ఈనాడు దిన పత్రికలో ప్రతి సోమవారం ప్రచురించే చదువు పేజీలో ‘జాతీయ అంటార్జాతీయ పరిస్ధుతులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపర వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాసాలను కొత్తగా చూసినవారు పాత భాగాల కోసం అడుగుతున్నారు. కొంతమంది ‘కటింగ్ తీసి పెట్టారా’ అని అడుగుతుంటే, ఇంకొందరు ‘అన్నీ కలిపి బుక్ వేస్తారా’ అని అడుగుతున్నారు.
నేను కటింగ్స్ తీసి పెట్టలేదు. బ్లాగ్ లో ఉన్నాయి గనుక ఆ జాగ్రత్త తీసుకోలేదు. బుక్ వేయదలిస్తే ఈనాడు వాళ్ళు వేయాలనుకుంటా. వారికా ఆలోచన ఉన్నట్లు లేదు. అందుకని అన్నీ కలిపి ఒకే టపాలో ఉండేలా లింక్స్ ఇస్తే కొత్త పాఠకులకు పాత భాగాలను అందుబాటులో ఉంచినట్లవుతుందని కొందరు మిత్రులు సలహా ఇచ్చారు. ఆ సలహాను పాటిస్తూ ఇప్పటివరకు ప్రచురించబడిన 11 భాగాలకు లంకెలను కింద ఇస్తున్నాను. చదువు పేజీతో పాటు ఈనాడు ఎడిట్ పేజీలో ఏప్రిల్ 2 తేదీన బ్రిక్స్ కూటమి గురించి రాసిన ఆర్టికల్ ప్రచురించబడింది. దానికి కూడా లింక్ చివరన ఇస్తున్నాను. అవసరమైనవారు ఉపయోగపెట్టుకోగలరు.
–
జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -1వ భాగం
సమాచార సేకరణకు చక్కని దారులు -2వ భాగం
పరిభాష తెలిస్తే తేలికే -3వ భాగం
ఐక్యవేదికలూ… వ్యూహాలూ -4వ భాగం
మావో మూడు ప్రపంచాలు -5వ భాగం
వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ -6వ భాగం
వర్తమాన అంశాల్లో కీలకం, ఈశాన్య భారతం -7వ భాగం
అలజడి, ఆందోళనల నేపధ్యం ఏమిటి? -8వ భాగం
భిన్నత్వంలోనూ ప్రత్యేకం, దక్షిణ భారత దేశం -9వ భాగం
గుర్తుపెట్టుకోవడం సులువే -10వ భాగం
ఏ దేశానిది ఏ నేపధ్యం -11వ భాగం
very beautiful but add some more international issues
మీరు ఈనాడు చదువులో అందించిన సమాచారం అమూల్యం. ఇలాంటి సమాచారం సూక్ష్మంలో మోక్షంలా ఉంది. మరిన్ని వ్యాసాలు ఈబ్లాగులో అందించండి. అవన్నీ కలిపి తర్వాత ఓ పుస్తక రూపంలో ప్రచురించవచ్చు. మీరు భావిస్తున్నట్లు ఈనాడుకు ఆ హక్కులు లేవు. మీరే రచయిత కాబట్టి మీరు పుస్తకరూపంలో తెచ్చేందుకు అన్ని విధాల హక్కులున్నాయి. ఈనాడు చదువులో వ్యాస పరంపరతో సత్య గారు మార్కుల వ్యూహం అనే పుస్తకాన్ని ప్రచురించారు.