అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయి. సెకన్ల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో ముగ్గురు చనిపోగా 130 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. 40 కి.మీ బోస్టన్ మారధాన్ పరుగు పందెం చివరి అంచెలో ఈ పేలుడు సంభవించింది. ప్రేక్షకులు నిలుచున్న చోట పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం ఏరియల్ వ్యూ నుండి తీసిన వీడియోను కింద చూడవచ్చు.
ఈ కింది ఫోటోలను ఆర్.టి (రష్యా టుడే), ది హిందు పత్రికలు అందించాయి.
–