బ్రిటిష్ మాజీ ప్రధాని ధాచర్ మరణం వారికి పండగ -ఫోటోలు


బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ ధాచర్ ఏప్రిల్ 8 తేదీన మరణించింది. ఆమె మరణం పట్ల ధనికులు ఖేదం ప్రకటిస్తే కార్మికులు, అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలు అనేకులు మోదం ప్రకటించారు. దేశవ్యాపిత సంబరాలకు సైతం ‘క్లాస్ వార్’ లాంటి సంస్ధలు, మైనింగ్ వర్కర్స్ యూనియన్ లాంటి కార్మిక సంఘాలు పిలుపునిచ్చి అమలు చేసాయి కూడా. ధాచర్ మరణం పట్ల సంబరాలు జరుపుకున్న ఫోటోలను కింద చూడవచ్చు. ఈ సంబరాలకు కారణం ఏమిటో అర్ధం చేసుకోవాలంటే చరిత్రలోకి కొద్దిగా తొంగి చూడాల్సి ఉంటుంది.

సోవియట్ రష్యా, చైనా లలో కమ్యూనిస్టు రాజ్యాలు అవతరించడంతో కమ్యూనిస్టు తిరుగుబాట్ల ప్రమాదం తమను కూడా చుట్టుముడుతుందని పశ్చిమ దేశాలు భయపడ్డాయి. ఆ ప్రమాదాన్ని నివారించడానికి పశ్చిమ రాజ్యాలు తమను తాము సంక్షేమ రాజ్యాలు (welfare states) గా ప్రకటించుకున్నాయి. బ్రిటన్ కూడా అందులో ఒకటి. సంక్షేమ విధానాల పేరుతో ప్రభుత్వరంగ పరిశ్రమలను అభివృద్ధి చేసి కార్మిక వర్గ ప్రజానీకానికి సంక్షేమ విధానాలు అమలు చేశాయి. అంటే కార్మిక వర్గానికి వారి శ్రమలో వారికి ఇచ్చే వాటాను కొద్దిగా పెంచాయి. ఈ విధానాలు కొద్దో గొప్పో కార్మికవర్గ ఆదాయాన్ని పెంచాయి.

కానీ ఆ తర్వాత రష్యా, చైనాలలో పెట్టుబడిదారీ విధానం పునరుద్ధరించబడడంతో పశ్చిమ దేశాలకు సంక్షేమ విధానాల అవసరం తప్పిపోయింది. కార్మిక వర్గానికి పెంచిన ఆదాయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కంపెనీల అధిపతులు, వారి సేవకులైన ధనికుల్లో ఆరాటం మొదలయింది. ఈ ఆరాటాన్ని తీర్చడానికి ముందుకు వచ్చిన వ్యక్తి మార్గరెట్ ధాచర్. స్ధిరమైన ఆదాయం సమకూర్చే ప్రభుత్వ రంగ కంపెనీల ఉద్యోగాలు, వివిధ వర్గాలకు ఇచ్చిన పింఛన్లు, మెరుగైన పని పరిస్ధితులు తదితర సౌకర్యాలు పొందడానికి అవకాశాలు కల్పించిన సంక్షేమ విధానాలను ఒక్కొక్కటి ఉపసంహరించి క్రమంగా ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పే కార్యక్రమాన్ని ధాచర్ ముందుండి నడిపించింది. 1979 నుండి 1990 వరకు 11 సంవత్సరాల పాటు బ్రిటన్ ను ఏలిన ధాచర్ రష్యా చేత ‘ఐరన్ లేడి’ బిరుదు దక్కించుకుంది.

బ్రిటన్ ను సంక్షేమ రాజ్య విధానాల నుండి స్వేచ్ఛా మార్కెట్ విధానాల వైపుకు లాక్కెళ్లిన క్రమంలో మార్గరెట్ ధాచర్ కార్మిక వర్గంతో అత్యంత రాక్షసంగా వ్యవహరించింది. లక్షలాది ప్రభుత్వ కంపెనీలను మూసేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ప్రభుత్వ రంగ ఉద్యోగాలను ఊడబెరికి మిలియన్ల కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. కార్మికుల సమ్మెల పైనా, వారి ప్రజాస్వామిక హక్కుల పైనా ఉక్కు పాదం మోపింది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో పాటు సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్ధులను సైతం ఆమె నిర్దాక్షిణ్యంగా అణచివేసింది.

