ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్పణం ఈ ఫోటో


Stop apartheid

Click to enlarge

ఆ కనిపించే గోడ ఇజ్రాయెల్ తన ప్రాంతాల చుట్టూ నిర్మించిన కట్టడం. కోట కోడను తలపించే ఇలాంటి ఎత్తైన గోడలు ఇజ్రాయెల్ నిండా దర్శనమిస్తాయి. అవి ఇజ్రాయేలీయులు (యూదులు), పాలస్తీనీయులు నివసించే ప్రాంతాలను వేరు చేస్తాయి.

పనులకు వచ్చే పాలస్తీనీయులను శల్య పరీక్ష చేయడానికి కూడా చెక్ పోస్టుల వద్ద ఇలాంటి ఎత్తైన గోడలను ఇజ్రాయెల్ నిర్మించింది. ఇలాంటి చెక్ పోస్టుల వద్ద ‘క్యూ’లలో ఇజ్రాయెల్ సైనికుల చేత నఖశిఖ పర్యంతం చెకింగ్ అయ్యాకనే పాలస్తీనీయులకు ఆ రోజు పని మొదలవుతుంది.

ఫోటోలో కనిపిస్తున్న దృశ్యం బెత్లెహామ్ చెక్ పోస్టు వద్ద జెరూసలేము నగరంలోపలికి ప్రవేశించడానికి చాంతాడుతో కూడా పోల్చలేని పొడవైన ‘క్యూ’లో పాలస్తీనీయులు ఎదురు చూస్తున్నప్పటిది. జెరూసలేం లోకి ప్రవేశించడానికి పాలస్తీనీయులు తెల్లవారు ఝాము 5 గంటల నుండి ఇక్కడ ఎదురు చూస్తారు.

బ్లేక్ డన్లప్ అనే ఫోటోగ్రాఫర్ ఈ ఫోటో తీయగా యాక్టివ్ స్టిల్స్ అనే వెబ్ సైట్ మొట్టమొదట ప్రచురించింది. అమెరికా పాలకవర్గాల తరపున పనిచేసే ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ గానీ, బ్రిటన్ పాలకవర్గాల కోసం పని చేసే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్ధకి గానీ ఇలాంటి అమానవీయ జాత్యహంకార పాలనలు పట్టవు. వారి దృష్టిలో పాలస్తీనీయులకు మానవ హక్కులు ఉండవు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా, ఐరోపాల సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేర్చె నమ్మకమైన బంటు.

ఈ ఫోటో 2006 నాటిది. ఇప్పటికీ అక్కడి పరిస్ధితి ఇదే.

One thought on “ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్పణం ఈ ఫోటో

  1. palastinula samasya lu kanipinchani usa, eu lu afgan lo praja hakulu kapadadani ki

    krushi chestunatlunaru !!!!. migata vari ki budda tanaku sidda anta edana mo………..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s