ఢిల్లీ పాప అత్యాచారం: పాలకులారా, ఛావెజ్ ను చదవండి!


ఢిల్లీలో ఆందోలనలు -ది హిందు

ఢిల్లీలో ఆందోలనలు -ది హిందు

అత్యంత విలువైన సమయాన్ని పోలీసులు వృధా చేయడంతో పాపను త్వరగా కనుక్కోలేకపోయారని ఢిల్లీ పాప బంధువులు ఆరోపించారు. సోమవారం సాయంత్రం పాప కనిపించకుండా పోయాక కొద్ది సేపు వెతికి గాంధీ నగర్ పోలీసులను ఆశ్రయించామని కానీ వారు రాత్రంగా స్టేషన్ లోనే తమను కూర్చోబెట్టారని వారు తెలిపారు. ఆ తర్వాత రోజు కూడా అదీ, ఇదీ కావాలని తిప్పించారని అసలు వెతికే ప్రయత్నం చేయలేదని తెలిపారు. పాప దొరికిన తర్వాత తండ్రిని పక్కకు పిలిచి గొడవ చేయొద్దని బెదిరించారని, అందుకు ప్రతిఫలంగా రెండు వేలు ఇవ్వజూపారని తెలిపారు.

బీహార్ కి చెందిన 22 సంవత్సరాల మనోజ్ కుమార్ ను శనివారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే పెళ్ళయిన మనోజ్ ఢిల్లీలో ఒక బట్టల ఫ్యాక్టరీలో కేజువల్ లేబర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అమానుష రీతిలో లైంగిక అత్యాచారానికి గురయిన పాప ఆరోగ్యం ప్రస్తుతానికి స్ధిరంగా ఉందని ‘ఎయిమ్స్’ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. సోనియా గాంధీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎవరికి వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ దేశ ప్రజలకు, సమాజానికి సుద్దులు చెబుతుండగానే వివిధ డిమాండ్లతో రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలు ఢిల్లీలో ఆందోళన చేశాయి.

Child rapedఏం జరిగింది?

అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ది హిందు పత్రిక పాప బంధువులను విచారించింది. పాప బాబాయి సంఘటనల క్రమాన్ని పత్రికకు వివరించాడు. సోమవారం చీకటి పడే సమయానికి పాప కనిపించకపోవడంతో అందరూ వెతకడం ప్రారంభించారు. కానీ వారికి పాప ఆనవాళ్ళు దొరకలేదు. “మేము ఆ తర్వాత ఫిర్యాదు చెయ్యడానికి పోలీసు స్టేషన్ కి వెళ్లాము. కానీ మమ్మల్ని స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. రాత్రి 8 గంటల నుండి ఉదయం 1 వరకు మమ్మల్ని అక్కడే ఉంచారు. ఫిర్యాదు నమోదు చేసుకున్నారు గాని వెతికే ప్రయత్నాలు చేయలేదు. దానికి బదులు మమ్మల్ని ఆ తర్వాత రోజు రమ్మన్నారు. పాప ఫోటో కావాలని కూడా అడిగారు” అని పాప బాబాయి తెలిపాడు. కానీ పోలీసులు మాత్రం పాప సంబంధీకులు వచ్చిన గంటన్నరలోనే ఫిర్యాదు నమోదు చేశామని చెబుతున్నారు.

పాప తప్పిపోయిందని తెలిసిన సమయంలో ఆమె తండ్రి ఇంటివద్ద లేదు. ఆయన పంజాబ్ లో పార్ట్ టైమ్ వ్యవసాయ కూలీగా పని చేస్తుంటాడు. దానితో ఆయనకు విషయం రెండు రోజుల తర్వాత గాని తెలియలేదు. ఆ తర్వాత రోజు పాప ఫోటో తీసుకుని బంధువులు మళ్ళీ పోలీసు స్టేషన్ కి వెళ్లారు. “ఫోటోతో మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాం. కానీ సంబంధిత అధికారి లేడని మాకు చెప్పారు. మళ్ళీ మమ్మల్ని మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల దాకా అక్కడే కూర్చోబెట్టారు. పాప కోసం వెతకడానికి నిర్దిష్ట ప్రయత్నం ఏమీ జరగలేదు. మేము నివసించే భవనంలో సైతం వాళ్ళు వెతకలేదు” అని పాప బంధువు తెలిపాడు. పాప నివసించే అపార్టుమెంటు ఐదు అంతస్ధుల భవనం. దాదాపు 40 గదులు ఆ భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

