భిక్షా పాత్రకు కూడా మతం ఉంది!


మార్చి 21, 2013న మీక్తిలాలో మసీదు చుట్టూ తగలబడుతున్న రొహింగ్యాల ఇళ్లు

మార్చి 21, 2013న మీక్తిలాలో మసీదు చుట్టూ తగలబడుతున్న రొహింగ్యాల ఇళ్లు -ప్రెస్ టి.వి

కాలం అనుకూలంగా లేకపోతే (టైం బాగోకపోతే) తాడే పామై కరుస్తుందంటారు. (ఇక్కడ నెపాన్ని కాలం మీదికి నెట్టేసినా దానర్ధం ‘స్ధల, కాల పరిస్ధితులు’ అయి ఉండాలి.) మియాన్మార్ (బర్మా) లో ముస్లింల పరిస్ధితి అలానే తగలడింది. ఒక బౌద్ధ భిక్షువుకు చెందిన భిక్షా పాత్రను ఒక ముస్లిం మహిళ పగలగొట్టిందన్న అనుమానంతో ముస్లింల పైనా, ఒక మసీదు పైనా దాడి జరిపారు అహింసావాదులైన భౌద్ధ మత ప్రజలు. ఇటీవలే మత ఘర్షణలతో అట్టుడికిన మియాన్మార్ లో మరో ఘర్షణకు సిద్ధంగా లేని పోలీసులు ముస్లిం మహిళను అరెస్టు చేయక తప్పలేదు. అరెస్టు ద్వారా భారీ మత ఘర్షణలు నివారించామని పోలీసులు చెబుతున్నారంటే పరిస్ధితిని ఊహించవచ్చు.

“ఈ ప్రాంతంలో మత అల్లర్లు నివారించడానికి మహిళను నిర్బంధంలోకి తీసుకోక తప్పలేదు” అని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పాడని ది హిందు తెలిపింది. సదరు మహిళను ‘విన్ విన్ సీన్’ గా గుర్తించామని మియాన్మార్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో 144 సెక్షన్ లాంటిది పెట్టి నలుగురైదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పెద్ద ఉపద్రవం తప్పిపోయిందని పోలీసులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారట! అయితే అనేక ఇళ్ళు తగలబడ్డాయని కనీసం 10 మంది గాయపడ్డారని ప్రెస్ టి.వి నివేదించింది.

యాంగాన్ కు ఉత్తరాన 60 కి.మీ దూరంలోని ఒక్కన్ జిల్లాలో 20 సంవత్సరాల లోపే ఉన్న ఒక యువ బౌద్ధ భిక్షువు మంగళవారం ఉదయాన్నే భిక్షా పాత్ర పట్టుకుని ఆహార సేకరణ మొదలు పెట్టాడు. (అంటే పొద్దున్నే అన్నం అడుక్కోవడం మొదలు పెట్టాడు.) ఏం జరిగిందో ఏమో గాని ఆ భిక్షా పాత్ర కాస్తా పగిలి నేలమీద పడిపోయి ఉంది. అక్కడే ఉన్న ఒక ముస్లిం మహిళ పాత్ర పగలడానికి కారణమని ఆ యువకుడు అనుమానం వ్యక్తం చేశాడు.

అంతే! ఇక మొదలైంది జాతర. బౌద్ధ భిక్షువులకు భిక్షా పాత్ర పరమ పవిత్రమైంది కాబోలు, ముస్లింలపైన దాడులు మొదలు పెట్టారు. ఒక మసీదు పైన దాడి చేసి నష్టం కలిగించారు. ఒక ముస్లిం వ్యాపారికి చెందిన షాపుని ధ్వంసం చేశారు. రొహింగ్య ముస్లింల పైన అత్యంత హింసాత్మక దాడులతో ఇటీవల వరకు మియాన్మార్ అట్టుడికిపోయింది. ఈ నేపధ్యంలో ప్రమాదం పసిగట్టిన పోలీసులు వెంటనే స్పందించి నిషేధాజ్ఞలు విధించారు. ఒక్కన్ టౌన్ షిప్ లో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమి కూడొద్దని ఆదేశాలు జారీ చేసి అమలు చేశారు. సాయంత్రానికల్లా పరిస్ధితి అదుపులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు.

