గాంధేయవాదులూ బహిష్కృతులే -రెండో భాగం


చెట్టుకింద గాంధియన్ ఆశ్ర(యం)మం

చెట్టుకింద గాంధియన్ ఆశ్ర(యం)మం

(జస్టిన్ పొదుర్ టొరొంటో నగరంలో ఒక రచయిత. యార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ప్రస్తుతం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్మాలియాలో విజిటింగ్ ప్రొఫెసర్ కూడా. ఆయన బ్లాగ్: www.killingtrain.com ట్విట్టర్: @JustinPodur)

మొదటి భాగం తరువాయి…………………

జె.పి: ఆశ్రమ్ కూల్చివేత కూడా ఒక ఉదాహరణ అనుకుంటాను.

హెచ్.కె: ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ భూమిలోనే మా ఆశ్రమ్ ని ప్రారంభించామని గుర్తుంచుకోండి. సల్వాజుడుం సాగిస్తున్న దాడులు, లైంగిక అత్యాచారాలు, హత్యలు, గ్రామ దహనాలు మొదలైన వాటిని మేము ప్రశ్నించడం ప్రారంభించాక ప్రభుత్వానికి కోపం వచ్చింది. వారు చేసిన మొదటి పని ఏమిటంటే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణంలో మేము ఉన్నామని నోటీసు పంపడం. మొదటిది: గ్రామ సభ (చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడిన గ్రామ సమావేశం) అనుమతితో ఆ భూమిలో ఆశ్రమ్ ని నెలకొల్పి పని చేసుకుంటున్నామని మేము వాదించాము రాజ్యాంగం ప్రకారం, గిరిజన ప్రాంతాల్లో, గ్రామ సభ ఒక తీర్మానం ఆమోదిస్తే ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండాలి. రెండోది: ప్రభుత్వ అనుమతితోనే ఇన్నాళ్లూ పని చేసినా ఆశ్రమ్ నిర్మాణంతో వారికి ఇంతవరకూ సమస్య రాలేదు. హఠాత్తుగా మేము చట్టవిరుద్ధంగా ఎలా మారాము?

అది అటవీ భూమి కాబట్టి దానిని కేటాయించడానికి వీలు లేదని ప్రభుత్వం నుండి తిరుగు సమాధానం వచ్చింది. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం అది వ్యవసాయ భూమి అని మేము బదులిచ్చాము. ‘కాదు, కాదు, భూమి స్టేటస్ ని 1996లో మార్చారు’ అని ప్రభుత్వం తిరుగు టపాలో తెలిపింది. దానితో నేను లాండ్ రికార్డుల కోసం ‘సమాచార హక్కు’ చట్టాన్ని ప్రయోగించాను. రికార్డులు కనపడడం లేదని వారు చెప్పారు. ఫర్వాలేదు రెండో కాపీ రెవిన్యూ ఆఫీసులో ఉంటుంది చూడమని కోరాను. 1996 రికార్డు, కేవలం ఆ సంవత్సరం రికార్డు మాత్రమే, కనపడ్డం లేదని రెవిన్యూ అధికారి రాశాడు. అయినా ఫర్ఫాలేదు, మూడో కాపీ గ్రామ అకౌంటెంటు (గ్రామ పట్వారీ) వద్ద ఉండాలి అని చెప్పాను. తమ వద్ద కూడా 1996 నాటి రికార్డు కనపడ్డం లేదని పట్వారీ కూడా మాకు రాశాడు. దానితో మేము కోర్టుకి వెళ్లాము.

మేము కోర్టులో ఉండగానే వాళ్ళు బుల్ డోజర్లు తెచ్చి మా ఆశ్రమ్ ని కూల్చివేశారు.

జె.పి: ఆ తర్వాత కూడా మీ పని కొనసాగించారా?

హెచ్.కె: మరి! దంతెవాడలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఆ ఇంటి యజమాని ఒక ప్రభుత్వ  ఉద్యోగి. కలెక్టర్ ఆయన వద్దకి వెళ్ళి మాకు ఇల్లు అద్దెకు ఇవ్వడం కొనసాగితే అతన్ని ఉద్యోగం నుండి తీసేస్తామని బెదిరించాడు. వాళ్ళు మా ఇంటికి విద్యుత్ ని కట్ చేశారు. దానితో ఒక చెట్టు కింద ఆశ్రమం పెట్టుకుని అక్కడి నుండే పని చేయడం మొదలుపెట్టాము. “వారికి దూరంగా ఉండండి, లేదా….” అని పోలీసులు గ్రామస్ధులను బెదిరించారు.

జె.పి: అక్కడ ఇక ఎంత మాత్రం మీరు పని చేయలేరని గ్రహించిన ఆ చివరి క్షణాలు ఏమిటి?