రష్యాలో ఇదే కాలంలో ధాచర్ నిర్వాకం లాంటి పనిలోనే నిమగ్నమై ఉన్న గోర్బచేవ్ ఆమెకు ‘ఐరన్ లేడి’ అని బిరుదు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముంది? గోర్బచెవ్ ను ‘వ్యాపారం చేయడానికి నమ్మకమైన వ్యక్తి’ అని ధాచర్ సైతం కీర్తించడంలో అంతకంటే ఆశ్చర్యం ఏముంది?

ఆమె అంతిమయాత్ర ‘సెర్మోనియల్ ఫనెరల్’ గా నిర్వహించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ‘స్టేట్ ఫనెరల్’ కంటే ఒకడుగు తక్కువని, దీనికి బ్రిటిష్ రాణి అనుమతి అవసరమని బి.బి.సి ద్వారా తెలుస్తోంది. తన అంతిమయాత్రను హడావుడి లేకుండా చేయాలని, పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో తన అంతిమయాత్ర సాగడం తనకు ఇష్టం లేదని ధాచరే స్వయంగా (బతికి ఉన్నపుడు) కోరినప్పటికి ఆమె పార్టీ నేతృత్వంలోని కామెరాన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నిర్ణయించింది. అనేకమంది విమర్శిస్తున్నప్పటికీ కామెరాన్ లెక్క చేయడం లేదు.

ధాచర్ మరణ వార్త విన్న వెంటనే ఆమె మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఫేస్ బుక్ లో పేజీలు విలిశాయి. ఏప్రిల్ 13 తేదీన లండన్ లోని ట్రాఫల్గర్ స్క్వేర్ లో సంబరాలు జరుపుకోవాలని వివిధ గ్రూపులు పిలుపు ఇచ్చాయి. వీరిలో ‘క్లాస్ వార్’, ‘మైనింగ్ వర్కర్స్ యూనియన్’ తదితర సంస్ధలు ఉన్నాయి. తన నిర్దాయక స్వేచ్ఛా మార్కెట్ విధానాలకు “ప్రత్యామ్నాయం లేదు, ప్రత్యామ్నాయం లేదు, ప్రత్యామ్నాయం లేదు” అంటూ బ్రిటన్ పార్లమెంటులో ధాచర్ చేసిన ప్రకటనను అనుకరిస్తూ ప్రదర్శన కారులు “మేగీ, మేగీ, మేగి, చచ్చింది, చచ్చింది, చచ్చింది” అంటూ నినాదాలు చేశారు. ఆమె రూపంలో దిష్టి బొమ్మ తయారు చేసి ఊరేగించారు. ఆమెను విమర్శించే నినాదాలతో ప్లెకార్డులు రాసి ప్రదర్శించారు. షాంపేన్, బీరు తదితరాలు సేవించి, సంతోషాతిరేకాలతో నృత్యాలు చేశారు. రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకారం ఈ సంబరాల్లో 2000 నుండి 3000 మంది వరకు పాల్గొన్నారు. వర్షం పడడంతో అనేకమంది పాల్గొనలేకపోయారని తెలుస్తోంది. తక్కువ మంది హాజరు అయినందుకు పోలీసులు సైతం ఆశ్చర్యం ప్రకటించారని రష్యా టుడే తెలిపింది.

మాజీ ప్రధాని మరణం పై సంబరాలు జరుపుకోవడం పట్ల లండన్ మేయర్ బోరిస్ జాన్సన్ అభ్యంతరం తెలిపాడు. “నిరసన తెలపడానికి ప్రజలకు హక్కు ఉన్న ప్రజాస్వామ్యంలో మనం నివసిస్తున్నాం. వారు ఆనందించవచ్చు, వారు కోరుకున్నది చేయవచ్చు. కానీ వారు చేయకూడనిది ఏమిటంటే, నా దృష్టిలో, ఒక పెద్ద వయస్కురాలి మరణాన్ని అల్లరి చేయడానికో, జగడమాడడానికో వినియోగించడం” అని జాన్సన్ అన్నాడు.

