తమిళనాట తెలుగు కోసం పోరుతున్న స.వెం.రమేష్


ఈ బొమ్మ తెలుగు వెలుగు నుండి సేకరించినది

ఈ బొమ్మ తెలుగు వెలుగు నుండి సేకరించినది

ప్రళయ కావేరి కధల రచయిత సన్నాడి వెంకట రమేష్ ఉరఫ్ స.వెం.రమేష్ 18 సంవత్సరాల వయసు వరకు తెలుగు రాసి ఎరగరు. మద్రాసులో పి.జి వరకు ఆంగ్ల మాధ్యమం లోనే చదువుకున్న రమేష్ తెలుగులో కధలు రాసే స్ధాయికి ఎదగడమే అద్భుతం అయితే, ఆ కధలను వేలాది పల్లె పదాలతో నింపడం ఇంకో అద్భుతం. పులికాట్ సరస్సు వద్ద ఉన్న తమ తాత, ముత్తాతల గ్రామాలకు వచ్చి అక్కడి పద సంపదను చూసి అచ్చెరువు పొంది పట్టుబట్టి తెలుగు నేర్చుకున్న రమేష్ ఇప్పుడు తమిళనాట తెలుగు ప్రజల్లో తెలుగును బతికించుకోవడం కోసం ఆహరహం శ్రమిస్తున్నారు. ఈనాడు గ్రూపు పత్రిక ‘తెలుగు వెలుగు’ ఆరు నెలల క్రితం ఈయన కృషిని వెలుగులోకి తెచ్చింది.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత తెలుగు మెజారిటీ మాట్లాడే ప్రాంతాలు కొన్ని తమిళనాడులో ఉండిపోయాయి. ఈ ప్రాంతాల్లో తెలుగును బతికించడం కోసం పోరాడిన కుటుంబంలో పుట్టిన స.వెం.రమేష్ తన కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాక తెలుగు భాషాభివృద్ధికి పల్లెల్లోని శ్రమ జీవులపైన, ముఖ్యంగా శ్రమ పైనే ప్రధానంగా ఆధారపడి బతికే దళిత ప్రజల పైన ఆధారపడడం అత్యద్భుత విశేషం. తెలుగు భాషను కాపాడుకుని అభివృద్ధి చేయాలంటే కోట్లు ఖర్చుపెట్టి మహాసభలు జరపనవసరం లేదని పద సంపదలతో తులతూగే శ్రామిక, దళిత ప్రజలను అంటిపెట్టుకుని విద్యాభివృద్ధి చేయగలిగితే చాలని స.వెం.రమేష్ చెబుతున్నారు.

ద్రావిడ భాష నుండి మొట్టమొదట విడిపోయిన భాష తమిళం కాదని, తెలుగు అని స.వెం.రమేష్ చెబుతున్న సంగతి తెలుగు పండితులకు తెలుసోలేదో మరి! పల్లె ప్రజల అనేక రకాల మాండలికాలను, కళారూపాలను బతికించుకుని రికార్డు చేసుకోగలిగితే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి తగిన పద సంపద మన చేతుల్లో ఉన్నట్లేనని రమేష్ చెబుతున్న విషయం తెలుగు ప్రేమికులకు కొత్త ఊపిరి ఇస్తోంది. కేవలం 400 క్రియా ధాతువులు మాత్రమే ఉన్న తమిళం వైద్య పరిభాషను సైతం అభివృద్ధి చేసుకున్నదనీ, 3,500 యేళ్ళ చరిత్రలో 1780 క్రియా ధాతువులు సొంతం చేసుకున్న తెలుగు ద్వారా సాంకేతిక బోధన చాలా తేలిక అనీ, కావలసింది చిత్తశుద్ధి మాత్రమేనని చెబుతున్న స.వెం.రమేష్ ఇంటర్వ్యూను అందించిన ‘తెలుగు వెలుగు’ పత్రిక అభినందనీయురాలు. ఇంటర్వ్యూను పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో కింద బొమ్మపై క్లిక్ చేసి చదవొచ్చు.

ఇంటర్వ్యూ చూసే ముందు ఒక్క మాట! స.వెం.రమేష్ గారి తెలుగు సౌందర్యాన్ని ‘ప్రళయ కావేరీ కధలు’ గొప్పగా పట్టిస్తాయి. సదరు కధల పుస్తకానికి కొద్ది వారాల క్రితం రమా సుందరి గారు పరిచయం రాయగా సారంగ వెబ్ పత్రిక వారు ప్రచురించారు. ‘ప్రళయ కావేరి’ కధలకు, స.వెం.రమేష్ గారు సాగిస్తున్న తెలుగు భాషోద్యమానికి కూడా ఈ పరిచయం ‘వాకిలి’ లాంటిది. ఈ వాకిలి ద్వారా స.వెం.రమేష్ గారి ఇంటర్వ్యూలోకి ప్రవేశిస్తే ఆయన ఇంటర్వ్యూ ఇంకా బాగా మన గుండెలకు చేరుతుంది. పుస్తక పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేసి చూడండి. సరికొత్త అనుభూతితో ఇంటర్వ్యూలోకి ప్రవేశించండి. (పి.డి.ఎఫ్ పరిమాణం 13 MB పైనే ఉంది. అందువలన ఆలస్యంగా లోడ్ కావచ్చు. ఓపిక పడితే దానికి తగిన ఫలితం ఉంటుంది.) (ఇప్పుడు ఫైల్ సైజు తగ్గిందిలెండి.)

S V Ramesh2

2 thoughts on “తమిళనాట తెలుగు కోసం పోరుతున్న స.వెం.రమేష్

  1. MOTTA MODATA MANA RAASHTRAMULO 1 nunchi 10 VARAKU Telugu nirbandha paathyaamsangaa undaali.RAAJAKEEYANAAYAKULU CHEPTUNNAARU KAANI adi aacharana loki eppudu vvastundo teliyadu. Ippatike Tamilnadu, Karnataka &Maharashtra G.O.lu jaari chesinaayi. Telugetara mediumla vaariki, Telugu literature kante TELUGU LANGUAGE avasaram.KARNATAKA ASSEMBLY LO ANDAROO( E PARTY VAARAINAA )
    KANNADA LONE MAATLAADUTAARU.
    High Court vadilesi migataa anni courtulalo T E L U G U lone vaada, prati vaadanalu jarigetlugaa G . O . jaari cheyaali
    SRI MANDALI BUDDHA PRASAD GAARU TALUCHUKUNTE IVANNEE CHEYAGALARU.
    IDI JARAGANANTAVARAKU, KAVULU , MEDHAAVULU enta gaggolu pettinaa emi jaragadu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s