విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బొనాంజా


FIIsఅయినోడికి ఆకులు, కానోడికి కంచాలు! అదేమంటే జి.డి.పి వృద్ధి కోసం అని సాకులు. ఇదీ మన ప్రభుత్వ విధానం. స్వంతగా ఏడవ లేక పరాయి దేశాల పెట్టుబడిదారులను పిలిచి ‘మా దేశాన్ని అభివృద్ధి చేయండహో’ అని చాటింపు వేస్తున్నారు మన ఆర్ధిక మంత్రి చిదంబరం. ఎఫ్.ఐ.ఐ (విదేశీ సంస్ధాగత పెట్టుబడులు), క్యు.ఎఫ్.ఐ (క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ – అర్హిత విదేశీ పెట్టుబడులు) ల సొంతదారులు ఇప్పుడిక తమ వడ్డీ ఆదాయంపై 20 శాతం పన్ను బదులు 5 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

ఈ ఆఫర్ మే 2015 వరకు వర్తించనున్నది. తమ నిర్ణయం వలన విదేశీ మదుపుదారులు ఉత్సాహం పొంది భారత దేశ స్ధూల దేశీయోత్పత్తిని ఒక్క ఉదుటున అభివృద్ధి చేయడానికి పరుగులు పెడతారని ఆశిస్తున్నట్లు మంత్రివర్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

“విస్తృత ప్రాతిపదికన ప్రోత్సాహకాలు ఇవ్వడానికి, అప్పుల మార్కెట్ లో భారీ విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ పన్నును మినహాయించుకునే లబ్దిని (20 శాతం బదులు 58 శాతం పన్నును మినహాయించుకోవడం) ఎఫ్.ఐ.ఐ, క్యు.ఎఫ్.ఐ లకు ఇవ్వడానికి నిర్ణయించాము. భారత కంపెనీలు జారీ చేసే బాండ్లలో, ప్రభుత్వం జారీ చేసే సెక్యూరిటీలలో మదుపు చేసే పెట్టుబడుల వడ్డీ ఆదాయాలకు ఇది వర్తిస్తుంది” అని ఆర్ధిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే మరేమీ లేదు. ప్రభుత్వం జారీ చేసే బాండ్లనే ప్రభుత్వ సెక్యూరిటీలు అంటారు. సావరిన్ డెట్ బాండ్లు కూడా వీటిలో భాగం. మదుపరుల నుండి సావరిన్ డెట్ బాండ్ల రూపంలో ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. నిర్దిష్ట కాలానికి గాను, నిర్దిష్ట ఆదాయాన్ని గ్యారంటీ చేస్తూ జారీ చేసే ఈ బాండ్లు ప్రమాదం లేనివిగా ఫైనాన్స్ పెట్టుబడిదారులు పరిగణిస్తారు. ప్రభుత్వంతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు కూడా ఈ అప్పు పత్రాలను జారీ చేయవచ్చు. ఉదాహరణకి కొన్ని సంవత్సరాలుగా మౌలిక నిర్మాణాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు’ జారీ చేస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వ సెక్యూరిటీలే.

విదేశీ కరెన్సీలలో అప్పులు తీసుకుంటే అది విదేశీ అప్పు అంటారు. స్వదేశీ మదుపరుల నుండి రూపాయల్లో రుణాలు సేకరిస్తే అది స్వదేశీ అప్పుగా పరిగణిస్తారు. విదేశీ మారక ద్రవ్యం విలువ ఎక్కువ గనుక ప్రభుత్వానికి స్వదేశీ రుణాల సేకరణే సేఫ్. కానీ విదేశీ పెట్టుబడులకు ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏకంగా 75 శాతం పన్ను తగ్గించేసింది.

