మొదటిభాగం తరువాయి…………………….
సాగరికా ఘోష్: ఈ హింసా వలయానికి వ్యతిరేకంగా మీలాంటివారు గొంతెత్తవలసిన అవసరం లేదంటారా? లేదా మీలాంటి వారు వాస్తవానికి దానికి హేతుబద్ధతను కనిపెట్టడానికి ప్రయత్నించాలంటారా? ఎందుకంటే, మిమ్మల్ని ‘మావోయిస్టుల ఆపాలజిస్టు’గా పిలుస్తున్నారు! బి.జె.పి మిమ్మల్ని ‘నగ్నలిజం యొక్క అధునాతన ముఖం’ అని పిలుస్తారు. వారి హింసకు వ్యతిరేకంగా మీరు గొంతెత్తకపోతే, రాజ్యం (యొక్క హింస) కు నైతికంగా న్యాయబద్ధమైన ప్రతిఘటన అని చెబుతూ అది నైతికంగా సమర్ధనీయం అని చెబితే, పౌర సమాజంలోని ఒక సభ్యురాలిగా మీరు విఫలం చెందడం లేదా?
అరుంధతీ రాయ్: లేదు. నేను అలా (విఫలం అయినట్లు) కాదు. ప్రతి ఒక్కరూ ‘అది చాలా భయంకరం’ లాంటివి ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటే అది యధాతధ పరిస్ధితి కొనసాగింపుకు మద్దతు ఇవ్వడమే అవుతుంది. వాస్తవంలో ఆ గిరిజన ప్రాంతాల్లో ‘సామూహిక హత్యాకాండ పరిస్ధితిని’ సృష్టిస్తున్న భయంకరమైన నిర్మాణాత్మక హింసను పరిగణనలోకి తీసుకోకుండా దానిని (యధాతధ పరిస్ధితి) కొనసాగనిద్దాము (అని చెప్పడం అవుతుంది). అక్కడ ఉన్న పోషకాహార లోపం యొక్క స్ధాయిలను మీరు చూసినట్లయితే, అక్కడి ప్రజల పూర్తి నిరాశా నిస్పృహలను మీరు చూసినట్లయితే; ఆ ప్రజలను హింసించడం ఆగితేనే (ప్రతి) హింస ఆగుతుందని బాధ్యతాయుత పౌరుడు ఎవరైనా చెప్పాల్సి ఉంటుంది. అనేక దేశాల జనాభా కంటే పెద్దదైన ఆ గిరిజనాల సమూహం వాస్తవానికి తమను తాము నిర్మూలించుకోవడానికి వ్యతిరేకంగా పోరాడుతూ, తమ ఉనికికి కొన అంచున ఉన్నది. రాజ్యం యొక్క హింసతో వారి ప్రతిస్పందనలను, వారి ప్రతిఘటనను నేను సమానం చేయలేను. రెండింటినీ సమానం చేయడం అనైతికం అని నేను భావిస్తాను.
ఎస్.జి: మీ వ్యాసంలోని ఇతర అంశాలను మీ దృష్టికి తెస్తాను. మీరు గాంధి విషయంలో ప్రత్యేకంగా కఠినంగా ఉన్నారు. భారత దేశంలో విప్లవ కలను చారు మజుందార్ ఒక వాస్తవ ఉనికిగా ఉంచారన్నారు. ఆ కల అనేది లేకుండా సమాజాన్ని ఊహించండి, ఎందుకంటే అలా ఊహించినా గాంధీ పట్ల అంత కఠినంగా తీర్పు ఇవ్వలేము. ముఖ్యంగా, ‘గాంధీ అహింసా మార్గం, దాని ట్రస్టీషిప్ భావనలు, పవిత్ర భక్తి మాటున దాగిన కపటత్వం’ అనే అవగాహనా పొత్తిళ్లలో మనల్ని మనం చుట్టుకోనంతవరకూ. మనం కాల్పులకు గురవుతున్నపుడు ఏమి చేయాలో మీకు తెలుసా అని కూడా మీరు అడుగుతున్నారు… గాంధి అపహాస్యం చేయదగిన వ్యక్తి అని మీరు భావిస్తున్నారా?
