సి.బి.ఐ అటానమీ -కార్టూన్


CBI autonomyబొగ్గు కుంభకోణం దర్యాప్తు నేపధ్యంలో సి.బి.ఐ కి స్వయం ప్రతిపత్తి గ్యారంటీ చేసేలా చట్టం చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బొగ్గు కుంభకోణం విషయమై జులైలో తదుపరి హియరింగ్ జరగనుంది. ఆ లోపు చట్టాన్ని తెస్తే తాము సంతోషిస్తామని సుప్రీం కోర్టు అటార్నీ జనరల్/ కేంద్ర ప్రభుత్వం ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.

“పంజరంలో చిలక” లాగా మారిన సి.బి.ఐ తమ యజమాని ఏమి చెప్పమంటే అదే చెబుతోందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఒకే ఒక్క “పంజరం చిలక” ఉండగా దానిని అనేకమంది యాజమానుల ఉండడం ఇప్పటి క్షుద్ర గాధ అని కూడా సుప్రీం చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ నసాళానికి అంటాయో లేదో గాని కాస్త పత్రికలు చదివే అలవాటున్న ప్రతి ఒక్కరికీ అంటాయి.

చట్టం చెయ్యడానికి పార్లమెంటు సమావేశాలు జరిగేదాకా ఆగనవసరం లేదని, పార్లమెంటు సమావేశాలు జరగకపోయినా చేయదలుచుకున్న చట్టం చెయ్యడానికి అనేక అవకాశాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని కూడా సుప్రీం వ్యాఖ్యానించింది. అంటే ఆర్డినెన్స్ ద్వారానైనా సి.బి.ఐ అటానమీ గ్యారంటీ చేస్తూ చట్టం చేయాలని సుప్రీం కాంక్షిస్తోంది.

ఈ నేపధ్యంలో సి.బి.ఐ స్వయం ప్రతిపత్తి కోసం అంటూ కేంద్ర ప్రభుత్వం ‘మంత్రుల సమూహం’ (గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్) ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమూహంలో ఉన్నది అధికార పార్టీ మంత్రులే గనక సి.బి.ఐ అటానమీ దిశలో పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని ప్రతిపక్ష బి.జె.పి ఇప్పటికే విమర్శించింది. సి.బి.ఐ అటానమీకి చట్టం చేసే నైతిక హక్కు యు.పి.ఏ ప్రభుత్వానికి లేదని బి.జె.పి వాదన.

అయితే ఇక సుప్రీం కోరినట్లు చట్టం చేయడం మానుకోవాలా? సి.బి.ఐ అటానమీకి ఏమి చేస్తే బాగుంటుందో బి.జె.పి వివరించకపోవడం బట్టి దాని ఉద్దేశాలపై అనుమానం కలుగుతోంది. చట్టం చేసే హక్కు యు.పి.ఏ కి లేకపోతే ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చేదాకా ఆగాలని బి.జె.పి ఉద్దేశ్యామా? మేము అధికారంలోకి వచ్చే వరకూ ఆగాలని బి.జె.పి నాయకులు సుప్రీం కోర్టుకు చెప్పగలరా?

ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చాకయినా మంత్రులు, పార్లమెంటు సభ్యులే కదా చట్టం చేయాల్సింది? బి.జె.పి తదితర ఎన్.డి.ఏ పక్షాలు వివిధ రాష్ట్రాల్లో ఎంత నీతితో పాలిస్తున్నాయని వాటికి సి.బి.ఐ అటానమీ చట్టం చేసే హక్కు ఉంటుంది? పార్లమెంటు గొంగట్లో ఎన్ని అవినీతి వెంట్రుకలు ఏరితే అది అన్నం తినగలిగేటంత శుభ్రం కావాలి? కాంగ్రెస్ కి ఆ నైతిక హక్కు లేదన్న విమర్శ నిజమే కావచ్చు. కానీ బి.జె.పి కి కూడా ఆ నైతికి హక్కు లేదని దాని ఐదేళ్ల కేంద్ర పాలన, వివిధ రాష్ట్రాల్లోని దాని పాలన ఇప్పటికే స్పష్టం చేశాయి. నైతిక హక్కు లాంటి వాటి గురించి బి.జె.పి నాయకులు మాట్లాడకుంటేనే మేలు కాదా?