హెచ్.కె: గోంపాడ్ గ్రామంలో సోడి సాంబో అనే మహిళను కాలి పైన తుపాకితో కాల్చారు. ఇప్పుడు ఆమె కేసు సుప్రీం కోర్టులో ఉంది. ఆమె గ్రామంలో 16 మంది హత్యకు ఆమె ప్రత్యక్ష సాక్షి. కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సి.ఆర్.పి.ఎఫ్), కోబ్రాలు గ్రామంపై దాడి చేసి కత్తులు, పిడి బాకులతో దాడి చేసి 16 మందిని చంపేశారు. 18 సంవత్సరాల బాలుడి చేతుల వేళ్ళను కోసేశారు; అతని తల్లిని తలలో పిడిచారు, ఆమెపై అత్యాచారం చేశారు; 70 యేళ్ళ ముసలావిడ రొమ్ములను కోసేశారు; కళ్ళు లేని 80 యేళ్ళ పెద్దాయనను చంపేశారు. సోడిని కాలిపై కాల్చారు. కానీ ఆమె బతికిపోయింది. సర్జరీ కోసం మేము ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లాము. రెండోసారి ఆమెను ఢిల్లీ తీసుకు వస్తుండగా పోలీసులు కిడ్నాప్ చేశారు. పైగా నేనే కిడ్నాప్ చేశానని పోలీసులు నాపై ఆరోపణ చేశారు. నేను తప్పించుకుని తిరుగుతున్నానని త్వరలో అరెస్టు చేస్తామని ప్రకటించారు. నేనేమీ ఆలోచించానంటే -నేను అన్ని కేసులు ఫైల్ చేశాను, నేను జైలులో ఉన్నట్లయితే, వారికిక అవకాశం ఉండదు. అలా ఆలోచించి జనవరి 4, 2010 తేదీన అర్ధరాత్రి పూట నేను దంతెవాడ వదిలిపెట్టాను.

జె.పి: ఈ సంఘటనల నుండి కొద్దిగా వెనక్కి వెళ్లగలిగితే గనక; మీ గురించి తెలిసినవారంతా మీరు గాంధేయవాది అని చెబుతారు. మీరు ఇక్కడ దేని గురించైతే చెబుతున్నారో, అటువంటి సందర్భంలో, ఈ స్ధలంలో, ఈ కాలంలో గాంధీ బోధనలను మీరు ఎలా అన్వయించగలరో నాకు ఆసక్తిగా ఉంది.

హెచ్.కె: నేను గాంధేయవాదిని అవునో కాదో నాకు తెలియదు, కానీ, ఆయన చెప్పిన వాటిలో కొన్ని అంశాలను నేను నమ్ముతాను. గ్రామాలు స్వతంత్ర యూనిట్లు; ప్రజలే సర్వాధికారులు; గ్రామాలు రాజకీయంగానూ, ఆర్ధికంగానూ స్వయం సమృద్ధితో ఉండాలి, అంటే గ్రామ్ స్వరాజ్, గ్రామాల స్వయం పరిపాలన; గ్రామ స్వయం పాలన అహింసాత్మక పద్ధతుల్లో సాధించాలి… ఇవన్నీ.

(ఇక్కడి నుండి హిమాంషు కుమార్ తన సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చారు. మార్క్సిస్టు సిద్ధాంతాలు గొప్పవాని చెబుతూనే వాటికి గాంధీ సిద్ధాంతాలను జత చేయాలని ఆయన చెప్పారు. అంటే గాంధీయన్ మార్క్సిజం అని కావచ్చు. వాస్తవంలో అవి రెండూ పొసగనివి. అహింసా సిద్ధాంతం పాలక వర్గాల ప్రయోజనం కోసం వారి దోపిడీ కొనసాగడానికి వీలుగా రూపొందించిన సిద్ధాంతం. హిమాంషు సిద్ధాంతం గురించి ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే ఈ లింక్ లో చూడవచ్చు. -విశేఖర్)

…………………..అయిపోయింది.

3 thoughts on “గాంధేయవాదులూ బహిష్కృతులే -రెండో భాగం

  1. పోలీసుల అమానుష కృత్యాలు చదువుతుంటేనే గగుర్పాటు కలిగిస్తున్నాయి. ఇన్ని వేధింపులూ, చేదు అనుభవాల తర్వాత కూడా హిమాంషు తన సిద్ధాంతంపై ఇంకా నిలబడటం విశేషమే. కానీ మార్క్సిస్టు సిద్ధాంతాన్ని గాంధీయిజానికి జత చేయడం ఆచరణలో అసాధ్యం.

  2. గాంధీ ఏమీ ఆదర్శమూర్తి కాదు. అతను ఇద్దరు వేశ్యలతో పడుకుంటూ దొరికిపోయి, అందుకు సిగ్గుపడకుండా “నేను నా బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకోవడానికే వేశ్యలతో పడుకున్నాను” అని అన్నాడు. ఆయన సమాధానాన్ని అంగీకరించలేక సరోజినీ దేవి గారు అన్నారు “గాంధీని బ్రహ్మచారిగా ఉంచడానికి చాలా ఖర్చు అవుతుంది” అని. గాంధేయవాదం అనేది ఒక అబద్దాన్ని పది సార్లు చెప్పడం ద్వారా మెదడులోకి ఎక్కించబడిన indoctrination లాంటిది. చారిత్రక భౌతికవాద నిర్దేశనలతో నడిచే మార్క్సిజంకి గాంధేయవాదం లాంటి బలవంతపు indoctrinationsతో పోలిక ఉండదు.

  3. ఇంతకన్నా గొరమూ భయంకరమైన చిత్రహింసనూ ,సామూహిక మానభంగాలూ తెలంగాణా విప్లవపొరాటంలొ జరిగాయి అప్పుడు కుడా ఏ ప్రత్రికా వీటిగురించిరాయలేదు. ఘనతకెక్కిన స్త్రీ ని పుజించే దేశంలొ.
    మహెంద్ర కర్మ శరీరంలొ 80 తుటాలు వున్నాయని మొదట గగ్గొలు పెట్టింది బుర్జువా మీడియా ఆ పైన దాన్ని ఉపసమ్హరించుకుని ఆయన్ను చిత్రహింసలు పెట్టెరని మారణ హొమం జరిగిందనీ గొంతు చించుకుంటుంది. అదే మారణ హొమం పొలీసులు సైన్యం చేస్తె అది ఎంకౌంటర్ అప్పుడు కనడవు మారణహొమం మానవహక్కులు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s