ఎ.ఆర్: అపహాస్యం చేయదగిన కొన్ని విషయాలు గాంధి గురించి ఉన్నాయని నేను భావిస్తాను; గొప్ప గౌరవం ఇవ్వవలసిన అంశాలు గాంధీ గురించి కొన్ని ఉన్నాయని కూడా నేను భావిస్తాను. ముఖ్యంగా వినియోగం, కనీసమైన మరియు భరించయోగ్యమైన జీవనం లకు సంబంధించిన ఆయన భావాలు. అయితే, ట్రస్టీషిప్ గురించి ఆయన ఏమన్నారో నన్ను చదవనివ్వండి. ట్రస్టీషిప్ గురించిన ఆయన అవగాహనకు సంబంధించిన కొటేషన్ ఇది, “ధనికుడు తన స్వాధీనంలో ఉన్న సంపదలో నుండి తన హేతుబద్ధ అవసరాలకు తగినంతగా వినియోగించుకుని మిగిలినదాని పట్ల సమాజం యొక్క బాగోగుల కోసం ఒక ట్రస్టీగా వ్యవహరిస్తాడు.” ఇది అపహాస్యం చేయదగిన ఒక ప్రకటన అని నేను భావిస్తాను. దానిని అపహాస్యం చేయడానికి నాకేమీ సమస్య లేదు.
ఎస్.జి: అమెరికాలో, లెఫ్ట్ ఫోరం వేదికపైన మార్చిలో ఒక లెక్చర్ ఇస్తూ ‘భారత దేశం ఒక బూటకపు ప్రజాస్వామ్యం’ అని మీరన్నారు. హింసకు మీరిచ్చే సమర్ధన లేదా అర్ధ-సమర్ధన తో అది కొంతవరకు ఏకీభవిస్తుంది. భారత ప్రజాస్వామ్యం బూటకమైనది కాబట్టి మావోయిస్టులకు భారత ప్రజాస్వామ్యం ఎటువంటి నమ్మకాన్ని ఇవ్వలేదని మీరు భావిస్తారా?
ఎ.ఆర్: లేదు. ఇండియా అల్ప సంఖ్యలో ఉన్న ధనికుల స్వామ్యం అనీ, మధ్య తరగతి వర్గం, ఉన్నత తరగతి వర్గాల ప్రజలకు అది ప్రజాస్వామ్యంగా పని చేస్తుందని నేను రూఢిగా భావిస్తాను.
ఎస్.జి: కానీ అది బూటకపు ప్రజాస్వామ్యం కదా?
ఎ.ఆర్: అవును. ప్రజాసామాన్యం కోసం అది పనిచేయదు గనుక అది బూటకపు ప్రజాస్వామ్యం. కనుక, పూర్తిగా శూన్యీకరించబడిన ఒక వ్యవస్ధ ఇక్కడ ఉన్నది, పేదలకు ఎ మాత్రం ప్రవేశం లేని సంస్ధలు ఇక్కడ ఉన్నాయి. ప్రజాస్వామిక వ్యవస్ధను గనుక మీరు చూసినట్లయితే, ఎన్నికలు, కోర్టులు, మీడియా, న్యాయ వ్యవస్ధ వీటన్నిటినీ చూడండి. ఒక ప్రమాదకరమైన వ్యవస్ధా నిర్మాణం ఇక్కడ కొనసాగుతోంది. ఈ దేశంలో విశాలరాశులలో ఉన్న పేద ప్రజానీకాన్ని అంతకంతకూ మినహాయించుకుంటూ, పక్కకు నెట్టుకుంటూ పోతే; అందుకే నేను దానిని బూటకం అంటున్నది. మీరు మీ కాలిని ఎక్కడ మోపుతారు అన్నదానిని బట్టి అది కొంతమందికి పని చేస్తుంది, మరికొంతమందికి పని చేయదు. గ్రేటర్ కైలాస్ లో మీరు నిలబడితే; నిజమే, అది నిజంగా గొప్ప, క్రీయాశీలకమైన ప్రజాస్వామ్యం, కానీ దంతెవాడలో నిలబడి చూడండి -అదసలు ప్రజాస్వామ్యమే కాదు. అడవుల నుండి బైటికి వచ్చి సల్వాజుడుం శిబిరాల్లో నివశించకపోతే గనుక అలాంటి వారంతా మౌలికంగా టెర్రరిస్టులే అని ప్రకటించిన ముఖ్యమంత్రిని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి మీ కోళ్ళను చూసుకుంటే, మీ పొలాలను సాగు చేసుకుంటే అది టెర్రరిస్టు చర్యా? అది ప్రజాస్వామ్యమేనా?
