బేంక్సీ అంత కాకపోయినా ఆ తరహాలో చిత్రకళను అభ్యసిస్తున్న వీధి చిత్రకారుల్లో మొగుల్ ఒకరు. స్వీడ దేశస్ధుడయిన మొగుల్ గీసిన ఈ వీధి చిత్రం స్టాక్ హోం నగరంలొని ఒక గోడ మీద గీసినది. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందని మనకు తెలిసిన సామెత. రాజకీయ నాయకులు అబద్ధాని నిజం చేసే కళను తమ వ్రుత్తిగా స్వీకరించారని మొగుల్ వీధి చిత్రం సూచిస్తోంది. అదెంత నిజమో ఎల్లరకు తెలిసిందే కదా.
నాలుగుకోట్ల కుతుంబాలకు ఉపాధి కల్పించే చిల్లరవర్తకంలో విదేశీ పెట్టుబడులు అనుమతిస్తే దేశీయ చిల్లరవర్తకులకు ముప్పేమీ లేదని ప్రధాని దగ్గర్నుండి ఎమ్మెల్యేల వరకూ చిలక పలకులు వల్లించినా,
బొగ్గు కుంభకోణం పురోగతి నివేదికను సుప్రీం కోర్టుకి చూపడం కంటే ముందు మంత్రులు, అధికారులు చూసినా ‘అబ్బే, మేము చూడలేదు’ అని (మాజీ) న్యాయమంత్రి అశ్వినీ కుమార్ చెప్పినా…
కాసులు కురిపించే సభ్యత్వ పదవి ఇప్పిస్తాననని తన మేనల్లుడే పది కోట్లు లంచం పుచ్చుకున్నా దానితో తనకు సంబంధం లేదని (మాజీ) రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ నమ్మబలికినా…
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు కారణం బి.జె.పి అవినీతి కాదు, రాహుల్ గాంధి ప్రచారమే అని నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించినా…
విద్యుత్ ఛార్జీల పెరుగుదల వలన ప్రజలపై భారం పడబోదని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించినా…
విదేశీ కంపెనీల కోసం కాదు, దేశీయ ఇన్సూరెన్స్ రంగం అభివృద్ధి కోసమే భీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచుతున్నాం అని ఆర్ధికమంత్రి పి.చిదంబరం ప్రకటిస్తున్నా…
అవన్నీ రాజకీయ క్రీడలో భాగం గానీ, realpolitik గానీ అవుతాయి తప్ప అబద్ధాలు కావు!
(ప్రఖ్యాత వీధి చిత్రకారుడు బ్యాంక్సి గురించి తెలియనివారు ఈ లంకెపై క్లిక్ చేసి చూడగలరు. ఇక్కడ మరియు ఇక్కడ కూడా. ఆసక్తి ఉంటే ఇక్కడ కూడా చూడండి.)