ఇరాన్ పుణ్యం, సిరియా సమస్యలో ఇండియా మాటకు విలువ!

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో ఇండియా మాట చెల్లుబాటు అయ్యేందుకు అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అలీన దేశాల కూటమి ‘అలీనోద్యమం’ (Non-Aligned Movement) నాయకురాలుగా ఇరాన్ గత యేడు బాధ్యత తీసుకున్న నేపధ్యంలో పశ్చిమ రాజ్యాల ప్రాభవానికి ప్రత్యామ్నాయ శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఇరాన్ ప్రారంభించింది. ఈ కృషిలో ఇండియాను భాగస్వామిగా స్వీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తో ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్…

కొత్త పరిణామం: మధ్యప్రాచ్యంలో చైనా రంగ ప్రవేశం?

అంతర్జాతీయ రంగంలో ఎంత మెల్లగానైనా బలాబలాల్లో మార్పులు వస్తున్నాయనడానికి తార్కాణంగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉండే మధ్య ప్రాచ్యంలో చైనా రాజకీయ అరంగేట్రంకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బద్ధ శత్రువులైన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ ఇప్పుడు చైనా పర్యటనలో ఉండడం ఈ ఏర్పాట్లలో ఒక భాగంగా చూడవచ్చు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ రాజధాని బీజింగ్ లో విమానం దిగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చైనా వాణిజ్య…

రెక్కలు కట్టుకుంటే మాత్రం ఎగరగలమా? -కార్టూన్

రైట్స్ సోదరులు విమానం కనిపెట్టక ముందు మనిషి గాలిలో ఎగరడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కొందరు ఉత్సాహపరులు పక్షి రెక్కల లాగా అట్టలతో రెక్కలు తయారు చేసుకుని చేతులకు కట్టుకుని కొండలపైకి ఎక్కి దూకడం కూడా చేశారట. అలాంటివారు అనేకమంది చనిపోగా మరి కొందరు వికలాంగులు అయ్యారని చిన్నప్పుడు చదువుకున్నాం. భారత దేశంలో ధర్డ్ ఫ్రంట్ కోసం ములాయం సింగ్ చేస్తున్న ప్రయత్నాలను అలా రెక్కలు కట్టుకుని పక్షిలా ఎగరాలని ప్రయత్నించడంగా కార్టూనిస్టు పోల్చారు. రెక్కలు కట్టుకుని…

ప్రత్యేకతలే కొండగుర్తులు -ఈనాడు ఆర్టికల్ 12వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపరలో చివరి భాగం ఈ రోజు ఈనాడు దినపత్రికలో చదువు పేజీలో వచ్చింది. “ప్రత్యేకతలే కొండగుర్తులు” శీర్షికన వచ్చిన ఈ భాగం, మరిన్ని దేశాల ప్రత్యేకతలను వివరిస్తూ వాటి ఆధారంగా వివిధ దేశాలను ఎలా గుర్తు పెట్టుకోవచ్చునో చర్చించింది. ఈ భాగాన్ని నేరుగా ఈనాడు వెబ్ ఎడిషన్ లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. కింద బొమ్మను క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ చూడవచ్చు. బొమ్మ…

చైనా సేనలు వెనక్కి వెళ్లాయోచ్!

యు.పి.ఎ ప్రభుత్వానికి ఒక తలనొప్పి తప్పినట్లుంది. దౌలత్ బేగ్ ఒల్డీ సెక్టార్ లో 19 కి.మీ మేర భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చాయని ఆరోపించబడిన చైనా సేనలు వెనక్కి వెళ్లిపోయాయి. చైనా చొరబాటుకు ప్రతిగా చైనా సైనిక గుడారాలకు 300 కి.మీ దూరంలోనే మరో శిబిరం ఏర్పాటు చేసిన భారత సేనలు కూడా వెనక్కి వచ్చేశాయని తెలుస్తోంది. ఉన్నతస్ధాయి చర్చల అనంతరం ఈ ఆకస్మిక పరిణామం జరిగింది. ఇరు సేనలు నాలుగు పతాక సమావేశాలు జరిపినా ముగిసిపోని…

