ఐరిష్ అబార్షన్ చట్టం: డాక్టర్లా లేక మత బోధకులా?


Savita Halappanavar -Photo: The Hindu

Savita Halappanavar -Photo: The Hindu

‘మాది కేధలిక్కుల దేశం’ అని మూర్ఖంగా వాదించి భారతీయ డెంటిస్టు సవితా హలప్పనవార్ ప్రాణాలు బలిగొన్న ఐర్లండు డాక్టర్లు ఇప్పుడు అక్కడి ప్రభుత్వం తలపెట్టిన బలహీన ‘అబార్షన్ చట్టాన్ని’ కూడా వ్యతిరేకిస్తున్నారు. తల్లి ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు తీవ్రమైన కేసుల్లో అబార్షన్ కు అనుమతించేందుకు చట్టంలో కల్పించిన అవకాశాన్ని ఐరిష్ మెడికల్ ఆర్గనైజేషన్’ (ఐ.ఎం.ఒ) సమావేశం తిరస్కరించింది.

ఇంకా ఘోరం ఏమిటంటే అత్యాచారం, స్వకుటుంబ సంపర్కం తదితర ప్రత్యేక పరిస్ధితుల ద్వారా సంభవించిన గర్భాన్ని తొలగించడానికి కూడా డాక్టర్లు నిరాకరించారు. ఐ.ఎం.ఒ డాక్టర్లు ప్రాక్టీసు మానేసి మతబోధ చేసుకుంటే ఎవరు వద్దన్నారో తెలియడం లేదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చిన జ్ఞానంతో ఉద్యోగంలో చేరి సంపాదిస్తూ ప్రాణాలు కాపాడడం మాని మూర్ఖ వాదనతో ప్రాణాలు తీయడానికి సిద్ధపడడం బొత్తిగా క్షమార్హం కాదు.

గత అక్టోబరు నెలలో ఐర్లాండులో స్ధిరపడిన సవిత ఐరిష్ డాక్టర్ల మూఢత్వం వలన ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె గర్భంలో ఉన్న పిండం చనిపోవడంతో రక్తం విషతుల్యమై చనిపోయింది. తనకు గర్భస్రావం అయిందని, అబార్షన్ చేయాలని 17 వారాల గర్భంతో ఉన్న సవిత రెండు రోజులు మొత్తుకున్నప్పటికీ ఐరిష్ డాక్టర్లు “మాది నిబద్ధత గలిగిన కేధలిక్కుల దేశం” అని చెప్పి నిరాకరించారు. తాము హిందువులం కనుక కేధలిక్కు చట్టం వర్తింపజేయొద్దని సవిత దంపతులు వేడుకున్నప్పటికీ డాక్టర్లు కనికరించకపోవడంతో ఆమె గాల్వే యూనివర్సిటీ ఆసుపత్రిలో బాధతో రెండు రోజులు విలవిలలాడి అక్టోబరు 21న చనిపోయింది.

సవిత చావు పై విచారణ జరిపిన కమిటీ రెండు రోజుల క్రితమే నివేదిక వెలువరించింది. నివేదికలో కమిటీ డాక్టర్లను తప్పు బట్టింది. పిండాన్ని కాపాడడం పైనే డాక్టర్లు తమ దృష్టి అంతా కేంద్రీకరించకుండా ఉంటే సవిత బతికి ఉండేదని నివేదిక పేర్కొంది. “పిండం గుండె ఆగిపోయేవరకూ తాము జోక్యం చేసుకోకూడదన్న సూత్రం పైన డాక్టర్లు అతిగా కేంద్రీకరించడం జరిగిందని పరిశోధన బృందం భావిస్తోంది. దానితో పాటు తల్లికి ఇన్ఫెక్షన్, సెప్సిస్ సోకే ప్రమాదం నివారించడం పైనా, ఆమె ఆరోగ్య నిర్వహణ పైనా తక్కువ దృష్టి పెట్టడం కూడా జరిగింది” అని నివేదిక పేర్కొంది.

అయితే ఈ నివేదికను సవిత భర్త తిరస్కరించాడు. తన భార్య చావుకు కారకులెవరైనదీ నివేదిక తేల్చలేదని ఆయన అసంతృప్తి చెందాడు. తన భార్య నొప్పితో తీవ్రంగా బాధపడుతూ పిండం తొలగించమని వేడుకున్నా ఎందుకు నిరాకరించారో నివేదిక చెప్పలేదని ఆయన భావిస్తున్నట్లు ఆయన తరపు లాయర్ తెలిపాడు.

ఈ నేపధ్యంలో ఐ.ఎం.ఒ సమావేశం ఐరిష్ ప్రభుత్వం తలపెట్టిన చట్టాన్ని తిరస్కరించడంతో ఆధునికులుగా చెప్పుకునే యూరోపియన్లు నిజానికి పరమ మూడత్వంతో బతుకుతున్నారని స్పష్టం అవుతోంది. కిల్లర్ని లో జరిగిన వార్షిక సమావేశంలో అబార్ధన్ చట్టంలో మార్పులను డాక్టర్లు మెజారిటీ ఓటింగ్ ద్వారా తిరస్కరించారని ది హిందు తెలిపింది. దీనితో ఐర్లండులో ప్రధాన మెడికల్ వృత్తి సంఘం అయిన ఐ.ఎం.ఒ ప్రభుత్వంతో ఘర్షణకు సిద్ధపడినట్లు స్పష్టం అవుతోంది. కేవలం తల్లికి ప్రమాదం ఏర్పడిన కేసుల్లో అబార్షన్ చెయ్యొచ్చన్న చిన్న మార్పును కూడా డాక్టర్లు భరించలేకపోవడం గర్హనీయం.

5 thoughts on “ఐరిష్ అబార్షన్ చట్టం: డాక్టర్లా లేక మత బోధకులా?

  1. Life is life, wether it is small or big….we have to see equally both mother and foetus. They both have the same right to live…as we see superficially we weigh the mother only the worthful…but actually both are the same worthful to live…this is not blind faith..this the same respect that u are showing about mother…at the same time when it is dangerous they should think of doing abortion also….

  2. Of course! those Irish doctors are not just idiots. They are fenatically blind, brutal and INHUMAN too. If traditions are enough to govern the people why do we need constitution?

    A foetus’s nervous system is not as sophisticated as that of mother’s. Now, do the math to come to a conclusion of which one would experience more pain. Why cannot the logic of weighing the both on par be applied to the animals and birds that are raised especially for extracting meat? Only if you are willing to take off the religion and the opinions indoctrinated by the religion, would one be able to see the veritability of the demand that a grown ups life should be favoured to a lump of cells (foetus).

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s