శ్రీలంక: సాయంలో కోత పెట్టిన అమెరికా


అమెరికాలో శ్రీలంక అనుకూల ప్రదర్శన

అమెరికాలో శ్రీలంక అనుకూల ప్రదర్శన

శ్రీలంకకు ఇస్తున్న సహాయంలో అమెరికా కోత విధించింది. మానవ హక్కుల హరణ, మిలట్రీ జోక్యం వల్ల కోత విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి చెప్పినట్లు పి.టి.ఐ తెలిపింది. ఎల్.టి.టి.ఇ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తరాన నివశిస్తున్న తమిళులకు పౌరహక్కులు కల్పించడంలోనూ, నాశనం అయిన నిర్మాణాలను పునర్నిర్మించడంలోను, రాజకీయంగా తమిళులను దేశంలో కలుపుకోవడంలోనూ శ్రీలంక ప్రగతి సాధించలేదని తాము ఇస్తున్న సాయం బాధితులకు అందకుండా మిలట్రీ జోక్యం చేసుకుంటోందని అమెరికా ప్రతినిధి తమ చర్యకు కారణంగా చెప్పాడు.

ది హిందు ప్రకారం దక్షిణాసియాలో అమెరికా సహాయంలో కోత పెట్టిన దేశాల్లో శ్రీలంక దేశమే ఎక్కువ కోత ఎదుర్కొంది. గత వారం విదేశాంగ శాఖ కార్యదర్శి (మంత్రి) జాన్ కెర్రి, అమెరికన్ కాంగ్రెస్ కి సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ కోత ప్రతిపాదించాడట. 2012 లో 11 మిలియన్ డాలర్ల సహాయం కెర్రి ప్రతిపాదించాడని ఇది వాస్తవ ఖర్చు కంటే 20 శాతం తక్కువని అమెరికా విదేశాంగ శాఖలోని సీనియర్ అధికారిని ఉటంకిస్తూ పి.టి.ఐ తెలిపింది.

“శ్రీలంకలో మేము తలపెట్టిన ప్రోగ్రామింగ్ కు చాలా కష్టాలు ఎదురవుతున్న పరిస్ధితికి ఇది ప్రతిబింబం. శ్రీలంక ఉత్తర భాగంలో అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమానికి మేము చాలా చేయాలనుకున్నాం. అక్కడి ప్రజలు (తమిళులు) తిరిగి సాధారణ జీవితం గడపడానికి వీలుగా పునర్నిర్మాణానికి మద్దతు ఇవ్వాలనుకున్నాం. కానీ అనేక చోట్ల మాకు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, మిలట్రీ అందులో తలదూరుస్తున్నాయి. దానితో ఈ కార్యక్రమాలను అమలు చేయలేకపోతున్నాం. కాబట్టి మాకు సమస్యలు ఎదురైన చోట సహాయంలో కోత పెట్టాలని నిర్ణయించుకున్నాం.” అని సదరు సీనియర్ అధికారి తెలిపాడు.

అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం, మిలట్రీ జోక్యం చేసుకుంటున్నాయని అమెరికా అధికారి ఆరోపిస్తున్నాడు. అయితే స్ధానిక జాతీయ ప్రభుత్వానికి అతీతంగా సొంత అభివృద్ధి కార్యక్రమాలను విదేశాలు ఎలా అమలు చేస్తాయి? అభివృద్ధి చేయదలిస్తే అక్కడి ప్రభుత్వం ద్వారానే అది జరగాలి తప్ప సొంతగా చేస్తానంటే ఏ సార్వభౌమ దేశం అయినా ఎలా అంగీకరిస్తుంది?

అమెరికా చెబుతున్న కారణాలు నమ్మదగినవిగా కనపడడం లేదు. అమెరికాకి శ్రీలంకతో ఉన్న సమస్యల్లా ఆ దేశం చైనాకు దగ్గర అవుతుండడమే. మహేంద్ర రాజపక్ష అధికారంలోకి వచ్చినప్పటి నుండి పశ్చిమ దేశాలకు దూరంగా శ్రీలంగా విదేశాంగ విధానం పయనించింది. మహేంద్ర రాజపక్ష పశ్చిమ దేశాలకు అనుకూలమైన రాజకీయ పాలక గ్రూపులకు ఛేందినవాడు కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రేమదాస తర్వాత పశ్చిమ దేశాలకు దూరంగా జరిగిన వ్యక్తి మహేంద్ర రాజపక్ష. ఈయన కాలంలో నార్వే మధ్యవర్తిత్వంలో సాగుతున్న చర్చలు విఫలం కావడంతో పూర్తిస్ధాయి యుద్ధం చెలరేగింది. ఈ యుద్ధంలో చైనా, అమెరికాలు సైతం శ్రీలంక ప్రభుత్వం వహించడంతో ఎల్.టి.టి.ఇ ఓటమి ఖాయం అయింది.

