ర్రయ్… ర్రయ్… యు.పి.ఎ-2 పయనం ఎందాక? -కార్టూన్

చిన్న పిల్లలకి వాహనాలను స్వయంగా నడపాలన్న కోరిక బుర్రని తొలుస్తూ ఉంటుంది. కానీ పెద్దవారి భయం వారిని వెనక్కి లాగుతుంటుంది. వాహనాలు ఉన్న ఇంట్లో అయితే స్టీరింగ్ ముందు కూర్చుని దాన్ని తిప్పుతూ ‘ర్రయ్… ర్రయ్…’ అని ఆడుకుంటారు. వాహనాలు లేనివారయితే ఉత్త చేతుల్ని స్టీరింగ్ పట్టుకున్నట్లు గాలిలో ఉంచి స్టీరింగ్ ని తిప్పుతున్నట్లు చేతులు ఆడిస్తూ ‘ర్రయ్… ర్రయ్…’ అని ఆడుతుంటారు. తాడు రెండు కొసల్ని ముడివేసి మధ్యలో నలుగురైదుగురు చేరి ‘బస్సమ్మ బస్సు…’ అంటూ…

రెండు దేశాలు, ఒకే క్రూరత్వం

సరబ్ జిత్ సింగ్ చనిపోయాడు. పాకిస్ధాన్ లోని జిన్నా ఆసుపత్రి డాక్టర్లు ‘బతకడం కష్టమే’ అని చెప్పినట్లుగానే ఆయన చనిపోయాడు. మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు పాకిస్ధానీ ఖైదీలు లాహోర్ లోని కోల్ లఖ్పట్ జైలులో అమానుషంగా దాడి చేయడంతో కోమాలోకి వెళ్ళిన సరబ్ జిత్ సింగ్ గురువారం తెల్లవారు ఝామున 1 గంటకు తుది శ్వాస విడిచాడని పాక్ అధికారులు ప్రకటించారు. గత శుక్రవారం దాడికి గురైన సరబ్ జిత్ సింగ్ వారం రోజులు కోమాలో…

ఎంత హింస మోసిందో, భర్తను కడతేర్చింది…

“ఎంతైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు కదా!” ఈ మాట చెప్పడం చాలా తేలిక. కష్టాన్ని మోసేవాడిని నీతి సూత్రాలు ఎందుకు పాటించలేదని నిలదీయడం అతి సులువు. ఒడ్డున నిలబడి లోతు లెక్కలు వల్లించడం మాటలతో పని. ఇక ఇరవై నాలుగ్గంటలూ హింస అనుభవిస్తున్న వారిని ‘ప్రతిఘటించొద్దు, అది నేరం’ అని చెప్పడం ఎంత అన్యాయం? పదేళ్ళు అనుమానపు భర్త చేతుల్లో హింస అనుభవించిన భార్య, ఇక సహించలేక అతన్ని కడతేరిస్తే ఆమె పైన హత్యానేరం మోపడం చట్టం…

స్త్రీల దుఃఖాన్ని రొమాంటిసైజ్ చేయలేము -POW సంధ్యతో ఓ రోజు

(రచన: రమా సుందరి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్ షిప్ తో పంజాబ్ యూనివర్సిటీలో ఎం.టెక్ చదువుతున్న రచయిత్రి వద్దకు ‘ప్రగతిశీల మహిళా సంఘం’ అధ్యక్షురాలు సంధ్య వచ్చిన సందర్భంగా… విశేషాలు) సంధ్య వస్తుందనే సంతోషం నన్ను నిలవనీయలేదు. ఎయిర్ పోర్ట్ కు గంట ముందే వెళ్ళి కూర్చున్నాను. డిల్లీలో తెలంగాణా ధర్నా రెండు రోజులు ఉంటుందని, ముందు ఒక రోజు వచ్చి నీతో ఉంటాను అని నాకు చెప్పినప్పటి నుండి నా పరిస్థితి ఇదే.…