ఎస్.జి: దీనికి పరిష్కారం చెప్పవలసిన అవసరం మీకు వస్తే, మీ పరిష్కారం ఏమిటి? ఈ ప్రతిష్టంభనను బద్దలు కొట్టడానికి మీరు చూపే మార్గం ఏమిటి?
ఎ.ఆర్: ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, తాత్విక స్ధాయిలో, నేనేమంటానంటే, (భూ) గ్రహాన్ని ఇలాంటి సంక్షోభంలోకి నెట్టిన తలంపు ఏదైతే ఉన్నదో అది ఒక ప్రత్యామ్నాయ పరిష్కారం చూపుతుందని నేను నమ్మడం లేదు. కాబట్టి కనీసం మనం చేయగలిగింది ఏమిటంటే, మన గతాన్ని కాపాడగలరని , అదే సమయంలో మన భవిత కోసం తగిన వివేకం కలిగినవారని ఎవరైతే మనం మనం భావిస్తామో వారిని చైతన్యవంతులను కావించండి.
కానీ “ఆపరేషన్ గ్రీన్ హంట్” విషయానికి వస్తే నేను మూడు అంశాలను చెబుతాను. ఈ అవహనా ఒప్పందాలు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్టులు మొదలైనవాటి విషయంలో ప్రభుత్వం పరిశుభ్రంగా ముందుకు రావాలని నేను భావిస్తాను; అవి ఏమిటో బహిరంగంగా ప్రకటించి మనకు చెప్పాలి. ప్రస్తుతానికి వాటిని స్తంభింపజేయాలి. బైటికి నెట్టివేయబడిన గ్రామాల ప్రజలందరికీ, కొన్ని వందల వేలమంది జనం గురించి మనం మాట్లాడుకుంటున్నాము, పునరావాసం కల్పించాలి. తుపాకులను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది.
ఎస్.జి: ప్రతి దేశమూ వృద్ధి చెందడానికి ఖనిజ వనరులను వినియోగిస్తుంది. మన దేశానికి కావలసిందే అభివృద్ధి. ప్రస్తుత మావోయిస్టు నాయకత్వం పోస్కో ( దక్షిణ కొరియా ఉక్కు కంపెనీ) తో సంబంధాలు నెరిపేది; (వారికి) సంవత్సరానికి చెల్లించవలసిన నష్టపరిహారం రు. 30 లక్షలు. అంతమొత్తాన్ని వారు మావోయిస్టులకు చెల్లించేవారు. ఇప్పుడు ఆ ఒప్పందాలేవీ లేవు. అన్నీ రద్దయ్యాయి. ఆ ప్రాంతాలలోని ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేసుకుని వెళ్లిపోవాలని మీరు ప్రతిపాదిస్తున్నారా?
ఎ.ఆర్: మైనింగ్ రంగాన్ని ప్రైవేటీకరించడం వలన ఇప్పుడు ఏం జరుగుతున్నదో మీరు చూడండి. మైనింగు వృద్ధిని పైకి తోస్తుందన్న ఒక తప్పుడు తరహా అవగాహన వ్యాపించి ఉంది. దానిని (అభివృద్ధిని) అది ఒక వింత పద్ధతిలో పైకి నెడుతుంది. నిజమైన అభివృద్ధితో దానికి ఎలాంటి సంబంధమూ లేదు. కానీ ప్రభుత్వం పొందుతున్న రాయల్టీలను చూస్తే గనుక, ఉదాహరణకి ముడి ఇనుమును తీసుకుంటే 5,000 టన్నుల లాభానికి గాను కేవలం 27 రూపాయలు మాత్రమే ప్రైవేటు కంపెనీ చెల్లిస్తుంది. ఇతర ప్రజల ఆర్ధిక స్ధితిగతుల పర్యావారణాన్ని ఏ మాత్రం గమనంలో ఉంచుకోకుండా మనం మూల్యం చెల్లిస్తున్నాము. కాబట్టి ఈ అభివృద్ధి అనేదే ఒక మిధ్య.