ఎప్పుడు మదుపు చేశారు అన్నదానితో సంబంధం లేకుండా ఎఫ్.ఐ.ఐ, క్యు.ఎఫ్.ఐ ల పైన జూన్ 2013, మే 2015 ల మధ్య సమకూరే వడ్డీ ఆదాయాలపైన ఈ లబ్ది అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అంటే గతంలో జారీ చేసిన సెక్యూరిటీల ఆదాయం పైన కూడా 20 శాతం బదులు 5 శాతం పన్ను చేల్లిస్తే  చాలు. ఈ విధానం వలన విదేశీ పెట్టుబడిదారులకు లాభమే గాని ప్రభుత్వానికి లాభం ఎలా ఉంటుంది? కొత్త పెట్టుబడులను ప్రోత్సహించే పేరుతో పన్ను రాయితీ ఇవ్వడం ఒక విషయం. ఇప్పటికే మదుపు చేసిన మొత్తం పైన అదనపు పన్ను రాయితీ ఇస్తున్నారంటే ఉన్న పెట్టుబడులను పెద్ద ఎత్తున ఉపసంహరిస్తున్నారన్నమాట! ఈ ఉపసంహరణ ఆపడానికి ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించింది.

భారత ప్రజలకు ఆదాయ పన్ను రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం ఎంత నీలుగుతుందో చెప్పలేము. మొన్న బడ్జెట్ లో ఈ నీల్గుడు తారస్ధాయికి చేరింది. బడ్జెట్ ప్రకటించాక ఆర్ధిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ ఆదాయ పన్ను విషయంలో ఒక్క చిన్న మార్పు చేసినా భారీ ఎత్తున పన్ను పునాది నష్టపోతామని చెప్పారు. అంటే ఒక్క శాతం కూడా రాయితీ ఇచ్చేది లేదని చెప్పేశారాయన.

ఇవే ప్రభుత్వాలు ప్రైవేటు కంపెనీలకు, సూపర్ ధనికులకు దాదాపు 6 లక్షల కోట్ల పై చిలుకు రాయితీలు మంచి నీళ్ళ ప్రాయంలా ఇచ్చేసాయి. ప్రైవేటు కంపెనీలలో అత్యధికం విదేశీ కంపెనీలే ఉన్నాయి. స్వదేశీ పేర్లతో ఉండే కంపెనీల్లో కూడా విదేశీ కంపెనీల వాటాలు ఉన్నాయి. బహిరంగ వాటాలు లేని చోట సైతం వివిధ ముసుగుల్లో విదేశీ పెట్టుబడులు దాగి ఉంటాయి. అంటే ఈ 6 లక్షల కోట్ల పై చిలుకు పన్ను రాయితీ లబ్దిదారుల్లో సైతం విదేశీ కంపెనీలు ఉన్నారు. ఇది చాలక ఇప్పుడు అప్పు పత్రాలపై ఆదాయాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడడం అంటే భారత ప్రభుత్వం ఎవరిని ఎవరి కోసం పాలిస్తున్నట్లు?

ఇంతా చేసి ఎఫ్.ఐ.ఐ లను నమ్మొచ్చా అంటే అదేమీ లేదు. ఎఫ్.ఐ.ఐ లను మించిన అస్ధిర పెట్టుబడులు మరొకటి లేవని పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు సైతం చేప్పే మాట. వివిధ దేశాల్లో సంక్షోభాలు కలుగ చేయగల సామర్ధ్యం వీటి సొంతం 1995 ల నాటి ఆసియా టైగర్ల ఆర్ధిక సంక్షోభం ఎఫ్.ఐ.ఐ ల పుణ్యమే. తక్షణ లాభాల కోసం ప్రపంచ దేశాల అప్పు మార్కెట్ల వెంబడి నిరంతరం పరుగులు పెట్టే ఎఫ్.ఐ.ఐలు ఎప్పుడు దేశం విడిచి పోతాయో చెప్పలేరు. స్టాక్ మార్కెట్లను దఢాలున కూలదోస్తూ మరిన్ని రాయితీలు ఇచ్చే చోటికి, లాభాలు వచ్చే చోటికి ఇవి చెప్పా పెట్టకుండా వెళ్లిపోతాయి. అలా వెళ్ళిపోతాయనే పాత పెట్టుబడులకు కూడా రాయితీలు ప్రకటించింది ప్రభుత్వం. ఎఫ్.ఐ.ఐల సామర్ధ్యం ఏపాటిదో అక్కడే తెలిసిపోతోంది.