మేయర్ మాటలను నిరసనకారులు తిరస్కరించారు. “ఆమె మా కమ్యూనిటీలను నాశనం చేసింది. మా గ్రామాలను సర్వనాశనం చేసింది. మా గనులను ధ్వంసం చేసింది. మా గౌరవాన్ని సైతం ధ్వంసం చేయడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించింది” అని డర్హం మైనర్స్ అసోసియేషన్ నాయకుడు డేవిడ్ హాపర్ అన్నాడని ఆర్.టి (రష్యా టుడే) తెలిపింది. “ధాచర్ మరణంతో పార్టీలు జరుపుకోవడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే అవన్నీ ఆమె విధానాలు కలిగించిన దుష్పరిణామాల ముందు కొట్టుకుపోతాయి. ఈ భావోద్వేగం యొక్క శక్తి ఎంత లోతైనదంటే మాకున్న రిజర్వేషన్లను సైతం దానిముందు దిగదుడుపే. అనేక సంవత్సరాల పాటు మేము ఆమె నీడలో బ్రతికాం. కుటుంబాలను నిట్ట నిలువునా చీల్చిన నీడ అది. ఆ క్రోధం ఇంకా రగులుతూనే ఉంది” అని నాటింగ్ హామ్ షైర్ లో గని కార్మికుడిగా పని చేసిన టోనీ స్మిత్ అన్నాడు. ట్రాఫల్గార్ స్క్వేర్ వద్ద ప్రదర్శనలతో పాటుగా అనేక ప్రైవేటు పార్టీలకు ఫేస్ బుక్ పేజీలు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది.

“ప్రత్యామ్నాయం లేదు” అంటూ మార్గరెట్ ధాచర్, తదనంతర ప్రభుత్వాలు అమలు చేసిన స్వేచ్ఛా మార్కెట్ విధానాలు ఆ దేశాలను వరుస సంక్షోభాలలోనికి మరింతగా తోసివేశాయో ఇప్పుడు మన కళ్ళముందు ఉన్నది. ‘ప్రత్యామ్నాయం ఉంది’ అని నినదించి సంక్షేమ విధానాలను విస్తృతంగా అమలు చేసిన హ్యూగో ఛావేజ్ ప్రజల గుండెల్లో ఎంత పదిలంగా స్ధానం సంపాదించుకున్నాడో కూడా మన కళ్ల ముందు ఉన్నది. దేశం అంటే శారీరక, మేధో శ్రమలు చేసి అనేక ఉత్పత్తులు తీసే శ్రామిక ప్రజలే తప్ప శ్రామికుల శ్రమను లాభాలుగా వెనకేసుకుని విలాసాలలో కులుకుతూ సొల్లు కబుర్లు చెప్పే పరాన్నజీవులైన ధనిక పెట్టుబడిదారులు కాదు. హ్యూగో ఛావేజ్ మరణానికీ, మార్గరెట్ ధాచర్ మరణానికి వచ్చిన, వస్తున్న విరుద్ధ ప్రజా స్పందనలే దానికి ప్రబల తార్కాణం.

14 thoughts on “బ్రిటిష్ మాజీ ప్రధాని ధాచర్ మరణం వారికి పండగ -ఫోటోలు

 1. 1) tatkalika labdi kosam tayilaalanu ichi….vatini malli venakki teskodam valla entha nastam kalugutundo teliyadaniki e article oka vudaharana…..

  2) ilanti vidanalanu amalu cheyadaniki entho dairyam kavali…aaa diryam ee iron lady ki vundi! andukey falitanni (odipoyindi) anubavinchindi kudaaaaaaaa!(samanatvam sadichalani anukodam danika/peda vargala madya).

  3)kani IRON LADY ki telyani vishayam emi tantantey samanatvam tevadam sadyam kadu…..సంక్షేమ విధానాల పేరుతో ప్రభుత్వరంగ పరిశ్రమలను అభివృద్ధి చేసి కార్మిక వర్గ ప్రజానీకానికి సంక్షేమ విధానాలు అమలు chesina……..moolallo vari vidanam pettubadidarividanamey…(dochuku pettadam) …..

