చెన్నై టీం ఓనర్లే స్పాట్ ఫిక్సర్లు, పందెందార్లు


మామ శ్రీనివాసన్, అల్లుడు గురునాధ్ మీయప్పన్

మామ శ్రీనివాసన్, అల్లుడు గురునాధ్ మీయప్పన్

కలుగులో ఎలుక బైటికి వచ్చేస్తోంది. పోలీసులు పెట్టిన పొగ తట్టుకోలేక పుట్టలో పాములు వరుసగా తోసుకుని బైటికొస్తున్నాయి. విందూ దారా సింగ్ ఇచ్చిన వివరాలు నిజమేనని ముంబై పోలీసులకు స్పష్టంగా అర్ధం అయింది. స్పాట్ ఫిక్సింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, ఇండియా సిమెంట్స్ కంపెనీ అధినేతల్లో ఒకరు అయిన గురునాధ్ మీయప్పన్ పాత్ర ఉన్నదని ముంబై పోలీసుల వద్ద సరిపోయినన్ని సాక్ష్యాలు ఉన్నాయట. ఈ మేరకు ముంబై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) హిమాంషు రాయ్ పత్రికలకు చెప్పినట్లు ది హిందు తెలిపింది.

“స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆయన పాత్ర ఉన్నదని నిర్ధారించడానికి మావద్ద తగినన్ని సాక్ష్యాలు ఉన్నాయి” అని హిమాంషు రాయ్ తెలిపారు. పోలీసుల సమన్లు అందుకున్నాక శుక్రవారం సాయంత్రం మధురై నుండి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్ళిన మీయప్పన్ ను అరెస్టు చేస్తున్నట్లు ముంబై పోలీసులు బాగా పొద్దు పోయాక ప్రకటించారు. అనేక గంటలపాటు అతనిని ప్రశ్నించారు. అయితే విచారణకు ఆయన సహకరించడం లేదని రాయ్ తెలిపారు. బెట్టింగ్ కేసులో అరెస్టయిన మీయప్పన్ చివరికి స్పాట్ ఫిక్సర్ గా తేలనున్నాడని రాయ్ మాటలను బట్టి తెలుస్తోంది.

“మేము ఆశించినంతగా ఆయన సహకరించడం లేదు. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నాడు” అని రాయ్ తెలిపారు. శుక్రవారం కాకుండా సోమవారం విచారణకు హాజరవుతానని మీయప్పన్ ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధం అవుతోంది. పోలీసుల ప్రశ్నలకు తానివ్వబోయే సమాధానాలకు తగిన ‘మెటీరీయల్ ఫ్యాక్ట్స్’ ఏర్పాటు చేసుకోవడానికే మీయప్పన్ మరింత సమయం కోరాడు. ముంబై పోలీసులు అందుకు అంగీకరించకపోవడంతో ఫ్యాక్ట్స్ నిర్మాణంలో తగిన సమయం ఆయనకు చిక్కలేదు. దానితో పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడమే ఆయనకు మిగిలింది.

కానీ ఇంత లగ్జరీ సాధారణ నేరస్ధులకు ఉంటుందా? ఒక బడా పారిశ్రామికవేత్త అల్లుడు, వందల కోట్లు వరదలా పారిస్తున్న ఐ.పి.ఎల్ క్రికెట్ సంరంభంలో ఒక ఫ్రాంచైజీ యజమాని అయినందుకే పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోగల అవకాశం గురునాధ్ కి దక్కింది. అదే ఏ పిక్ పాకెటరో, పేరు మోసిన స్టూవర్టుపురం గజదొంగో (ఆ పేరు ఆపాదించేది పోలీసులేనన్నది వేరే సంగతి!) లేదా ఏ చెయిన్ స్నాచరో అయి ఉంటే, తప్పించుకోవడం అటుంచి మక్కెలు ఇరగదన్ని చేయని దొంగతనాలు కూడా మోపి ఉండేవారు. అంతెందుకు పెద్దగా ధనికుడు కాని దారా సింగ్ కొడుకు విందూ దారాసింగ్ కూడా నిజాలు కక్కాల్సి వచ్చింది మరి!

యజమాని కాదు

మీయప్పన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న నేపధ్యంలో ఆయనసలు చెన్నై సూపర్ కింగ్స్ యజమానే కాదు పొమ్మని ఇండియా సిమెంట్స్ ప్రతినిధి ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని రద్దు చేస్తారేమోనన్న భయంతోనే టీం యాజమాన్యం ఈ ‘కవరప్’ కి పాల్పడుతోందని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. ది హిందు పత్రికలో ఈ రోజు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్ అదే. ‘As betting plot thickens, CSK owners become Cover-up Super Kings’ అన్న హెడ్డింగ్ తో సదరు పత్రిక బేనర్ వార్త ప్రచురించింది.

కానీ గతంలో అనేకసార్లు సి.ఎస్.కె ప్రిన్సిపాల్ గా గురునాధ్ మీయప్పన్ పత్రికా ప్రకటనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సి.ఎస్.కె ప్రిన్సిపాల్ గానే ఆయన తన ప్రొఫైల్ ఉంచారు. “ఆయనా సి.ఇ.ఓ కాదూ, ప్రిన్సిపాలూ కాదు” అని ఇండియా సిమెంట్స్ ప్రకటించిన తర్వాత ప్రొఫైల్ నుండి సి.ఎస్.కె ప్రిన్సిపాల్ అన్న పరిచయం మాయమయింది. గురునాధ్ మీయప్పన్, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ గానూ, ప్రిన్సిపాల్ గానూ సంబోధించే స్క్రీన్ షాట్స్ ను కింద చూడవచ్చు. ఇవన్నీ సి.ఎస్.కె వెబ్ సైట్ నుండి సేకరించినవేనని ఐ.బి.ఎన్. లైవ్ తెలిపింది.

