రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన యాపిల్!


Apple storeపన్ను ఎగవేయడం ఒక కళ. ఆ కళలో ఆరితేరింది యాపిల్ కంపెనీ. ప్రపంచ వ్యాపితంగా పదుల కొద్దీ డూప్లికేట్ కంపెనీలు స్ధాపించి ‘టాక్స్ ప్లానింగ్’ పేరుతో ‘టాక్స్ ఏవేజన్’ కి పాల్పడడంలో యాపిల్ నేర్పరి అని ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను రుజువు చేస్తూ సదరు కంపెనీ 74 బిలియల్ డాలర్లు (దాదాపు రు. 4 లక్షల కోట్లకు సమానం) పన్ను ఎగవేసిందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఆరోపించడమే కాక విచారణ కూడా ప్రారంభించింది. పన్నులు తక్కువగా ఉన్న దేశాలను ఎంచుకుని, ముఖ్యంగా ఐర్లాండ్ లాంటి దేశాల్లో పేపర్ కంపెనీలను స్ధాపించి ఈ మొత్తంలో పన్ను ఎగవేసిందని అమెరికా ఆరోపిస్తూ విచారణ ప్రారంభించింది.

యాపిల్ పన్ను ఎగవేతకు సహకరించినందుకు ఐర్లండ్ ప్రభుత్వాన్ని కూడా అమెరికా తప్పు పడుతోంది. అయితే ఐర్లండ్ మాత్రం తమ పన్ను విధానాలు పారదర్శకమైనవని, మోసాలు జరగడానికి వీలు లేదని యధావిధిగా వాదిస్తోంది. నిజానికి ఐర్లండ్ ఆదాయంలో ప్రధాన భాగం బ్యాంకింగ్ పైనా, సరళతరమైన పన్నుల విధానం పైనా ఆధారపడినట్టిది. ఐర్లండ్ అనుసరించే దాపరికం వలన అనేక కంపెనీలు తమ డబ్బును అక్కడ మదుపు చేయడానికి ఆసక్తి చూపుతాయి. పన్ను ఎగవేతదారులకు, మోసకారులకు, అంతర్జాతీయ మాఫియాలకు సేవలు చేసుకుంటూ ఐర్లండ్ పాలక వర్గాలు బిలియన్లకు పడగలెత్తిన విషయం రహస్యం ఏమీ కాదు.

అత్యంత ఆధునికమైన స్కీములను వినియోగించి అంతర్జాతీయ స్ధాయిలో లెక్కకు మిక్కిలిగా అనుబంధ కంపెనీలను సృష్టించి బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నును యాపిల్ కంపెనీ ఎగవేసిందని అమెరికా పరిశోధకులు కనుగొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. యాపిల్ కంపెనీకి ‘పన్నులు ఎగవేసే మార్గంగా’ వ్యవహరిస్తున్నందుకు అమెరికన్ సెనేట్ ఒక నివేదికలో ఐర్లండ్ ప్రభుత్వాన్ని విమర్శించిందని పత్రిక తెలిపింది. ఐరిష్ పన్నుల ఏర్పాట్లను అమెరికా ప్రత్యేకంగా విమర్శించింది. ఈ ఏర్పాట్ల ద్వారా యాపిల్ చట్టబద్ధంగా పన్ను ఎగవేసే అవకాశాన్ని ఐర్లండ్ ప్రభుత్వం కల్పించిందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.

నివేదికల ప్రకారం గత 4 సంవత్సరాలలో యాపిల్ కంపెనీ తనకు వచ్చిన లాభాలను అమెరికా పన్నుల విభాగం నుండి దాచిపెట్టి 74 బిలియన్ డాలర్ల పన్ను ఎగవేసింది. వివిధ అనుబంధ కంపెనీలను స్ధాపించడం ద్వారా ఈ ఎగవేతకు పాల్పడింది. ఐర్లండ్ లో ఉనికిలో లేని రెండు పేపర్ కంపెనీలను యాపిల్ స్ధాపించిందని టైమ్స్ తెలిపింది. సెనేట్ నివేదిక ప్రకారం విదేశాలలో ఖాతాలను తెరవడానికి బదులుగా యాపిల్, గొలుసుకట్టు అనుబంధ కంపెనీలను స్ధాపించింది. ఇవేవీ వాస్తవంగా ఉనికిలో లేవని, కేవలం పేపర్ మీద మాత్రమే పన్నులను ఎగవేయడానికి ఉద్దేశించి స్ధాపించినవని సెనేట్ నివేదిక పేర్కొంది.