పాప తప్పిపోయిన సంగతి తెలిసిన తండ్రి బుధవారం తెల్లవారు 4 గంటలకు గాంధీ నగర్ లోని తన ఇంటికి చేరాడు. “అదే రోజు ఆ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో అద్దెకు ఉంటున్న వారు పాప ఏడుపు, కేకలు విన్నారు. వెంటనే మాకు చెప్పారు. తాళం బద్దలు కొట్టి చూడడంతో అక్కడ అమ్మాయి భయంకర పరిస్ధితిలో పడి ఉంది. మేము అప్పుడక్కడ చూసింది చెప్పడానికి మాకు మాటలు రావడం లేదు” అని ఆయన తెలిపాడు. పాప మెడ చుట్టూ తీవ్రంగా కమిలిన గాయాలు ఉన్నాయి. పాప కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. “కానీ వాళ్ళు అక్కడికి రావడానికి బదులు మమ్మల్నే పోలీసు స్టేషన్ కి రమ్మన్నారు. తీరా అక్కడికి వెళ్ళాక అక్కడి నుండి మళ్ళీ మమ్మల్ని ఆ గదికి తీసుకొచ్చారు. ఆ తర్వాతే పోలీసు వాహనంలో పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. విలువైన సమయం వృధా అయిపోయింది” అని బంధువు తెలిపాడు.

“గురువారం సాయంత్రం పాప తల్లి దండ్రులు ఆసుపత్రిలో ఉండగా ఒక పోలీసు, మరొక సివిల్ దుస్తులు ధరించి ఉన్న వ్యక్తి వారి వద్దకు వచ్చారు. వారిని బైటికి తీసుకెళ్లారు. అక్కడ పోలీసు రెండు వేల రూపాయలు తండ్రి జేబులో కుక్కారు. ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దని అతన్ని కోరారు. మళ్ళీ ఏ సహాయం చేయాలన్నా పోలీసులే చేయాలని, వారి కోసం ఎవరూ Manoj kumarరారని బెదిరించే ధోరణిలో మాట్లాడారు” అని ఆ బంధువు తెలిపాడు. పోలీసులపై వచ్చిన ఆరోపణలను విచారించడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. విచారణ జరుగుతున్నందున గాంధీ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధరం పాల్ సింగ్, పరిశోధనాధికారి మహావీర్ సింగ్ లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

రెండు రోజులు కూడు నీళ్ళు లేవు

ఢిల్లీ పోలీసులు నిందితుడు మనోజ్ కుమార్ ను బీహార్ లోని ముజఫర్ పూర్ లో అరెస్టు చేశారు. మనోజ్ చెబుతున్నదాని ప్రకారం పాప చనిపోయిందని భావించిన మనోజ్ కుమార్ సాయంత్రం 7 గంటలకే ఇంటి నుండి రైల్వే స్టేషన్ కి వెళ్లిపోయాడు. 8:30 గంటలకి రైలెక్కి ఏప్రిల్ 16 సాయంత్రానికల్లా తమ సొంతూరు చేరుకుని ఆ తర్వాత రోజు అత్తగారి ఊరు వెళ్ళాడు. పోలీసులు అతన్ని అక్కడే అరెస్టు చేశారు. మనోజ్ చెప్పేదాని ప్రకారం పాపను కిడ్నాప్ చేసిన గంటకే అతను ఇంటినుండి వెళ్ళిపోయి ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అతను వెళ్లిపోయాక అతని పైశాచిక చేష్టలకి అప్పటికే బలై ఉన్న పాప 40 గంటల పాటు కూడు, నీళ్ళు లేకుండా గడిపింది. చనిపోయిందని భావించాడు కనుక పాప వాడి వికారపు అకృత్యానికి అప్పటికి స్పృహ కోల్పోయి ఉండాలి.