  4) ekkuva % vundey pedavargalni anachivesi takkva% vundey danikulni pattukuni veladi vari prayojanalaku anugunam ga vyaharistey entati nayakudikayana padey sikshanu …idi vudaharana ga chupinchochu!

 2. సర్, జాతీయ అంతర్జాతీయ పరిణామాల్లో ప్రాధాన్యత కలిగిన వాటి గురించి మాత్ర మే మీరు రాస్తేబాగుంటుంది. ప్రపంచంలో విమర్శకులు లేని వారంటూ ఎవరూ ఉండరు. ఏ సిద్ధాంతమూ ఖచ్చితంగా సరైంది కాదు. కమ్యునిజం, పెట్టుబడిదారీ విధానంలోనూ చాలా లోపాలున్నాయి. వేదాల్లో చెప్పినట్లు అన్ని వైపుల నుంచి ఉన్నత ఆలోచనలను ఆహ్వానించాలి. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఆ పద్ధతులను సిద్ధాంతాలను ఆలోచనలను మలచుకొని ఆచిచూతి అడుగేస్తే మంచిది

 3. విఘ్నేశ్వరరావు గారు, ప్రధానం అనే ఈ వార్త రాశాను. ధాచర్ మరణం ఇక్కడ వార్త కాదు. ఆమె మరణం ప్రేరేపించిన సంబరాలు వార్త. ఒక వ్యక్తి, అందునా పదకొండేళ్లు బ్రిటన్ ప్రధానిగా పని చేసిన వ్యక్తి చనిపోతే, జనం ఇంత బహిరంగంగా సంతోషం ప్రకటించడం నేను చూడడం ఇదే మొదటిసారి. ప్రజలని ఎంత క్షోభ పెడితే వారు సంతోషిస్తున్నారు! ఆ క్షోభని చర్చించడమే ఈ విశ్లేషణ ఉద్దేశం.

  అన్ని వైపుల నుండి ఉన్నత ఆలోచనలు ఆహ్వానించాలని వేదాలే చెప్పాలా? కాని ఉన్నత ఆలోచనల వెనుక అసలు ఉద్దేశాలు గ్రహించడమూ అవసరమే. చెప్పేదొకటి చేసేదొకటి ఐనప్పుడు కేవలం ఆలోచన వరకే తీసుకుంటే సరిపోదు కదా.

  ఈ “ఆచితూచి అడుగేయడం” ఏమిటో నాకు బొధపడలేదు. ఈ పద ప్రయోగానికి సందర్భం ఏమిటి?

 4. Actually, This news is real importnat, then any other articles published here. This news should be in headlines of every news agency lst. to create some stir, what is going on now in india. I am sure the same will happened in india also after 15-20 years. y because we are in the same phase, where Mrs. Theathcer done to Britan.

 5. I had completely different understanding about the meaning of Welfare state. As per my understanding, Govt providing certain essential services like education, health, old age pension, or unemployment benefits to all citizens for free. The main aim of welfare state is making sure that all citizens can have minium quality life irrespective of their economic and employment status. In that sense Britain is still a welfare state, even thought the current Conservative Government is said to cut spending and thus reducing benefits.
  About Margaret Thatcher’s legacy, as per my understanding the is responsible for the economic shift of the country. Before her Britain’s economy is focused on Mining and Manufacturing. This economy was not working for Britain anymore. She made changes to bring Consumer spending economy and replacing Services as centre of Britain’s economy in the place of Mining and Manufacturing. Naturally that resulted in lot of people loosing jobs.

  Comparing Margaret Thatcher with Hugo Chavez is like comparing apples and oranges. (For that matter comparing Hugo Chavez with any other country’s leader). Hugo Chavez’s development model and economic model has lot do with Venezuela being a Petroleum resource rich country. It is aslo a fact that not all countries has this luxury and have to invent new economic models to improve people’s lives.
  About people celebrating Thatcher’s death I think it says a lot about the freedom of expression here rather than anything else.