మియాన్మార్ ప్రజలు ప్రధానంగా బౌద్ధమత ప్రజలు. ముస్లింల సంఖ్య అక్కడ చాలా తక్కువ. బౌద్ధులు, ముస్లింలకు మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుంటాయి. ‘అహింసో పరమ ధర్మః’ అని బుద్ధుడు చెప్పాడంటారు. మత ప్రవక్తల బోధనలకు ప్రజల దైనందిన భౌతిక ఆచరణకి ఎంత చుక్కెదురో మియాన్మార్, శ్రీలంక దేశాల్లోని బౌద్ద మతం ఒక ఉదాహరణ కావచ్చు. మియాన్మార్ లోనైతే రోహింగ్య ముస్లింల పైన అక్కడి బౌద్ధులు సాగించే హత్యాకాండ అత్యంత ఘోరం. మియాన్మార్ ప్రభుత్వం కూడా రోహింగ్య ముస్లింలు తమ దేశం వారు కాదని ప్రకటించడంతో వారు ఏ ప్రభుత్వం కిందికి రాని అనాధ పౌరులుగా (stateless citizens) మిగిలిపోయారు. దానితో బౌద్ధుల దాడులకు వాటంగా దొరుకుతున్నారు.

గత సంవత్సరం బౌద్ధులకు, రోహింగ్య ముస్లిం లకు జరిగిన సెక్టేరియన్ హింసాకాండలో 192 మంది ప్రజలు చనిపోయారు. పశ్చిమ మియాన్మార్ లోని రఖినే రాష్ట్రంలో జరిగిన ఈ ఘర్షణల వలన రోహింగ్యాలకు ఇల్లూ, వాకిలి లేకుండా పోయింది. కనీసం 1.25 లక్షల మంది రోహింగ్యాలు శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రానున్న వర్షా కాలంలో వీరి పరిస్ధితి మరింత ఘోరంగా ఉండబోతోందని హ్యూమర్ రైట్స్ వాచ్ సంస్ధ ఇటీవల ఒక నివేదికలో తెలిపింది. ప్రభుత్వమే ఈ ‘జాతి హత్యాకాండ’కు లోపాయకారీ మద్దతు ఇస్తోందని ఈ సంస్ధ ఆరోపిస్తోంది.

గత మార్చి నెలలో బౌద్ధులకు, ముస్లింలకు మధ్య మరోసారి మత ఘర్షణలు చెలరేగాయి. మధ్య మియాన్మార్ లోని ఒక రాష్ట్రంలో  ఒక ముస్లింకు చెందిన బంగారం కొట్టులో జరిగిన చిన్న తగాదా చిలికి చిలికి గాలివానగా మారి 44 మందిని బలిగొంది. 8,000 మంది వరకు నిరాశ్రయులయ్యారు. మియాన్మార్ మానవ హక్కులకు సంబంధించి ఐరాస నియమించిన ప్రత్యేక ప్రతినిధి రోహింగ్య ముస్లింలపై దాడుల్లో సైన్యం, పోలీసుల పాత్ర ఉండని తనకు ఫిర్యాదులు అందాయని మార్చి 28 తేదీన ప్రకటించాడు. బౌద్ధ తీవ్రవాదులు ఇల్లు ముస్లింల ఇళ్ళు తగలబెడుతుండగా సైనికులు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఫిర్యాదులు అందాయని, కొన్ని చోట్ల సైనికులే ట్యాంకుల్లో తీవ్రవాదులకు పెట్రోలు అందించినట్లు ఫిర్యాదులు అందాయని ఆయన ప్రకటించాడు.

రోహింగ్యాలు మియాన్మార్ దేశీయులు కాదని మియాన్మార్ ప్రభుత్వం వాదిస్తుంది. వారిని బ్రిటిష్ వారు వలస పాలనా కాలంలో వ్యవసాయం చేయడం కోసం బెంగాల్ నుండి తీసుకొచ్చారని, కనుక వారి బాధ్యత తమది కాదని వాదిస్తుంది. ఈ లెక్కన ప్రపంచంలో ఎన్ని దేశాలు ఎంతమందిని తమ వారు కాదని ప్రకటించాలి? ప్రెస్ టి.వి ప్రకారం రోహింగ్యాలు 8వ శతాబ్ద కాలంలో వలస వెళ్ళిన పర్షియన్, టర్కిష్, బెంగాలి, పఠాన్ ముస్లింలు. కనీసం శతాబ్దం కిందట వలస వచ్చారని భావించినా వారిని స్ధానికులు కాదని చెప్పడం ఆధునిక మానవతా విలువలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం.