యాపిల్ స్ధాపించిన అనుబంధ కంపెనీలలో ఎటువంటి సిబ్బంది లేరని కనుగొన్నారు. ఉన్నత స్ధాయి సిబ్బంది ఒకరిద్దరు తప్ప మరే ఇతర సిబ్బంది లేరని కనుగొన్నారు. ఇవన్నీ విదేశీ కంపెనీలు కావటాన పన్నులు విధించడానికి అమెరికా ప్రభుత్వానికి వీలు లేకుండా పోయింది. అమెరికా ప్రభుత్వానికి టాక్స్ రిటర్న్స్ సమర్పించే అవసరాన్ని యాపిల్ ఆవిధంగా తప్పించుకుంది. “తక్కువ పన్నులు ఉన్న దేశాలకు తన లాభాలను తరలించడంతోనే యాపిల్ సంతృప్తి పడలేదు. పన్ను ఎగవేత అనే పవిత్ర పాత్రను అది కోరుకుని విజయవంతం అయింది. పదుల కొద్దీ బిలియన్ల డాలర్లతో విదేశాలలో కంపెనీలు స్ధాపించడమే కాక ఎక్కడా పన్ను చెల్లించవలసిన నివాసి (tax resident) గా చెప్పుకోకుండా తప్పించుకుంది” అని సెనేటర్ కారల్ లెవిన్ అన్నాడని రష్యా టుడే తెలిపింది. పరిశోధనలపై నియమించబడిన శాశ్వత సబ్ కమిటీకి ఈయన ఛైర్మన్. యాపిల్ కేసును ఈయన నిర్వహిస్తున్నాడు.

ప్రభుత్వ ఆరోపణలకు యాపిల్ సమాధానం వింతగా ఉన్నది. అమెరికా చట్టాలు పురోగామి యుగానికి తగ్గ విధంగా అభివృద్ధి చెందలేదని అందుకే తనను పన్ను ఎగవేతదారుగా భావిస్తున్నారని యాపిల్ వాదిస్తోంది. “ప్రస్తుత  చట్టం డిజిటల్ యుగ ఆవిష్కరణ వేగానికి తగినట్లుగా, వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు తగినట్లుగా మారలేదు” అని యాపిల్ చెప్పుకొచ్చింది.  అంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందేకొద్దీ ఇలాంటి కంపెనీలకు భారీ స్ధాయిలో పన్నులు ఎగవేసే అవకాశాలు ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వకపోతే ఇచ్చే చోటికి వెళ్ళి పన్నుల ఎగవేతను విజయవంతంగా నిర్వహిస్తాయన్నమాట! ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇలా మోసాలను సమర్ధించుకోడానికి కూడా వినియోగించవచ్చన్నమాట.

యాపిల్ కంపెనీ ఇప్పుడు ఏ దేశానికి చెందిన కంపెనీ కాదని, తాను ప్రపంచం అనే ఒక వ్యవస్ధకు చెందిన కంపెనీ అని యాపిల్ అర్ధం కాబోలు. అంటే ఇలాంటి కంపెనీలను నియంత్రించే వ్యవస్ధలు ఏమీ ఉండకూడదిక. అమెరికా ప్రభుత్వం వ్యాపారుల నుండి మరీ ఎక్కువగా (35 శాతం) పన్నులు వసూలు చేస్తోందని కూడా యాపిల్ ఆరోపిస్తోంది. దానివల్లనే తమ నిధులలో ఎక్కువగా విదేశాలలో ఉంచడానికే మొగ్గు చూపుతున్నామని కుండ బద్దలు కొట్టేసింది. అంటే తన తప్పును కంపెనీ పరోక్షంగా అంగీకరిస్తోంది. 2012లో యాపిల్ 6 బిలియన్ డాలర్ల పన్నులు చెల్లించినట్లు తెలుస్తోంది.