చెన్నై సూపర్ కింగ్ వెబ్ సైట్ లోని ఈ లింగ్ కు ఇప్పుడు ‘404 page’ ఎర్రర్ వస్తోంది. ఈ లింక్ లోని పేజీని తొలగించక ముందు ఉన్న మేటర్ యొక్క గూగుల్ catched page ని కూడా చూడవచ్చు. ట్విట్టర్ ప్రొఫైల్ cached link ఇక్కడ చూడవచ్చు.

ఈ ఆధారాలన్నింటినీ చెరిపివేయడానికి ప్రయత్నించారంటే గురునాధ్ కి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నట్లేనని భావించవచ్చు. ఈ నేపధ్యంలో బి.సి.సి.ఐ అధ్యక్షుడుగా శ్రీనివాసన్ రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మాజీ బి.సి.సి.ఐ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్ పవార్, ఐ.పి.ఎల్ మాజీ నిర్వాహకుడు లలిత్ మోడి, ఎన్.సి.పి పార్టీ, టీం ఇండియా స్పాన్సరర్ సహారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత సుబ్రతో రాయ్… వీరందరూ ఈ జాబితాలో ఉన్నారు.

కానీ రాజీనామాకు శ్రీనివాసన్ ససేమిరా అంటున్నారు. తానేమీ తప్పు చేయలేదని చెబుతూ ఆయన శ్రీశాంత్ పట్ల బి.సి.సి.ఐ ఎలా వ్యవహరించిందో గురునాధ్ పట్ల కూడా అలాగే వ్యవహరిస్తుందని (గురునాధ్ తప్పు చేశారని అంగీకరిస్తున్నాట్లా?) ఆయన హామీ ఇస్తున్నారు. ఎన్.డి.టి.వి ప్రకారం బి.సి.సి.ఐ బోర్డు లోని పలువురు సభ్యులు కూడా శ్రీనివాసన్ రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ను ఆ పదవిలోకి రావాలని వారు కోరారని తెలుస్తోంది. అయితే బి.సి.సి.ఐ అధికార పోరాటంలో శశాంక్ మనోహర్, శ్రీనివాసన్ లు శరద్ పవార్ కి వ్యతిరేకంగా జట్టు కట్టిన వారు. వారిరువురు పరస్పర అంగీకారంతో శశాంక్ మనోహర్ కార్యదర్శిగా వెళ్ళగా ఆయన అధ్యక్ష స్ధానంలోకి శ్రీనివాసన్ వచ్చారని పత్రికలు తెలిపాయి. కనుక శశాంక్ మనోహర్ వచ్చినా ‘కవర్ అప్’ వ్యవహారం మరో రూపంలో కొనసాగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

ఐ.పి.ఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీ యజమానులు ఐ.పి.ఎల్ కి గానీ, బి.సి.సి.ఐకి గానీ, మొత్తంగా క్రికెట్ ఆటకి గానీ అప్రతిష్ట తెచ్చే పనులు చేయరాదు. అలా చేస్తే ఫ్రాంచైజీ రద్దవుతుంది. ఈ రద్దు నుండి తప్పించుకోడానికే గురునాధ్ హఠాత్తుగా సి.ఎస్.కె యజమాని కాకుండా పోయారు. స్టేక్ హోల్డర్లు కూర్చుని బేరసారాలు జరుపుకుని సి.ఎస్.కె ని రద్దు చేయడమా లేక శ్రీనివాసన్ రాజీనామా చేయడమా అన్నది తేల్చుకుని ఆ ప్రకారం వ్యవహరించవచ్చు తప్పితే రెండూ జరిగే అవకాశాలు తక్కువే. రెండింటిలో ఏది లాభకరమో శ్రీనివాసన్ ఎంచుకోవాలన్నమాట. శరద్ పవార్ డిమాండ్ ప్రకారం శ్రీనివాసన్ రాజీనామా సాధ్యం కావచ్చునేమో.

ఇక కేసులను ఎలా పక్కదారి పట్టించాలో పోలీసులకు, రాజకీయ నాయకులకూ బాగానే తెలుసు. ఇప్పుడు హడావుడి చేస్తున్న పత్రికలు ఆ తర్వాత కుయ్ కయ్ మనవు. ఐ.పి.ఎల్ యధావిధిగా సాగిపోతుంది, ఈ దేశ క్రికెట్ పిచ్చోళ్లను నిజమైన పిచ్చోళ్లను చేస్తూ….

17 thoughts on “చెన్నై టీం ఓనర్లే స్పాట్ ఫిక్సర్లు, పందెందార్లు

 1. This is a private scam. It is not like public scam 2g, coal gate. Media will try to create big impression as if common people’s money lost In this scam. It is not so. It seems top people settling their scores.. Srinivasan should not resign his post. He shuld try to continue as long as posible. Then only lot of hidden things will come out. The moment he resigns, media will stop covering this scam or ignore this scam.

