ఐదేళ్ల పాప అనుభవించిన అమానుషం చెప్పనలవి కాదు…


ఎన్.డి.టి.వి

ఎన్.డి.టి.వి

అదే రాజధాని నగరం. అదే తరహా అత్యాచారం, అదే పోలీసులు, అదే నిష్క్రియాపరత్వం, అదే అవహేళన, అదే వర్గ స్పృహ…! వయసొక్కటే తేడా. ఈసారి అత్యాచారం బాధితురాలి వయసు కేవలం 5 సంవత్సరాలు. శారీరక బాధ తప్ప తనను ఏం చేస్తున్నాడో తెలియని పసి వయసు. జరిగిన అమానుషం ఏమిటో ఊహించుకోలేని మనసు.

అభం శుభం తెలియని ఆ పాప ఎప్పటిలాగా ఆడుకోడానికి బైటికి వచ్చింది. ఎప్పటి నుండి కన్నేసాడో గాని మానసిక వైపరీత్యంతో, శారీరక మద వాంఛతో కొట్టుకు చస్తున్న 30 యేళ్ళ పశువు మగాడు (పశువునెందుకు అవమానించడం?) కిడ్నాప్ చేశాడు. పాప తల్లిదండ్రులు నివాసం ఉండే అపార్టుమెంటు లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తున్న ఆ క్రూరుడు నాలుగు రోజులు బందీగా ఉంచుకున్నాడు. పదే పదే అత్యాచారం చేశాడు. అదీ చాలక కొవ్వొత్తులు, నూనె సీసాలు ఆ పాప మానం లోపలికి నెట్టేశాడు. డాక్టర్లు పసిగట్టి బైటికి తీసేదాకా ఆ తల్లిదండ్రులకి తెలియదు, చెప్పలేని బాధతో విలవిలలాడటం తప్ప ఆ పాపా చెప్పలేదు. తమ సర్వీసులో ఇంత ఘోరం ఎప్పుడూ చూడ్లేదని డాక్టర్లు సైతం షాక్ లో ఉన్నారు.

పాప కనిపించక పోలీసులకి ఫిర్యాదు చెయ్యబోతే అసలు ఫిర్యాదే తీసుకోలేదు. ఆ తల్లి, తండ్రి బతిమాలినా కసిరికొట్టారు. కనిపించకుండా పోయిన నాలుగు రోజుల తర్వాత పాప ఆర్తనాదాలు చెవిన బడేసరికి ఇరుగు పౌరుగు విని పాపని కనుగొన్నారు. పాప కనపడ్డాక పోలీసులకు మళ్ళీ ఫిర్యాదు చెయ్యబోతే గొడవ చెయ్యొద్దని వారిని పోలీసులు కోరారు. 2,000 రూపాయలు ఇచ్చి నోరుమూసుకుని ఉండమన్నారు. గట్టిగా అడగబోతే పాప బతికే ఉందికదా సంతోషించమన్నారు. పాప కోలుకోడానికి దేవుడ్ని వేడుకోమ్మని ఓ ఉచిత సలహా కూడా పడేశారు. పాప గురించి ప్రశ్నిస్తున్న ఒక ఆమ్ ఆద్మీ పార్టీ యువ మహిళా కార్యకర్తను ఎసిపి పదే పదే చెంపమీద కొట్టి తాము మారలేదని, మారబోమని చాటుకున్నాడు. (ఇక్కడ ఎన్.డి.టి.వి వీడియో చూడండి.) ఎ.సి.పి పేరు బి.ఎస్.ఆహ్లావత్ అని తెలుస్తోంది.

పోలీసుల వ్యవహారం తెలిసి పత్రికలు విచారిస్తే పోలీసులు కధలు మొదలు పెట్టారు. తాము ఫిర్యాదు ఇచ్చిన వెంటనే తీసుకున్నాం అన్నారు. తాము పార్కులు, రోడ్లు వెతుకుతున్నామని, అదే అపార్ట్ మెంటులో ఉంటుందని అనుకోలేదని కాకమ్మ కధలు చెప్పారు. మళ్ళీ తామే పాపను కనుగొన్నామని, వెనువెంటనే ఆసుపత్రిలో చేర్పించామని కూడా అబద్ధమాడారు. పాప కేకలు విని పొరుగువారు కనిపెట్టేవరకూ తాము అసలు పాప గురించి పట్టించుకోనేలేదన్న విషయాన్ని దాచిపెట్టడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. కాగా యువతిపై చేయి చేసుకున్న ఎసిపి ని సస్పెండ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

