మైనస్ జె.డి(యు), మోడి ఇమేజ్ భారం బి.జె.పి ఆపగలదా? -కార్టూన్


The Hindu

The Hindu

బి.జె.పి లో నరేంద్ర మోడి అనుకూల ప్రచారం ఇతర నాయకులకు అలవి కానంతగా పెరిగింది. మోడి తప్ప దేశానికి దిక్కు లేదని దేశ ప్రజలకు నచ్చజెప్పడానికి ఆయన పార్టీ మద్దతుదారులు, అభిమానులు చెవినిల్లు కట్టి పోరుతున్నారు. మోడీకి ముందే జరిగిన గుజరాత్ అభివృద్ధిని కూడా మోడి చలవే అని తాము నమ్మి ఇతరులను కూడా నమ్మమంటున్నారు. మోడి ప్రధాని అయితే మంత్రి పదవులు దక్కుతాయన్న అసవల్లనే యేమో గాని బి.జె.పిలో ఆరెస్సెస్సేతర నాయకులైన యశ్వంత్ సిన్హా లాంటివారు సైతం మోడి భజన అందుకున్నారు. ఇన్ని ప్రచారాల మధ్య ప్రధాన మంత్రి పదవి ఆకాంక్షిస్తున్న ఎల్.కె.అద్వాని ఏమీ మింగలేక, కక్కలేక మౌనముద్ర దాల్చి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ పరిస్ధితుల్లో మోడి సృష్టిస్తున్న కృత్రిమ గాలిని అడ్డుకోవాలంటే మిత్రపక్షాల బలం తీసుకోక తప్పదని ఈ కార్టూన్ సూచిస్తోంది. ముఖ్యంగా మోడి ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో జనతాదళ్ (యు) మొదటి నుండి చురుకుగా ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా నరేంద్ర మోడిని తూర్పారబడుతూ, ఆయన సెక్యులరిస్టు క్రెడెన్షియల్స్ ని ప్రశ్నిస్తూ, మోడి వ్యతిరేకత గాలి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. తమ మీదికి ప్రమాదకరంగా దూసుకు వస్తున్న సో కాల్డ్ మోడి ప్రభంజనాన్ని నిలువరించాలంటే బి.జె.పి నాయకులకు సైతం జె.డి(యు) సహాయం తప్పనిసరి అయినట్లు కనిపిస్తోంది. కనుక జె.డి(యు) పార్టీని ఎన్.డి.ఏ కూటమిలో ‘ఉంటే ఉండండి, పోతే పొండి’ అని దులపరించడం ఆత్మహత్యా సదృశమే కాగలదని కొందరి అంచనా!

18 thoughts on “మైనస్ జె.డి(యు), మోడి ఇమేజ్ భారం బి.జె.పి ఆపగలదా? -కార్టూన్

 1. intakanna hardcore politicians like bal thakre lk advani valla valle kaledu modi ki gujarat aytene correct aa state dati bytaki vaste ante sangati kani ee bhajan batch modini kuda byataki lagi gujarat lo kuda lekunda chestaru ade politics ante untadi india ni rule cheyatam rughtist la valla leftist la valla kadu alaa ayte eppudo leftist ayna jyoti basu pm ayi undevadu kaledu rightist ayna advani ayye vadu kaledu kabatti centrist ke aa chance untundi ani naa opinion ???????????

 2. @సాయి: తెలుగులో వ్యాఖ్య రాయడానికి కింద లేఖినికి లింక్ ఇచ్చాను. మీరు టైప్ చేస్తున్నట్లే లేఖినిలోని పై బాక్స్ లో ఆంగ్లంలో తెలుగు టైప్ చేస్తే కింద బాక్స్ లో తెలుగు లిపి కనిపిస్తుంది. అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చెయ్యొచ్చు. ఈసారి ఈ సౌకర్యాన్ని వినియోగించండి.

 3. సాయి గారు,

  మీకు ఇది తేలికే అయినా చదివే వారికి కష్టం. ఆసక్తి ఉండదు. చదవకుండా వదిలేసి పోతారు. ఇక మీరు రాసి లాభం లేదు. అలవాటైతే లేఖిని తేలిక.

  ఉదాహరణకి: పై వ్యాఖ్య లేఖినిలో ఇలా వచ్చింది.
  >>ఆ లెఖిని కన్న ఈ తెంగ్లిష్ బెత్తెర్ సిర్ అందులొ నా మాతలు అన్నీ మారిపొయి గందరగొలం అవుతుంది>>

  దీర్ఘం అవసరం ఐన చోట కేపిటల్ లెటర్ ఇవ్వాలి. ఉదాహరణకి lEkhini = లేఖిని. పరుషం అవసరం అయినచోట కూడా కేపిటల్ లెటర్. ఉదా: beTar = బెటర్, దీర్ఘం ఉన్నపుడు రెండుసార్లు ఇచ్చినా ఓ.కె. ఉదా: maaTalu = మాటలు. అ కోసం a వాడాలి. ఉదా: sar = సర్. ఒక్కోసారి సున్నకి M ఇవ్వాలి. ళ కోసం కేపిటల్ ఎల్ వాడాలి. ఉదా: gandaragOLam = గందరగోళం.