అమెరికాకి చెందిన బహుళజాతి కంపెనీలలో పేరుమోసిన కంపెనీలన్నీ ఇలా పన్నులు ఎగవేయడంలో ఆరితేరినవే. గూగుల్, స్టార్ బక్స్, అమెజాన్ లాంటి బడా కంపెనీలు కూడా అమెరికా సెనేట్ నుండి విచారణ ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీల ఉద్దేశ్యంలో వీటికి వచ్చే లాభాలన్నీ వాటి సొంతం. అందులో ఉద్యోగుల పాత్ర ఏమీ లేదు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ఈ కంపెనీల తోనే మొదలయినట్లు అవి ఫోజులు పెడతాయి. ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారపడి అయితే అవి తమ అడుగులు ప్రారంభించాయో వాటిని మర్చిపోయి, ఉన్న అభివృద్ధి అంతా తమదేనని ఇవి భ్రమిస్తూ ఇతరులను కూడా నమ్మమాంటాయి.

రాతి యుగపు ఆదిమానవుడి మొట్టమొదటి రాతి గొడ్డలి. రాతి ఈటె లాంటి పని ముట్లు మానవ సాంకేతిక పరిజ్ఞానానికి మొట్టమొదటి అడుగు. అత్యంత ప్రాధమికమైన, ప్రయాసభరితమైన వారి అనుభవం మానవ సమాజ వికాసానికి మొదటి పెట్టుబడి. అవే లేనట్లయితే తదుపరి అడుగులు పడేవే కాదు. పదుల వేల సంవత్సరాల తరబడి సాగిన అత్యంత కష్టభూయిష్టమైన మానవుడి ప్రయాణం అంతటా నేటి సాంకేతిక పరిజ్ఞానపు పునాదులు విస్తరించి ఉన్నాయి. ఆ పునాదులు లేకుండా నేటి డిజిటల్ యుగం లేదు. మూలాన్ని విస్మరించిన ఆధునిక మనిషి నడమంత్రపు వాదనలకు చిరునామాగా మారడం ఒక పరిహాసభాజనమైన వాస్తవం.

9 thoughts on “రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన యాపిల్!

  1. “అంటే తన తప్పును కంపెనీ పరోక్షంగా అంగీకరిస్తోంది”.

    You mean to say so far US govt does not know about it. Actually, they agreed openly. What can Govt will do? If govt has guts ask them to close that company and face the wrath of tech industry.
    “రాతి యుగపు ఆదిమానవుడి మొట్టమొదటి … నేటి డిజిటల్ యుగం లేదు”
    That is your openion. It does not mean everybody should accept it. Well educated people by working day and night created wealth. You want to distribute money freely to entire humanity? Come on sir.

  2. కొంత మంది సో కాల్డ్‌ మేదావులు తాము సంపాదంచిన జ్ఞానం తాము పుట్టుకతో కొనుక్కొచ్చుకొన్నదని, లేక దేవుడిచ్చిన వరమని తమ జ్ఞానం తోటే ఈ సమాజ సంపద సృష్టించబడుతొందని ఫోజులిస్తుంటారు. స్కూలు, కాలేజిల్లో వారిచ్చే డబ్బుతోటే విజ్ఞానం సృష్టించబడిందని వారి నమ్మకం. వాళ్లు నేర్చుకున్న జ్ఞానం వెనుక ఎంత సామాజిక శ్రమ వుందో ఎన్ని తరాల శ్రమ అనుభవం దాగివుందో తెలియదు పాపం. “రాతియుగం ఆదిమానవుని రాతి పని ముట్టు ఈ నాటి దిజిటల్‌ యుగానికి పునాది” ఇది ఒక అభిప్రాయం కాదు, చారిత్రక వాస్తవం. చారిత్రక జ్ఞాన లేమి ఎంత దుర్మార్గానికి దారితీస్తుందో?

  3. @thirupal,
    When I read your comment, immediatly some of my brahmin frends flashed into my memory. Generally, they will give lot of idealistic suggestions which I do not like.They talk like you, only difference they belivie in God /Hindu culture. You belive in society. But damination/impact of bramhin culture ended before1985. After that we left with only landlard culture/ people daminating politics, and effecting every spehere of life. Their objective was/is making money.

    Comig to the point, we invested lot of effort and money on education, took risk went to overses for higher studies, struggled to get jobs and finally we made some money. You guys argue society is supreme. Knowlege belongs to society . So, we should give money back to society/Govt. Is it fair?

  4. @Nivas,

    So you think your education, employment and money etc… were possible, only because of your courage of risk taking, your ceaseless eforts to go overseas and your penchant for higher studies? Did you read the above link?

