ఉ.కొరియా అణు సామర్ధ్యంపై అమెరికాలో విభేదాలు


ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ -ఫొటో: రష్యా టుడే

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ -ఫొటో: రష్యా టుడే

ఉత్తర కొరియా అణు క్షిపణులు అమెరికా భూభాగాన్ని చేరగలవా లేదా? చేరగలిగితే ఎక్కడి వరకు రాగలవు? పశ్చిమ తీర ప్రాంతం అయిన అలాస్కా వరకేనా లేక ప్రధాన భూభాగాన్ని కూడా చేరగలవా? అసలు ఖండాంతర క్షిపణులు మోసుకెళ్లగల తక్కువ సైజు అణు బాంబులను ఉత్తర కొరియా అభివృద్ధి చేసుకున్నదా? ఇవి అమెరికా ప్రభుత్వాన్ని తొలుస్తున్న ప్రశ్నలు. అణ్వస్త్ర సామర్ధ్యాన్ని ఉత్తర కొరియా రుజువు చేసుకున్నప్పటికీ వాటిని మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులు ఎంత దూరం వెళ్లగలవనేది అంతర్జాతీయ పరిశీలకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విభేదాలు అమెరికా ప్రభుత్వ విభాగాల్లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా బెదిరిస్తున్నట్లుగా అమెరికా, దక్షిణ కొరియాలపైనా దాడి చేసే ఉద్దేశ్యం ఆ దేశానికి ఉన్నదా లేదా అనేది కూడా అమెరికా ఉన్నత మిలట్రీ, ప్రభుత్వ వ్యవస్ధల్లో ఒక తీవ్ర చర్చాంశం అని తెలుస్తోంది.

ఉత్తర కొరియా అణు బెదిరింపులు నిజమేనా అన్న విషయాన్ని అమెరికా ప్రభుత్వంలో అధికులు నమ్మడం లేదు. అయితే ఖండాంతర క్షిపణులు మోసుకెళ్లగల తక్కువ సైజులో అణు బాంబులు నిర్మించగల సామర్ధ్యం ఆ దేశానికి ఉన్నదని మాత్రం అమెరికా మిలట్రీ నమ్ముతోంది. కానీ ఖండాంతర క్షిపణుల సామర్ధ్యం పైన మళ్ళీ అనుమానాలు ఉన్నాయి. అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగల శక్తి ఉత్తర కొరియా ఖండాతర క్షిపణులకు లేదని మిలట్రీ అధికారులు స్పష్టం చేస్తుండగా, పశ్చిమ తీరంలోని అలాస్కాతో పాటు అమెరికా సైనిక స్ధావరం ఉన్న గువాం ద్వీపానికి అవి చేరగలవని వారు అంగీకరిస్తున్నారు.

అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) సభ్యులతో నియమించబడే ‘హౌజ్ ఆర్మడ్ సర్వీసెస్ కమిటీ’ బడ్జెట్ సమావేశం గురువారం నిర్వహించిన సందర్భంగా అమెరికా ప్రభుత్వంలో ఉన్న విభేదాలు కొన్ని బైటికి వచ్చాయి. కమిటీలో రక్షణ కార్యదర్శి చక్ హెగెల్ చెప్పిందాని ప్రకారం అణు వార్ హెడ్ లు మోసుకెళ్లగల క్షిపణులను ఉత్తర కొరియా ఇంకా అభివృద్ధి చేయలేదు. అయితే పెంటగాన్ (అమెరికా మిలట్రీ హెడ్ క్వార్టర్స్) నివేదిక ప్రకారం ఖండాంతర క్షిపణులు మోసుకెళ్ల తక్కువ సైజులో అణు బాంబును కూర్చగల సామర్ధ్యం ఉత్తర కొరియాకు ఉన్నది.

కమిటీకి హాజరైన నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ జేమ్స్ క్లాపర్ ప్రకారం ఉత్తర కొరియా నాయకుడు కిం జోంగ్-ఉన్ జారీ చేస్తున్న బెదిరింపులు ఉత్తి వాగాడంబరమే. “ఉత్తర కొరియా ఒక అణుశక్తిగా ఆవిర్భవించిందని ప్రపంచం నుండి గుర్తింపు పొందడానికి, ముఖ్యంగా అమెరికా గుర్తింపు పొందడానికి… నూతన నాయకుడు చేసున్న ప్రయత్నమే ఈ బెదిరింపులు.” అని క్లాపర్ చెప్పాడు. ఉత్తర కొరియాకు అణు క్షిపణుల శక్తి సంతరించుకుందని చెప్పడం డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (డి.ఐ.ఏ) దృష్టిలో వాస్తవం కాదు. డి.ఐ.ఏ నివేదిక రహస్యమే అయినా అందులో కొద్ది భాగం బహిరంగం చేశారని రష్యా టుడే తెలిపింది. అంతర్జాతీయ సమాజం నుండి సహాయం పొందడం కోసమే ఉత్తర కొరియా నాయకులు ఉత్తుత్తి బెదిరింపులు చేస్తున్నారు.

రోడ్డు పై నడిచే వాహనం నుండి ఖండాంతర క్షిపణి ప్రయోగించగల శక్తికి ఉత్తర కొరియా సమీపంలో ఉన్నదని జేమ్స్ క్లాపర్ చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఉత్తర కొరియా నేత ఇటీవల చేస్తున్న బెదిరింపులు స్వదేశంలో ప్రజల నమ్మకం, గౌరవం పొందడానికి విదేశాలకు తన అణుశక్తి చెప్పుకోవడానికి ఉద్దేశించినవే తప్ప దాడి చేసే లక్ష్యం లేదని ఆయన ఉద్దేశ్యం. ఉత్తర కొరియా శక్తి ఏ మేరకు ఉన్నా ఆ దేశం చుట్టూ అమెరికా స్తన సైనిక సామర్ధ్యాన్ని భారీగా పెంచుకోవడం మాత్రం వాస్తవం. కనుక ఉత్తర కొరియా వాస్తవ ఉద్దేశ్యాల గురించి జరుగుతున్న చర్చ అమెరికా చర్యల నుండి దృష్టి మళ్లించడంలో విజయవంతం అవుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s