  ఇలాగే అన్నీ.

 4. ఆసక్తి ఉంటే ఎందులొ ఐనా చదువుతారు సార్ ఐనా తెలుగువార్తలు అన్నారుగా తెలుగు లొనె రాస్తా

 5. నేను సోమవారం మిమ్మల్నిభారతదేశ సరిహద్దులు ఆర్యుల కాలం లో ఏవి అని అడిగా అది తెలిస్తె ఎవరు దాడులు చేసారో తెలుస్తుంది

 6. ఆర్యులనేవారు ఎవరూ లేరని కదా ఆర్టికల్ లో చెప్పింది. ఉన్నదల్లా ఇండో-ఆర్యన్ భాషలు మాట్లాడేవారే. దాడులు జరగలేదు, వలస వచ్చారు అని చరిత్రకారులు చెబుతున్నట్లు చెప్పాను. కనుక దాడి జరిగినప్పుడు సరిహద్దులు ఏమిటి అన్న ప్రశ్న ఉండదిక.

  ఆర్యుల కాలం అంటే మీ అర్ధం ఇండో-ఆర్యన్ భాషలు మాట్లాడేవారు వచ్చినపుడు అని అనుకుంటా. అదే అయితే అప్పటికి భారత దేశ సరిహద్దులు అంటూ ఏమీ లేవు. రాచరికాలు కూడా పూర్తిగా అభివృద్ధి కాని కాలం అది. కనుక వలస వచ్చినపుడు సరిహద్దులు ఏమిటి అన్న ప్రశ్నకు అర్ధం లేదు.

  భారత ఉపఖండం సరిహద్దులకు బ్రిటిష్ వాడి రాకవల్లనే ఒక రూపం వచ్చింది. వాళ్లు రాకపోయి ఉంటే జాతుల రాజ్యాలు ఏర్పడి ఉండేవని నాకనిపిస్తుంది. ఎందుకంటే చరిత్రలో వివిధ చోట్ల జరిగిన పరిణామాలు అలానే జరిగాయి. బానిస, ఫ్యూడల్ కాలాల్లో యూరప్ రాజ్యాలు అలానే ఏర్పడ్డాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ అభివృద్ధి చెందాక కూడా ఇటీవలి దశాబ్దాలలో ఉత్తర ఐర్లండ్, బాల్కనీకరణ (1990) లాంటి పరిణామాల రూపంలో అక్కడ జాతుల ప్రాతిపదికన రాజ్యాల ఏర్పాటు కొనసాగుతూనే వచ్చింది.

  తెలంగాణ, కాశ్మీరు మీరు ఒక గాటన కడుతున్నారు. అది కరెక్టు కాదు. కాశ్మీరు ప్రజలు దేశం కోసం పోరాడుతుంటే తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. ఉత్తరఖండ్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు ఇటీవల ఏర్పడినవే. రాష్ట్రం కోరడం మీరు భావిస్తున్నట్లు చెయ్యకూడని పాపం కాదు. ప్రపంచంలో ఏ ప్రాంతం వారయినా తమ వనరులు తమకు దక్కనపుడు స్వయం పాలన కోరే హక్కు ఉంటుంది. అదేమీ ఒకరు దయాదాక్షిణ్యాల పైన, భావోద్వేగాల పైన ఆధారపడేది కాదు.

  భారత దేశం ఐనా, ఎక్కడైనా వనరుల పంపిణీ న్యాయబద్ధంగా జరగకుండా, అలాంటి పంపిణీ కోరినవారిని అణచివేస్తే తిరుగుబాటు తప్పనిసరిగా తలెత్తుతుంది. అది ప్రకృతి సహజం. గదిలో పెట్టికొడితే పిల్లైనా తిరగబడుతుంది అని సామెత. మనిషి ఎందుకు తిరగబడడు. కాకపోతే వివిధ జాతుల, ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను మనం ఎలా అర్ధం చేసుకుంటున్నాం అనేదాని పైన ఆధారపడి తిరుగుబాటు/రాష్ట్ర కోరిక/దేశం కోరిక లాంటి వాటిని మనం చూస్తాం. మీ అవగాహన కూడా అందులో భాగమే.

 7. ఎన్ని రాష్త్రాలు ఇచ్చినా సమస్య లెదు రాష్ట్రం కావాలంటే కేంద్రం ఇవ్వాలి వాల్లు తీసుకోవాలి 100 సేట్లు లెక్కలు ఎందుకు
  political campaign ???? political gain???????

