గుజరాత్ లోపల మోడి వాలి టైపు. వాలికి ఎదురు నిలబడి పోరాడినవాడి నుండి సగం బలం వాలికి వచ్చి చేరుతుందట! దానితో శ్రీరాముల వారు సైతం చెట్టు చాటున నిలబడి దొంగ దెబ్బ తీయక తప్పలేదు. మోడి విషయం కూడా అంతే. ఆయనను ఎంత విమర్శిస్తే మోడీకి అంత బలం. మోడిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మోడీకి ఇంకా బలం. గత మూడు ఎన్నికల్లో అదే జరిగింది. తనపైన ప్రత్యర్ధులు విరుచుకుపడినప్పుడల్లా దానిని ‘గుజరాత్ ఆత్మాభిమానం’ కింద మలుచుకుని మోడి లబ్ది పొందారు.
గుజరాత్ మారణకాండలో మోడి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ పాత్రను ధ్రువపరుస్తూ ఆయన అనుచరులు, ఎమ్మెల్యేలతో సహా, తెహెల్కా రహస్య కెమెరా ముందు దొరికిపోయినా దానిని సైతం మోడి తనకు అనుకూలంగా వినియోగించుకోగలిగారు. చివరికి పరిస్ధితి ఎలా తయారైందంటే ‘బి.జె.పి యే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కుట్ర పన్ని స్టింగ్ ఆపరేషన్ జరిపించుకుందని’ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దానితో హతాశులవడం తెహెల్కా విలేఖరుల వంతయింది. ఎంతో కష్టపడి, రిస్కు తీసుకుని మోడి పాత్రను బైటపెడితే దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేని దివాళాకోరు పాత్ర ఈ సో కాల్డ్ ‘సెక్యులరిస్టు’ కాంగ్రెస్ పార్టీది.
గుజరాత్ బైట మాత్రం మోడిని ఎంత విమర్శిస్తే తమకు అంత బలమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభిప్రాయం అనుకుంటాను. మోడి ‘సెక్యులరిస్టు క్రెడెన్షియల్స్’ పైన ఆరోపణలు చేసి ఆయనను బీహార్ ఎన్నికల ప్రచారానికి రాకుండా నితీష్ అడ్డుకున్నారు. రెండు సార్లు ఎన్నికల్లో విజయం కూడా సాధించిన నితీష్ ‘యాంటీ-మోడి’ బ్రాండు బీహార్ లో ఎంత అవసరమో నితీష్ కనిపెట్టారు. మోడి గదాయుధంతో కండలు పెంచుకుని ప్రదర్శిస్తున్న నితీష్ ఇక్కడ ఆ విషయమే చెబుతున్నట్లుంది.
ఈ మధ్య జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కూడా జె.డి(యు) నాయకులు మోడి పైన విరుచుకుపడి తాము ‘సెక్యులరిస్టులం’ అని చాటుకునే ప్రయత్నం చేశారు. భారత రాజకీయాల్లో ‘సెక్యులరిజం’ అంటే ముస్లింల ఓట్ల పైన కన్నెయ్యడంతో సమానంగా మారిపోయింది. అసలు సెక్యులరిజం గురించీ, దానిని ప్రజల జీవన విధానానికి అన్వయించడం గురించి భారత రాజకీయ నాయకులు మర్చిపోయి చాలాకాలం అయింది.
ఈ వాలి, మొడీ, రాముడు వీల్లంతా వర్ణన ల కేన వ్యవహారం లొ ఏమన్నా ఉపయొగ పడతాయ చెప్పండి
దీన్ని బట్టి నాకు అర్దం ఐంది ఏంటంటె వాలి లాంటి ఎంతటి శక్థి వంతుడైనా నీతి ధర్మం తప్పి ప్రవర్తిస్తె ఆ దేవుడు కూడా నీతి దర్మం తప్పి అంతం చేస్తాడు ఇది సత్యం మీరు దేవున్ని నమ్మినా నమ్మక పోయినా అలాగె రాముడు కూడ తర్వాత జన్మలొ క్రిష్ణుడిగా పుట్టీ అదే వాలి చేతిలొ అలాగె చెట్టు వెనుక నుంచి బాణం తొ కొట్టబడీ చంపబడ్డాడు ఎంతటీ వారికైనా newtons 3 law prakaaram action ki reaction tappadu devudynaa maanavudynaa ee visvam lo antaa okkate ………