పంపిణీ, పెట్టుబడిదారీ పూర్వ అధిక-వడ్డీ మరియు వర్తక పెట్టుబడులు


అహ్మదాబాద్ కు 70 కి.మీ దూరంలోని కేలా గ్రామంలోని దృశ్యం ఇది. అర లక్షకి పైగా పలుకుతున్న ఎద్దులను కొనలేక ఆడపడచులకు కాడినిచ్చి పత్తి విత్తనాలు నాటుతున్నారు. (ఫొటో: ఎ.ఎఫ్.పి, జులై 2010)

అహ్మదాబాద్ కు 70 కి.మీ దూరంలోని కేలా గ్రామంలోని దృశ్యం ఇది. అర లక్షకి పైగా పలుకుతున్న ఎద్దులను కొనలేక ఆడపడచులకు కాడినిచ్చి పత్తి విత్తనాలు నాటుతున్నారు. (ఫొటో: ఎ.ఎఫ్.పి, జులై 2010)

భారత వ్యవసాయ రంగంలో మార్పులు -ఒక నోట్ -పార్ట్ 2

      పంపిణీలు & ఉత్పత్తి (Distributions & Production): భూమి అద్దె, వేతనాలు, వడ్డీ మరియు లాభ మొత్తం లను పంపిణీ కిందా, భూమి, శ్రమ మరియు పెట్టుబడి మొత్తం లను ఉత్పత్తి కిందా మార్క్స్ చర్చించారు. “పంపిణీ రూపాలలో ఉండే వడ్డీ మరియు లాభాలు ‘పెట్టుబడి, ఉత్పత్తి యొక్క ప్రతినిధి (agent of production)’ అనే పూర్వాలోచన (presupposes) కలిగి ఉంటాయి” అని కూడా మార్క్స్ అంటారు. ఈ పంపిణీ విధానాలు (modes of distribution), ‘పెట్టుబడి, ఉత్పత్తికి యొక్క ప్రతినిధి’ అనే పూర్వాలోచనను కలిగి ఉంటాయి, అలాగే పెట్టుబడి యొక్క పునరుత్పత్తి విధానాలు (modes of reproduction of capital) కూడా అదే పూర్వాలాచోనను కలిగి ఉంటాయి. పంపిణీ యొక్క నిర్మాణం ఎలా ఉండాలనేది పూర్తిగా ఉత్పత్తి యొక్క నిర్మాణం చేతనే నిర్ణయించబడుతుంది. ఉత్పత్తిలో నిర్దిష్ట పద్ధతిలో పాల్గొనే విధానమే నిర్దిష్ట పంపిణీ రూపాలను ఉత్పన్నం చేస్తుంది.

     మార్క్స్ ఇలా వివరిస్తారు- అన్ని ‘ఆక్రమణ’ (conquest) లలోనూ విజేతలైనవారు పరాజిత ప్రజలను “తమ సొంత ఉత్పత్తి విధానం కిందకు లోబరుచుకుంటారు (ఉదా: ఈ శతాబ్దంలో ఐర్లండులో ఆంగ్లేయులు, ఇండియాలో కొంతవరకు); లేదా పాత విధానాన్ని కదపకుండా అట్టేపెట్టి కప్పంతో సరిపెట్టుకుంటారు (ఉదా: టర్కులు మరియు రోమన్లు); లేదా ఏదైనా నూతన తరహా సంశ్లేషణ (synthesis) ఉత్పన్నమయే విధంగా పరస్పర చర్యలు జరుపుకుంటారు (జర్మనీ ఆక్రమణలు, కొంతవరకు).” (A contribution to critique of Political Economy). అన్నింటిలోనూ నూతన పంపిణీ విధానం ఉద్భవించడానికి ఉత్పత్తి విధానమే నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది.

     కనుక, ఉత్పత్తి, పంపిణీ, మార్పిడి (exchange) మరియు వినియోగం- వీటి మధ్య ఉండే అంతస్సంబంధాన్ని దానియొక్క ఖచ్చితమైన సందర్భం (context) తోటి అన్వయించుకోవాలి.