 6. చంద్ర గారు, వెల్ఫేర్ స్టేట్ గురించిన అవగాహనలో నేను చెప్పినదానికి భిన్నంగా మీరు చెప్పలేదు కదా. పూర్తిగా భిన్నం అని ఎందుకు అంటున్నారు? బహుశా చైనా, రష్యాల ప్రస్తావన మీకు ఆ అభిప్రాయం కలిగించిందనుకుంటాను.

  పోతే బ్రిటన్ ఇంకా వెల్ఫేర్ స్టేట్ అని బ్రిటన్ పాలకులే చెప్పడం లేదు. గత లేబర్ ప్రభుత్వాన్ని తీసుకున్నా, ఇప్పటి కామెరాన్ ప్రభుత్వాన్ని తీసుకున్నా అనేకసార్లు ఈ వెల్ఫేర్ స్టేట్ నిర్మాణాలను తొలగించాలని వివిధ సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఆ మేరకు క్రమంగా చర్యలు అమలు చేస్తున్నారు. రుణ సంక్షోభం, దరిమిలా అమలవుతున్న పొదుపు ఆర్ధిక విధానాలు అందులో భాగమే. వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ లో భాగంగా అమలు చేసిన ప్రజానుకూల విధానాలను ఉపసంహరించుకోవడమే పొదుపు విధానాల లక్ష్యం. ఈ ఉపసంహరణ ఒక్క రోజులో, ఒక్క సంవత్సరంలో కనపడదు. నలభై, ఇరవై యేళ్ల కింద పరిస్ధితి ఇప్పటి పరిస్ధితితో పోలిస్తే ఈ తేడా తెలుస్తుంది.

  హ్యూగో ఛావెజ్, ధాచర్ ల పోలికను మీరు ఎలా అర్ధం చేసుకున్నారో గాని నేను చెప్పింది మాత్రం ప్రజలపై వారి విధానాలు పడవేసిన ప్రభావం గురించి. ప్రజలు రియాక్ట్ అయ్యేది దానివల్లనే. ఆయిల్ దేశం కావచ్చు, ఖనిజాల దేశం కావచ్చు, సేవల దేశం కావచ్చు. ప్రభుత్వాల విధానాలు అంతిమంగా శ్రమ చేసి ఉత్పత్తులు తీసే ప్రజలకు అందాలి తప్ప శ్రమను దోచి పెట్టుబడులు పోగేసుకునే ధనికులకు కాదు. ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఆధారం ఏ వనరైనా ఆర్ధిక విధానాల్లో తేడా ఉండదు. ఆర్ధిక సిద్ధాంతాలు, వాటి అమలు ప్రధానంగా రెండే. ఒకటి: ధనికులకు మేలు చేసేవి. రెండు: శ్రామిక ప్రజలకు (అంటే సకల ఉత్పత్తులు తయారు చేసేవారు – అది శారీరక శ్రమ కావచ్చు, మేధో శ్రమ కావచ్చు) మేలు చేసేవి. బ్రాడ్ గా చూస్తే మొదటిది స్వేచ్ఛా మార్కెట్ వాదం, రెండోది సంపదలన్నింటిని సమాజపరం చేసే కమ్యూనిజం. ఈ రెండింటి మధ్య ప్రజలకు సేవ చేస్తున్నట్లు నటిస్తూ వాస్తవంలో ధనికులకు సేవ చేసేది వెల్ఫేర్ స్టేట్.

  ఈ అర్ధంలో చూసుకున్నపుడు వెల్ఫేర్ స్టేట్ – మార్కెట్ ఎకానమీలలో ఒక్కటే తేడా కనిపిస్తుంది. అది ఏమిటంటే మార్కెట్ ఎకానమీతో పోలిస్తే వెల్ఫేర్ స్టేట్ లో శ్రామికులకు కొంత మెరుగైన వాటా దక్కుతుంది. అంతే తప్ప వాస్తవ వాటా దక్కదు. ఈ కాస్త వాటా ఇవ్వడానికి కూడా ధనికులు (పెట్టుబడిదారులు, కంపెనీలు మొ.) ఒప్పుకోకపోవడం వల్లనే రుణ సంక్షోభం సాకు చూపి పొదుపు విధానాలు అమలు చేస్తున్నారు.

  వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ కి ఆద్యుడు కీన్స్. రెండో ప్రపంచ యుద్ధం నాటి ప్రత్యేక పరిస్ధితుల్లో ఆయన సిద్ధాంతం చారిత్రక పాత్ర పోషించింది. పెట్టుబడిదారీ రాజ్యాలకు కమ్యూనిస్టు భయం నుండి బైటపడే దారి చూపించింది. ఒక పక్క ప్రజలకు మెరుగైన వాటా పంచుతూనే తమ మెజారిటీ వాటాను కాపాడుకునే అవకాశం అది కల్పించింది. కిన్సే లేనట్లయితే యూరప్ లో సోషలిస్టు విప్లవాలు వెల్లువగా సాగి ఉండేవి.

  ప్రతి దేశానికి ఆయా ప్రత్యేకతలు ఉండడం అనివార్యం. కాని ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక వ్యవస్ధలు పని చేసే పద్ధతి దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ప్రస్తుతం అయితే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానమే రాజ్యం ఏలుతోంది. దానికి ప్రత్యామ్నాయం సోషలిస్టు ఉత్పత్తి విధానం (ఇదిప్పుడు ఎక్కడా లేదు). వెల్ఫేర్ స్టేట్ అనేది పెట్టుబడిదారీ విధానానికి ఉన్న ముసుగుల్లో ఒకటి. కాని దానివల్ల ప్రజలు కొద్దొగొప్పో లబ్ది పొందుతారు. అందువలన దానిని కూడా లెఫ్ట్ అనడం ఇప్పుడొక ధోరణిగా ఉంటోంది.

 7. V. Sekhar gaaru, I said completely different because what your wrote about welfare sate gives impression that,

  1. Welfare state means Government owing all Industries.
  2. Providing welfare schemes to only one section of people like working class.
  3. Somehow welfare state can only exists with Communist political and economic ideology.

  My understanding is different from that, as I mentioned in my previous comment.

  I am saying Britain is still welfare state because it still has free education, free health and disability, unemployment, old age pensions. I am not seeing any indications about Government taking away free education and health services in any time in near future.

  I am neither a supporter of Consumer based economy model nor the admirer of Margaret Thatcher. But I found out that what you have written about her is not balanced. She has both critics and admirers (may be more admirers if you consider winning three consecutive elections as a measure for number of admirers).

  About Hugo Chavez, yes it is true that he has tried to improve the lives of poor by distributing the wealth. But how did Hugo Chavez’s Government acquired this wealth? Not by selling services, technology or products. In other words its not a result of additional work. This wealth is generated by the natural resources (Thanks to dead dinosaurs). Yes it is true that country’s natural resource belong to the people and they should benefit from it. but it is aslo a fact that people did not generate this wealth . Just imagine if a situation where Venezuela does not have Petroleum resources or World no longer requires Petroleum products. Do you think Hugo Chavez should have been what he is now?

  My understanding is that, any Government needs money to implement welfare schemes. But how you earn that money depends on the country. If I am a resource rich (the resource world needs most in the current time) country, I can sell these on my own terms. In other words I can aslo use these resources to promote my political ideology. But if I am a country that depends on selling services and products, I need to be more flexible. I may have to give somethings to get few back.

 8. చంద్ర గారు

  మీరు ప్రస్తావించిన అంశాల వారీగా చూద్దాం.

  1 & 2. పరిశ్రమలన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తుందని నేను రాయలేదు కదా! ప్రభుత్వరంగంలో ఉన్న పరిశ్రమలని ప్రైవేటు కంపెనీలకి అప్పగించడం ప్రారంభించారు అంటే ప్రైవేటు కంపెనీలు అసలే లేవని కాదు. ఏ విధంగా చూసినా మీరు చెప్పిన అర్ధంలో నేను రాసినట్లు నాకు కనిపించలేదు.