……………………………..ఇంకా ఉంది.
bootakapu prajasvaamyam aite ee medhavulanta matladagalaraa ?????asalu bytakannaa vastaaraaa
eeme prajasvamyam bootakam antundi inkokaru ahimsa abaddham annaaru inko tala pandina aayana rajyangam abaddham antaadu (ee blog lo kadu) annee abadhaalu, bootakaalu aite edi nijam ???????????????adi chepte vini santoshistaam kadaa……… anta abadham ayte veellanta andulo batakatam enduku pustakalu rayadam enduku awards tesukovadam enduku ????????????
dabbu lu unna vaadini konta daanam cheyamante adi eemeki apahaasyamaa??? mari daanam cheyyalante evaru cheyali andaroo pedavallu ayi ee erra medhavula venuka jenda mostoo vellaala emanna unte kadaa evariki anna emanna ivvagaligedi evari daggara emi lenappudu asalu emi cheyagalam gaali lo medalu tappa pustakaallo siddhaantaalu tappa mee siddhaantaaalu meru cheppukondi madhyalo gandhi enduku gandhi sidhantam apahaasyam ante meru cheppe samaanatvam asaadhyam………..aina manaki gandhi nachadu marx lenin mao lu kaavali vaallani folow ayye chota koooda undi trusteeshippe akkada antaa samaanam gaa untaaraaa antaa samaanam aite inka goverment enduki president pm lu parliament lu enduku ivanni akkada kuda unnai avi kooda bootakaalena????????????????
ee roy gariki raallu veyatame pani lagundi
సాయి గారు రాయ్ ఒకటి చెబితే మీరు మరొకటి అర్ధం చేసుకుంటున్నారు. సరిగ్గా అర్ధం చేసుకొని రాస్తే ఉపయోగం.
పైన ఉటంకించిన గాంధీ కొటేషన్ లో దానం విషయం ఏమీ లేదు. గాంధీ ప్రకారం ఆస్తులు ధనికుల స్వాధీనంలో ఉంటాయి. కాకపొతే వాటిని ధనికులు దానం చెయ్యకుండానే ట్రస్టీషిప్ గా వ్యవహరిస్తారని ఆయన ఊహిస్తున్నారు. దానం అంటే ధనికుల స్వాధీనం నుండి దానం స్వీకర్తల స్వాధీనంలోకి వెళ్లాలి. అలాంటిది ఏమీ గాంధీ చెప్పలేదు. మీరు ఊహిస్తున్న విషయాలు కనీసం గాంధీ చెప్పినవి కూడా కాదు.
ప్రజల ఉపయోగం కోసం మార్క్స్, ఏంగెల్స్, లెనిన్ లు చెప్పినా గాంధీ, సోనియాలు చెప్పినా స్వీకరించాల్సిందే. కాకపోతే అవి నిజంగా ప్రజల కోసం చెప్పినవా లేక దోపిడీదారుల కోసం చెప్పినవా అన్నదే చూడాలి.
మీరు తెలుగులో రాస్తేనే ఉపయోగం. తెలుగుని ఇంగ్లీష్ లో రాయడం వలన ఉపయోగం ఉండదు. కొంత కష్టం అనుకున్నా అలా చేస్తేనే బెటర్. లేకపోతే మీరు రాసినా ఉపయోగం ఉండదు. చదవడానికి ఎవరూ ఆసక్తి చూపరు. ఈ విషయం ఇంతకు ముందు చెప్పాననుకుంటాను.
స్కూల్ పుస్తకాలలో ఎన్ని తియ్యని మాటలు వ్రాసి గాంధేయవాదాన్ని ఎంత బలవంతంగా ప్రజల బుర్రలలోకి ఎక్కించినా అహింసావాదం అనేది పరమ సత్యమైపోదు. పండగల సమయంలో మా వీధికి దాసరివాడొచ్చి, ప్రతి రోజూ “శ్రీరామ, రఘురామ, భ్రద్రాద్రి రామ” అని పాడుతుండేవాడు. గాంధేయవాదం కూడా అటువంటి పాటే.