పాలకులే పగబట్టినపుడు ముస్లింలు భిక్షా పాత్రకు కూడా లోకువేనని తాజా ఘటన స్పష్టం చేస్తోంది.

18 thoughts on “భిక్షా పాత్రకు కూడా మతం ఉంది!

 1. మీరు రాస్తున్నదంతా హిందూ దినపత్రిక నుంచే కదా..ఇందులో మీ క్రుషి ఉందంటే అనువాదం చేయడం ఒక్కటే. అందులోనూ మీకు నచ్చిన మీ ద్రుష్టిలో ముఖ్యమైనవనుకున్న ఒకటి అర వార్తలు మాత్రమే. దీనివల్ల పాఠకుడికి పెద్దగా ప్రయోజనం ఉండదు. మీరు అదే హిందూ లోని ఓపెన్ ఎడ్ పేజీలోని ఆరు నుంచి ఏడు వ్యాసాలు,పాఠకుల లేఖలు ,కార్టూన్ వంటి అన్నింటినీ ఏ రోజుకారోజు అనువాదం చేస్తే పాఠకుడికి ప్రయోజనం ఉంటుంది.మీ ప్రయత్నానికి అర్థం ఉంటుంది. ఒకటి అర వార్తల కోసం ప్రతీ రోజూ మీ తెలుగువార్తలు డాట్ కమ్ చూడటం వల్ల పాఠకుడికి ప్రయోజనం చాలా చాలా తక్కువే. మీరు ఈనాడు దినపత్రికలో రాస్తున్న వ్యాసాలే తెలుగు వార్తలు డాట్ కమ్ కంటే చాలా ప్రయోజనదాయకంగా ఉంటున్నాయి. ఈ బ్లాగులో మీరు రాస్తున్నదంతా మేము ప్రతీరోజూ హిందూలో చదువుతూనే ఉన్నాం. ప్రజాశక్తి,సాక్షి లాంటి దినపత్రికల్లోనూ ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇక మీ బ్లాగు ఏర్పాటుచేయడం వల్ల పాఠకులకు పెద్దగా ప్రయోజనం లేదనిపిస్తుంది.

 2. ప్రేమ వి… గారు

  >>మీరు రాస్తున్నదంతా హిందూ దినపత్రిక నుంచే కదా>>

  కాదు. ఉదాహరణకి ఈ ఆర్టికల్ చూడండి. హిందూ వార్తను కవర్ చేస్తూ అదనపు సమాచారం ఇచ్చాను. ప్రెస్ టి.వి నుండి కొంత సమాచారం ఇచ్చాను. అంతకుముందు నాకు రొహింగ్యాలపై నేను వివిధ చోట్ల చదివిన కొన్ని పాయింట్లు ఇచ్చాను.

  ది హిందూ పత్రిక ముఖ్యమైన పరిణామాలను గుర్తిస్తుంది. అది గుర్తించని పరిణామాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటివి ఇతర పత్రికల్లో ఉంటే రాస్తున్నాను. ప్రధానంగా ఆయా పత్రికల వార్తను కవర్ చేస్తూనే పూర్వాపరాలకు సంబంధించి అదనపు సమాచారం ఇవ్వడం ఈ బ్లాగులో కనిపిస్తుంది.

  ఈనాడు వ్యాసాల్లాంటివి ఈ బ్లాగ్ లో చాలా ఉన్నాయి. మీరు ఈ మధ్యనే నా బ్లాగ్ కి వచ్చారు కనుక వాటి గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీకు కోరితే వాటికి సంబంధించి లింక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అడిగితేనే సుమా!

