వేగంగా పరుగెత్తాలని గుర్రాన్ని ఆదేశించాలంటే అశ్వికుడు ‘గిడియాప్’ అంటాడట. యు.పి.ఏ ఆస్వారూఢుడైన అశ్వికులు మన్మోహన్ సింగ్ గారు తొమ్మిదేళ్ల శ్రమతో నిర్మించిన రోడ్డు పైన తన గుర్రానికి అదే ఆదేశాలిస్తున్నారు. హ్యాట్రిక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఆ మధ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్, మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలని తోసి పుచ్చలేదని వార్తలు వచ్చాయి. మొన్నటితో మన్మోహన్ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ అదే చర్చ తలెత్తింది. దానినే కార్టూనిస్టు ఎత్తిచూపిస్తున్నారు.
అసలు మన్మోహన్ గారికి ఆ ధైర్యం ఉన్నందుకే మెంచ్చుకోవాలి. గెలిచే సంగతి తర్వాత!