 8. తిరగబడతారు అన్నారు మన sysyem లొ తిరగబడే వాల్లకి పని జరగదు అలా ఐతె తిలక్ భగత్ సింగ్ కాలం లొనె frredom vachedi గాంధి అవసరం ఉండేది కాదు కదా!!!!!!!!!!!!

 9. రాష్ట్రం కోరడం పాపం అని నేను భావిస్తున్నానన్నారు పాపం పుణ్యం గురించి ఇది అలోచించె బ్లాగ్ కాదు వార్తలు విస్లెషణలు అంతె ఐనా కొత్త రాష్ట్రం వస్తె సమస్య ఏముంది నా స్కూల్ రోజుల్లొ 26 రాష్ట్రాలు ఉండెవి తర్వాత 30 kotha state vaste 31 అంతకన్న ఎమి కాదు పొటీ పరిక్ష ల్లొ ఉపయొగపడతాయి అంతె……….

 10. తెలంగాణ కి కాశ్మీర్ కి పోలిక పెట్టానని అన్నారు నాకు ఇంకా అంతబుద్ధి మాంధ్యం రాలెదు దేశంలొ ఆర్ధిక మాంధ్యం లాగ……… మళ్ళి భవిష్యత్ లొ ఎవరన్న అప్పటి చరిత్ర లో లాగ మమ్మల్ని ఏ దెశానికన్న అద్దెకి ఇస్థారెమొ ఆని నా గోల ఒకసారి మమ్మల్ని ఫ్రెంచ్ వాల్లకి తర్వాత బ్రిటిష్ వాల్లకి ఇచ్చారంట బుక్స్ లొ చదివా ఈ సారి మళ్ళీ ఇస్తె పరిస్తితి ఏంటి????

 11. వనరుల పంపిణీ అని అన్నారు నా ఒపినియన్ ప్రకారం ఇదంతా అస్థిత్వం కొసం జరుగుతున్నది కాశ్మీర్ ఐనా తెలంగాన ఐనా కాని ఇండియ అనె ఇంత పెద్ద దేశము లొ ఉంటూ ఈ పోరాటాలన్నీ ఎందుకు ????? నా భావం అర్దం ఐంది అనుకుంటా తెలంగాన గురించి కాదు భారత్ దెశం గురించి తెలంగాన తొ, కాశ్మీర్ తొ నాకు సంబధం లెదు నాకు అంటించ కండి

 12. అసలు ఈ చర్చ అంతా దక్షిణ భారత దేశం మీద ఆర్టికల్ తొ మొదలైంది అందులొ గొండులు సంతాలులు వంటి వారు భూమిపుత్రులు అన్నారు మరి మిగతా వారు ఎవరు నేను ఆ వర్గాలకి చెందిన వాదిని కాదు మరి నేను భూమి పుత్రుడిని కాదా దానికి మీరు నా పూర్వికులు ఆ వర్గాలు కి చెందిన వారు అయుంటారు అంటారు అంటె మనం అంత ఒకే కామన్ అన్సెస్టర్ నుంచి వచ్చాం అంటారు అని నేను అనుకుంటున్నను నిజమా కాదా చెప్పండి

 13. గది లో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది అన్నారు అసలు ఎవరిని పిల్లి లాగ గదిలో పెట్టారు వాల్లు గదిలో కూర్చుని గెడీ పెట్టుకుని వాళ్ళ కళ్ళు వాళ్ళు పొడుచుకుని ఎవరో కొడుతున్నారని అరవటం ఎంతవరకు న్యాయం ఐన విషయం ??????? ఐన మనం పిల్లులం కాదు ……మనుషులం పాపం వాటికి తెలివి లేక కొదితే కొట్టిఛ్ఛుకుంటాయి కాని మనం తెలివి గల జంతువులం అందితె జుట్టూ లేకుంటె కాల్లు పట్టుకుంటాం పీల్లులతొ పోల్చకండి అవి బాధ పడతాయి

 14. నా కామెంట్ పాపం గా భావింపబడితె దానికి కారణమైన వారిని ఏమనాలి మీరే చెప్పండి సార్ ……………

 15. మీరు చెప్పినట్ళు భారత సరిహద్దులు బ్రిటీష్ కాలం లొ ఏర్పడి ఒక రూపం ఏర్పడింది కాని అంత కన్నా చాలా సంవత్సరాల ముందు నుంచి ఈ దేశంలొ రాజకీయ ఏకీకరణ భౌగొలొక ఏకీకరన లేకున్నా ఇది భారత భూమి అనె భావ ఏకీకరణ ఉంది అప్పట్లొ దీనిని భరత ఖండం అనో భరత వర్షం అనో అనేవారు అనుకునేవారు అందరూ భారతీయులమనే అనుకునెవారు ఇది నిజమా ???????? కాబట్టి అప్పుడూ ఇప్పుడూ అందరూ ఒక్కటె అందరూ ఈ భూమి పుత్రులే ………….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s