  ముఖ్యమైన విషయం: ది హిందు పత్రిక (లేదా ఆంగ్ల పత్రికలు) చదవలేని వారి కోసమే ఈ బ్లాగ్. ఈనాడు పత్రిక పరిచయం చేసాక విద్యార్ధులు, ఉద్యోగార్ధులు ఈ బ్లాగ్ చూస్తున్నారు. కాని నేను టార్గెట్ గా పెట్టుకున్న పాఠకులు ఇంకా ఉన్నారు. వాళ్లు వివిధ రంగాల్లో ప్రజాసేవా రంగంలో పని చేస్తున్నారు. వారి నుండి నాకు రెగ్యులర్ గా ఫీడ్ బ్యాక్ ఉంటుంది. అంతే కాకుండా ఈనాడు పరిచయంతో ఇక్కడికి వస్తున్న పాఠకులు కూడా ఉపయోగంగా ఉందని రాస్తున్నారు. ది హిందు నుండి మరిన్ని వార్తలు రాయాలని కోరుతున్నారు.

  కాని నేను ఒక్కడినే ఇవన్నీ చేయలేను కదా. నా పరిమితి మేరకు రాస్తున్నాను. నా ప్రయత్నానికి మీరు ఒక విధంగా అర్ధం చూస్తున్నారు. ఇతర పాఠకులు వారి దృష్టి నుండి వారి వారి అర్ధం చూస్తున్నారు.

  ఒక విషయం అర్ధం కాలేదు. హిందు పత్రిక మీరు చూస్తున్నపుడు మీరు కోరినట్లు ఎడిట్ పేజీ వ్యాసాలు, లేఖలు, కార్టూన్లను అనువాదం చేసినా మీకు ప్రయోజనం ఉండదు కదా!

  బ్లాగ్ పాఠకులు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పైన చెప్పినట్లు కొంతమంది వ్యక్తం చేస్తే ఇంకొంతమంది క్లుప్తంగా రాయమంటున్నారు. కొందరు వివరంగా రాయాలంటున్నారు. కొందరికి హిందూ మత వార్తలంటే కోపం. మరికొందరికి తెలంగాణ సమస్య చర్చిస్తే కోపం. సరిహద్దు సమస్య గురించి రాస్తే దేశ ద్రోహం అనేవాళ్ళూ ఉన్నారు. అన్నింటిని దృష్టిలో పెట్టుకుంటూ ఉచితమైనవి రాస్తున్నాను. కాని నేను ఉచితం అనుకున్నవల్లా రాయలేకపోతున్నాను. రాయదలుచుకుని రాయలేకపోతున్నవి చాలా ఉన్నాయి. కారణం మరేమీ లేదు. సమయం, శక్తి సరిపోకపోవడమే.

  ఐనా కాని, మీరు చెప్పిన అంశాలను దృష్టిలో ఉంచుకుంటాను.

 3. వి శేఖర్ గారు,
  ఒక చిన్న విజ్నప్తి మీ పాఠకులకి. ముఖ్యంగా గ్రూప్ వన్ సివిల్స్ రాస్తున్నవారికి. అటువంటి ఉన్నత లక్ష్యాలు ఉన్నప్పుడు ఇంగ్లీషు మీద పట్టు సాధించాల్సిందే. ఇంగ్లీషు దినపత్రికలు చదవటం కంటే వేరే ప్రత్యామ్నాయం లేదు. తెలుగు దినపత్రికల్లో వ్యాసాలు ప్రామాణికంగా ఉండవు. అవి కూడా ఎక్కువ రాజకీయ అంశాలే ఉంటున్నాయి. మరొక విషయం విశేఖర్ గారు రాస్తున్నవి ఒక జర్నలిస్టు రాస్తున్న వ్యాసాలుగానే ఉన్నాయి. జర్నలిస్టు కర్తవ్యం ఒక విషయాన్ని నివేదించడం,సమస్యను ఎత్తిచూపడం…వివిధ కోణాలను స్ర్పుశించటం. కానీ అడ్మినిస్ట్రేటర్ అలా కాదు. సమస్యలను పరిష్కరించడం. అడ్మినిస్ట్రేటర్ నిర్మాణాత్మక అభిప్రాయాలను,సవ్యమైన సమగ్రమైన ఆలోచనా ధోరణిని,ఆచరణాత్మక ద్రుక్పథాన్ని కలిగి ఉండాలి. వి శేఖర్ గారి వ్యాఖ్యలు,వ్యాసాలు గ్రూప్ వన్ సివిల్స్ లాంటి పరీక్షార్థులకు ఉపయోగపడవని తెలుసుకోవాలి. యూపీఎస్సీ ఏపీపీఎస్సీ పరీక్షా పత్రాల సరళిని గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతంది. సమస్య పరిష్కర్తే అడ్మినిస్ట్రేటర్. సమస్యను వేలెత్తి చూపెట్టెవాడు జర్నలిస్టు. ఆ మౌలిక భేదాన్ని గుర్తించి మీ ప్రిపరేషన్ సాగించండి. ఈ బ్లాగు జర్నలిస్టు మిత్రులకు అంతర్జాతీయ జాతీయ వార్తలపై అవగాహనకు ఉపయోగపడుతుంది తప్ప పరిక్షార్థులకు కాదు.

