కాలిఫోర్నియాను చుట్టుముడుతున్న దావానలం -ఫోటోలు


అమెరికా పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియాను భారీ దావానలం చుట్టుముడుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు చోట్ల దావానలాలను ఆర్పే పనిలో అగ్నిమాపక దళాలు నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం నగరానికి సమీపంలోనే మరో దావానలం అంటుకుని వేలాది ఇళ్లకు ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే పలు ఇళ్లను ఖాళీ చేయించగా లాస్ ఏంజిలిస్  మరో మూడు వేల ఇళ్ళు ప్రమాదంలో ఉన్నట్లు రష్యా టుడే తెలిపింది. కాలిఫోర్నియా రాష్ట్ర వ్యాపితంగా ప్రస్తుతం 3,000 మంది అగ్నిమాపక దళ ఉద్యోగులు ఆరు చోట్ల దావానల మంటలతో పోరాడుతున్నారని బి.బి.సి తెలిపింది.

వేసవి ప్రారంభంలోనే భారీ దావానలాలు చెలరేగడం పట్ల అమెరికా అగ్నిమాపక విభాగం వారు ఆశ్చర్యాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలోనే ఇలా ఉంటే నడి వేసవి గురించి ఇప్పుడే ఆందోళనగా ఉన్నదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటికే 680 దావానలాలను అదుపు చేశామని వారు చెప్పారని బి.బి.సి చెప్పింది. లాస్ ఏంజిలిస్ నగర తీరానికి చేరిన దావానలం ఇప్పటికే డజను ఇళ్లను బలిగొందని, మరో 4,000 ఇళ్ళు అంటుకునే ప్రమాదం ముంచుకొస్తోందని దానితో జనాన్ని ఖాళీ చేయిస్తున్నారని సదరు వార్తా సంస్ధ సమాచారం. దాదాపు నలభై చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించిన దావానలం లాస్ ఏంజిలిస్ ను భయపెడుతోంది.

దావానలాలు అమెరికాకి కొత్త కాకపోయినా సీజన్ కాని సీజన్ లో అనూహ్యంగా ఏర్పడి విస్తరిస్తున్న దానాలనాలు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు సమస్యలుగా మారాయి. పర్యావరణాన్ని అత్యధికంగా పిండుకుని ఇబ్బంది పెట్టిన దేశాల్లో అమెరికాది ప్రధమ స్ధానం. దాని ఫలితమే ఈ కాలం కాని దావాలనాలు అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా వినే పరిస్ధితిలో కంపెనీలు, వారి సమర్ధకులైన పాలకులు పట్టించుకునే పరిస్ధితిలో లేరు.

లాస్ ఏంజిలిస్ నగరంలోని వెంచుర కౌంటీ వద్ద ప్రస్తుతం 900 మంది అగ్నిమాపక సిబ్బంది భారీ మంటలతో పోరాడుతున్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఈ దావానల విజృంభణను వివిధ పత్రికలు అందించాయి. బి.బి.సి, రష్యా టుడే సంస్ధలు వివిధ ఫోటో న్యూస్ సంస్ధల నుండి సేకరించి అందజేసిన ఫోటోలను కింద చూడవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s