 2. Anyways police started enquiry. They would continue as per process. Today or tomorrow whoever involved they can not escape from investigation. But Why electronic media is showing over enthusiasm and projecting as if it is a public scam? Clearly they targetted individuals untill they go out they have to keep on digging all the stories. If Srinivasan stick to his position as long as posible more stories will come out.

 3. మనోహర్ గారు, మీ లాజిక్ బాగుంది. శ్రీనివాసన్ ఎంత ఎక్కువ కాలం కుర్చీని అంటిపెట్టుకుని ఉంటే అతడిని తొలగించే పనిలో మీడియా అంత ఎక్కువ వాస్తవాలు వెలికి తీస్తుంది. ప్రాక్టికల్ లాజిక్. బహుశా ఈ ఐడియా చాలా తక్కువమందికి వస్తుందనుకుంటాను. ఐడియా చెప్పాక ఇది నాకూ అనిపించింది అనేవారు ఉంటారు గానీ, ఈ రూపంలో ఇలాంటి ఐడియా నాకు మాత్రం కొత్తే.

 4. సుమారు లక్ష కోట్ల వ్యాపారం లో 20 లక్షల రూపాయలు బెట్టింగ్ అనేది ఊహించండి. మీ దగ్గర లక్షల్ రుపాయలు ఉంటే పది రూపాయాలు పోతే పోలిస్ కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేస్తారా? అలా ఎవరైనా చేస్తున్నారు అంటే చాలా కేలికులేటేడ్ గా ఒక వ్యుహ ప్రకారం చేస్తున్నారని భావించాలి. వారి వ్యుహం లో ప్రత్రి తల అనుకొన్న సమయానికి తెగాలి (అంటే అరేస్ట్ కావడామో /రిజైన్ చేయడమో) , అలా జరగాలి. అలా జరిగేటట్లు మీడియాలో వార్తలు రప్పించటం, వత్తిడి పెంచటం కూడా వారికి ఒక భాగం. మధ్యలో ఊహించని విధంగా శ్రీనివాసన్ లాంటి వారు రిజైన్ చేయకుండా ఎదురు తిరిగితే, తెర వెనుక వారికి బూమరంగ్ అవుతుంది. అందువలన ఆయన ఆలస్యం చేసేకొద్ది వాళ్లకి దిక్కు తోచక ,వాడిని వీడీని పిలిచి వివరణలు ఇప్పించాల్సి వస్తుంది. ఇది చాలా శ్రమ, ఖర్చు తో కూడీన పని. లలిత్ మోడి, సుబ్రతో రాయ్, జగ్మోహన్ దాల్మియ వీళ్లకి ఎమి క్రెడిబిలిటి ఉందని ఆయనను రిజైన్ చేయమంటారు? అయినా సరే ఘనత వహించిన ఇంగ్లిష్ మీడియావారు, ఈ క్రెడిబిలిటి లేనివారిని తీసుకొచ్చి, ఈ సందర్భంలో వాళ్లు చాల గొప్పవారైనట్లు మాట్లాడిస్తుంది. ఆయన కొనసాగే కొద్ది బయటకు పంపాలనుకొనే వారు పంతం నెగ్గించుకోవటానికి కారణాలు చూపుతూ వాళ్ల రహస్యాలను వారే బయట పెట్టుకోవలసి వస్తుంది. లేకపోతే ఆయనతో రాజికి రావల్సి వస్తుంది. ఇదొక పెద్ద డ్రామ. మధ్యతరగతి వారికి క్రికేట్ ఇష్టం, కనుక అదేదో కొంపలు మునిగే స్కాం లాగా ప్రచారం చేయటం. క్రికేట్ లో ముందునుంచి ఉన్న బాంబే, ఉత్తరాది ఆధిపత్యానికి తమిళ తంబి శ్రీనివాసన్ కొంచెం అడ్డుపడినట్లు ఉన్నడు. కార్పోరేట్ లో పుట్టినప్పటినుంచి ఉన్న శ్రీనివాసన్ అల్లుడు తప్పు చేస్తే నెత్తిన కెత్తుకొంటాడా? కార్పోరేట్ రంగం ఎమైనా రాజకీయ రంగమా? ఆయన రాజకీయవాదా? వాస్తవానికి ఇందులో నిజాలు ఎప్పటికి బయటకి రావు. ఆయన రిజైన్ చేసిన పక్క రోజు నుండి, అనుకొన్న పని అయిపోయిందని, పని చేయించుకొన్న వారు పైసా ఖర్చు పెట్టరు, డబ్బులు రాని అంశాలకు మీడీయా భారి ఎత్తున ప్రాముఖ్యత ఇవ్వదు. అంతా గప్ చుప్ అయిపోతారు.

