ప్రపంచం నలుమూలలకి ఫ్యాషన్ దుస్తుల్ని అందించే బంగ్లాదేశ్ బట్టల ఫ్యాక్టరీ కార్మికుడి వేతనం నెలకి 38 డాలర్లు. అంటే దాదాపు 2 వేల రూపాయలు. దుస్తుల తయారీకి వినియోగించే శ్రమలో అతి కొద్ది భాగం మాత్రమే దాని సొంతదారుకు దక్కగా మిగిలినదంతా ఫ్యాక్టరీ ఓనరు, ఆ ఫ్యాక్టరీ నడిచే భవనం ఓనరు. తయారైన దుస్తుల్ని అద్దాల ఎ.సి గదుల్లో పెట్టి అమ్మే ఫ్యాషన్ దుకాణం ఓనరు, వీళ్ళకు ఫైనాన్స్ అందించే వడ్డీ వ్యాపారి…. ఇలాంటివారంతా పంచుకు తింటున్నారు. పంచుకు తింటున్నది బిలియన్ల డాలర్లలో ఉంటే అసలు సొంతదారుకు మాత్రం పదుల డాలర్లు మాత్రమే దక్కుతున్నాయి. ‘అదనపు విలువ’ లాంటిదేమీ ఉండదని కూసేదెవ్వరు?
ఢాకా శివార్లలో బట్టల ఫ్యాక్టరీలు నడుస్తున్న భవనం కూలిన దుర్ఘటనలో మరణాల సంఖ్య 804కు చేరుకుందని గంటన్నర క్రితం బి.బి.సి తెలిపింది. ఏప్రిల్ 24 తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో భావన శిధిలాలను ఇంకా పూర్తిగా తొలగించలేదు. కనుక మరిన్ని మరణాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. రెండు వారాల తర్వాత వెలికి తీస్తున్న శవాలు ఎంతగా కుళ్లిపోయాయంటే వారిని గుర్తించడానికి డి.ఎన్.ఎ పరీక్షలు జరుపుతున్నారు. ఈ ప్రమాదం జరిగాక బంగ్లాదేశ్ ప్రభుత్వం 18 బట్టల ఫ్యాక్టరీలను ఇప్పటివరకు మూసివేసింది. సరైన భద్రతా ఏర్పాట్లు లేనందున మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే కార్మికుల భద్రత ప్రభుత్వం దృష్టికి రావాలంటే కనీసం 800 మంది బలి కావాలన్నమాట!
అంతర్జాతీయ కార్మిక సంస్ధ ప్రతిపాదించిన ప్రమాణాలను ఇకనుండి అమలు చేస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రకటిస్తోంది. దానితో ఖర్చు పెరిగిపోతుందన్న భయం కంపెనీలకు పట్టుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫ్యాషన్ దుస్తుల కంపెనీలు ఢాకా పరిసర ఫ్యాక్టరీల నుండే దుస్తులు దిగుమతి చేసుకుంటాయి. కూలి పోయిన భవనంలో అత్యంత దుర్భరమైన పనిపరిస్ధితుల మధ్య పని చేసే కార్మికుల రక్త మాంసాలు పండి లాభాలు పండించుకున్న కంపెనీలు ఇప్పుడు నెపాన్ని భవనం యజమాని పైకి నెట్టి తప్పుకుంటున్నాయి. పరిహారం చెల్లిస్తామని చెబుతున్న ఒకటి, రెండు కంపెనీలు ఎంత పరిహారం చెల్లిస్తామో చెప్పడానికి ముందుకు రావడం లేదు.
బంగ్లాదేశ్ దుస్తుల తయారీ పరిశ్రమల భవనం కూలిపోయిన నేపధ్యంలో దుస్తుల కంపెనీలు అనుసరిస్తున్న వికృత ధోరణులను ఈ కింది కార్టూన్లు పట్టిస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ పత్రికల నుండి ఎబౌట్ డాట్ కామ్ వెబ్ సైట్ ఈ కార్టూన్లను సేకరించింది.
భారమైన ప్రభుత్వ నియంత్రణలనుండి తప్పించుకోండి!! మీ కంపెనీని ఫలానా చోటికి తరలించండి…
బంగ్లాదేశ్
ఈ వారం ఫ్యాక్టరీ స్కోరు 433… ఇంకా లెక్కిస్తున్నాం
–
–
–
–
కార్పొరేట్ కంపెనీలు:
–“ఉద్యోగాల్ని రద్దు చేసే ప్రభుత్వ నియంత్రణలు వచ్చేస్తున్నాయని వినికిడి.”
–“ఐతే ఇక మన ఆపరేషన్లు టెక్సాస్ కు తరలించడం మంచిది…”
–
–
గొప్ప తగ్గింపు ధరలు…
–
–
బంగ్లా దేశ్ లో దుస్తుల తయారీ భవనం లోఇప్పటి వరకూ స్వేదం చిందిస్తూ , తగిన ప్రతిఫలం రాకుండా ,పని చేస్తున్న కార్మికులు ,ఇప్పుడు రక్తం చిందిస్తూ ప్రాణాలు కోల్పోయారు ! ఆ మరణాలకు ప్రతిఫలం ఇవ్వనంత వరకూ ! వారు కుట్టిన ప్రతి బట్ట మీదా , వారి రక్తం మరకలు చెరగవు !
My mother’s salary is 55 thousand per month but she had seen some temporary workers who work for one thousand per month. Their income is even lower than rural labour class. India has many heroes who struggle for emancipation from caste fetters but none of these heroes ever make any struggle against the system of wage labour.