్తవానికి మందు కాదని, అది కేవలం ప్రసాదం మాత్రమేనని హై కోర్టు గతంలో ఒకసారి తీర్పు చెప్పింది. ఈ తీర్పుకు బత్తిన సోదరులు సైతం ఒప్పుకున్నారు. తాము పంపిణీ చేసేది మందు కాదని, ప్రసాదం మాత్రమేనని వారు అంగీకరించారు. ఐనా వారు జె.వి.వి వాళ్ళని ఆడిపోసుకోవడం మానలేదు.

ఔషధం అయితే అది సంవత్సరంలో అన్ని వేళలా పని చేయాలి. కానీ మృగశిర కార్తెలో మాత్రమే చేపమందు పని చేస్తుందని బత్తిన కుటుంబం చెబుతుంది. చేపమందు అశాస్త్రీయం అని సగం ఇక్కడే తేలుతోంది. చేప ప్రసాదం ఔషధం కాదన్న హై కోర్టు తీర్పును లోకాయుక్త బుధవారం నాటి తన తుది తీర్పులో ఉటంకించడం విశేషం.

అర్ధ భూస్వామ్య వ్యవస్ధ పునాది వల్ల పదిలంగా కొనసాగుతున్న మూఢనమ్మకాలు, దైవ భీతిలకు అర్ధ వలస దోపిడి అవసరం తోడు కావడంతో భారత దేశ ప్రజలకు విజ్ఞానం అందే దారులు మూసుకుపోయాయి. ఫలితంగా బత్తిన సోదరుల చేపమందు లాంటి మూఢ నమ్మకాలతో పాటు, అనేకమంది బాబాల పెత్తనం భారత శ్రామిక ప్రజల మెదళ్ళను శాసిస్తూనే ఉన్నాయి.

జె.వి.వి పోరాటం మేరకు చేప ప్రసాదం పంపిణీకి సిటీ సివిల్ కోర్టు గత డిసెంబరులో కొన్ని నిబంధనలు విధించింది. 10 టి.వి ప్రకారం ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి.

  • ఇది చేప మందు కాదు చేప ప్రసాదమే అంటూ పంపిణీ ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటుచేయాలి.
  • చేప ప్రసాదాన్ని రోగుల నోట్లో వేసిన ప్రతిసారీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • ప్రసాదం పంపిణీ చేస్తున్న ఏరియాల్లో పరిశుభ్రత, మంచినీటి సదుపాయం తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి.
  • ఆహార తనిఖీ శాఖ ఆధ్వర్యంలోఈ ప్రసాదాన్ని తయారు చేయాలి.
  • ప్రసాదంలో ఏ పదార్థాలు వాడుతున్నారు అనే విషయాన్ని ఆ శాఖ పర్యవేక్షించాలి.

ఈ నిబంధనలు పాటించే పరిస్ధితి ఉన్నదో లేదో తెలియడం లేదు. ప్రభుత్వం ఎటువంటి సహాయము బత్తిన సోదరులకు అందించవలసిన అవసరం లేదని లోకాయుక్త తీర్పు చెప్పినందున భద్రతకు సంబంధించిన పొరపాట్లు దొర్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత యేడు పంపిణీలో తొక్కిసలాటలో పడి ఒకరు మృతి చెందిన విషాధం పునరావృతం కారాదు.

ప్రజల్లో మూఢనమ్మకాలు ఉన్నంతవరకూ, వాటిని కాపాడుతూ లబ్ది పొందుతున్న పాలకులు ఉన్నంతవరకు చేప ప్రసాదం ఔషధంగా జనాదరణ పొందుతూనే ఉంటుంది.

15 thoughts on “చేపమందు అశాస్త్రీయం, ఏర్పాట్లు మీవే -లోకాయుక్త

 1. చేప మందులో ఏముందో బయట పెడితే అది పని చెయ్యదని బత్తిన సోదరులు అన్నారు. చిన్న పిల్లలు మాట వినేలా చెయ్యడానికి పెద్దవాళ్ళు చెప్పే అబద్దంలాగ ఉంది.

 2. దేశియ సంప్రాదాయ వైధ్యం లో మందు గురించిన వివరాలు ఇతరులకు తెలిపితే అది పని చేయకుండా పోతుందనే మూడ నమ్మకం ఎప్పటి నుడో ఉంది. స్త్రీలు, దలితులు వేదాలు చదవకూడదనే సాంప్రదాయం లోంచి వచ్చి ఉంటుంది. అంటె తమకు తెలిసిన ‘విజ్ఞానం ఇతరులకు తెలియ కూడదూ ఆ విదంగ అదికరాన్ని గుప్పెత పెట్టుకొవలనే మనస్తత్వం లోంచి. దీని వల్ల మచి వైద్యం కూడా సమాజానికి తెలియకుండ పొయింది.

 3. లోకాయుక్త ఇచ్చిన తీర్పు చాలా సహేతుకం గా ఉంది !
  చేప మందు మింగి , తరువాత, తీవ్రమైన ఆస్తమా ఎటాక్ లకు గురై , ఆస్పత్రులలో వేలకు వేలు ఖర్చు చేసే వారూ , ప్రాణాలు కోల్పోయే వారి బంధువులు కూడా , ఈ చేప మందు ఇచ్చే వారి మీద నష్ట పరిహారం కోరుతూ దావాలు వేయాలి ! కేవలం చేప మందు కోసం తిరణాల లాగా వరసలు కట్టి,
  ” చేప మందు ” మింగడం తో నే తమ పని అయి పోయిందను కోకుండా !
  అప్పుడు లక్షలలో పరిహారం చెల్లించ లేక ” బోర్డు తిరగేస్తారు వాళ్ళు !