  కార్మిక వర్గం అంటే నా అర్ధం: శ్రమ చేసే వారు అని. అది శారీరక శ్రమ కావచ్చు, మేధో శ్రమ కావచ్చు. వారికి నామమాత్ర ఆస్తులు కూడా ఉంటే ఉండవచ్చు. శారీరక శ్రమతో పాటు ఆఫీసులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ లాంటి మేధో శ్రమల వారు కూడా కార్మికులే. ఏదో ఒక పని చేసి విలువ సృష్టించేవారు వీరు. వీరి వల్లనే సంపద సృష్టి జరుగుతుంది. పెట్టుబడి వల్ల విలువ సృష్టించబడదు. ఉన్న విలువ తిరిగొస్తుంది, అంతే. పెట్టుబడికి వచ్చే లాభాలు శారీరక, మేధో శ్రమల వల్ల పోగుబడిన అదనపు విలువ తప్ప మరొకటి కాదు. కనుక పెట్టుబడిదారులకు లాభాలు, వడ్డీలు, డివిడెండ్లు… ఇత్యాది పేర్లతో దక్కుతున్నది అంతా శ్రమ చేసేవారిదే.

  కనుక ఎవరికి ఎవరు బెనెఫిట్స్ ఇస్తున్నట్లు? లేదా ఎవరు ఎవరి సంక్షేమం చూస్తున్నట్లు?

  ఇదెందుకు చెప్పానంటే working claas, capitalist class విభజన గురించి ఒక ఐడియా ఇవ్వడానికి.

  3. నేను పై వ్యాఖ్య చివర స్పష్టంగా ఇలా చెప్పాను.

  >>వెల్ఫేర్ స్టేట్ – మార్కెట్ ఎకానమీలలో ఒక్కటే తేడా కనిపిస్తుంది. అది ఏమిటంటే మార్కెట్ ఎకానమీతో పోలిస్తే వెల్ఫేర్ స్టేట్ లో శ్రామికులకు కొంత మెరుగైన వాటా దక్కుతుంది. అంతే తప్ప వాస్తవ వాటా దక్కదు. ఈ కాస్త వాటా ఇవ్వడానికి కూడా ధనికులు (పెట్టుబడిదారులు, కంపెనీలు మొ.) ఒప్పుకోకపోవడం వల్లనే రుణ సంక్షోభం సాకు చూపి పొదుపు విధానాలు అమలు చేస్తున్నారు.>>

  >>వెల్ఫేర్ స్టేట్ అనేది పెట్టుబడిదారీ విధానానికి ఉన్న ముసుగుల్లో ఒకటి. కాని దానివల్ల ప్రజలు కొద్దొగొప్పో లబ్ది పొందుతారు. అందువలన దానిని కూడా లెఫ్ట్ అనడం ఇప్పుడొక ధోరణిగా ఉంటోంది.>>

  మీరు నేను ఇలా చెప్పానని అంటున్నారు.

  >>Somehow welfare state can only exists with Communist political and economic ideology. >>

  వెల్ఫేర్ స్టేట్ అనేది పెట్టుబడిదారీ విధానానికి ఉన్న ఒక ముసుగు అని కదా నేను చెప్పాను. అది కమ్యూనిస్టు ఐడియాలజీలో మాత్రమే ఉందని నేను చెప్పినట్లు మీకెలా అర్ధం అయింది? బహుశా ఎక్కడో పొరపాటుపడ్డారు.

  మీరు బ్రిటన్ ఇంకా వెల్ఫేర్ స్టేట్ అంటున్నారు. ఆ లక్షణాలు ఉన్నది నిజమే. కానీ వాటిని ఒక్కొక్కటీ వదిలించుకునే క్రమం ధాచర్ కాలంలోనే మొదలైంది. దానిని మోడల్ మార్పు అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పై వ్యాఖ్యలో కొంత వివరణ ఇచ్చాను. పరిమిత వ్యాఖ్యలో వివరించలేను గనుక వదిలేస్తున్నాను. అయితే వెల్ఫేర్ లక్షణాలను వదిలించుకుంటున్నారు అనడానికి ఒక ఉదాహరణ కింద లింక్ లో చూడండి. గత సంవత్సరం ప్రకటించిన ఒక విధానం ఇప్పుడు జూన్ నుండి అమలులోకి రాబోతున్నది.

  http://www.dailymail.co.uk/news/article-2309275/Benefits-cap-trial-David-Cameron-hails-big-day-welfare-reform.html

