2జి కుంభకోణానికి కాంగ్రెస్ తలపెట్టిన ‘సున్నం కొట్టుడు’ కార్యక్రమం పూర్తయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఏ-2 ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (సం.పా.సం – జాయింట్ పార్లమెంటరీ కమిటీ -జె.పి.సి) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పేమీ లేదని, పాపం అంతా అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా దేనని ముక్తాయించిన సం.పా.సం నివేదిక ఊహించని విధంగా మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి ని నివేదికలో చేర్చింది. వాజ్ పేజీ పేరు నివేదికలో చేర్చడమే కాకుండా ఆయన వలన దేశానికి 48,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నిర్ధారించింది.
అంటే 2జి కుంభకోణంలో కాగ్ చెప్పినట్లుగా భారత ఖజానాకు వాటిల్లిన నష్టం కేవలం 1,76,000 కోట్లు కాదు. మొత్తం నష్టం 1,76,000 + 48,000 = 2,24,000 కోట్ల రూపాయలు. ఖజానాకి అసలు నష్టమే లేదని వాదించి ‘జీరో లాస్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 48,000 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు సం.పా.సం చేత చెప్పించడం ఎలా అర్ధం చేసుకోవాలి? జీరో లాస్ అన్నదే నిజం అయితే అది వాజ్ పేయి ప్రభుత్వానికి కూడా వర్తించాలి. కాదూ, నష్టం జరిగిందీ అనే పనైతే కాగ్ నివేదిక నిజమే అని అంగీకరించాలి.
పార్లమెంటు ఉభయ సభల్లో కూర్చుని ఉన్న అతిరధ మహారధులంతా నెలల తరబడి చర్చోపచర్చలు సాగించి తయారు చేసిన నివేదిక నష్టం నిజమే అని తేల్చింది కనుక కాగ్ చెప్పింది నిజమే అని స్పష్టం అవుతున్నట్లే. 2జి కుంభకోణం పైన కాగ్ తనిఖీ నివేదిక పార్లమెంటులో ప్రవేశపెట్టింది మొదలు రాజ్యాంగ బద్ధ సంస్ధ పైన అలుపూ సొలుపూ లేకుండా దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు లెంపాలయినా వేసుకోవాలి. లేదా సం.పా.సం నివేదిక తప్పనయినా చెప్పాలి. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు ఇందులో బి.జె.పి పాత్ర కూడా ఉందని వేరే చెప్పాలా?
చివరికి తేలేదేమిటంటే పార్లమెంటరీ కమిటీలు, జ్యుడీషియల్ కమిటీలు, కేబినెట్ ఉప కమిటీలు, ఆ కమిటీలు, ఈ కమిటీలు…. ఇవన్నీ ఎందుకంటే పెద్దోళ్ళ పాపాలు న్యాయబద్ధం చెయ్యడానికి. లేదా ఇతర రాజ్యాంగ బద్ధ సంస్ధలయిన కోర్టులు గానీ, కాగ్, సి.వి.సి లాంటి విచారణా సంస్ధలు గానీ, లేదా ఫోర్ట్ ఎస్టేట్ గా భావించే పత్రికలు గానీ దోషులుగా నిర్ధారించిన పెద్ద మనుషులకు క్లీన్ చిట్ ఇచ్చి ‘సున్నం కొట్టడమే’ కమిటీలు చేసే పని. ప్రజాస్వామ్యానికి మూడు మూల స్తంభాలున్నాయని, పార్లమెంటు, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్ధలే ఆ మూల స్తంభాలని పార్లమెంటరీ వ్యవస్ధల సమర్ధకులు గొప్పలు చెబుతుంటారు. ఈ మూడిండికి పత్రికా వ్యవస్ధను జత చేర్చి వాటిని నాలుగో మూల స్తంభంగా అనధికారికంగా అభివర్ణిస్తుంటారు. అధికారిక మూల స్తంభాలు మూడైతే, అనధికారిక మూల స్తంభం ఒకటన్నమాట!
ఏ కుంభకోణం జరిగినా, ఏ అక్రమం జరిగినా, ఏ అణచివేత జరిగినా లేదా ఏ దోపిడీ కార్యక్రమం జరిగినా ఈ నాలుగింటి ఒకటి చురుకుగా వ్యవహరిస్తే మిగతావి ఆ చురుకుదనాన్ని వెనక్కి లాగడానికి రెడీగా ఉంటాయని అనేక సం.పా.సం ల నివేదికలు నిరూపిస్తున్నాయి. నరేంద్ర మోడి విషయమే తీసుకుంటే కోర్టులు చురుకుగా వ్యవహరించేసరికి బ్యూరోక్రసీ (నేరపరిశోధన సంస్ధలు) ముందుకొచ్చి మోడిని కాపాడే పనిని విజయవంతంగా నిర్వర్తించాయి. బోఫోర్స్, భోపాల్ విష వాయువు విడుదల లాంటి వాటిల్లో ఏకంగా కోర్టులే దోషుల పక్షాన నిలిచాయి. 2జి కుంభకోణంలో కోర్టులు చురుకుగా వ్యవరిస్తుంటే పార్లమెంటు ఆదుకుంటోంది. 2జి విచారణలో కోర్టులను ఎలా పక్కదారి పట్టించాలో ప్రభుత్వ అధికారులు, నిందితులకు వ్యతిరేకంగా వాదించవలసిన ప్రభుత్వ లాయర్లు సాగించిన కుట్ర ఇందులో ఒకటి మాత్రమే.
అందుకే ఈ వ్యవస్ధ శ్రమ చేసే ప్రజలది కాదు, ప్రజల శ్రమను దోచుకుతినే పరాన్న భుక్కులైన దోపిడీదారులది అనడం!
miru prati vyakya modi ni yenduku lagutaru, secular ani pilipinchukovali anna atyutsaham tho na. okka mata cheppandi, dadapuga 10 years nunchi congress adhikaram lo vundi. modi di tappayite aa congress yenni kotlaina karchu petti , clues lagi modi meda lo vuri tadu biginchedi. kani ala yenduku cheyyaleka poyindi cheppagalara? kashmir lo 10 lakhs mandi hinduvulani tarimesaru, daanni gurinchi cheppandi sir jananiki, yeduku tarimero, vaalla siddantam yendho. modi, modi ani gavu kekalu pettadam kadu
modi pm avvaalantunnaaraugaa andaruu amduke ayanani laagutaaru ayyedaka ayyaaka kooda lagutoone untaaru pm avvaalante tappadu ………..
ఐన నాయకుల మీద విమర్శలు చేస్తే కొందరు మౌనం వహిస్తారు మరి కొందరు లేచి వెల్లి పొతారు ఎంతైనా వాల్లు నాయకులు వాల్ల అలవాట్లు వాల్లవి ఎవరో ఏదో అన్నారని వాల్లు ఆలోచించరు…… ……. modi modi ani gaavu kekalu pedatame kadaa aa modi ki kudaaa kaavalsindi ayanaki kavalsinde vellu chestunnaru