7 thoughts on “విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బొనాంజా

 1. Visekhar garu,you analysed very nicely…but our cuurent account deficit is balloning up like anything ,to fill in that we need more foriegn reserves…if u feel what the gov is doing are not the right ways to attract foreign reserves ,can we please mention what other ways can gov choose in order to attarct foriegn reserves

 2. ప్రేమ్ గారు, సి.ఎ.డి పెరగడానికి కారణాలు మీ దృష్టిలో ఉన్నవి ఏమిటి? ఈ అవగాహన పైన ఆధారపడి పరిష్కారాలు ఎవరికి తోచినవి వారు చెబుతుంటారు. ఈ చెప్పడం అనేది ఆయా వ్యక్తులు ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నదానిపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.

  దేశ ఆర్ధిక వ్యవస్ధకు మూలం ప్రజలూ, వారి ఆదాయాలు. ఆదాయం అంటే కొనుగోలు శక్తి. ప్రజల దగ్గర ఇది దండిగా ఉంటే సి.ఎ.డి లాంటివి దరిచేరవు. ముందు స్వదేశీ మార్కెట్ ను అభివృద్ధి చేయాలి. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు దీనిపైన కేంద్రీకరిస్తే అమ్మకాలు పెరుగుతాయి. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. అంటే జి.డి.పి వృద్ధి చెందుతుంది.

  అదే సమయంలో శాస్త్ర, సాంకేతిక పరిశోధన, విద్యా రంగాలకు తగిన నిధులు కేటాయిస్తే ఆ రంగాలలో జరిగే అభివృద్ధి ఎగుమతుల మార్కెట్ వృద్ధి కావడానికి దోహదపడుతుంది. ఇది క్రమంగా వాణిజ్య లోటును తగ్గిస్తుంది.

  ఎగుమతులు పెంచుకోవడానికి విదేశాంగ విధానం కూడా కీలకమైనదే. రాజకీయ రంగంలో సమాన ఒప్పందాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తే ఆర్ధిక రంగంలో వాణిజ్య లోటు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి అమెరికా, ఐరోపాలు అసమాన ఒప్పందాలకు పెట్టింది పేరు. అవి ఆదేశిస్తాయి; మనం అమలు చేయాలి అన్నట్లు ఉంటుంది. ఆ దేశాలు బలవంతంగా అసమాన ఒప్పందాలను మూడో ప్రపంచ దేశాలపై రుద్దుతాయి. వాటి బదులు లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు ప్రాధాన్యం ఇస్తే వాణిజ్య లోటుకి అస్కారం తక్కువ. లోటు తగ్గితే సి.ఎ.డి తగ్గుతుంది.

  పాలకులు దేశ రాజకీయ, ఆర్ధిక సార్వభౌమత్వాన్ని కాపాడడంలో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే ప్రజలకు అంతకు మించిన మేలు ఉండదు. కాని భారత పాలకులవన్నీ లొంగుబాటు విధానాలు. అమెరికా ఒత్తిడితో ఇరాన్ బదులు సౌదీ చమురు దిగుమతి చేసుకుంటూ చమురు ఖర్చు పెంచుతున్నారు. ఆ భారం ప్రజలపై మోపి వారి కొనుగోలు శక్తిలో మరింత కోత పెడుతున్నారు. బహుళజాతి కంపెనీల మెప్పు కోసం మన మార్కెట్లను విదేశీ కంపెనీల పరం చేస్తున్నారు.