  ఋణ సంక్షోభం సాకు చూపి గత మూడేళ్లుగా బ్రిటన్ లో austerity measures అమలు చేస్తున్నారు. వీటి ప్రకటిత లక్ష్యం సంక్షోభం నుండి బైటకి రావడం. వాస్తవంలో వేతనాలు, పెన్షన్లు, బెనెఫిట్స్ కట్ చేస్తున్నారు. దానిని బెయిలౌట్లుగా బ్యాంకులకు, కంపెనీలకి ఇస్తున్నారు. ఇవన్నీ వెల్ఫేర్ స్టేట్ విధానాలను వెనక్కి తీసుకోవడమే. పై వ్యాఖ్యలో చెప్పినట్లు ఈ మార్పుల ప్రభావం లాంగ్ టర్మ్ లో కనపడతాయి. జి.డి.పి ఇప్పటికే బాగా తగ్గిపోయింది. రెండు సార్లు రిసెషన్ లోకి వెళ్లింది. ఈ మాక్రో కండిషన్స్ కూడా వెల్ఫేర్ ఉపసంహరణ ఫలితమే. వెల్ఫేర్ విధానాల ఉపసంహరణ వలన ఆదాయాలు పడిపోయి కొనుగోలు శక్తి పడిపోతుంది. దానితో ఉత్పత్తి పేరుకుపోయి కొత్త ఉత్పత్తి ఆగిపోతుంది. దాని ఫలితం జి.డి.పి తగ్గుదల, రిసెషన్. ఇవన్నీ పేపర్లలో వస్తున్న వివరాలే.

  ధాచర్ సంగతి అదనంగా ఇప్పటికీ చెప్పేదేమీ లేదు. వివిధ ఆర్టికల్స్ లో యూరప్ ఋణ సంక్షోభం గురించి రాశాను.

  వెనిజులాలో ఆయిల్ ప్రోడక్ట్ కాకుండా ఎలా పోయింది? ఆయిల్ బైటికి తీయాలంటే శ్రమ చేయాలి. యంత్రాలు కావాలి. అక్కడ కూడా సేవా రంగం, మాన్యుఫాక్చరింగ్ రంగం ఉంది. ఏ దేశానికేళ్ళినా, దాని ఆర్ధిక వ్యవస్ధ పునాది ఏదయినా సంపద ఉందంటే అది ఉత్పత్తి అయితేనే ఉంటుంది. గాలిలోంచి రాదు. వెనిజులాలో ఉన్న సంపద అలా శ్రమతో వచ్చిందే. అది అక్కడి జనం శ్రమతో పుట్టిందే. వారు తీసిన సంపదలో గతంలో కంటే కొంత ఎక్కువ వాటా ఇవ్వడం మాత్రమే ఛావేజ్ చేశాడు.

  people did not generate this wealth అనే మాట కరెక్ట్ కాదు. ఎవరూ శ్రమ చేయకుండా ఉత్పత్తి లేదా సంపద రాదు. మనం ఆ సంగతి గుర్తిస్తున్నామా లేదా అన్నది ఇక్కడి విషయం తప్ప ప్రజలు సృష్టించారా లేదా అన్నది కాదు. ప్రజలు సృష్టించ కుండా సంపదలను ఎవరూ సృష్టించలేదు. బహుశా మీ దృష్టిలో పెటుబడి సంపద సృష్టించిందని ఉద్దేశ్యమా? అది కాదని చెప్పడానికి పైన రెండో పాయింటు లో వివరణ రాశాను.

 9. వి.శేఖర్ గారు యూరో జోన్ లో నిరుద్యోగం పెరుగుదల కోసం ఒక ట.పా రాసారు గా ….అక్కడ పొదుపు విధానాల వలన యూరోపియన్ దేశాలలో ఎదుర్కొన్న ఇబ్బందులను చక్కగా వివరించారు . ఈ ట.పా కి ఆ లింక్ ఇస్తే పాటకులకు మరింత అవగాహన కలుగుతుంది.

 10. vedala lo laga alochinchali ani okaru rasaru vedallo alochana leke kada upanishads puranalu itihasalu bhashyalu rasaru baudha jaina mathalu vachayi andulo alochana unte ivanni enduku chaduvutam asalu ila enduku untam okavela unna adi samanyudiki evariki ardam kani bhashalo undemo manavalla kadu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s