  మీడీయా ఒక కార్పోరేట్ రంగం అని మీరు బాగా గుర్తుంచుకోవాలి. వాటికి డబ్బులు వచ్చే వాటినే అది ప్రసారం చేస్తుంది. వాళ్లకి అవినీతే అంశమైతే మన రాష్ట్రంలో జరిగిన స్కాంలు కూడ వేల, లక్షల కోట్లలో నే ఉన్నాయి. వాటిలో పాలు పంచుకొన్న మంత్రులు ఇంకా పదవిలో కొన సాగుతూంటే జాతీయ ఇంగ్లిష్ మీడీయా వాళ్లు ఎన్ని సార్లు దాని గురించి ప్రచారం/ప్రసారం చేశారు? అదేకాక తిండి గింజల కొరత, ఆహర పదార్థాల ధరల పెరుగుదలను ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మీడీయా ప్రస్తావించిందా? ప్రస్తుతం బ్లాగులు మాత్రమే నిజాయితిని ప్రతిబింబించేది. ఇటువంటి వార్తలపై మీరు ప్రతిస్పందిస్తున్నారంటే మీరు కూడా , అనవసరం గా ఆ అర్థ సత్య వార్తలు చదువుతూ, ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకోవటం తప్పించి ఎమీలాభం ఉండదు. కనుక ఇటువంటి అంశాలకు ప్రాముఖ్యత నివ్వకండి. రాసి సమయం,శ్రమ వృథా చేసుకోవద్దు. ఆటలు,సినేమా మొద||డబ్బుండే వాడి టైం పాస్ అంశాలు. నా సలహ మిమ్మల్ని నిరుత్సాహ పరచటానికి మాత్రం కాదు. బి ఫొకస్డ్ అని చెప్పటమే ఉద్దేశం .

 5. మనోహర్ గారు

  నేను ఆలోచించే దీని గురించి రాసాను. కార్పొరేట్ మీడియా వార్తల ఫోకస్ కి నేను ఇచ్చిన వివరణ యొక్క ఫోకస్ కి మధ్య తేడాను మీరు గుర్తించి ఉండాలి. మీరు చెబుతున్నట్లు ఇది కేవలం ప్రైవేటు స్కామ్ మాత్రమే కాదు. అందులో ఉన్నదంతా ప్రజాధనమే. క్రికెట్ ఆడేవారు, ఆడించేవారు ఆ డబ్బుని ఉత్పత్తి చేయలేదు. జనం నుండి దోచుకున్న డబ్బే అక్కడ చేతులు మారుతోంది. అలా చేతులు మారడానికి ఐ.పి.ఎల్ అనే సర్కస్ ని సృష్టించి జనాన్ని పిచ్చోళ్లని చేస్తున్నారు. ఆ సంగతి చెప్పడమే నేను ఈ అంశంపై కేంద్రీకరించిన ఉద్దేశం.

 6. “కార్పొరేట్ మీడియా వార్తల ఫోకస్ కి నేను ఇచ్చిన వివరణ యొక్క ఫోకస్ కి మధ్య తేడాను మీరు గుర్తించి ఉండాలి”

  నేను గుర్తించానండి. అజారుద్దిన్ సమయం నుంచి ఎంతో మంది పై ఆరోపణలు వచ్చినా ఆ ఆట పైన మక్కువ తగ్గిందా? అన్ని తెలిసి కూడా వాళ్లు చూడాలనుకొంటే ఎమి చేయగలం? మీరు సామన్య జనంగురించి మాట్లడుతునారేమో, యం యన్ సి కంపేని ల లో వి పి, యం డి మొదలుకొని, అప్పుడే ఉద్యోగంలో చేరిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వరకు వరకు ఈ ఆట పిచ్చి ఉంది . వాళ్ల పిల్లల చేత ఆడిస్తుంటారు కూడాను. వాళ్లకి వాస్తవాలు తెలిసిన ఆటను చూడకుండా ఉండలేరు. క్రికేట్ విషయానికి వచ్చేటప్పటికి, ఈ దేశం లో ప్రజలు పిచ్చోళ్లు గానే ఉండాలను కొంట్టున్నరు. మానసిక బలహీనత. ఏం చేద్దాం?

 7. నిన్నటి నుంచి జరిగిన సంగటనలు పరిశీలిస్తే శ్రీనివాసన్ రాజీనామా చేయకపోవటంతో బెంబేలెత్తి,అతనితో అమీతుమీ తేల్చుకోవలనుకొన్నవారు, దిక్కుతోచక కలకత్తాలో దాల్మియా చేత పార్టి ఏర్పాటు చేయించారు. దానికి ఎంతో ఉత్సాహం తో హాజరైన శ్రీనివాసన్, పార్టి చివరివరకు ఉన్నాడు. అక్కడ ఎవ్వరు అతనిని రాజీనామా అడగలేదు.సరికదా కనీసం పది మంది ని కూడా శ్రీనివాసన్ వ్యతిరేకం గా కూడగట్టలేక చతికిల బడ్డారు. వాళ్ళు ఏర్పాటుచేసిన విడిది కి వెళ్లి వారికె తన బలం రుచి చూపించి వచ్చాడు. అతనికి వ్యతిరేకం గా ఎవ్వరులేకపోయినా మీడీయాలో బాకాలు ఊదించిన వాళ్ళు తిన్నగా ముసుగులు తొలగించి బయటకు వచ్చారు. వారు మరేవరో కాదు యన్.సి.పి. పార్టి వారు. అందరు వాళ్ల వాళ్ల ప్రయత్నాలు చేసుకొని, ఇక చేయటానికి ఎమీ లేక,వ్యూహాలు అన్ని వీగిపోయి, నెత్తిన చెంగేసుకొని, ఒంటరిగా కుచ్చొన్న తరువాత వాళ్ల ఎత్తుగడలను తిప్పికొట్టిన శ్రీనివాసన్ ఈ రోజు 4గం|| ప్రెస్ కాన్ ఫెరెన్స్ పెట్టి బెట్టింగ్ సాకుతో ఆయానతో రాజకీయ చదరంగం మొదలుపెట్టిన వారిని ఉద్దేశిస్తూ (మీడీయా+యన్.సి.పి.పార్టి+ గల్ఫ్ వ్యాపారులను )విజయం నాదే అని ముంగింపు ప్రసంగం దిగ్విజయంగా చేసి, తానోక గొప్ప నాయకుడు అని నిరూపించుకొన్నాడు. శ్రీనీవాసన్ మీద ఎత్తులు వేసిన వారు బహుసా కొన్నిటిని ఊహించలేకపోయారు. సదరు సాదా సీదానాయకులు కూతుర్లకొరకు,అల్లుళ్ల కొరకు దేశాన్ని దోచిపెట్టేవారు, శ్రీనివాసన్ ని కూడా వారిలాగే అని ఊహించుకొన్నారు. అల్లుడిని దెబ్బకొడితే కాళ్ల బేరానికి వస్తాడని అనుకొంటే, ఆయన తోణుకకుండా అల్లుడిది జీవితకాలం బహిష్కరిస్తామని చెప్పటమేకాక, విడిపించుకొనే ప్రయత్నాలు కూడా ఎక్కడా చేయలేదు. ఇది అవతల వారిని తీవ్రంగా దెబ్బకొట్టేసింది.