ప్రధాన మంత్రి యధావిధిగా దుర్ఘటన పట్ల తాను తీవ్రంగా కలత చెందానని ప్రకటించాడు. ఢిల్లీలో స్త్రీలను కాపాడడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలం అయ్యారని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మమత శర్మ ప్రకటించింది. పోలీసులు ఢిల్లీ ప్రభుత్వం చేతుల్లో లేరు గనక రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదని ఆమె నమ్మబలికింది. పాపను ఎటువంటి సౌకర్యాలూ లేని ఆసుపత్రి నుండి ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్పించాలని కోరితే ఈ రోజు శుక్రవారం కనుక తానాపని చేయలేనని, శనివారం తానా సంగతి చూస్తానని వాయిదా వేసింది. ఒక పక్క ఆమె పాపకు మెరుగైన వైద్యం కల్పించడంలో తన అశక్తత వ్యక్తపరుస్తుండగానే మరో పక్క ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల ఆందోళనతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం పాపను ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్పించారు కూడా.

పాపపై జరిగిన ఘోరం చూసి డాక్టర్లు చేష్టలుడిగిపోయారు. “పాప బాగా భయపడిపోయింది. పూర్తి స్పృహలో లేదు. మొదట పరీక్షించడానికి కూడా పాప దగ్గరకు రానీయలేదు. విపరీతమైన నెప్పితో విలవిలలాడింది. జ్వరంతో ఒళ్ళు కాలిపోయింది. మందులు ఇచ్చాక తగ్గుముఖం పట్టింది. కానీ మళ్ళీ జ్వరం పెరగడంతో పాపకి ఇన్ఫెక్షన్ సోకిందని గ్రహించాము.” అని డాక్టర్లు చెప్పారు.

“మత్తు ఇచ్చిన తర్వాత మరిన్ని పరీక్షలు జరిపాము. ఆమె శరీరంలో బైటి వస్తువులు ఉన్నాయని మేము గమనించాము. మూడు కొవ్వొత్తులు బైటికి తీసాము. 200 మిల్లీ లీటర్ల (తల)నూనె సీసా కూడా ఆమె శరీరం లోపల ఉండిపోయింది” అని స్వామీ దయానంద్ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ బన్సాల్ చెప్పాడని ది హిందు తెలిపింది. రానున్న 24 నుండి 48 గంటల వరకు పాప పరిస్ధితి క్లిష్టంగా ఉంటుందని డాక్టర్ తెలిపాడు. ఈ లోపు పరిస్ధితి చెప్పలేమని స్పష్టం చేశాడాయన. ప్రైవేటు భాగాల వద్ద, ఛాతీ, పెదవులు, బుగ్గల పైన తీవ్ర గాయాలున్నాయి. గొంతు పైన కూడా గాయం అయింది. దాన్ని బట్టి ఆమెను గొంతు పిసికి చంపే ప్రయత్నం చేసి ఉండొచ్చని భావిస్తున్నామని డాక్టర్ తెలిపాడు.

నిందితుడు తప్పించుకున్నాడు. పోలీసులు వారి కోసం ఇప్పుడు వేట మొదలుపెట్టారు. తాము మొదట ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు వెతికితే పాపకి ఈ నరకం తప్పి ఉండేదని తల్లి దండ్రులు ఆక్రోసిస్తున్నారు. సోమవారం తప్పిపోయిన పాప గురువారం కేకలు విని పొరుగువారు గమనించేవరకూ తన గదిలో బందీగా ఉంచాడని వారు కన్నీరుమున్నీరయ్యారు. “నేను ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చెయ్యడానికి వెళ్ళినపుడు ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. వారు సరిగ్గా ప్రయత్నించి ఉంటే పాప దొరికి ఉండేది. ఆమె బతికి ఉన్నందుకు సంతోషించమని నాతో అన్నారు” అని పాప తండ్రి అన్నాడు. డాక్టర్లు కూడా తమకేమీ చెప్పలేదని, పాప పరిస్ధితి క్లిష్టంగా ఉందన్న మాట తప్ప ఏమీ చెప్పలేదని ఆయన తెలిపాడు.

తాము పాప గురించి విచారించడానికి పోలీసు స్టేషన్ కి వెళితే పోలీసులు నిర్దయగా మాట్లాడారని పాప త్వరగా కోలుకోవాలని దేవుడికి మొరపెట్టుకొమ్మన్నారని పాప సమీప బంధులు తెలిపారు. గాంధీ నగర్ లోని తమ అపార్టుమెంటులోనే పాప దొరికాక విషయాన్ని పెద్దది చెయ్యొద్దని పోలీసులు తనను కోరారని అందుకు ప్రతిఫలంగా రెండు వేలు ఇవ్వజూపారని పాప తండ్రి ఆరోపించాడు. పాపని ఇంటికి తీసుకెళ్లి త్వరగా కోలుకోవాలని దేవుడికి మొరపెట్టుకోండి అన్నారని తెలిపాడు.