 4. నా ఉద్దేశం మీరు హిందూ పత్రికలో ఉన్నదంతా మక్కీకి మక్కీ అనువదించమని కాదు శేఖర్ గారు. మీరు ఆ పత్రికలోని ఓపెన్ ఎడ్ లోని విశ్లేషణాత్మక కథనాలకు సంబంధించిన జిస్ట్ (సారాంశాన్ని )అందించగలిగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని. మీరు పూర్తి సమయం కేటాయిస్తున్నారని భావించి అలా స్పందించాను. మీరు వేరే వ్రుత్తిలో ఉండి ఈ తెలుగు వార్తలు డాట్ కామ్ నిర్వహిస్తున్నారనిపిస్తుంది. కాబట్టి మీకు అంత సమయం కూడా లేదేమో.

  మీ వ్యాసాలు వాస్తవికంగా ఉంటున్నాయి. మసిపూసి మారేడు కాయ చేయడమో, సెన్సేషనలిజమో, రాజకీయ ప్రయోజనాలో, ప్రలోభాలో లేకపోతే ఉన్నది ఉన్నట్టు ఎలా వార్తలు అందించవచ్చో మీ వ్యాసాలను చూస్తే అర్థమవుతుంది.

  నేను మీ బ్లాగుని ఈ మధ్య కాదు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. కానీ స్పందన తెలియజేయడం మాత్రం ఈ మధ్యే మొదలుపెట్టాను.

 5. ప్రేమ వి… గారు

  మొదటిది: ఈ బ్లాగ్ కేవలం సివిల్స్, గ్రూప్ పరీక్షార్ధుల కోసం ప్రారంభించినది కాదు. జాతీయ, అంతర్జాతీయ పరిస్ధితులపైన ఒక అవగాహన ఇవ్వడానికి ప్రారంభించినది. ముఖ్యంగా తెలుగు పాఠకులకు. వారు ఎవరైనా కావచ్చు. విద్యర్ధులు కావచ్చు, ఉద్యోగార్ధులు కావచ్చు. రాజకీయ కార్యకర్తలు, జర్నలిస్టులు వగైరా కావచ్చు.

  రెండోది: ఆంగ్ల పత్రికల్లో విశ్లేషణలు అడ్మినిస్ట్రేటర్ దృక్పధంతో ఉంటాయని భావించడం పొరపాటు. అక్కడ కూడా వ్యాసకర్తలు తమ తమ అభిప్రాయాలను తమ దృక్కోణం నుండే రాస్తారు. అక్కడ రాసేది కూడా ప్రధానంగా జర్నలిస్టులే. జర్నలిస్టులు కాని వారు రాసినా, వ్యాసం రాయడం ద్వారా జర్నలిజంలోకి ప్రవేశించినట్లే. వారిలో ప్రభుత్వాన్ని విమర్శించేది కొందరైతే, సమర్ధించేది కొందరు. నిస్పాక్షిత అనేది రెలిటివ్ టర్మ్. ఒక అర్ధంలో అది రెండు పడవల మీద కాళ్లు పెట్టడం లాంటిది కూడా. రెండు పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణిస్తే ఏమవుతుందో మీకు తెలియనిది కాదు.