  ఇక మీడీయావారి విషయానికి వస్తే ఇంతక్రితం వాళ్లు అనుసరించిన మోడల్ ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. గడ్కరి విషయం లో వాళ్లు చేసిన హంగామా , పై పై విచారణ అంతా బూటకమని ఇప్పుడు పై సర్కిల్ లో వారికి తెలిసిపోవటం వల నో ఎమో, శ్రీనివాసన్ ఈ హంగామాను చూసి మొదటనే ఒక వెంట్రుక ఒకటి తీసీ పారేశాడు. తొందరపడకుండా సమయం తీసుకొని ఓపికగా వాళ్లకంటిని వారి వేలితోనే పొడిచాడు. ఇది అతని కి ఎంతో కలసి వచ్చింది.

  I am not an accused: Srinivasan
  There is nothing against me, no one has said that I have done anything wrong: Srinivasan
  No member of the BCCI has asked for my resignation and NCP is not a member of the BCCI: Srinivasan
  Srinivasan refuses to reply to allegations made by Lalit Modi, says he does not reply to fugitives

 8. మనోహర్ గారు

  శ్రీనివాసన్ గారికి మీరిస్తున్న మద్దతు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరిన్ని నిజాలు బైటికి రావాలంటే అర్ధం శ్రీనివాసన్ ఆధిపత్యం రుజువు కావడమే అన్నట్టుంది మీ వివరణ.

  శ్రీనివాసన్ కి తెలియకుండా ఆయన అల్లుడు బెట్టింగ్ లో ఉన్నాడంటే నమ్మలేని విషయం. ఇండియా సిమెంట్స్ ఓనర్ గా, తద్వారా చెన్నై టీం ఓనర్ గా శ్రీనివాసన్ కూడా తన అల్లుడి నిర్వాకానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే చెన్నై టీమ్ ఓనర్ గా నిన్న మొన్నటివరకు ముందు నిలిచింది మీయప్పనే. ఆయనపై ఆరోపణలు వచ్చేసరికి హఠాత్తుగా ఓనర్ కాకుండా ఎలా పోతాడు?

  చైన్నై ఓనర్ ప్లస్ బి.సి.సి.ఐ అధ్యక్షుడుగా శ్రీనివాసన్ conflict of interests పరిస్ధితిలో ఉన్నాడు. ఆయన బి.సి.సి.ఐ అధ్యక్షుడుగా ఉంటూ మీయప్పన్ పైన విచారనను నిజాయితీగా చేయిస్తాడని ఆశించడం ఆయన అభిమానులకు సాధ్యమవుతుందేమో గానీ, మామూలుగా సాధ్యం కాదు. కాబట్టి ఆయన రాజీనామా చేయడమే సరైనది. వైరి వర్గాల బలా బలాల వలన ఆయనని తప్పించడంలో ప్రత్యర్ధులు విఫలం అయితే, అది అంతవరకే. కాని అది శ్రీనివాసన్ నిర్దోషిత్వానికి రుజువు మాత్రం కాజాలదు.

  ఇక మీయప్పన్ పందెం ఎంత కాశాడంటే ఇరవై లక్షలని ఒకసారి కోటి రూపాయలని ఇప్పుడు వినవస్తోంది. అలాగైతే యాభై వేల కోట్ల మొత్తం పందేల్లో చేతులు మారడం ఎలా సాధ్యం? ఆఫ్ట్రాల్ కోటి రూపాయల పందెంతో మీయప్పన్ సరిపెట్టుకుని ఉంటాడా? నా ఉద్దేశ్యంలో ఇంకా పెద్ద మొత్తం ఉండి ఉండాలి. లేకపోతే యాభైవేల కోట్లు అన్నదైనా తప్పై ఉండాలి.

