ఇది ఇండియాలో మాత్రమే జరుగుతుందట! అలా చెప్పడం అతిశయోక్తే అయినా, జరిగింది మాత్రం ఘోరమే. ఏ తగాదా వచ్చిందో గానీ ఇద్దరు పోలీసులు బహిరంగంగా, అందరూ చూస్తుండగానే రక్తం కారేలా లాఠీలతో బాదుకున్నారు. కెమెరా పని చేస్తోందన్న స్పృహే లేకుండా కొట్టుకున్నారు. చూడడానికి ఒళ్ళు గగుర్పొడిచేలా కొట్టుకుని ఆనక వారిలో ఒకరు వీడియోగ్రాఫర్ తోనో, విలేఖరితోనో మాట్లాడారు కూడాను. తొమ్మిది రోజుల క్రితం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Times Now వార్తా ఛానెల్ ద్వారా యాహూ అందజేసిన ఆ ఘోరాన్ని ఈ లింక్ లోని వీడియోలో చూడండి.