సి.బి.ఐ దయనీయ స్ధితి -కార్టూన్

“రాజకీయ నాయకుల నుండి సి.బి.ఐ ని విముక్తం చేయడం మా తక్షణ కర్తవ్యం” అని సుప్రీం కోర్టు నిన్న సి.బి.ఐకి తలంటుతూ వ్యాఖ్యానించింది. “రాజకీయ నాయకుల ఆదేశాలు పాటించవలసిన అవసరం మీకు లేదు” అని సుప్రీం బెంచి చెప్పాక “ఇక నుండి బుద్ధిగా నడుచుకుంటాం. బొగ్గు కుంభకోణం విచారణ పురోగతి నివేదికలన్నీ నేరుగా మీకే చూపుతాం. ప్రభుత్వానికి చూపించం” అని తలూపి కోర్టు బైటికి వచ్చిన సి.బి.ఐ అధిపతి కోర్టు ఆవరణలోనే మాట మార్చేశారు. “సి.బి.ఐ స్వతంత్ర…

బంగ్లాదేశ్ ప్రమాదం: ఆదుకోడానికి ముందుకు రాని కంపెనీలు

బంగ్లాదేశ్ లో ఎనిమిది అంతస్ధూల భవనం కూలిపోయి 400 మందికి పైగా మరణించిన ప్రమాదంలో బాధిత కార్మికులను ఆడుకోడానికి పశ్చిమ దేశాల కంపెనీలు ముందుకు రావడం లేదు. కూలి పోయిన భవనంలో నడుస్తున్న అనేక బట్టల తయారీ కంపెనీలు ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల బహుళజాతి కంపెనీలకు దుస్తులు సరఫరా చేస్తాయి. నెలకు 38 డాలర్లు చెల్లించే అత్యంత హీనమైన వేతనాలతో బిలియన్ల కొద్దీ డాలర్ల లాభాలు గుంజే ఫ్యాషన్ బట్టల కంపెనీలు తమకు లాభాలు ఆర్జించిపెడుతున్న…

అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియాల వద్ద ఉద్రిక్తతలు

ఉభయ కొరియాల వద్ద అమెరికా సాగిస్తున్న ‘మిలట్రీ డ్రిల్’ (కోడ్ నేమ్ ఫోల్ ఈగిల్) ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. మున్నెన్నడూ లేని విధంగా అణు బాంబులు జారవిడిచే బి-2 బాంబర్ యుద్ధ విమానాలను కొరియా భూభాగంపై ఎగరడంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. కొరియా భూభాగంపై 10,000 కి.మీ ఎత్తు ఎగురుతూ బి-2 బాంబర్లు ‘మాక్ బాంబింగ్’ డ్రిల్ (పేలుడు పదార్ధాలు లేని బాంబు జారవిడిచి అది అనుకున్న చోట పడేదీ, లేనిదీ నిర్ధారించుకోవడం) నిర్వహించడంతో ఉత్తర కొరియా…

కర్ణాటక ఎన్నికలు: బి.జె.పి విచిత్ర పోరాటం

మాకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీయేనని కర్ణాటక బి.జె.పి ప్రకటిస్తోంది. తమ నుండి చీలి ‘కర్ణాటక జనతా పార్టీ’ పేరుతో వేరు కుంపటి పెట్టిన యెడ్యూరప్ప ప్రభావాన్ని ఆ విధంగా తక్కువ చేసి చూపాలని బి.జె.పి ప్రయత్నం. బి.జె.పి పాలనలో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ జనతాదళ్ (సెక్యులర్) అని కనుక తామే బి.జె.పి కి ప్రధాన పోటీ అని జె.డి(ఎస్) ప్రకటిస్తోంది. ఆ పార్టీకి ప్రత్యేకంగా పోరాటం చేయాల్సిన పని లేదని దాని ఓటు…

భిక్షా పాత్రకు కూడా మతం ఉంది!

కాలం అనుకూలంగా లేకపోతే (టైం బాగోకపోతే) తాడే పామై కరుస్తుందంటారు. (ఇక్కడ నెపాన్ని కాలం మీదికి నెట్టేసినా దానర్ధం ‘స్ధల, కాల పరిస్ధితులు’ అయి ఉండాలి.) మియాన్మార్ (బర్మా) లో ముస్లింల పరిస్ధితి అలానే తగలడింది. ఒక బౌద్ధ భిక్షువుకు చెందిన భిక్షా పాత్రను ఒక ముస్లిం మహిళ పగలగొట్టిందన్న అనుమానంతో ముస్లింల పైనా, ఒక మసీదు పైనా దాడి జరిపారు అహింసావాదులైన భౌద్ధ మత ప్రజలు. ఇటీవలే మత ఘర్షణలతో అట్టుడికిన మియాన్మార్ లో మరో…