 9. మీరు రాసిందంతా పేపర్లో వాళ్ళు చెప్పే మాటలండి. నేను సామాన్య మానవుడిని . నాకు ఎవరు ఎమీ తిన్నారో ఎమీ చేశారో విషయాల సంగతి అనవసరం. ఎందుకంటే పేపర్లో వచ్చే వార్తలన్ని సెలెక్టివ్ వార్తలని నమ్ముతాను. విషయానికి వస్తే మీరనుకొన్నట్లు శ్రీనివాసన్ కూడ అవినితి పరుడని అనుకొందాం. ఆయనను దిగమన్నవారు కూడా అవినీతిలో ఎమీ తీసిపోరు. ఆయన ఉంటే అక్కడ మనకు తెలియని ఎదో సమస్య వారికి ఉంది. కాని ఆయన పోతే వారికి మార్గం సుగమౌతుంది, లాభాలు చేకురుతాయి. అవినీతి పరుల ఎత్తుగడను ఇంకొక అవినితి పరుడు వ్యతిరేకించటమంటే ఎమిటి? అవినితికి వ్యతిరేకం గా నిలబడి పోరాడినపుడు వాడు అన్నాహజారే కానక్కరలేదు, అవినితి పరుడైనా అక్కడ పరోక్షంగా నీతి గెలిచినట్లు. సింపుల్ గా చెప్పాలి అంటే గాంబ్లింగ్ ఆట ఆడే వారు అటుచేసి ఇటుచేసి చివరికి చేసేది డబ్బు చేసుకోవటమే. ఈయనను పొగపెట్టినవారికి సొమ్ము చేసుకొనే పెద్ద ప్లాన్స్ ఉంటేనే, మోసం జరిగిపోతుంది అంటు ఆ ఆటనే గబ్బు పట్టించేత రిస్క్ తీసుకొన్నారు. ఆయన ఎదురుతిరిగితే వాళ్ల ప్లాన్స్ అన్ని తలకిందులయ్యినట్లే. వాళ్లకి వస్తుందనుకొన్న ఆదాయం గండి పడినట్లే. సాధారణంగా ఈ ఆదాయం ప్రభుత్వానికి టాక్స్ కట్టే రూపంలో ఉండకపోవచ్చేమో!అని నా అభిప్రాయం. ప్రభుత్వానికి కూడా టాక్స్ కట్టే పనైతే ప్రాసేస్ ని ఫాలో అవుతారు కదా. చివరికి ఈ తగవు వలన ప్రజలకి పైకి స్పష్ట్టంగా కనపడకపోయినా ఎక్కడో లాభం చేకూర్చింది అనుకొంటాను.
  మొన్నటి పేపర్లో ఆయనను ఇంపీచ్ చేస్తామని మసాల వార్తలు ఎలా రాయించారో చూడండి. తీరా ఈ రోజు ఎదురుతిరిగిన అతని పైన అవిశ్వాస తీర్మానం పెట్టటనికి వారి వైపు ఎవ్వరులేరు. అది అయ్యేపని కాదు అని తెలిసిపోయింది.
  http://ibnlive.in.com/news/cricketnext/bcci-to-confront-srinivasan-may-consider-impeaching-him-sources/393852-78.html

 10. శ్రీనివాసన్ నేను సమర్ధిస్తున్నాని అనుకొకండి.ప్రత్యర్దులు విసిరిన ఒక పక్కా ప్లాన్ ను సరైన సమయంలో బంధుత్వాలను సైతం పక్కనపెట్టి, సైంధవుడిలా గా అడ్డుకొన్నాడు. దాని వలన ఎక్కడో ప్రజలకు లాభం జరిగిందని భావిస్తాను. శ్రీనివాసన్ కొంతకాలంతరువాత పదవి నుంచి దిగినా, వాళ్లకి ఇప్పుడు జరిగిన నష్టం పూడటం మాత్రం చాల కష్టం. ఎందుకంటే ఆయన వ్యతిరేకులంతా అవినీతిలో పి.చ్ డి లు చేసి, దేశం లోనే లేకుండా తప్పించుకొని తిరుగుతున్నవారు కనుక. వారికి వ్యతిరేకంగా పోరడటం అంటే ఖచ్చితంగా మనదేశప్రజలకు లాభం.

 11. పేపర్ వాళ్లు చెప్పేవన్నీ తప్పులు కావు. బి.సి.సి.ఐ విధించిన సూత్రాలను శ్రీనివాసన్ ఐనా పాటించవలసిందే కదా.

  క్రికెట్ లో పారుతున్న డబ్బు కూడా సామాన్యులదే. అది వివిధ లాభాలు, వడ్డీలు, మాఫియా ఎక్స్ టార్షన్ ల రూపాల్లో అక్కడికి వచ్చింది. డబ్బు గాలిలో నుండి పుట్టదు. అది శ్రమ చేస్తేనే పుడుతుంది. కాబట్టి క్రికెట్ లో ఉన్నది ప్రైవేటు డబ్బు అని పబ్లిక్ డబ్బు కాదు అని అనుకోవడం కరెక్టు కాదని నా అభిప్రాయం. అలా చూసినపుడు శ్రీనివాసన్ అయినా, శరద్ పవార్ అయినా చట్టాలకు జవాబుదారులుగా ఉండవలసిందే. వారి మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి తప్పులు బైటకి వస్తున్నాయి, నిజమే. అంతమాత్రాన తప్పు జరగడం లేదని అనకూడదు కదా. తప్పు తప్పే. బాధ్యత వహించవలసిందే, శిక్ష పడవలసిందే.

  మీరు సామాన్యులేమో గానీ శ్రీనివాసన్ సామాన్యుడు కాదు. ఆయన ఒక కార్పొరెట్ కంపెనీ అధినేత. అక్కడ డబ్బు చాలకనా క్రికెట్ సేవకు వచ్చాడు? కార్పొరెట్ మీడియాకు వర్తించేదే కార్పొరేట్ కంపెనీలకు వర్తిస్తుంది.