  మూడు: ఈ బ్లాగ్ లో వ్యాసాలు వివిధ అంశాలపైన ఒక అవగాన ఇస్తాయి. సివిల్స్, గ్రూపు పరీక్షల వారికి ఆ పరీక్షల్లో నెగ్గేవిధంగా వ్యాసాలు రాయడం ఈ బ్లాగ్ లక్ష్యం కాదు. కాకపోతే ఉద్యోగార్ధులు బ్లాగులు చదివినా, పత్రికలు చదివినా తాము చదివిన వార్తలను, విశ్లేషణలను తమ అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోగలగాలి. ఆంగ్ల పత్రికలు చదవగలిగినా వారికా బాధ్యత తప్పదు.

  నాలుగు: ఉద్యోగార్ధి పరీక్ష తర్వాతే అడ్మినిస్ట్రేటర్ అవుతారు. ముందే కారు కదా. పోటీ పరీక్షలలో ఒక సమగ్ర అవగాహన ఉన్నదా లేదా అన్నది ముఖ్యం. అలాంటి అవగాహన కోసం విద్యార్ధులు శ్రమ పడక తప్పదు. కాని శ్రమ పడాలంటే అది ఎక్కడ చేయాలి అన్న సమస్య తెలుగు మీడియం వారికి వస్తోంది. అవసరమైన సమాచారం అంతా ఆంగ్లంలో ఉంటే ఆంగ్లం పెద్దగా ప్రవేశం లేనివారు ఎక్కడ శ్రమ చేయాలి? అలాంటి వారికి ఒక ఉపకరణంగా ఈ బ్లాగు ఉపయోగపడవచ్చు.

  ఐదు: ఈ బ్లాగు పైన మీరు వ్యక్తం చేసిన కోణమే సమగ్రం కాకపోవచ్చు. కోచింగ్ సెంటర్ల విషయం ఐనా అంతే. ఏది సమగ్రం అన్న విషయాన్ని ఎవరికి వారు స్వయం ఆలోచనతో నిర్ణయించుకోవలసిందే.

 6. విఘ్నేష్ గారు నేను ఒక పబ్లిక్ సెక్టార్ సంస్ధలో జాబ్ చేస్తున్నాను. ఖాళీ సమయాన్ని ఇలా జర్నలిజం కోసం వినియోగిస్తున్నాను. మీ పేరు ఈ మధ్యనుండే చూస్తున్నాను. బహుశా ఈనాడు పరిచయం తర్వాత బ్లాగ్ గురించి తెలుసుకున్నారేమో అనుకున్నాను. ఇంతకీ మీరు పరీక్షార్ధులకు కోచింగ్ ఇస్తున్నారా?

 7. హిందు పేపర్ లో వి రాస్తున్నారన్నారు ఎవరైనా ఎక్కడో జరిగిన వార్తని ఏదైనా మాధ్యమం ద్వారా చూసే కదా విస్లేషించేది అది హిందు కావచ్చు బి బి సి కావచ్చు ఇక్కడి నుంచి ఎవరూ మయన్మార్ కొ ఇంకెక్కదికొ వెల్లి ప్రత్యక్షము గా చూసి రాయరు కదా హిందు పేపర్ మా లాంటి తెలుగు మీడియం వాల్లకి, గవర్నమెంటు స్కూల్ల లొ చదివిన వాల్లకి అర్దం కాదు కదా అందుకే మా లాంటి వాల్లకి ఇది ఉపయొగం

 8. విఘ్నేశ్వరరావు గారు ….

  బహుశా మీరు ఈ బ్లాగును మొదటి నుంచి అనుసరిస్తూ ఉంటే….ఈ వ్యాఖ్య చేసేవారు కాదు. ఎందుకంటే హిందూ పత్రికతో సంబంధం లేకుండా అనేక విషయాల మీద ఇందులో లోతైన చర్చ జరిగింది. రంగనాయకమ్మ విషవృక్షం, జపాను పుకుషిమా ప్రమాదం-పర్యవసానాలు, పెట్టుబడి దారీ విధానాలు, కాశ్మీరు సమస్య, చావెజ్ నాయకత్వం….. ఈ మధ్యనే నిర్బయ అంశం మీద, అత్యాచారాల మీద ఇలా అనేక అంశాలమీద లోతైన చర్చలు జరిగాయి. కావాలంటే పాత పోస్టులు చూడండి.

