అవినీతిని సహించరట! -కార్టూన్


The Hindu

The Hindu

“వాళ్ళ అవినీతి కుంభకోణాల్లో ఎన్ని సున్నాలున్నా మనం భరిస్తున్నామనేనా దానర్ధం?”

“అవినీతిని ఇక ఎంత మాత్రం సహించేది లేదు” ఇది మన మంత్రులు, ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి, రాజ్యాంగేతర శక్తులు తరచుగా చేసే హెచ్చరిక. ఈ హెచ్చరికలో ఎంత బోలుతనం, ఎంత పరిహాసం, ఇంకెంత కపటం, మరెంత నమ్మక ద్రోహం ఉన్నదో ఆ చెప్పేవాడికీ, విని రాసుకుని పత్రికల్లో నివేదించేవారికీ, చదివేవారికీ… అందరికీ తెలుసు.

అయినా సరే,

అలవాటు పడిపోయాం మనమంతా!

నీరసపడిపోయారు ఉద్యమ వీరులు.

దిగమింగుకుంటున్నారు అశేష శ్రామిక జనం.

ప్రత్యామ్నాయం లేదంటున్నారు మేతావులు.

కెరీర్ ఎట్లా అంటున్నారు విద్యార్ధి యువతరం.

గొంగట్లో వెంట్రుకలేరుదాం అంటున్నారు ఎర్ర జెండా ఓట్ల వీరులు.

కత్తుల వంతెనపై నెత్తుటి రహదార్లు నిర్మిస్తాం అన్నవారు

అభివృద్ధి ఫలాలు కోసుకోవడానికి బయలుదేరుతున్నారు.  

అలవాటు పడిపోయాం మనమంతా!

6 thoughts on “అవినీతిని సహించరట! -కార్టూన్

 1. మనదీ ఒక బ్రతుకేనా…మనదీ ఒక బ్రతుకేనా…?
  కుక్కలవలె….నక్కల వలె…………………….

 2. Sir visekhar garu,mee analysis only criticsm base chesukone undi,meeru cheppedi correcte e kadanadam ledu.me analysis only criticsm mede focus cheyakunda both pros and cons discuss chesi dani tarvatha denikentha weightage discuss cheste baguntundani naa abipryam.

 3. రాకేష్ గారు, ఈ బ్లాగ్ ప్రజల దృక్పధం నుండి రాస్తున్న బ్లాగ్. దేశంలో సకల ఉత్పత్తులకు (సంపదలకు) కారణమైన సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉన్నవి దేశంలో చాలా తక్కువ. అందుకే వాస్తవాలు విశ్లేషించినపుడు విమర్శ అనివార్యంగా ఎక్కువగా కనిపిస్తుంది.

  మీక్కావలసిన pros & cons విశ్లేషణ ఇంకెక్కడయినా దొరుకుతుందేమో ప్రయత్నించండి. ఇది ఆ టైపు బ్లాగ్ కాదు. ప్రజల కోణం నుండి వివిధ అంశాలను చర్చించడమే ఇక్కడ ఉద్దేశ్యం. ప్రభుత్వాలు, పాలకులు, ధనికులు లాంటి వారిలో మంచి కనపడుతుందేమో చూద్దాం అని వెతికే బ్లాగ్ కాదిది.

 4. Sir bagane chepparu….prajala drukpadam nundi rastunna blog antunaru…meeremaina vallatho matladi rasthunara….meeremi palakulni pogadakar ledu…vallu introduce chese policies like national rural health mission,national urban health mission,janani sisu suraksha yojana lanti policies nunchi peda prajalu ee vidanga benefit pondavacho chebithe may be ee blog chadivevaru evaraina naluguriki cheppachu…peda prajalu chala mandi veetigurinchi teliyaka use chesukoleka pothunaru…adi vidanga emaina unte help cheyandi…anthe gani meeremi pogadakarledu…chala chotla mee reply comments observe chesa konchem helana chestunatlu untai…paddati marchukondi sir…evarina comments isthe valla inputs nachakapothe sunnithanga tiraskarichandi

 5. సురేష్ గారు, బ్లాగుల్లో వివిధ ధోరణులు చాలా ఉన్నాయి. తమకు నచ్చని విషయాలను రాసేవారిని బెదిరించి బ్లాగ్ మూసేయించే వారు ఉన్నారు. వారికి ఎలా సమాధానం ఇవ్వాలో అలానే ఇచ్చాను. అలాంటి వారికి నా సమాధానాలు ఇక ముందు కూడా అలాగే ఉంటాయి. అందులో సందేహం లేదు. మీరు కొత్తవారేమో తెలియదు గానీ, పాతవారైతే ఆ విషయాలు మీకు తెలిసి ఉండాలి.