ఈ ఆరోపణలను పోలీసులు తిరస్కరించారు. సీనియర్ అధికారులే ఆరోపణలను కొట్టిపారేశారు. పోలీసుల పైన ఆరోపణలు చేసే ధైర్యం పాప తల్లిదండ్రులకు ఎక్కడి నుండి వస్తుంది. పాప తప్పిపోయిందన్న ఫిర్యాదును నమోదు చేయించుకోలేని తల్లిదండ్రులు తమకు పోలీసులు లంచం ఇవ్వజూపారని ఆరోపించగలరా? పాప తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించినందుకు ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారని ఎన్.డి.టి.వి తెలిపింది.

జ్యోతి సింగ్ పాండే దుర్ఘటన జరిగిన తర్వాత కూడా ఢిల్లీలో అత్యాచారాలు ఆగలేదు. పోలీసుల బుద్ధి మాంద్యపు వికార ప్రతిస్పందనలు కూడా కట్టడి కాలేదు. మరీ ఘోరంగా ముక్కుపచ్చలారని పసి పిల్లలపైన ఇంత వికారపు కోరికలు పెంచుకునే దరిద్రులను తయారు చేస్తున్న సమాజాన్ని అనాలి.  చట్టాలు మాత్రం తయారయ్యాయి. నిర్భయ చట్టం కోసం ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో తమ సామాజిక చైతన్యాన్ని పార్లమెంటు ప్రసంగాల్లో ఒలకబోసి బల్లలు చరిపించుకున్నారు. ఈసారి పార్లమెంటులో ఎవరు కన్నీరు పెట్టనున్నారో, అసలు కన్నీరు తర్వాత సంగతి, కనీస స్పందన ఐనా ఉంటుందో లేదో వేచి చూడాలి.

13 thoughts on “ఐదేళ్ల పాప అనుభవించిన అమానుషం చెప్పనలవి కాదు…

 1. ఐదేళ్ల పాప – కొవ్వత్తి, నూనె సీసా ఏంటి సార్? ఎక్కడ పడితే అక్కడ రక్కాడు ఆ పాపని. మనసంతా ఏదోగా, గొంతు గద్గదం గా ఐపోతోంది. 😥

 2. ఈ విషయం పై స్పందించలన్నా భాధతొ హ్రుదయం ద్రవించి పొతుంది. ఒక భరతీయుడు గా సిగ్గు పదుతున్నా.

 3. నిర్బయ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరిగిన తర్వాత… చట్టాన్నే మార్చేలా ఆందోళనలు జరిగినా కూడా….అదే ఢిల్లీలో మళ్లీ మరో దారుణమైన ఘటన జరగడం అమానుషం.
  అంటే చట్టాలు ఎంతగా మార్చినా..కఠినతరం చేసినా జనాల్లో మార్పు రానంత కాలం చట్టాల వల్ల జరిగేది, ఒరిగేది శూన్యం అని తేటతెల్లమవుతోంది. అసలు సాధారణ పౌరుల్లో కాదు, చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసుల్లోనే లోపం ఉందన్న చేదు నిజాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

  ఎందుకు ఈ తరహా అమానుషాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి.
  నేరం చేస్తే శిక్షకు గురవుతామన్న భయం కూడా నేరస్తులకు ఎందుకు కలగడం లేదు.

  లోపం ఎక్కడుందో లోతుగా ఆలోచిస్తే వాస్తవం బోధపడుతుంది.

  ఉదయం లేచిన దగ్గరి నుంచి పేపర్లు,టీవీలు…ఇంటర్నెట్ లో…అన్నింటిలోనూ….ఆడవాళ్ల శరీరం ఎరగా చూపి వ్యాపారం చేసుకోవడమే.
  ఆ మధ్య ఒక సెల్ ఫోన్ ప్రకటన వచ్చింది.
  ఆ సెల్ ఫోన్….. సదరు ప్రకటనలో కనిపించే హీరోయిన్ బాడీలా నాజూకుగా ఉంటుందట. కనుక ఆ సెల్ ఫోన్ కొని హీరోయిన్ దేహాని తడిమినట్లుగా అనుభూతి పొందాలట. ఎంత సిగ్గు చేటు.
  మా ఫోన్ లో అనేక రకాల ఫీచర్లున్నాయి, మా ఫోన్ నాణ్యమైనది అని చెప్పి అమ్ముకోవాల్సింది పోయి హీరోయిన శరీరాన్ని అడ్డం పెట్టుకుని సెల్ ఫోన్ అమ్ముకోవాలన్న దరిద్రమైన, నీచమైన ఐడియా ఆ కంపెనీకి వచ్చింది.
  ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
  ఇలా వ్యాపార ప్రకటనలే కాదు, పేపర్లు, టీవీలు, ఇంటర్నెట్ లు అన్నింటిలోనూ ఆడవాళ్ల శరీరాన్ని చూపించి వ్యాపారం చేసుకోవడమే …
  హీరోయిన్ ను వేధించి, ఏడిపించి, ఎలాగైనా సరే, తన సొంతం చేసుకున్నవాడే హీరో అనే రీతిలో నేటి సినిమాలు. అటువంటి సినిమాలు చూసిన తర్వాత జనాలు, ప్రధానంగా యువత సమాజంలో అదే తీరులో ప్రవర్తిస్తే ఆశ్చర్యం ఏముంది.