  విదేశీ మారక ద్రవ్య నిల్వలు వాటంతట అవే అస్సెట్ కావు. అవి ఒంటరిగా ఉనికిలో ఉండేవి కూడా కావు. దేశ ఆర్ధిక వ్యవస్ధ లక్షణాల్లో అది ఒకటి మాత్రమే. శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధను, దేశీయ మార్కెట్ ను అభివృద్ధి చేస్తే దిగుమతులతో అవసరం తగ్గి, ఎగుమతులు పెరుగుతాయి. దేశీయంగా సంపదల, ఆదాయాల సమాన పంపిణీకి కూడా ప్రభుత్వాలు పూనుకోవాలి. అది ఆర్ధిక వ్యవస్ధను శక్తివంతం చేస్తుంది.

  ఈ చర్యలన్నీ అంకెల గారడీతో సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్ల కంప్యూటర్ ముందు కూర్చొని ఆ లెక్కల ఆధారంగా వాణిజ్య విధానాలు రూపొందిస్తే ఆర్ధిక వ్యవస్ధ కూడా అలాగే తగలడుతుంది. పాలకులకు నిబద్ధత ఉండాలి. ప్రజలతో సాపత్యం ఉండాలి. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు శ్రమ చేయాలి. శ్రమకు గౌరవం పెంచాలి. ఇవన్నీ మన అవినీతి నాయకులు చేయగలరా? విదేశీ పెట్టుబడులకు వారే సేవకులుగా ఉన్నపుడు ఇక విదేశీ పెట్టుబడులకు ఏది మంచయితే దేశానికి కూడా అదే మంచిగా మారుతుంది.

 3. Hi visekhar garu,yes consumer dependent (consumer spending) economy will help in maintaing efficiecnt and sustainable economy,but it cannot happen in a day or an year,it will be a gradual process.purchasing power parity can be increased by creating more and more jobs and people get the income what they actually deserve no doubt in that.Gov alone cannot do all these things even private also need to step in to create more employment opportunities,be it a domestic industries or foreign investors.For the private to come and invest we need to provide some incentives other wise why they will do business.

  Even if we devolop our education system and provide adequate skills to them but if we are not able to provide them employment where will be the money in the hands of public to spend…Both public welfare and encouraging private people should go hand in hand.

  Your solution of devoloping our science and techonoly and education will help in longterm to solve our current problems…what can we do in shortterm to overcome our problems.

  Our foreign policy is mainly based on our nations intrests as a whole by not looking only into present but also future.To get something we should leave something.For india US is strategically very imp than iran to maintain our energy security(we had 123 agreement with US),also 14% of amercian population are indians…US being a big brother devoloping rivarly with them is not good.If we devolop rivarly with US it may side with pakisthan and will create problems,they are so many like this…

  India is not blessed with much petroleum reserves definitely we should depend on imports which is much adding to our current account deficit along with gold…

  There is other side of coin for consumer dependant economy…public instead of spending their income for productive actvities if they spend for unproductive activities like purchasing gold,putting in real estate what will happen…?will be bad to economy

 4. Hi Prem

  That’s why I said that the solutions would depend on how we look at problems.

  What you suggest is, what the rich are already telling. It’s everywhere in the world. This scheme of thought and application has been prevalent for centuries. But why the problems are resurfacing repeatedly over centuries? That itself is the evidence that it is not the correct solution.

  Of course, What I wrote is a long term solution. But is there any sign that ruling people will start at least now to implement such policies? Not even an iota! It is the interests of the ruling classes that are always at the play. My suggestion is, whether it is possible immediately or later or even decades later, that the ruling classes should be overthrown and the great toiling masses should take up their own reins. How it is possible, is a matter of discussion.

 5. Sir, I read all the above discussions. It is a good discussion. Ultimately what gov wants is CAD be controlled. Peolpes spending power only can solve this.For that prices have to come down.Puchasing power to increased by reducing unemployement. This can be achieved only when gov works sicerely. Otherwise if we encourage FIIs involvement, once agin our country will goes in the hands offoreign domination. We INDIANS, must be watchfull.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s