మనోజ్ కి సంవత్సరం క్రితమే పెళ్లి అయిందట. పెళ్లయ్యాక తన తండ్రి బిందేశ్వర్ సాహి తో కలిసి ఏడాది క్రితమే ఢిల్లీ వచ్చాడు. తండ్రి ఢిల్లీలో ఒక జ్యూస్ షాపు నడుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. మనోజ్ కి ఇద్దరు సోదరులు, నలుగురు సోదరిలు ఉన్నారు. మనోజ్ పైన హత్యాయత్నం, అత్యాచారం, కిడ్నాప్, పసిపిల్లల అత్యాచారాల నిరోధక చట్టం (పోస్కో) మున్నగు సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు.

మాటలు కాదు….

మాటలు కాదు చేతలు కావాలి అని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ డిమాండ్ చేసినట్లు పత్రికలు చెబుతున్నాయి. అయితే సోనియా గాంధీ పార్టీ నేతృత్వంలోనే ప్రభుత్వం నడుస్తున్న సంగతి ఆమె మరిచినట్లు కనిపిస్తోంది. చట్టాలను అమలు చేయాల్సిన స్ధానంలో ఉండి ఆ చట్టాలను చేతల్లో అమలు చేయాలని ఆమె ఎవరిని కోరుతున్నట్లు? మొదట సమాజంలో కూడా మార్పు రావాలని కూడా సోనియా గాంధీ చెబుతున్న నీతులు కూడా తిరిగి ఆమెకే వర్తిస్తాయి.

ఎందుకంటే సమాజానికి ఒక సాంస్కృతిక మార్గదర్శకత్వం వహించగల అధికారంలో ఉన్నది ఆమెయే. ప్రభుత్వాలు తలచుకుంటే వివిధ సాధనాల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని ఎలా పెంచవచ్చో, సామాజిక, సాంస్కృతిక మార్పులకు సంబంధించిన చొరవను ఎలా రగిలించవచ్చో వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావేజ్ చేసి చూపాడు. ఆయన తన తరపున ప్రజలతో మాట్లాడడానికి ఎవరినీ నియమించుకోలేదు. అధికారులు చేసేపని వారికి అప్పజెపుతూనే ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకున్నాడు. తానే టి.వి స్టూడియోలో కూర్చుని ప్రజలతో నిత్యం గంటల తరబడి సంభాషించాడు.

Hugo Chavezఅధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోనే సూపర్ ధనికులకు మాత్రమే ఉపయోగపడే రాజ్యాంగాన్ని రద్దు చేసి సొంతగా ప్రజానుకూల రాజ్యాంగాన్ని తయారు చేశాడు. ప్రజల ఆమోదానికి పెట్టి అత్యధిక మెజారిటీతో ఆమోదింపజేసుకున్నాడు. ఆమోదింపజేసుకోవడంతోనే ఆయన ఆగిపోలేదు. సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా రాజ్యాంగంలో ప్రజల ప్రయోజనాలకు కల్పించబడిన అవకాశాల గురించి వాటిని ఉపయోగపెట్టుకునే మార్గాల గురించీ ప్రజలకు వివరిస్తూ పోయాడు. ప్రజలకు చైతన్యం అందించే పుస్తకాలు కనపడితే ప్రభుత్వం తరపున ముద్రించి ప్రజలకు ఉచితంగా అందజేసి వాటిని చదవాలని కోరేవాడు. పుస్తకం దగ్గర ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా చదువుతారని ఆయన ప్రజలపై గాఢమైన విశ్వాసం ఉంచాడు.

