‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపరలో చివరి భాగం ఈ రోజు ఈనాడు దినపత్రికలో చదువు పేజీలో వచ్చింది. “ప్రత్యేకతలే కొండగుర్తులు” శీర్షికన వచ్చిన ఈ భాగం, మరిన్ని దేశాల ప్రత్యేకతలను వివరిస్తూ వాటి ఆధారంగా వివిధ దేశాలను ఎలా గుర్తు పెట్టుకోవచ్చునో చర్చించింది.
ఈ భాగాన్ని నేరుగా ఈనాడు వెబ్ ఎడిషన్ లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
కింద బొమ్మను క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ చూడవచ్చు. బొమ్మ పై క్లిక్ చేస్తే ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. (అక్షరాల సైజు పెంచుకోవడానికి పై భాగంలో ఉన్న + గుర్తు పైన క్లిక్ చేయండి. చదవగలిగిన సైజు వచ్చేవరకు + పైన క్లిక్ చేస్తూ పోవాలి.)
కొత్త పాఠకుల సౌకర్యార్ధం 12 భాగాలకు లింక్ లను మరొకసారి కింద ఇస్తున్నాను.
–
జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -1వ భాగం
సమాచార సేకరణకు చక్కని దారులు -2వ భాగం
పరిభాష తెలిస్తే తేలికే -3వ భాగం
ఐక్యవేదికలూ… వ్యూహాలూ -4వ భాగం
మావో మూడు ప్రపంచాలు -5వ భాగం
వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ -6వ భాగం
వర్తమాన అంశాల్లో కీలకం, ఈశాన్య భారతం -7వ భాగం
అలజడి, ఆందోళనల నేపధ్యం ఏమిటి? -8వ భాగం
భిన్నత్వంలోనూ ప్రత్యేకం, దక్షిణ భారత దేశం -9వ భాగం
గుర్తుపెట్టుకోవడం సులువే -10వ భాగం
ఏ దేశానిది ఏ నేపధ్యం -11వ భాగం
–
–
africa australia lani cover chesaru baagundi………….
వి శేఖర్ గారూ.. ఈ వ్యాసం కూడా చాలా వివరణాత్మకంగా ఉంది.
ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని దేశాలను గుర్తుపెట్టుకొనేందుకు మీరు సూచించిన విధానం ఉపయోగకరంగా ఉంది. ఐతే చదువు పేజిలో ( ఈ సీరిస్ లో ) ఇది చివరి వ్యాసం అన్న వాక్యం కొంత నిరాశను కలిగించింది.
గత మూడునెల్ల నుంచి ప్రతీ వారం చదువు పేజీలో మీ వ్యాసం…దానిలోని వివరాలు, విశ్లేషణ…తిరిగి దానిపై బ్లాగులో చర్చ, ఇలా పోటీ పరీక్షల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. దానికి కొనసాగింపుగానే నాదో చిన్న సూచన. వీలైతే పరిశీలించగలరు.
మీ వ్యాసాలు చదువుతున్నపుడు వాటిపై ఏదైనా సందేహం కలిగితే…ఆ వ్యాసం కిందనే స్పందించడం ద్వారా మీ అభిప్రాయం తెలుసుకునే వీలు కలుగుతోంది. కానీ ఒక్కోసారి ఆ అంశానికి సంబంధించని అంశంపై ఏదైనా సందేహం కలిగితే….మీతో చర్చించే అవకాశం ఉండడం లేదు.
అందుకే మీ బ్లాగులో ప్రశ్నలు-సందేహాలు లాంటి ప్రత్యేక విభాగం ఏదైనా నిర్వహిస్తే బాగుంటుందనేది నా సూచన. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఏదైనా లభ్యంకాని అంశంపైన కానీ….తెలుగులో మరింత వివరణ అవసరమైతే కానీ…అది ఉపయోగపడుతుంది. దాన్ని ప్రత్యేక విభాగం కింద నిర్వహించడం వల్ల….అవి అవసరం లేని వారికి చదవాల్సిన అవసరమూ తప్పుతుంది.
అంతేకాదు ఆ అంశంపై ఇంకెవరికైనా తెలిసినవారు స్పందించే అవకాశమూ ఉంటుంది. ఇలా పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందనేది నా సూచన. వీలైతే పరిశీలించగలరు. అందులో భాగంగానే నేను నా సందేహం వ్యక్త పరుస్తున్నాను.
-స్వతంత్రానికి పూర్వం భారత్-చైనాల మధ్య విభేదాలున్నట్లు కనపడదు. పైగా చరిత్రలో ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలున్నట్లుగా అనేక ఆధారాలున్నాయి. హఠాత్తుగా వందల ఏళ్ల చరిత్రకు భిన్నంగా ఒక్కసారిగా భారత్-చైనాల సంబంధాలు ఎందుకు సంక్షోభంలో పడ్డాయి..?
భారత్ లాంటి పెద్ద దేశంతో చైనా ఎందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది..?
భారత్ చైనా సంబంధాలు మెరుగుపడేందుకు ఇరుదేశాలు ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.?
వి శేఖర్ గారు, మీరు భారత విదేశాంగ విధానం పరిణామం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ చిత్రాన్ని సమగ్రంగా ఒకే వ్యాసంలో కానీ వివిధ భాగాలుగా కానీ అందించగలరు. భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేస్తున్న వేంటి? సంస్కరణల అనంతరం సంస్కరణలకు పూర్వం విదేశాంగ విధానంలో మార్పులు ఏంటి? విదేశాంగ విధానం అంతస్సూత్రం ఏంటి?
చందుతులసి గారు మీ సూచన బాగుంది. అయితే బ్లాగ్ లో అది ఏ రూపంలో ఉండాలో అర్ధం కావడం లేదు. “ప్రశ్నలు – జవాబులు” అని ఒక కేటగిరి ఓపెన్ చేయడమా లేక ఆ పేరుతో మరొక పేజి తెరవడమా అనేది సంకటంగా ఉంది. మరో పేజి తెరిస్తే అవన్నీ ఒకే పేజీలో ఉండిపోతాయి. ఆర్టికల్స్ రూపంలో విడిగా ఉండవు. విడిగా ఉండాలంటే కేటగిరీయే ఉత్తమం. కాని ఇప్పటికే కేటగిరీలు ఎక్కువైనాయి. హోమ్ పేజిలో అన్నీ కనపడడానికి తగిన చోటు లేదు. ఉన్నవి తీసెయ్యాల్సి ఉంటుంది. ఆలోచించి చూస్తాను.
ఈలోపు మీ ప్రశ్నకు సమాధానం ఆర్టికల్ రూపంలో ఇస్తాను. వేరే పని ఉన్నందున రెండు మూడు రోజుల్లో ఇస్తాను.
విఘ్నేష్ గారు
మీరు చెప్పిన టాపిక్ చిన్నది కాదు. బహుశా మీరు పోటీ పరీక్షల దృక్పధంతో అడుగుతున్నట్లున్నారు. కాని నేను చెప్పే విషయాలు అందుకు అనుకూలంగా ఉండకపోవచ్చు. తీక్షణంగా ఉండవచ్చు.
దానికంటే చందుతులసి గారు సూచించిన పద్ధతి మెరుగేమో. అలాగైతే తీక్షణత ఉండదని కాదు. కాని ప్రశ్న పరిధికి సమాధానాన్ని కుదించవచ్చు గదా.