 12. ఇక కార్పోరేట్ మీడీయా రంగం చేసేదివ్యాపారమైన అదేదో ప్రజాసేవ చేస్తున్నమన్నట్లు పోజులు పెడతరు. అదే కార్పోరేట్ రంగం వాళ్లు వ్యాపారాన్ని ప్రజాసేవ అని డబ్బా కోట్టుకోరు కదా!

 13. IPL scandal: This nonsense wouldn’t have happened if I was BCCI chief, says Sharad Pawar

  సమయం గడిచే కొద్ది పరిస్థితిలో ఏ మార్పు లేకపోవటం వలన, వెనుక నుంచి చేసేది ఎమీలేక ముసుగుతీసి ముందుకొచ్చిన పాత్రధారి. సమయాను కూలంగా మీడీయా వారు ఆయనను ఒక గొప్ప వ్యక్తిగా ప్రొజేక్ట్ చేస్తూ,ఆయన అభిప్రాయాలను గౌరవిస్తూనట్ట్లు నటిస్తూ దొంగనాటకాలు ఆడుతుంది. భారతదేశంలో ఎన్నో స్కాంలు ఉంటే /జరిగితే ఈ స్కాం తో ఘొరం జరిగినట్లు ఇన్ని రోజులు ప్రచారం చేయటానికి గల కారణం పెద్దగా ఎవరు ఊహించనక్కరలేదు. వెనకాల ఎవరో బాగా డబ్బులు ముట్ట చెపుతూంటారు. డబ్బులు లేని,రాని కేసులను రెండో రోజే పక్కన పడేస్తుంది.

  మంత్రి గారికి అంత ప్రాముఖ్యత నిచ్చే మీడీయా, ఏనాడైనా ఆయన స్వంత రాష్ట్రం లో రైతులు లక్షలలో చనిపోతుంటె ఆయన తీసుకొన్న బాధ్యత ఎమిటి ? అని ప్రశ్నించిందా!? ఈ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను పెద్ద అక్షరలతో ప్రచూరించి, ఆయనే ఉంటే ఇటువవంటి వాటిని జరగనిచ్చిఉండేవాడు కాడంట అని వత్తాసు పలుకుతున్నాది. పైగా ఆయనేదో ఒక గొప్ప పరిపాలనధురంధరుడిలాగా ప్రచారం చేయటం మొదలుపెట్టింది.
  ఆయన అంత సమర్దుడు ఐతే, లక్షల మంది రైతులు మహారాష్ట్రలో చస్తుంటె వారిని ఆదుకొని, రైతుల విషయం లో ఒక్కసారి తన సమర్ధతను ఎందుకు నిరూపించుకోలేకపోయాడు? రైతుల సమస్య కన్నా క్రికేట్ స్కాం చాలా ముఖ్యమైనదా!? డబ్బు ఉండేవారికి వత్తాసు పలుకుతు, సమాయానుకూలంగా వ్యవహరిస్తూ, సిగ్గు ఎగ్గు వదలి వేసిన ఇంగ్లిష్ మీడియా ప్రజల చెవిలో పువ్వులు పెట్టటం ఆపాలి.

 14. సమయం దొరకక ఈ విషయం గురించి రాయలేక పోయాను. ఆలస్యంగా రాస్తున్నాను.
  శ్రీనివాసన్ విషయం మీడీయా ఏవిధంగా ప్రవర్తిస్తుందో తిమ్మిని బమ్మిగా చేయటానికి, వారి మాటపై చేయి కావటానికి ఎలా ప్రవర్తిస్తారో ఈ క్రింది సమాచారం చదివితే ఎవరికైనా కొద్దిపాటి విచక్షణ ఉంటే అర్థమైపోతుంది. ఇంత క్రితం చెప్పినట్లుగా మీడీయా లో ఆయన ను తొలగిస్తారని ఎంత ఆత్రుత తో, ఎలా ప్రచారం చేశారో.

  IPL row: Srinivasan might resign at BCCI meet tomorrow, say sources
  http://www.ndtv.com/video/player/news/ipl-row-srinivasan-might-resign-at-bcci-meet-tomorrow-say-sources/277804

  తీరా మీటీంగ్ పెడితే ఆయన రాజినామాని ఎవరు అడగలేదు. సరికదా అందరు ఆయన చెప్పిన ప్రతిపాదనని విని నాదస్వరం ఊదితే విన్నపాములా తలాడించి లేచి వచ్చారు. ఈ విషయానికి వారల తరబడి మీడియా చేసిన హంగామా అంతా ఇంతాకాదు.ఆయనని వ్యతిరేకించేవారే లేనపుడు ఆయన రాజీనామాకు కౌంట్ డౌన్ ప్రారంభమైనదని ఒకరు, రేపే రాజీనామా చేస్తారని ఇంకొకరు ఎలా అబదాలను ప్రచారంచేశారో! ఇక పరువు కోల్పోయిన మీడీయా వారు దానిని దాచుకోవటానికి చానా తంటాలుపడ్డారు. వీళ్ళు ఎంత వరకు వెళిపోతారంటే మేము ఇన్ని రోజులు ఈ విషయం పైన ఆందోళన చేసిన రాజీనామా ఇవ్వలేదంటే అర్థమేమిటి? ప్రజల కి వీళ్లు జవాబుదారి గా వ్యవహరించరా అని మీడీయా అజేండాని, ప్రజల అజేండా గా మారుస్తారు. కుట్రలు పన్ని, ఎత్తులు పైఎత్తులు వేసి పదవిలో కనసాగుతున్నారని ప్రచారం చేస్తారు. అసలు విషయాన్ని కప్పి పుచ్చుతారు.