ఆయన తన ప్రజలపై ఉంచిన  విశ్వాసం వమ్ము కాలేదు కూడా. అమెరికా ప్రోద్బలంతో ఛావేజ్ కు వ్యతిరేకంగా మిలట్రీ కుట్ర జరిగినపుడు ప్రజలే విస్తృతంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలకి దిగారు. వెనిజులాలో ఉన్న మీడియా పూర్తిగా ప్రైవేటు ధనికులవే. ఛావెజే కుట్ర చేశాడని మీడియా చెవినిల్లు కట్టి పోరినా ప్రజలు నమ్మలేదు. టి.వి ప్రచారాలను పక్కకు నెట్టి వీధుల్లోకి వచ్చారు. రాజధాని కారకాస్ లో జనం అధ్యక్ష భవనం పైకి వెళ్ళి సానుకూల మిలట్రీ అధికారుల సాయంతో బందీగా ఉన్న చావేజ్ ను విడిపించుకుని మళ్ళీ గద్దె పైన కూర్చోబెట్టే వరకూ శాంతించలేదు. పాలకులంటే అలా ఉండాలి. పాలకులు ఇవ్వవలసిన చైతన్యం అలాంటి చిత్తశుద్ధితో సాగించాలి. ఇవేవీ చేయకుండా అంతఃపురంలో కూర్చొని సమాజం మారాలి అని ప్రకటనలు జారీ చేయడం ఎవరికి మాత్రం చేతకాదు?

నీతులు, సుద్దులు చెప్పేబదులు, ఆర్భాటపు ప్రకటనలు జారీ చేయడం మాని, దొంగ కన్నీళ్ల ఖర్చు పొదుపు చేసుకుని భారత పాలకులు హ్యూగో ఛావెజ్ ను చదవాలని కొరితే అది అత్యాశ కాదు కదా!?

8 thoughts on “ఢిల్లీ పాప అత్యాచారం: పాలకులారా, ఛావెజ్ ను చదవండి!

 1. ఇలాంటి అత్యాచరాలు జరుగుతూంటాయి. కాదనలేము. కాని దీంట్లొ ముఖ్యంగా పొలిసుల ప్రవర్తనను తప్పుపట్టాలి. ఎందుకంటె వాళ్ళ నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కంపిస్తొంధి. వంద కోట్ల జనాభాని మార్చ లేకపొవచ్చు గాని, పది కొట్ల పొలిసులను మార్చ గలదు కద ఈ ప్రభుత్వము. పొలిసులు కాని వెంటనే ప్రయత్నించి ఉంటే పరిస్తిథి మరొల ఉండెదెమొ? ఫ్రభుత్వం పొలిసులపై ఖటినమైన చర్య థీసుకొవలని నా అభిప్రాయము.

 2. దేశానికి ప్రధాని లేదా అధ్యక్షురాలు కాకపోయినా ప్రభుత్వాన్ని నడిపిస్తోంది మాత్రం అక్షరాలా సోనియాగాంధీయే. దేశంలో జరుగుతున్న అత్యాచారాలన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సోనియాగాంధీనీ వీధుల్లోకి లాగాల్సిన తరుణం కూడా ఇదే. ఆమె సానుభూతి, సంతాపాలు, సందేశాలు, హెచ్చరికలు కాదు ఇప్పుడు కావాల్సింది. అనేక విషయాల్లో తను అనుకున్న పనులు చేసుకుపోయే సోనియాగాంధీ ఇప్పుడు ఈ దారుణాలకు ఏం సమాధానం చెబుతారు, పరిష్కారం ఏం చూపుతారన్నదే ప్రజలకు కావాల్సింది.