  అంటే పిల్లలకు సామాజిక విలువలు బోధించడంలో మనం విఫలమవుతున్నాం. ఆ విలువలను పునరుద్ధరించే దిశగా చికిత్స జరిగితేనే వ్యవస్ధ బాగుపడుతుంది. అప్పటిదాకా ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. మనందరం గుండెలు బాదుకుంటూనే ఉంటాం.

  అందుకే ఇవాళ అందరూ ఆలోచించాల్సింది వ్యవస్థకు జరగాల్సిన చికిత్స గురించి….

 4. ఎవరో వ్యవస్త్థ కి చికిత్స చేయాలన్నారు ఐనా మనం కాషాయం ధరించే వాల్లని కషాయం తయారు చేసే వాల్లని చట్ట సభలకి పంపితె ఈ కష్టాలు మనకి తప్పవు చికిత్స చేయడం కష్టం నివారణ ఒక్కటె మార్గం మన ప్రభుత్వం రెందు అంకెల అభివ్రుద్ధి కావాలంటుంది అలాంటప్పుడు ఇలాంటివి మనకి తప్పవు

 5. సార్ మీరు మొన్న వనరులు పంపిణీ లొ అన్యాం జరుగుతుంది అన్నారు ఇప్పుడు మా వనరులు మాకే కావాలంటున్నారు మా దగ్గరె వాడాలంటున్నారు అలాంటప్పుడు ఎక్కడ నుంచో సహజ వాయువు తెచ్చుకుంటున్నాం ఈ మాటే ఆ గల్ఫ్ దేశాల వాల్లు అంటె మనం ఈ రోజుల్లొ మన ఇల్లల్లొ వంట చేసుకొగలమా

 6. మార్పు రావాలంటే , అది ( ఆడ శిశువు ) గర్భ విచ్చిత్తి ( అబార్షన్ ) చేయించుకునే తల్లి నుంచీ , చేసే డాక్టర్ల నుంచీ , మొదలవాలి !
  ఇంగ్లండు దేశం లో యుక్త వయసు వచ్చే వరకూ తమ పిల్లలను ( అమ్మాయి అయినా అబ్బాయి అయినా ) కనీసం వారి ఇంటిలో ఉంచి, తల్లి దండ్రులు బయటకు వెళ్ళినా కూడా అది నేరమే ! అంటే చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఎప్పుడూ సూపర్వైజ్ చేస్తూ ఉండాలి ! అంటే తలి దండ్రుల బాధ్యత ఎప్పుడూ ఉంటుంది.
  పులులూ, సింహాలూ , మొస ళ్ళూ , కేవలం జూలకే పరిమితమయాయని అనుకునే రోజులు పొయాయి. కేవలం మానవుల రూపం లో, అంతకన్నా క్రూరమైన ” జంతువులూ ” ఉంటాయని ప్రజలు మర్చి పోకూడదు, ఎప్పుడూ !
  ఇక్కడ పోలీసులు చేసింది ఏమీ లేదు ! పైగా అడిగిన వారి మీద తమ ‘ ప్రతాపం’ చూపించారు ! ఇది చాలా గర్హనీయం !

 7. కషాయం గురించి అర్దం కాకుంటె వదీలేయండి ఇక వనరుల గురించి వి శెఖర్ గారికి చెప్పా మొన్న నాకు ఆయనకి జరిగిన డిస్కషన్ గురించి కషాయం గురించి అర్దం కావాలంటే మీరే అర్దం చెసుకొండి నేను వ్యవస్త గురించి రాస్తే మీకు ఆ కషాయం ఒక్కటె అర్దం ఐందా……

 8. సార్ పోలీసుల నిష్క్రియాపర్వం అన్నారు నాకు తెలిసి పోలీసులు చాల అతి క్రియాపర్వులు లెకుంటె వాల్లు ఈ మధ్య ఆడ వాళ్లు వారి సంచుల్లొ కారం పొడి పెట్టుకోని తిరగమంటున్నారు దాన్ని ఏమనాలి నిష్క్రియాపర్వమా అతిక్రియాపర్వమా???????

 9. చాలా చాలా ఘోరం.
  నిజమేనండి…….ఇంత వికారపు కోరికలు పెంచుకునే దరిద్రులను తయారు చేస్తున్న సమాజాన్ని అనాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s