  Analysis: The big divide within the BCCI
  http://ibnlive.in.com/videos/395679/analysis-the-big-divide-within-the-bcci.html

  Chennai ‘sham’: Srinivasan gets his way
  http://www.ndtv.com/video/player/india-this-week/chennai-sham-srinivasan-gets-his-way/277979

  కాని శ్రీనివాసన్ లాంటి వాళ్లు నాయకత్వ పటిమను చూపి ఈ మీడీయా మేనేజిమెంట్ వారిని సమర్ధవంతం గా,తార్కికం గా చెంప చేడేల్ మనేటట్లు తిప్పికొట్టారు.

  My decision to step aside extremely fair, N Srinivasan tells NDTV
  http://www.ndtv.com/video/player/news/my-decision-to-step-aside-extremely-fair-n-srinivasan-tells-ndtv/277962

  ఇక అక్కడ ఉన్నా తమ మాటలు నెగ్గదని తెలిసిన వారు, రాజీవ్ శుక్లా చేత రాజినామా చేయించారు. బయట నుంచి చూసేవారికి, ఈ వ్యవహారం శ్రీనివాసన్ కు వ్యతిరేకంగా ఆయన తన నిజాయితిని నిరూపించుకోవటనికి చేసిన రాజినామాలా అనిపిస్తుంది. అసలి సంగతి ఎమిటంటే, ఈ క్రింది వార్త చూస్తే అర్థమౌతుంది.

  http://www.deccanchronicle.com/130604/news-current-affairs/article/did-rajeev-shukla-meet-dawood-ibrahim-when-he-was-pakistan

  ఇంగ్లిష్ మీడీయాలో ఎక్కువగా అమేరికా,లండన్ ల లో చదివి ఆ టేక్నిక్ లను మనదేశంలో కొంతకాలం విజయవంతంగా అమలు జరిపినా, ఇప్పుడు వాటిని అమలు జరపటంలో వరుసగా దెబ్బలు తింట్టున్నారు. వీళ్ల టి వి ప్రసారాలు చూస్తుంటే వీళ్లకి ఎమైనా దేశభక్తి ఉందా అనే అనుమానం చాలా సార్లు వస్తుంది కూడాను. ఈ క్రికేట్ ఉదంతం తో వీల్లంతా దిక్కు తోచని పరిస్థ్హితిలో ఉంటే, గోవాలో బిజెపి సమావేశాలు వీరిని ఆ దెబ్బనుంచి బయటపడేశాయి. ఇప్పుడు వీళ్లదృష్టి అంతా మోడి పైన పెట్టి, శ్రీనివాసన్ విషయాన్ని చాప కిందకు నెట్టేశారు. ఇంతకు ముందు సండే గార్డీన్ పత్రిక యన్ డిటివి ప్రణయ్ రాయ్ గారి విదేశి సంస్థల వివరాల పైన పెద్ద వ్యాసం,సాక్షాదారలతో సహా రాసింది. ఇప్పుడు ఇంకొక వ్యవహారం బయటకు వచ్చింది.

  http://www.dailypioneer.com/nation/politicians-media-barons-violating-goa-coast-norms.html

  ఎట్టకేలకు శ్రీనివాసన్ మరియు అతని టీం వీదేశి శక్తుల ఆటకట్టించటమేకాక, మళ్లి దాల్మియాను తాత్కాలికం గా తెరపైకి తీసుకొచ్చి మంత్రి గారి ఆటలకు చెక్ చెప్పారు. దాల్మియా ను తొలగించటంలో ఇంతక్రితం మంత్రిగారు ఎంతో కీలక పాత్ర వహించారు. కనుక దాల్మీయా గారు ఈ తక్కువ సమయం లో కూడా,తనకు వచ్చిన అవకాశాన్ని వాడుకొని, బోర్డ్లో మంత్రిగారి పలుకు బడికి అడ్డుకట్టవేయటానికి ప్రయత్నిస్తారు. కనుక సుదూర కాలంలో మంత్రిగారు, విదేశి శక్తుల మాట బోర్డ్ లో చెల్లు బాటాయ్యే పరిస్థితే లేదు. అలా ఎత్తులు వేసిన వారి పైన పైఎత్తువేసి దేశానికి మేలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం లో క్రికేట్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఎవరైనా భావిస్తే, ఈదేశంలో క్రికేట్ ఎంత దెబ్బ తింటే సామాన్య ప్రజలకి అంత మేలు జరుగుతుంది. దాని మత్తులో జోగటం ఆపి ఆలోచించటం నేర్చుకొంటారు.

 15. ఈ విషయం మొదటి నుంచి చివరి వరకు శ్రీనివాసన్ మీద వచ్చే వార్తలను అనుసరించి, ఇంకొక కోణం లో రాయలను కొని ఇక్కడ పెద్ద వ్యాఖ్యలు రాశాను. ప్రచురించినందుకు ధన్యవాదాలు. నేను రచయితను కానునేను రాసే ఏ వ్యాఖ్యలో అయినా భావం మత్రం తీసుకొనేది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s