     మార్క్స్ ప్రకారం, ఉత్పత్తి క్రమంలోనే ఇమిడి ఉంటూ ఉత్పత్తి నిర్మాణాన్ని సైతం నిర్ణయిస్తున్న పంపిణీ యొక్క స్పష్టమైన ఫలితమే ఉత్పత్తుల (బాహ్య) పంపిణీ. ఉత్పత్తి క్రమంలోని అంతర్గత పంపిణీని పట్టించుకోని ఉత్పత్తి పరిశీలనను నిరర్ధక సారాంశం (empty abstraction) గా ఆయన పేర్కొన్నారు. (K.Marx: Grundrisse-Marxist Internet Archive).

     నిజానికి ఉత్పత్తి, పంపిణీ, మార్పిడి, వినియోగం ఇవన్నీ సమరూపులే, కానీ అవన్నీ ఒక ఐక్యతలో ఇమిడి ఉండే సంపూర్ణ విశిష్టత యొక్క సభ్యులను ఏర్పరుస్తాయి. (Actually the production, distribution, exchange & consumption are identical, but they all form the members of a totality distinction within a unity.) ఒక నిశ్చిత ఉత్పత్తి ఒక నిశ్చిత పంపిణీ, వినియోగం, మార్పిడిలను నిర్ణయిస్తుంది, కానీ “పంపిణీలో ఒక మార్పు సంభవిస్తే అది ఉత్పత్తిని కూడా మార్చవచ్చు; ఉదాహరణకి పెట్టుబడి కేంద్రీకరణ, పట్టణము గ్రామాల మధ్య జనం భిన్న రీతుల్లో విభజించబడడం మొదలైనవి.” అంతిమంగా వినియోగం అనే అవసరం ఉత్పత్తిని నిర్ణయిస్తుంది. అంటే, “విభిన్న కదలికల మధ్య పరస్పర చర్య, ప్రతిచర్యలు జరుగుతాయి.” (K.Marx : Grundisse, MEIA –Marx Engels Internet Archive).

     పెట్టుబడిదారీ పూర్వ సంబంధం- అధిక-వడ్డీ (usury) మరియు వర్తక పెట్టుబడులు: పెట్టుబడిదారీ పూర్వ విధానం యొక్క గర్భం నుండి పెట్టుబడిదారీ వ్యవసాయం అభివృద్ధి చెందింది; మరియు పెట్టుబడిదారీ పూర్వ సంబంధం అధిక వడ్డీ, వర్తక పెట్టుబడులతో కలపబడి ఉంటుంది; కనుక ఒక ఆర్ధిక వ్యవస్ధలో అవి నిర్వహించే పాత్ర కూడా ఒక ఆర్ధిక పరివర్తనను అవగాహన చేసుకోవడానికి సాయపడుతుంది.

     అధిక-వడ్డీ పెట్టుబడి, వర్తక పెట్టుబడి కవల సోదరులు. ఇవి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి ముందు సుదీర్ఘ కాలం పాటు కొనసాగాయి. చారిత్రకంగా అధిక-వడ్డీ పెట్టుబడి అభివృద్ధి వర్తక పెట్టుబడి అభివృద్ధితో, ముఖ్యంగా మనీ డీలింగ్ పెట్టుబడి అభివృద్ధితో జతకూడి ఉంటుంది. (K.Marx : Capital III; Progress publishers, Moscow 1983, P: 593).

     పెట్టుబడిదారీ పూర్వ సంబంధంలో అధిక-వడ్డీ పెట్టుబడి ఏయే రూప లక్షణాలను కలిగి ఉన్నదంటే: (1) “అమిత వ్యయపరులైన ఉన్నత వర్గాలకు అప్పులిచ్చి సంపాదించే అధిక-వడ్డీ, (2) సొంత శ్రమ పరిస్ధితి కలిగి ఉన్న చిన్న ఉత్పత్తిదారులకు అప్పులు ఇవ్వడం ద్వారా వసూలయే అధిక-వడ్డీ – ఇందులో చేతి వృత్తుల వారు కూడా కలిసి ఉన్నారు, కానీ రైతాంగమే ప్రధానం; ఎందుకంటే, ప్రత్యేకంగా పెట్టుబడిదారీ పూర్వ పరిస్ధితిలో చిన్న స్వతంత్ర వ్యక్తిగత ఉత్పత్తిదారులను అనుమతించిన మేరకు, అనివార్యంగా వారిలో రైతాంగ వర్గమే ప్రబల మెజారిటీ. (Ibid, P: 594)

