మోడి ఢిల్లీ ప్రయాణానికి దారెటు? -కార్టూన్

ఒక దేశానికి ప్రధాన మంత్రి అవాలంటే దేశం మొత్తానికి కనీసంగా ఐనా తెలిసి ఉండాలి. ప్రజలకు ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేకపోయినా ప్రధాన మంత్రి అభ్యర్ధి అనగానే ప్రజల మనసుల్లో ఒక భావన మెదలాలి. బహుశా దానిని ‘మాస్ అప్పీల్’ అని (లూజ్ అర్ధంలో) అనవచ్చేమో. బి.జె.పి పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవికి అభ్యర్ధిగా అనేకమంది బి.జె.పి నాయకుల నోళ్లలో నానుతున్న నరేంద్ర మోడీకి అలాంటిది ఉన్నదా అని ఈ కార్టూన్ ప్రశ్నిస్తున్నట్లుంది. ‘మాస్ అప్పీల్’…

ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు -బ్రిక్స్ పై ఈనాడు ఆర్టికల్

“ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు” శీర్షికన, “ఆశలు రేకెత్తిస్తున్న బ్రిక్స్ బ్యాంకు” ఉప శీర్షికన ఈనాడు ఎడిటోరియల్ పేజిలో ఈ రోజు ఈ బ్లాగర్ రాసిన ఆర్టికల్ ప్రచురించబడింది. ఎడిటోరియల్ పేజిలో ప్రచురితం కావడం ఈ బ్లాగర్ కి ఇదే మొదటిసారి. పత్రిక జతచేసిన బ్రిక్స్ దేశాధినేతల ఫొటో, బ్రిక్స్ సభ్య దేశాలతో భారత దేశ వాణిజ్యాన్ని వివరించె గ్రాఫు ఆర్టికల్ కు మరింత పరిపుష్టతను చేకూర్చాయి. ఈ సందర్భంగా ఈనాడు, మిత్రులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పడం…

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్

(భారత దేశంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల స్వభావం ఏమిటన్నదీ దేశంలో ఒక చర్చగా ఉంటోంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలలో, ఇంకా ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలలో ఈ అంశం పైన తీవ్రమైన చర్చోపచర్చలు నడుస్తున్నాయి. భారత దేశ వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం (Capitalist Mode of Production) ప్రవేశించిందని కొంత మంది వాదిస్తుండగా, మరికొందరు ఆ వాదనను తిరస్కరిస్తున్నారు. అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్ధగా నిర్వచించబడిన భారత దేశ సామజిక వ్యవస్ధ…

ఇండియా ప్రధాని సరే, బి.జె.పి ప్రధాని ఎవరు? -కార్టూన్

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఇటీవల జరిగిన బి.జె.పి అత్యున్నత స్ధాయి సమావేశంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించబడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ తన సొంత నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అందులో నరేంద్ర మోడి ఒకరని పత్రికలు తెలిపాయి. ఆరు సంవత్సరాల క్రితం బి.జె.పికి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షుడుగా ఉన్నపుడే మోడిని పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించారని, అదే వ్యక్తి నేతృత్వంలో మోడిని మళ్ళీ బి.జె.పి తన పార్లమెంటరీ…

వర్తమాన అంశాల్లో కీలకం, ఈశాన్య భారతం -ఈనాడు వ్యాసం 7వ భాగం

“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?” వ్యాస పరంపరలొ ఏడవ భాగం ఈ రోజు ఈనాడులో వచ్చింది. జాతీయ పరిస్ధితుల అవగాహనలో భాగంగా ఈశాన్య భారతాన్ని వేధిస్తున్న సరిహద్దు సమస్య గురించి ఈ భాగంలో చర్చించబడింది. ఈనాడు ఇంటర్నెట్ పేజిల్లో ఆర్టికల్ చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి. ఈనాడు ఇ-పేపర్ నుండి తీసుకున్న ఇమేజ్ ను కింద చూడవచ్చు. ఇమేజ్ పొడవుగా ఉన్నందున ఒకే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ గా మార్చడం కుదరలేదు. అందువలన పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ల…