  నూతన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని కనీస సామాజిక బాధ్యత మరచి కేవలం తను, తన కుటుంబం, తన సౌఖ్యం, తన స్వార్థం, తన అవసరాల చుట్టూ తిరిగే జీవన శైలి అనివార్యంగా అందరికీ అంటుకుంది. ఆపదలో వున్న తోటివారికి తోచిన మేరకు సాయం చేయాలన్న నైతికత కొరవడింది. దీనికి తోడు సమాజంలో చైతన్యం రగిలించాల్సిన, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించాల్సిన మీడియా సంచలన వార్త దొరికింది కదా అని రకరకాల కోణాల్లో స్వంత అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు, మళ్ళీ రాజకీయ నాయకుల అభిప్రాయాలతో రోజంతా చర్చలు సాగిస్తున్నాయి. కానీ మౌలికమైన విషయాల జోలికి మాత్రం వెళ్ళడం లేదు.

  మహిళను సాటి మనిషిగా కాకుండా కేవలం లైంగిక అవసరాలు మాత్రమే తీర్చే మనిషిగా చూపెట్టే సంస్కృతిని, పురుషాధిక్య భావజాలాన్ని, సినిమాలను, టీవీ సీరియళ్ళను, సెన్సార్ బోర్డును, విచ్చలవిడితనాన్ని, విశృంఖలత్వాన్ని చూపెట్టే ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ వెబ్ సైట్లను విమర్శించకుండా నిర్బయ లాంటి చట్టాల గురించి, ఉరి శిక్షల గురించి మాట్లాడి ప్రయోజనం లేదు.

  ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు కన్నీటి బొట్లు రాలుస్తున్నారు లేదా దోషులను కఠినంగా శిక్షించాలని ఘోషిస్తున్నారు. అంతకు మించి వారి చేతుల్లోనే వున్న చట్టం అమలు గురించి స్వీయ విమర్శ చేసుకోవడంగానీ, యువతలో రేకెత్తుతున్న చెడు ఆలోచనలకు మూల కారణాల గురించిగానీ, పాలకులుగా వారి జవాబుదారీ తనాన్ని గురించి గానీ పల్లెత్తు మాట మాట్లాడకపోవడం, కనీసం బాధ్యత గలిగిన మీడియా సైతం ఈ విషయాలపై దృష్టి సారించకపోవడం దురదృష్టం అనే కంటే దౌర్భాగ్యం అని అనడం సమంజసం.

 3. ఇది మన వ్యవస్థ లో జరిగిన సంఘటన కాబట్టి దీనికి బాద్యత అందరిదీ అవుతుంది మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మూల్యం అందరూ చెల్లించుకొవాల్సిందే ఏ ఒక్క సోనియ గాంధి మీదో పొలీసుల మీదో తోస్తే సరిపోదు మనం అంగీకరించినా అంగీకరించపోకున్నా action ki reaction untundi

 4. —- —- —– —-


  ఈ వ్యాఖ్య అపార్ధాలకు తావిచ్చేదిగా ఉందని వ్యాఖ్య రచయిత (రామమోహన్) భావిస్తూ, తొలగించాలని కోరారు. అందువలన తొలగిస్తున్నాను. -విశేఖర్

 5. మనకి మన నీల్లని వేరే దేశం కంపెనీ సీసాల్లో పెట్టి ఆ బ్రాండ్ పేరుతో అమ్మినట్లు మన మాంసాన్ని వాల్ల కంపెనీ పేరుతో అమ్మినట్లు మన రాజకీయనాయకులని చావెజ్ బ్రాండ్ తొడూక్కొమంటారా ……….. కాదు చావెజ్ భావాలని ఆదర్శం గా తీసుకొమంటారా ఐతె మన దేశం లో నాయకులు ఆదర్శం గా మనకి పనికి రారా ??????????????????????????

 6. నాకు తెలిసి ఇదంతా అగ్నానము తో జరుగుతున్నదే ఐనా మనుషులు ప్రత్యుత్పత్తి వ్యవస్తలని అందం అని ఇంకేదో ఆని మన కవులు వర్ణీస్తున్నంత వరకు మనుషులు ఆనందిస్తున్నవరకు ఈ అవస్త్తలు తప్పవు …………

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s