“ధనికుడు తన స్వాధీనంలో ఉన్న సంపదలో నుండి తన హేతుబద్ధ అవసరాలకు తగినంతగా వినియోగించుకుని మిగిలినదాని పట్ల సమాజం యొక్క బాగోగుల కోసం ఒక ట్రస్టీగా వ్యవహరిస్తాడు.” ఇది అపహాస్యం చేయదగిన ఒక ప్రకటన అని నేను భావిస్తాను. దానిని అపహాస్యం చేయడానికి నాకేమీ సమస్య లేదు. ani roy cheppindani gandhini apahasyam chesindani naku ardam ayndi ……….trusteeship ante naku telisi daanam chesinatle complete ga danam cheste peru marutundi trusteeshipl lo peru maraka poyina vere vaallaki upayogam jarugutundi billgates adega chestundi gandhi sonia gandhi desam lo prajala kosam e kada edyna chesindi chestundi ante prajalu doplididarula
nenu meto eppudo annanu bhoomiputrulu ani rasi janaanni vibhajinchakandi ani alaa vibhajinchukone kadaa akkada chattisgarh lo himsa pratihimsa jarugutundi ilaa dopidi darulu ani inkedo darulu ante ee desam lo prajalu anta eppudu kalisi untaru
daanam sveekartala chetuloki vellakkarledu adi vallaki upayogapadite chaalu doctor patient ki mandu ioste chaalu medicine pharmacy nerpinchankkarledu …………..
telugu lo raayamannaru telugu vaalla vaartalu telugu rashtraniki chendina vartalu meru rayatledu kada anta international aite inka telugu enduku
dhanikula svaadheenam lo nunchi daanam sveekarta la chetulloki vellaali annaru alaa a dhanikudu mothamga evariki ivvadu chivariki tandri koodaa pillalaki mottham gaa rasi ivvadu sveekarta la chetulloki velte daanini daanam anaru bhiksham antaaru bhiksham kaavaala daanam kaavaalaaa………..
prabhutvam trustee laage undaali alaa kakunda adigindalla raasi iste vanpic emaar chenhalguda jail cbi investigation lu avutayi kabatti trusteeship laage undaali……..c
సాయి గారు, తెలియకనే అడుగుతున్నారా? మీరు రాసేది ఇంగ్లీషు కాదు కదా. తెలుగుని తెలుగులో రాయమని మాత్రమే నేను చెబుతోంది. దానికి సంబంధం లేని వాదన చేస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు కాబట్టి ఇంగ్లీషులోనే రాయమని నాకు చెప్పదలిచారా?
@సాయి, భూమిపుత్రుల సిద్ధాంతం శివసేనది. ఆ సిద్ధాంతాన్ని జస్టిస్ కట్జు ఉటంకిస్తూ అది సరికాదు అని చెప్పారు. ఆయన కొటేషన్ ని నేను ఉటంకించాను. మీరేమో దాన్ని తెచ్చి నాకు అంటగడుతున్నారు. పైగా చత్తీస్ ఘర్ హింస ఆ సిద్ధాంతం వల్లనే అంటూ సంబంధం లేకుండా రాస్తున్నారు.
చత్తీస్ ఘర్ లో గిరిజనులను అడవులనుండి తరిమేసి వారి పొలాలు, ఊళ్లలో ఉన్న ఖనిజ వనరులను విదేశీ కంపెనీలకు అప్పగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హింస ప్రయోగిస్తున్నాయి. దానిని మావోయిస్టుల నాయకత్వంలో గిరిజనులు ప్రతిఘటిస్తున్నారని అరుంధతీ రాయ్ చెబుతున్నారు. మీరీ విషయాలేమీ అర్ధం చేసుకోకుండా సంబంధం లేని విషయాలు ఏవేవో రాస్తూ పోతున్నారు. తెలుగులో రాయండంటే దానికీ ఇంకేదో సంబంధం లేని వాదన!?
విషయాన్ని రాసింది రాసినట్లు మొదట అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి. అనుమానాలు ఉంటే అడగండి. కానీ మీకు తోచింది చొప్పించకండి. మీకు తోచిందానికి నేను జవాబుదారీ కాదని గమనించగలరు.
Mr. V Sekhar this is not your personal dairy this is a blog in internet when you ask for a comment we write if you dont like it you delete it
సరే అలాగే కానివ్వండి. చేసేదేముంది! మీ కోరినట్లే చేద్దాం.
neku tochindi choppinchkandi ante vere evaridi anna choppinchaalaaa vere valladi nenu ela choppistaa
rasindi rasinatlu ardam chesukotaniki nenu robo ni kadu
naa anumaanalu mimmalni adagataaniki meremanna school mastaraa