  రాకేష్ గారికి సున్నితంగానే సమాధానం ఇచ్చాను కదా? హేళన ఎక్కడుంది? ఒక బ్లాగ్ లో ఏ విషయాలు రాయాలి, ఏ విధంగా రాయాలి అన్నవి నిర్వాహకులు నిర్ణయించుకునే విషయాలు. విజిటర్లు తమ అవసరాన్ని బట్టి ఏ బ్లాగ్ కి వెళ్ళాలో నిర్ణయించుకుంటారు. అదే నేను పైన చెప్పాను. మీకు కూడా ఆ సమాధానం వర్తిస్తుంది. ప్రభుత్వ పధకాల నుండి ఎలా లబ్ది పొందవచ్చో చెప్పేవారు వేరే ఉన్నారు. వాటికి నా బ్లాగ్ వేదిక కాదు.

  కొన్ని విషయాలు సూటిగానే చెబితేనే ఉపయోగం. నా బ్లాగ్ నిర్వహణ అందులో ఒకటి. చదివే వాళ్ళలో వివిధ అభిప్రాయాలు, దృక్పధాలు కలవారు ఉంటారు. వారందరినీ సంతృప్తి పరచడం ఏ బ్లాగర్ కీ సాధ్యం కాదు. మీరీరోజు పధకాల గురించి రాయమన్నారు. రేపు మరొక విజిటర్ ‘ఫలానా ప్లేస్ లో ఆధార్ కార్డ్ జారీ ఎంతవరకు వచ్చిందో వివరాలు ఇవ్వచ్చు గదా, చాలా ఇబ్బందిగా ఉంది. ఇస్తే చాలా ఉపయోగం’ అనొచ్చు. ఇంకొకరు ఇంకొకటి అడగొచ్చు.

  ఎవరికి ఆసక్తి ఉన్న విషయాల కోసం వారికి తగిన బ్లాగ్ లను, వెబ్ సైట్లను వెతుక్కోవడమే సందర్శకులు చేయగలరు. అలా కాకుండా నిర్వాహకులను ‘అది అలా ఎందుకు రాశారు, ఇది ఇలా రాయండి’ అని చెప్పడం వల ఫలితం ఉండకపోవచ్చు. ఏ బ్లాగ్ కైనా ఇది వర్తిస్తుంది.

  మీరు సూచించిన అంశాలు ఈ బ్లాగ్ పరిధిలోనివి కావు. రాకేష్ గారు సూచించిన pros & cons అనేవి ఒకరి దృక్పధానికి సంబంధించినవి. నిజానికి నేనాపని చేస్తున్నాను. కానీ తన దృక్పధానికి అవి సరిపోలేదు. అందువలన ఆ సూచన చేశారు. కనుకనే విషయాన్ని సూటిగా వివరించాను. అందులో హేళననే మీరు చూశారు తప్ప విషయాన్ని చూడలేకపోయారు. హేళన చేయాలన్న ఆలోచనే నాకు లేదు, విషయం చెప్పాలన్న ఆలోచన తప్ప. నమ్మకపోతే మీ ఇష్టం.

  నా బ్లాగ్ ని గమనించినవారు ఎవరైనా మీరు కోరినట్లు ప్రభుత్వ పధకాల గురించి రాయండి అని కోరగలరని నాకు ఊహకు అందని విషయం.

  ఏ బ్లాగ్ కైనా కొన్ని పరిధులు ఉంటాయి. అవి ఆ బ్లాగ్ నిర్వాహకుల సమయం, శక్తి, ఆసక్తి పైన ఆధారపడి ఉంటాయి. ఈ బ్లాగ్ కి కూడా అలాంటివి ఉన్నాయి. ఇపుడు మీరు చెప్పినట్లు హేళన చేస్తే అలాంటివి ఎత్తి చూపచ్చు. కానీ ఏది రాయాలి అనేది మాత్రం నిర్వాహకునికే వదిలేయాలి.

  ఇంతకీ సున్నితంగా రాశానా? .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s