  బహుశా నేననుకోవటం ఏంటంటే….వి శేఖర్ గారు ఈ మధ్య హిందూలోని కార్టూన్ మీద రోజూ వ్యాఖ్య రాస్తున్నారు. అందువల్ల అలాంటి అభిప్రాయం కలిగి ఉండవచ్చు. కానీ గతంలో అనేక అంతర్జాతీయ పత్రికల్లోని కార్టూన్ల మీద కూడా వ్యాఖ్యలు రాసేవారు.

  1. బ్లాగులనేవి ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి నిర్వహిస్తుంటారు. అందులోని అభిప్రాయాలు కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చేవారు నచ్చాయి అంటారు. నచ్చని వారు నచ్చలేదని అంటారు. అంతేకాని పాఠకులందరికీ (? ) ప్రయోజనం లేదని ….అందరి తరపునా మీరే ఎలా చెబుతారు…?
  మీకు నచ్చలేదని చెప్పండి.

  నా అభిప్రాయం ప్రకారం…వి శేఖర్ గారు పోటీ పరీక్షల కోసం ఈ బ్లాగును మొదలుపెట్టలేదనుకుంటా.

  —ఇక ఇక్కడ చర్చించేది వర్తమాన రాజకీయాలు వాటి పోకడలు. కేవలం ఇవి చదివితేనే పోటీ పరీక్షల్లో నెగ్గుతామనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఈ బ్లాగులో ప్రస్తుత సామాజిక వ్యవహారాలపై ఒక కోణంలో విశ్లేషణ దొరుకుతుంది. దాన్ని ఎవరికి వారే అర్థం చేసుకుని తిరిగి తమదైన శైలిలో విమర్శించగలగడం చేయగలగాలి. అంతే తప్ప రెడీమేడ్ వ్యాసాలు, ప్రశ్నలు ఇక్కడ…( ఆ మాటకొస్తే ఎక్కడా ) ఒకేచోట దొరకవు.

  @ వి. శేఖర్ గారు. గతంలో రామ్మోహన్ గారు ఓ వ్యాఖ్య చేశారు. ( ” జాగ్రత్త విశేఖర్ గారు. ఎక్కడో మునిగితే ఎక్కడో తేలుతాం అని. “) బహుశా..ఇటీవల కాలంలో పోటీ పరీక్షల అభ్యర్థుల ప్రభావం మీ మీద కనిపిస్తోంది. తెలుగు మీడియం వారికోసం ఎంతోకొంత ఉపయోగపడాలన్న మీ కృషికి, శ్రమకు ధన్యవాదాలు. కానీ ఈ బ్లాగును పూర్తిగా అటువైపే వంచకండి.
  మీదైన శైలిలో, మీదైన దృక్పథంలోనే పోస్టులు అందంచాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

 9. ఐనా ఈ ప్రపంచం లో ఎవరూ దేనినీ కొత్థగా తయారుచేయలేరు వార్తలని కూడా మీరు కాపీ అని మక్కి అని అనకండి ఏ పేపర్ వాల్లు అన్నా చూస్తె కాపీ రైటు అనీ పేటెంట్ హక్కులని గొడవ మొదలు పెడతారు మాకు ఇంక ee బ్లాగు కూడ లేకుండా పోతుంది మల్లి ఎవరన్నా సుప్ర్రీం కోర్టు దాక వెల్లి పోరాడాలి ………………………

 10. అసలు మన భిక్షువుల గురించి మర్చిపోయా ఈ మాయన్మార్, టిబెట్ వాల్లు అంతా బుధ్ధుడుని తెగ అనుసరిస్తారని అంతా అహింస తో, సాధు స్వభావంతో ఉంటారని అందరు అనుకుంతారు కాని వీల్లు సాధరణ మనుషులు కన్నా హింస లొ ఏమీ తీసిపోరని నేను ఎప్పటి నుంచొ (మా ఊల్లో కాల చక్ర జరిగినప్పుడు నుంచి నేను వాదిస్తున్నా ) చెపుతుంటే నా మాట ఎవరూ వినేవాల్లు కాదు కాని ఈ రోజు అసలు నిజం వెలుగులొకి వచ్చింది ఈ భిక్షువులు మన కన్నా చాలా ఫాస్ట్ ……… …

