మహిళలపై నేరాలు -గ్రాఫిక్స్


The Hindu (Click to enlarge)

The Hindu (Click to enlarge)

2012, 2013 సంవత్సరాలకు గాను జనవరి 1 నుండి ఏప్రిల్ 15 వరకు భారత దేశంలో మహిళలపై జరిగిన వివిధ నేరాలను పోల్చుతూ పి.టి.ఐ వార్తా సంస్ధ ఈ క్రింది గ్రాఫిక్స్ ను తయారు చేసింది. ది హిందు పత్రిక అందజేసిన ఈ గ్రాఫిక్స్ లో వివరాలు కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడినవారిలో అత్యధికులు సమీప బంధువులు, తెలిసినవారేనని ఈ వివరాల ద్వారా తెలుస్తున్నది.

2013లో ఇప్పటి వరకు 1869 నేరాలు మహిళలపై జరిగినట్లు ఈ గ్రాఫిక్స్ ద్వారా తెలుస్తోంది. నేరాలు జరిపిన వారిలో స్నేహితులు లేదా ప్రేమికులు ఎక్కువమంది ఉన్నారు. వారి తర్వాత స్ధానం పొరుగువారిది కాగా తండ్రులు, మారు తండ్రులు కూడా తమ కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడడం అత్యంత అమానుషం. ఏకంగా 12 మంది తండ్రులు లేదా మారు తండ్రులు తమ పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. సమాజంలోని కొన్ని చోట్ల సాంస్కృతిక సంబంధాలు ఎంత క్షీణ దశలో ఉన్నాయో ఈ సంగతి తెలియజేపుతోంది.

నిలకడగా ఉన్న నీరు కుళ్లి దుర్గంధం కొడుతుంది. ఈ సూత్రం సమాజానికి కూడా వర్తిస్తుంది. సమాజంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అవుతోందంటే దాని అర్ధం మానవుడి చేతిలోని ఉత్పత్తి సాధనాలు అభివృద్ధి అవుతున్నాయని అర్ధం. ఉత్పత్తి సాధనాల ద్వారానే మనిషి ఉత్పత్తిని తీసి వినియోగిస్తాడు. యంత్రాల పైన గానీ, పొలాల్లో గానీ శ్రమ చేసి ఉత్పత్తిని తీసేది అనేకమంది అయితే, దానిని స్వాహా చేస్తున్నది కొద్ది మందే. అంటే సంపదల సృష్టి చేసేవారికి ఆ సంపదలు అందడం లేదు. లేదా ఉత్పత్తి పంపిణీ సక్రమంగా జరగడంలేదు. ఉత్పత్తి త్వారా పోగుపడిన సంపదలన్నీ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అయిపోయింది. ఈ విధంగా ఉత్పత్తి సాధనాల అభివృద్ధికి, పంపిణీ సంబంధాలకు మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు అది పరిష్కరించబడాలి. ఆ పరిష్కారం ఒక్క విప్లవాల ద్వారా మాత్రమే సాధ్యం.

విప్లవాలు రాకపోతే? సమాజం కుళ్లి పోతుంది. ఇపుడు జరుగుతోంది అదే. ఆర్ధిక సంబంధాలు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడానికి తగిన విధంగా సంపదల పంపిణీ జరగడం లేదు. ఎంత శ్రమ చేసినా తగిన ఫలితం దక్కనపుడు శ్రమేతర దగ్గరి దారుల ద్వారా సంపదల సాధనకు వెంపర్లాట జరుగుతోంది. ఈ వెంపర్లాట మనిషిలో నేర ప్రవృత్తిని పెంచుతోంది. సంక్షుభిత ఆర్ధిక పరిస్ధితుల కారణంగా విచ్ఛిన్నమవుతున్న ఆర్ధిక సంబంధాలు మానవ సంబంధాల విచ్చిన్నతకు అనివార్యంగా దారితీస్తున్నాయి. అవి చివరికి కుటుంబాల లోని అంతర్గత సంబంధాలను కూడా కొరికేస్తున్నాయి.

ఫలితంగా సాంస్కృతిక పరివర్తన ప్రగతి వైపుకి కాకుండా కుళ్ళు వైపుకి సాగుతోంది. ఆ దుర్గంధమే ఇలా తన/పర, చిన్న/పెద్ద, వావి/వరుస లేని మనస్తత్వాలకు జన్మ ఇస్తోంది. ఏం చేసయినా డబ్బు సంపాదించవచ్చు అన్న విలువ స్ధిరపడిన చోట ఎలాగయినా సరే, ఒంట్లో రగిలిన కోరిక తీర్చుకోవచ్చు అనే విచ్చలవిడి స్వభావం ఏర్పడుతోంది. సమాజంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోకుండా కొనసాగినంత కాలం నిలవ ఉన్న నీటిలా సమాజంలోని వివిధ అంశాలు కూడా కుళ్లి దుర్గంధం వ్యాపింపజేస్తాయి.

One thought on “మహిళలపై నేరాలు -గ్రాఫిక్స్

  1. meeru cheppindi bagundi.kani samajamlo utpathi stailo unnavarini jagrum kakunda aneka shakthulu vati prayatnalu konasagistunnai.viplam ravadaniki mukya karam vidya. vidya mana deshamlo sariga ledu.prachyatya deshalalo vidyapi vati gdp lo 20-40 shatam karchu chestunte.mana deshamlo 2 % karchu chestu viplam rakunda muriyu prajalu jagrutham kakunda chestunte,maro vipu sprituavality musugulo aneka mandi swamulu mudacharalanu vyapimpa prayatnalu elagu unnai.already chaduvukunnavallu, medhavulu madyataragathivallu dabbu dabbu antu 24 gantalu naitika viluvalaku tilodakalu echaru.ardikanga venukabadivaru pi shaktulaku dasoham avvutunnaru. aina viplavam ravadaniki,lotus spring ravadaniki samayam entho duramlo ledu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s