సరబ్ జిత్ లాగే మాకూ డబ్బివ్వాలి, కోర్టుకు గూఢచారుల మొర

ఇంతకీ సరబ్ జిత్ సింగ్ ఎవరు? పాకిస్ధాన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు టెర్రరిస్టా? ఆయన కుటుంబం చెబుతున్నట్లు తాగి ఏమి చేస్తున్నాడో, ఎటు  వెళుతున్నాడో తెలియని అమాయక తాగుబోతా? భారత ప్రభుత్వం సొంతం చేసుకోలేని గూఢచారా? భారత పత్రికలు సరబ్ జిత్ సింగ్ గురించి అతని కుటుంబ సభ్యులు చెప్పిన ‘అమాయక తాగుబోతు’ కధని వల్లించినప్పటికీ బి.బి.సి, సి.ఎన్.ఎన్ లాంటి పశ్చిమ దేశాల పత్రికలు ఆయనను భారత గూఢచారి అనే సంబోధిస్తూ వచ్చాయి. ది హిందు పత్రిక ఆదివారం…

సీతాకోకచిలకలా ఎగరాలి, తేనెటీగలా కుట్టాలి… -కార్టూన్

“Float like a butterfly, sting like a bee” అనేది ఒక పాట. బ్రిటిష్ పాప్ సింగర్ ఫిల్ మార్షల్ రాసి పాడిన పాట ఇది. ఆ పాటని భారత విదేశాంగ విధానానికి అన్వయించారు కార్టూనిస్టు కేశవ్. ఆయన సెన్సిబుల్ కార్టూనిస్టు అనడానికి ఈ కార్టూన్ మరొక మచ్చుతునక. ఇటీవల కాలంలో రెండు (స్వ)విదేశీ సమస్యలు భారత విదేశాంగ విధానానికి పరీక్ష పెట్టాయి. అమెరికా ‘ఆసియా పివోట్’ వ్యూహంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ ను మిత్రుడుగా…

చైనా చేతిలో అమెరికా మిలట్రీ రహస్యాలు

ఒక అమెరికా మిలట్రీ కాంట్రాక్టర్ లాప్ టాప్ ను హ్యాక్ చెయ్యడం ద్వారా అమెరికాకి చెందిన అతి కీలక మిలట్రీ రహస్యాలను దొరకబుచ్చుకున్నారు చైనా మిలట్రీ హ్యాకర్లు. ఒకటి, రెండూ కాదు ఏకంగా మూడేళ్ళ పాటు అమెరికా మిలట్రీకి చెందిన మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్లను లేదా టెరా బైట్ల కొద్దీ డేటాను షాంఘై ఆధారిత హ్యాకర్ గ్రూప్ ఒకటి సంపాదించగలిగింది. “కామెంట్ క్రూ” గా పిలుస్తున్న ఈ హ్యాకర్ గ్రూపు పనితనాన్ని తక్కువ చేయడానికి కాంట్రాక్టర్ సంస్ధ…

కాలిఫోర్నియాను చుట్టుముడుతున్న దావానలం -ఫోటోలు

అమెరికా పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియాను భారీ దావానలం చుట్టుముడుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు చోట్ల దావానలాలను ఆర్పే పనిలో అగ్నిమాపక దళాలు నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం నగరానికి సమీపంలోనే మరో దావానలం అంటుకుని వేలాది ఇళ్లకు ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే పలు ఇళ్లను ఖాళీ చేయించగా లాస్ ఏంజిలిస్  మరో మూడు వేల ఇళ్ళు ప్రమాదంలో ఉన్నట్లు రష్యా టుడే తెలిపింది. కాలిఫోర్నియా రాష్ట్ర వ్యాపితంగా ప్రస్తుతం 3,000 మంది అగ్నిమాపక దళ ఉద్యోగులు ఆరు చోట్ల…

వ్యవసాయ సమస్యపై కారల్ కాట్ స్కీ, లెనిన్

భారత వ్యవసాయ రంగంలో మార్పులు -పార్ట్ 3 వ్యవసాయ సమస్య – కారల్ కాట్ స్కీ           పెట్టుబడిదారీ విధానం, వ్యవసాయ మార్పులను సంబంధించి అధ్యయనం చేయడానికి ఈ రచనను ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం ఉంది.           రైతాంగం మరియు పెట్టుబడిదారీ విధానం (Peasantry &Capitalism), ఆంగ్ల ఎడిషన్ ను పరిచయం చేస్తూ హంజా ఆలావి, ధియోడర్ షనిన్ లు లెనిన్ ను ఇలా ఉటంకించారు:           “కేపిటల్ మూడో వాల్యూమ్ తర్వాత నుండి ప్రస్తుత ఆర్ధిక…