 4. Dear Prasad,
  While what you have said (“vaati meeda poradandi”) is correct, it shouldn’t mean that one need not fight against these fake-doctory. The issue is not about what they seem to be doing (again, a government that cares about the well being of the people should avoid the malpractices these people are allegedly doing) but about the government wasting crores of money. In what way is the govt. spending people’s money on superstitions justifiable? By the way, there people fighting (not just paying lip service) with Cola companies and I’m sure this ssmanu guy is not one among them.

  Coming to the blog links you have provided, that guy ssmanu supports EVERYTHING provided that EVERYTHING is even remotely related to Hinduism. I’m sure that guy would certainly have applied some common sense had it been a Mulsim doing this medicine-distribution rather than a Hindu. They just prefer to close their eyes to the ridiculocities -not to mention atrocities- under practice in the name of their religion. That’s exactly the reason why most of the bloggers don’t take him seriously.

  One honest question. Let’s you have a relative suffering from Asthma, would you suggest him/her to take this “fishy medicine” (pun intended) and forgo the standard one?

  Regards,
  విశేషజ్ఞ

 5. “One honest question” వారు అన్నంత పని చేస్తారండి! నమ్మకమే వారి ప్రాతి పదిక. వారే అన్నట్టు “మానమ్మకాన్ని ఒమ్ముచేయకండి”అని. ఆనమ్మకం తోటే ప్రానాలు పొగొట్టు కున్న వాల్లని మనం చూడొచ్చు- అన్నీ మతాల్లో. కొడవటిగంటి రోహిణి ప్రసాద్‌ గారు అంటారు ఒక చోట ” భక్తులు చిన్న పిల్లలు లాంటి వారు, పాలు వస్తున్నాయి అనే భ్రమలో భక్తి అనే పాల పీక చుబుకు తూ ఉంటారు పాలు రాకపోయినా” అని. సాంకెతిక ప్రగతి పలాలు అనుభవిస్తున్నారు. మళ్ళీ ఆ సాంకేతికాన్ని – కంప్యుటర్లని- పూజిస్తూ ఉంటారు.

 6. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నాటు మందులు వేరు, ఆయుర్వేద మందులు వేరు. ఆయుర్వేద వైద్యం చెయ్యాలన్నా మెడికల్ కాలేజ్ లేదా యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. నాటు వైద్యుల దగ్గర ఎలాంటి సర్టిఫికేట్లూ ఉండవు. బత్తిని సోదరులు చేస్తున్నది నాటు వైద్యం. దానికి ఆయుర్వేదం (హిందూ మతంతో సంబంధం ఉన్న) రంగు పులిమి వ్యాపారం చేస్తున్నారు. జనం నిజమైన ఆయుర్వేద వైద్యుల దగ్గరకి కూడా వెళ్ళడం మానేస్తోంటే బత్తిన సోదరులు లాంటి నాటు వైద్యులని ప్రోత్సహించి ఆయుర్వేదమూ, నాటు వైద్యమూ ఒకటే అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.

 7. ఎన్ని బ్లాగుల లింక్‌ లిచ్చినంతమాత్రాన రాత్రికిరాత్రే వాస్తవాల మీద ఆదార పడి పెరిగిన అభిప్రాయాలు మారి పోతాయా? ఒక్క సారి అనుమతి దొరికిన తరువాత ప్రభుత్వ డబ్బు ఖర్చు అవక పోతేనేం ఎన్ని కార్పోరేట్‌ సంస్థలు, ఎన్ని స్వచ్చంద సంస్థలు, ఎన్ని మత సంస్థలు స్పాన సర్‌ చేయడానికి అత్యంత ఉత్సాహం తొ ముదుకొస్తాయొ చూడండి – దేశ సస్క్రుతిని కాపడే నెపంతో.

 8. ప్రసాదం వల్ల రోగాలు తగ్గితే ఆ ప్రసాదం అన్ని దేవాలయాలలో దొరికేలా చెయ్యాలి. అంతే కానీ దాని పేరుతో ఒక స్థలం పెట్టి తీర్థ యాత్రలు చెయ్యించక్కరలేదు.

 9. చేప ప్రసాదాన్ని వ్యతిరేకిస్తున్నవాళ్ళలో ఆయుర్వేద వైద్యులు కూడా ఉన్నారనే విషయాన్ని హిందూత్వవాదులు కావాలని మర్చిపోతున్నారు. ఆయుర్వేద మందుల ప్యాకెట్ల మీద కూడా ఆ మందులో ఏముందో వ్రాయబడి ఉంటుంది. మందులో ఏముందో చెప్పకుండా దాచాల్సిన అవసరం నాటు వైద్యులకి మాత్రమే ఉంటుంది.

 10. చేప మందు,
  పొగ తాగడం,
  అతిగా తాగే మద్యం,
  మాదక ద్రవ్యం ,
  అశాస్త్రీయం, ఇది సత్యం !
  ఎవరి చేతుల్లో వారి ప్రాణం !
  దేవుడి దేమీ లేదు పాపం !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s