ఓ పాల బుగ్గల జీతగాడా…. ఫోటోలు


2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభాలో పావు వంతు మంది 5-14 మధ్య వయసు పిల్లలే. వీరిలో దాదాపు 15 మిలియన్ (1.5 కోట్లు) బాల కార్మికులుగా పని చేస్తున్నారని అధికారిక అంచనా. వాస్తవ సంఖ్య ఇంతకు మించి ఉండే అవకాశం ఉంది. 1971లో వీరి సంఖ్య 1.07 కోట్లు. బాల కార్మికులు లేని చోటంటూ ఇండియాలో దాదాపు కనిపించదు.

వ్యవసాయ కూలీల దగ్గర్నుండి, భారీ నిర్మాణ పనుల వరకూ పడుతూ లేస్తూ చిన్నతనంలో జీవితాన్ని ద్వేషించే పరిస్ధితుల్లో కనపడుతుంటారు. యాజమానుల చేతుల్లో దెబ్బలు తింటూ, వారి సొంత భావోద్వేగాల భారం కూడా వీరే మోస్తుంటారు. చెత్త ఏరుకోవడం, రోడ్డు నిర్మాణం, ఊపిరిని కాల్చివేసే బంగారం పని, శరీరాన్ని కుతకుత ఉడికించే ఫౌండ్రీ పనులు… ఇలా అనేక పనుల్లో వారు తారసపడుతుంటారు.

బాల కార్మిక వ్యవస్ధ నిర్మూలన అంటే మన ప్రభుత్వాల దృష్టిలో అప్పుడప్పుడూ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి బాల బాలికలతో పని చేయించుకుంటున్నవారికి జరిమానా విధించడమే తప్ప వారి సంపాదనపై ఆధారపై ఆధారపడక తప్పని పరిస్ధితులను వారి తల్లిదండ్రులకు తప్పించడం కాదు. ఫలితంగా వారి సంఖ్య పెరగడమే తప్ప తరగడం లేదు. పదేళ్ళ కొకసారి జరిపే జనాభా లెక్కల్లో బాల కార్మికుల లెక్కల్లో ఒక సంఖ్యను పెంచేవారుగా మాత్రమే రిజిస్టర్లలో ఉంటారు.

విముక్తి లెక్కల్లో చోటు సంపాదించడం బాల కార్మికులకు ఒక భారీ లగ్జరీ. పని నుండి విముక్తి పొంది బడికి పోవడం వారికి ప్రభుత్వాలు విదిలించే భిక్ష తప్ప చట్టాలు కల్పిస్తున్న హక్కు కాదు. పాల బుగ్గల జీతగాడా అన్న పాటను మార్చి పాడుకోవడమే తప్ప అసలు పాడకుండా మానుకోగల పరిస్ధితి ఎన్నడు వస్తుంది?

వివిధ వెబ్ సైట్లు ఈ ఫోటోలు అందించాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s