శవ పేటికలే చర్చల బల్లలుగా… -కార్టూన్

మొట్ట మొదటి బి.జె.పి ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి కాలంలోనే భారత్-పాకిస్ధాన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు నిర్మాణాత్మక దృష్టితో ప్రారంభం అయ్యాయని పత్రికలు తరచూ చెబుతుంటాయి. అక్కడ మిలట్రీ పాలకుడు ముషార్రాఫ్, ఇక్కడ మొట్టమొదటి మితవాద ప్రభుత్వం రెండు దేశాల్ని నడుపుతుండగా ప్రారంభమైన చర్చలు వాణిజ్య సంబంధాల్లోకి ప్రవేశించి ఊపందుకుంటున్న సమయంలోనే ముంబై టెర్రరిస్టు దాడుల ఫలితంగా అటకెక్కాయి. అప్పటి నుండి వివిధ సంఘటనలు, దుర్ఘటనల సాకు చూపుతూ రెండు దేశాలు దూరం జరుగుతూ…

సూటు, బూటు బడాబాబు దర్జాల మర్మమేమి? -కార్టూన్

(కార్టూనిస్టు: ఎనెకో లాస్ హెరాస్. వెనిజులా రాజధాని కారకాస్ లో పుట్టిన ఎనెకో ఇప్పుడు స్పెయిన్ లో నివసిస్తున్నారు. ఆయన కార్టూన్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.) వ్యవస్ధని మోస్తున్నదెవరు? కష్టపడి వ్యవస్ధని నడిపేది మేమే అని బానిస వ్యవస్ధల కాలంలో బానిసల యజమానులు అన్నారు. ఫ్యూడల్ ప్రభువుల కాలంలో రాజులు, మంత్రులు, సైన్యాధిపతులు, భూస్వాములు, జమీందార్లు… ఇత్యాదిగా గల ప్రభు వర్గాలు తాము లేకపోతే సామాజిక వ్యవస్ధ ఎలా నడుస్తుంది అని ప్రశ్నించారు. పండితులు ‘ఔను కదా!’…

జమ్ము జైలులో పాకిస్ధానీ ఖైదీపై దాడి, విషమం

పదుల వేల సంఖ్యలో ప్రజలు సరబ్ జిత్ సింగ్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు భిఖివింద్ గ్రామం చేరుకుంటుండగానే జమ్ము జైలులో ఒక పాకిస్ధానీ ఖైదీ పైన దాడి జరిగింది. 64 సంవత్సరాల సోనాయుల్లా ఖాన్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర ఖండ్ రాష్ట్రానికి చెందిన భారతీయ ఖైదీ, వినోద్ కుమార్, శుక్రవారం ఉదయం ఆయనపై దాడి చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత తగాదాయే దాడికి కారణమని పత్రికలు చెబుతున్నాయి.…

మొదటి అమెరికా సెటిలర్లు నరమాంస భక్షకులు -పరిశోధన

ఇపుడు అమెరికన్లుగా కనిపిస్తున్నవారెవరూ నిజానికి అమెరికన్లు కాదు. ఇండియాకి కొత్త దారి కోసం వెతుకుతూ వెళ్ళి అమెరికా ఖండంలో అడుగుపెట్టిన కొలంబస్ ఎర్రగా ఉన్న అమెరికన్లను ‘రెడ్ ఇండియన్లుగా’ పిలిచాడు. ఆ తర్వాత యూరోపియన్లు ముఖ్యంగా ఆంగ్లేయులు అక్కడికి వలస వెళ్ళి అసలు అమెరికన్లను పశ్చిమానికి తరుముకుంటూ పోయి మొత్తం అమెరికా భూభాగాన్ని కబళించారు. చివరికి ‘రెడ్ ఇండియన్లను’ అమెరికాయేతరులుగా చేసేశారు. (అమెరికా తెల్లవారికి మాత్రమే చెందాలనే ‘వైట్ సూపర్ మాసిస్టులు’ కూడా ఉన్నారంటే తెల్లవారి తెంపరితనం…