కార్టూనిస్టు సూచిస్తున్నట్లు చట్టం చేశాక కూడా సి.బి.ఐ ప్రభుత్వాధినేతల కనుసన్నల్లో ఉంటుందని చెప్పేందుకు ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. కాకపోతే అది కాంగ్రెస్ పాలనలో ఎంత నిజమో, బి.జె.పి పాలనలోనూ అంతే నిజం. బహిరంగంగా కనిపించే నియంత్రణ బదులు రహస్య నియంత్రణలు అమలవుతాయి. ఇప్పటికీ, ఎప్పటికీ సి.బి.ఐ నుండి రిటైరయ్యే అధికారులకు మళ్ళీ ప్రభుత్వమే విశ్రాంత పదవులిచ్చి సత్కరించాలి. అవినీతిని తవ్వి తోడినందుకు మెచ్చి మెడల్స్ ఇచ్చే పుణ్య పురుషులేవ్వరూ ఉండబోరు.

జనమే పూనుకుని నిజమైన అర్ధంలో అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారం ఉండబోదు. పిల్లి మెడలో గంట కట్టేవారు ఇప్పుడు కావాలి.

8 thoughts on “సి.బి.ఐ అటానమీ -కార్టూన్

 1. Visekhar,Power to make laws lies in the hands of parliamnet especially the governement in rule.Supreme court can just give guidelines and it cannot make any laws.Does the gov have any obligation to compulsarily follow the guidelines of supremecourt?If gov cannot follow the guidelines of supreme court what action it can take on gov?Can u please clarify me on this point?

 2. Parliament can do any thing to thier favour. say it is their emoluments or any thing of that sort. Here ther is no doubt that they(including BJP) wont make any changes in the CBI’s stature. Suprem Court can do nothing but wait as an audience.

 3. Hi Prem & Rakesh

  I’m facing power problems here. My inverter stopped working properly. I’m giving this reply from my laptop. It took time to connect my laptop to internet due to my new modem’s security code.(I preserved that security code somewher and forgot where I kept it. This is normal to me.) That’s why I could not respond within your time.

  Please note that I’m having my own time and both of our times may not coincide. Both of us may have to wait for eachother’s reponse. It happens so on the net.

  Coming to your question, it is said that our constitution gave equal powers to three pillars of our democracy, namely Judiciary (interpret laws), legislature (make laws), executive (enforce laws). These three may look different but they are three arms of the same body which does same work of the body: to rule the country according to the wishes of their masters. Their masters are what I generally say, the super rich.

  There is no clearcut obligation for the legislature to strictly follow the guidlines of the judiciary. If both of their interests are to be served they have to compromise somewhere. Otherwise they will be looked down by the people which they don’t want. What we see as a clash is simply a drama of sorts. It is an exercise to show that the so called democracy is working and people need not bother.

  Regarding Supreme Court’s directive to make a law to free CBI from the clutches of the legislature, the CBI itself is a part of the executive. Though the executive is given equal power, it serves the interests of legislature as it is dependent on legislature. The govt., tries to show that they are following SC’s direction, but, as Arun Jaitley already said, it will be a show. The same is true even if BJP is in power.

  The question of CBI’s autonomy is not absolute one. It is always dependent on legislature. There will always be room for manipulation of CBI, even if it is proscribed independent and autonomous. This question has to be put into perspective. Otherwise you can’t get fact of the point.

 4. Sorry Visekahar garu,when you are posting some other posts like mineral resources in arctic region and all i felt you are not responding to our comments.please regret me for the incovinience caused to you.Really your blog is making tremendous work in informing current happenings arround us in a simplistic manner.you are doing a great work sir…keep continuing…

 5. Hi Prem, no hard feelings.

  There were minimum (power) resources available to me to update my blog. So, I used it that way. As we don’t know exactly what’s happening on the other side we may need some patience to communicate on the internet. I hope other visitors also get this point.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s