    I wonder, whether one should take what you say, as your opinions or universal facts! Forget not, the distance from you and others is equal to that from others to you.

    People may not hesitate to say ‘ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, నేను ఈ దేశానికి ఏమిచ్చాను అనేది ఆలోచించు,’ when such a context arises. One should realise from their innerself how obsurd to ask ‘why should I give my money back to society?’ when it is well known fact that the man is a social being. One should be able to see that each and every part of our life is an inseparable part of societal principle ‘give and take.’

    The point here is that nobody is asking your money when it is your hard earned money. Apple’s profits are not generated by steve jobs or it CEO. It is the consequence of surplus value generated by lakhs of workers toiling in unbearable working conditions of Chinese cheap labour factories. It is already exposed.

    An idea doesn’t gnenerate on it’s own. It is a combined reflection of already developed matrials and scientific ideas, which again the reflections of the previously developed materials and ideas. The journey goes on backwards and it ends at the technological innovation of the primitive ape. So one’s knowledge is a part of sum total of mankind’s knowledge reservoir. It does not belong to any single person or a group. It belongs to mankind or humankind or the human society to which one should be grateful.

    So, Nivas! don’t you bother. You can keep your money with you.

  5. Visekhar garu could you please explain how they will avoid tax by creating paper companies which do not physically exists…if the company does not physically exists where will be economic activity and how they will earn money if they are not physically operating?

  6. Vishal garu..i think u are working in some corporte company…usually in corporate companies when u visit toilets they look very clean and u will feel very happy…and u will comfortably work in office…that toilet cleaner will deserve for more salary than you for doing that odd works for which no body is intrested to do..are you talking abt these people who are struggling just for filling their stomach….

    Can u study with out our country provided a suitable platform for u……Can u study abroad with out our country provided u facilty to travel abroad…..

    Even if we r earning sth it is because of our country only..let u not forget?

    You considered yourself as well educated…if u r well educated u will not talk like this…u know pain in that…u will understand others and help them to come up…….

    wealth…wealth…wealth….what u will do with that….there is no guarentee to our life why are u worrying abt your temporay wealth….try to help others to an extent possible to u…

    Sir please if u dont want to help fellow beings like u let it….but dont talk like this….

  7. సురేష్ గారు, యాపిల్ అమెరికా కంపెనీ. అది పేపర్ కంపెనీలను స్ధాపించింది ఐర్లండ్ లో. అక్కడ కార్పొరేట్ పన్ను 5 శాతం అయితే అమెరికాలో 35 శాతం. యాపిల్ తన లాభాల్ని ఐర్లండ్ కంపెనీలకి వచ్చినట్లు చూపిస్తుంది. తద్వారా అమెరికాలో కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టింది.

    రెండు రోజుల క్రితం యాపిల్ సి.ఇ.ఒ అమెరికా సెనేట్ కమిటీ ముందు హాజరయ్యాడు. అమెరికా పన్నుల వల్లనే తామాపని చేస్తున్నామని అక్కడ ఆయన ఓపెన్ గానే చెప్పాడు. పైగా ఒక హెచ్చరికలాంటిది కూడా చేశాడు. అమెరికా పన్నుల విధానం మార్చుకోకపోతే తాము (గూగుల్ తదితర కంపెనీలను కలుపుకుని) తమ ఎగ్గొట్టే కార్యక్రమం కొనసాగిస్తామని కూడా చెప్పేశాడు. సెనేట్ సభ్యులు నోరు మూసుకుని పడి ఉన్నారు. ఒకరిద్దరు గట్టిగా అడిగినా అది అలంకారప్రాయమే. అంతిమంగా కార్పొరేట్ కంపెనీలదే పై చేయి అవుతుంది.

    అదే మధ్య తరగతి ఉద్యోగులైతే ప్రభుత్వాలు, వాటి విభాగాలు అత్యంత చురుకుగా పని చేస్తాయి. అరెస్టులు చేస్తాయి. జైలు శిక్షలు వేస్తారు. సాధారణ జనం దగ్గర పులులుగా వ్యవహరించే ప్రభుత్వాలు సూపర్ ధనికుల దగ్గర పిల్లుల కంటే అన్యాయంగా ఉంటారు. ఇది అన్ని దేశాల్లో జరిగేదే. ఇండియాలో రిలయన్స్ అదే స్ధాయి పెత్తనం చెలాయిస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s