 11. చందుతులసి గారు

  ఆ హెచ్చరిక చేసింది రాజశేఖర రాజు గారు. అది నాకు గుర్తుంది. బ్లాగును ‘అటువైపు’ వంచే పధకం ఏదీ నా వద్ద లేదు. ఆందోళన వద్దు. పోటీ అభ్యర్ధుల ప్రభావం కనిపిస్తే అది మంచికే. పరీక్షల కోసం అయినా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఆసక్తి పెంచుకుంటే అది కూడా ఉపయోగమే కదా!

  విఘ్నేశ్వర రావు గారు చెప్పిన విషయం కూడా పాఠకులకు కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆయన చెప్పిన కోణంలో ఎవరైనా ఆలోచిస్తే, వారికి. అయితే ఆయన జర్నలిస్టులను మొత్తం తీసేపారేయడం (పరీక్షల కోణంలో కూడా) కరెక్టు కాదని నా అభిప్రాయం. జర్నలిస్టులు అందిస్తున్న వార్తలే లేకపోతే సమాచారం ఎక్కడిది, సమాచార విప్లవం ఎక్కడిది? జర్నలిస్టులే కదా సమాచార సైనికులు!

  అడ్మినిస్ట్రేటర్ అంటే గొప్ప వ్యక్తి అనే అవగాహన విఘ్నేశ్వర రావు గారి వ్యాఖ్యలో తొంగి చూస్తున్నట్లు నాకనిపిస్తోంది. కాని ఈ అడ్మినిస్ట్రేటర్ల పాలనలోనే కదా కోటానుకోట్ల అవినీతి ఉరకలెత్తుతోంది? ఆయన చెప్పినట్లు అడ్మినిస్ట్రేటర్లు “నిర్మాణాత్మక అభిప్రాయాలను, సవ్యమైన సమగ్రమైన ఆలోచనా ధోరణిని,ఆచరణాత్మక ద్రుక్పథాన్ని కలిగి ఉంటే జనానికి ఇన్ని తిప్పలెందుకు!

  అడ్మినిస్ట్రేటర్ శక్తి ప్రధానంగా వారికి ప్రజల పట్ల ఉండే కమిట్‌మెంట్ లో ఉంటుంది తప్ప వారి తెలివితేటల్లోనో, గొప్పతనంలోనో కాదు.

 12. మనం ఈ రాజకీయ విసేషాలని వార్తలని రాసే బ్లాగును అడ్మినిస్ట్రేషన్ కి ఇంకా దేనికొ ముడీ పెడితే చివరికి చంచల్ గూడ అవుతుంది

 13. administation veru politics veru news analysis ki administration ki naku telisi sambhandham ledu kevalam mana chuttuu unna samaajaani ardam chesukotaniki tappa deenni administration to kalipite vipareeta parinaamaalu vastayi appudu antaa prajaa seva antaru evaru udhyogam cheyyaru

 14. మెకాలె విధ్యవిధానం మనల్ని మానసికంగా వారి గుమస్తాలుగా తయారు చేస్తే, ఇప్పటి ధేశియ విధ్య విధానం గ్లోభల్‌ కంపెనీలకు మేనెజర్లుగా, ఇంజినీరింగ్‌ మెకానికులుగా థయారు చేస్థూంధి.మనల్ని ఆలోచన ఉన్న మనుషులుగా తయారు చెయ్యటంలేదు.

 15. అక్కడ సన్యాసులు పాత్ర(పగిలి) పోయిందని అల్లర్లు చేస్తుంటే ఇక్కడ కొందరు సన్యాసులు పదవి పొతుందని పదవి రాదేమోనని అల్లర్లు చేస్తున్నారు

 16. మెకాలే విధానం ఐనా దేశీయ విధానం ఐనా ఏ విధానం ఐనా విధ్య అంతా బతకటానికే కదా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s