2009లో ఒక లంక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలంక డిఫెన్స్ మంత్రి గొట్టబాయ రాజపక్ష (మహేంద్ర సోదరుడు) అన్న మాటలు ఈ సందర్భంగా గమనార్హం. “అమెరికా, యు.కె, ఇంకా కొన్ని ఇతర పశ్చిమ దేశాలు… ఇవే ముఖ్యమైనవని అనేకసార్లు భావిస్తుంటాం. కానీ స్నేహపూర్వక దేశాలు ఉన్నా వాటిని మర్చిపోతున్నాం. కేవలం వారికి తెల్ల తోలు ఉందనో, విదేశాల్లో పెద్ద పేరు ఉందనో లేకపోతే వాళ్ళిక్కడికి వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేస్తారనో… వారిని చూసి మనం అంత ఉత్తేజం పొందనవసరం లేదు. వారు మననుండి ఏమీ కొనరు. మనకి ఇస్తున్నది కూడా ఏమీ లేదు. మనకి సాయం చెయ్యరు. కానీ వారి తోలు రంగుతో మనం ఉత్తేజితులం అవుతుంటాం” అని గొట్టబాయ వ్యాఖ్యానించాడని శ్రీలంక వార పత్రిక లక్బిమ న్యూస్ తెలిపింది.

ఎల్.టి.టి.ఇ ఓటమిలో ఇండియా, చైనాల సహాయమే కీలకంగా శ్రీలంక ప్రభుత్వానికి ఉపయోగపడింది. చైనా నుండి అత్యాధునిక ఆయుధాలు శ్రీలంకకు అందితే ఇండియా అక్కడి సైనికులకు శిక్షణ ఇచ్చింది. చైనా, ఇండియాలను పోలిస్తే చైనా సహాయమే ఎక్కువగా శ్రీలంకకు ఉపయోగపడినట్లు కొన్ని పత్రికలు చెప్పాయి. భారత దేశంలో తమిళనాడు రాజకీయాల వలన ఉత్పన్నమైన సున్నిత పరిస్ధితి దీనికి ఒక కారణంగా చూడవచ్చు. ఐరాస లో శ్రీలంక శాశ్వత ప్రతినిధి డాక్టర్ దయన్ జయతిలక జెనీవాలో జరిగిన ఒక సమావేశంలో చెప్పిన మాటలు ఇక్కడ ఉదహరించుకోవచ్చు:

“శ్రీలంకకు ఆయుధాలు అమ్మడం పైన ఇతరులు కోతలు, షరతులు విదించాయి. ఒక టెర్రరిస్టు శత్రువుతో పోరాటంలో సాటి ప్రజాస్వామిక దేశం తీవ్ర ప్రమాదంలో పడుతుందని వారు ఆలోచించలేదు. కానీ శత్రువుకు ఆయుధ సరఫరాలో ఎప్పుడూ లోటు రాలేదు. భారీ ఆయుధాలతో సహా అనేక ఆయుధాలను శత్రువు స్మగ్లింగ్ ద్వారా సంపాదించాడు. ఈ పరిస్ధితిలో చైనా ఒక్కటే కేవలం మాటలకు పరిమితం కాకుండా శ్రీలంక స్వతంత్రత కాపాడడం కోసం ఆచరణలో సహాయం చేసింది. శ్రీలంక జాతీయ ఐక్యతకు ఆ దేశం సాయం చేసింది” అని దయన్ అన్నాడు.

దయన్ వ్యక్తం చేసిన సెంటిమెంట్లు శ్రీలంకలోని అనేక సెక్షన్లకు ఉన్నాయి. ఆర్ధిక్కవేత్తలు సైతం అమెరికా ఎగుమతి మార్కెట్ పైన ఆధార పడడం మాని చైనా, ఇండియా లపై ఆధారపడాలని ప్రభోధించారు. నిజానికి చైనా ప్రభావం ఒక్క శ్రీలంక లోనే కాదు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలలో కూడా క్రమంగా, స్ధిరంగా పెరుగుతూ వస్తోంది. చైనా చేస్తున్న వ్యాపారంలో కేవలం వ్యాపారపరమైన సంబంధాలే ఉంటే పశ్చిమ దేశాలు చేసే వ్యాపారంలో అనేక విషమ షరతులు, బెదిరింపులు, లొంగదీసుకునే ప్రయత్నాలు ఉంటాయి. చైనా భవిష్యత్తులో ఎలా మారుతుందో తెలియదు గాని, ఇప్పటివరకు అది ఒత్తిడి, బెదిరింపుల జోలికి పోవడం లేదు. దానితో కాస్త స్వతంత్రత కోరుకునే దేశాలు చైనా సాన్నిహిత్యాన్నే కోరుకుంటున్నాయి. ఇది సహజంగానే పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు గిట్టడం లేదు.

ఫలితంగా శ్రీలంక పైన అమెరికా కత్తి కట్టింది. అసలు విషయం చెప్పకుండా మానవ హక్కులు అంటూ నాటకం ఆడుతోంది. అయితే అమెరికా ఆధిపత్యాన్ని చూపి శ్రీలంకలో శ్రీలంక జాతుల ఆధిపత్యాన్ని ఆమోదించలేము. తమిళులను రెండో తరగతి పౌరులుగా చూసే పరిస్ధితి శ్రీలంకలో కొనసాగుతోంది. తమిళులు నివసించే ప్రాంతాలలోని వనరులను కూడా శ్రీలంక జాతి పెట్టుబడుదారులకే ఆధిపత్యం కొనసాగుతోంది. విద్య, వనరుల పంపకం, రాజకీయాధికారం తదితర రంగాల్లో తమిళుల అణచివేత కొనసాగుతోంది. ఎల్.టి.టి.ఇ ఆవిర్భావానికి, అది సంపాదించిన మద్దతుకు ఇదే కారణం. తమిళులకు వారి న్యాయమైన వాటా, హక్కులు దక్కనంతవరకు ఈ సమస్య ఏదో రూపంలో రగులుతూనే ఉంటుంది. కానీ ఇందులో పశ్చిమ దేశాల చొరబాటు వలన సమస్య పరిష్కారం కాకపోగా మరింత కొనసాగడానికే దారితీయడం ఒక వాస్తవం.

4 thoughts on “శ్రీలంక: సాయంలో కోత పెట్టిన అమెరికా

  1. శ్రీకుమార్ గారు, ఎల్.టి.టి.ఇ, ప్రభాకరన్ ఇలా విడదీసి అభిప్రాయాలు చెప్పుకోవడం అంత అర్ధవంతంగా ఉండదు. ఈ సంస్ధ, దాని నాయకుడు శ్రీలంకలోని జాతుల సమస్య ఫలితం. లంక జాతీయులు, తమిళులపై జాతిపరమైన అణచివేత సాగించడం ఒక నిజం. లంక ప్రజలకు తమిళులపై జాతి పరమైన చిన్న చూపు ఉంది. తమిళులలో అభివృద్ధి చెందిన ధనికులకు రాజకీయ అధికారంలో తగిన ప్రాతినిధ్యం దక్కలేదు. రాజకీయ ప్రాతినిధ్యం అంటే ఆర్ధిక వనరుల్లో తగిన భాగం దక్కలేదని అర్ధం. ఆర్ధిక వాటా దక్కపోవడం వల్ల అది సాధారణంగా రాజకీయ రూపం తీసుకుంటుంది. ప్రత్యేక దేశంగా ఏర్పడితే తమ వాటా తమకు దక్కుతుందన్న నమ్మకం ఎల్.టి.టి.ఇ ఏర్పాటుకు దారి తీసింది.

    తమిళుల డిమాండ్లకు తగిన రీతిలో స్పందిస్తే ప్రత్యేకవాదాన్ని బలహీనపరచడం కష్టం కాదు. కాని అందుకు లంక జాతి ధనిక వర్గం సిద్ధంగా లేదు. సామరస్య పరిష్కారం కంటే అణచివేత పరిష్కారాన్నే అవి ఎంచుకున్నాయి. ఇందులో అంతర్జాతీయ రాజకియాలు కూడా చొరబడ్డాయి. ఇండియా, చైనాల నుండి అమెరికా వరకు. ఎవరి ప్రయోజనాల కోసం వారు ఎత్తుగడలు వేయడం వలన సమస్య పరిష్కారం కాకుండా సాగుతోంది. ఇలా సాగడమే అంతర్జాతీయ స్టేక్ హోల్డర్లకు అవసరం.

    ఈ నేపధ్యంలో కేవలం ఎల్.టి.టి.ఇ, ప్రభాకరన్ ల తప్పొప్పులను చర్చించుకుంటే అది అసలు సమస్యని విస్మరించడం అవుతుంది. తమిళుల ఆర్ధిక (వనరుల్లో తగిన వాటా), సామాజిక (జాత్యహంకారం), రాజకీయ (ప్రభుత్వంలో తగిన స్ధానం) డిమాండ్లు పరిష్కరిస్తే ప్రత్యేక దేశం అవసరం లేకుండానే సమస్య సమసిపోతుంది. ఇప్పటి నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్రేమ్ వర్క్ లో అది జరగదు కనుక సమస్య కొనసాగుతుంది.

  2. this is not my comment on your article aa srilankani chimmappati nunchi chustunna eppudu vartallo nilustundi aa samasya ni addam pettukini chalamandi chala veshalu vestunnaru ee madhyakalamlo tmilnadu lo oka leader indian govt ki ultimatum ichadu sl against ga uno lo teermanam cheyalani kani aa nayakudi family business ke chendina oka ipl cricket team ki matram aa lanka ke chendina vyaktini captain ga pettaru kani vere srilanka players chennai lo adakudadannaru adee rajakeeyam anduke manaki raja kiya nayakulu kadu praja prathinidhulu kaavali aa vishayam lo mana manmohan mounamga muni laga undabatti saripoyindi

  3. ninna meeru matam aadharam ga bjp power ki vachindi annaru congress delhi lo power ki ratani karanam ulli dhara (onion price) peragatm anta nijamena adi eppudo shila dixit delhi cm kakamundu sangati kaadedi kavitakanarham annatlu kaadedi rajakeeyaniki anarham inkluding ullipayalu, manushula savalu anne arhame………………

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s