     భూమి సొంతదారులు శిధిలం కావడం, రైతులు, చిన్న ఉత్పత్తిదారులను దరిద్రంలోకి నెట్టివేయడం ద్వారా ద్రవ్య పెట్టుబడి పెద్ద మొత్తంలో ఏర్పడి, కేంద్రీకరించబడింది. అయితే మార్క్స్ ఏం చెబుతాడంటే, పాత ఉత్పత్తి విధానంతో ఈ క్రమం ఎంతవరకు రద్దు అవుతుంది అనేది, ఆధునిక యూరప్ లో జరిగినట్లుగా, మరియు అది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని ఆధిపత్య స్ధానంలో ఉంచేదీ లేనిదీ, చారిత్రక అభివృద్ధి దశ మరియు ఉనికిలో ఉన్న పరిస్ధితులపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. (Ibid, P: 594)

     అధిక-వడ్డీ పెట్టుబడి, తాను ఆధిపత్యాల దశలో ఉన్నపుడు “పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో జరిగినట్లుగా, ఉత్పత్తివిధానాన్ని బలహీనపరుస్తుంది; ఉత్పాదక శక్తులను అభివృద్ధి చేయడానికి బదులు శక్తి విహీనం చేస్తుంది; అదే సమయంలో శ్రమ శక్తిని సైతం దెబ్బతీసే విధంగా శ్రామికుల సామాజిక ఉత్పాదకత అభివృద్ధిని ఆటంక పరిచే యమ యాతన పరిస్ధితిని కొనసాగింపజేస్తుంది.” (Ibid, P: 596)

     పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో అధిక-వడ్డీదారుడు ఇక ఎంత మాత్రం ఉత్పత్తిదారులను వారి ఉత్పత్తి సాధనాల నుండి వేరు చేయలేడు, ఎందుకంటే వారు అప్పటికే వేరు చేయబడ్డారు కనుక. ఉత్పత్తి సాధనాలు వ్యాప్తి చెందిన చోట (dispersed) అధిక-వడ్డీదారుడు డబ్బు సంపదను కేంద్రీకరింపజేస్తాడు. అది ఉత్పత్తి విధానాన్ని మార్చజాలదు. (Ibid, P: 596)

     సరుకు పెట్టుబడి మరియు డబ్బు పెట్టుబడులను వ్యాపార పెట్టుబడి మరియు మనీ డీలింగ్ పెట్టుబడులుగా మారడం గురించి మళ్ళీ కేపిటల్ వాల్యూం II, పార్ట్ IV [పేజీ 267] లో చర్చించబడింది.

   ట్రేడింగ్ కేపిటల్ తో వ్యాపారం చేసే వర్తకులను వ్యాపార పెట్టుబడి మరియు మనీ డీలింగ్ పెట్టుబడిగా విభజించవచ్చు. మార్కెట్ లోని సర్క్యులేషన్ రంగంలో సరుకు పెట్టుబడిగానూ, దాని రూపాంతరాలలోనూ ఉనికిలో ఉండే పెట్టుబడిని సర్క్యులేషన్ పెట్టుబడిగా ప్రత్యేకంగా వర్గీకరిస్తారు. ఉత్పాదక పెట్టుబడిగా అది నిర్వహించే విధులతో పోలిస్తే దీని విధులు విభిన్నంగా ఉంటాయి. మార్కెట్ లో కనిపించే ఈ రూపాంతరం చెందిన సర్క్యులేషన్ పెట్టుబడిలోని భాగం వ్యాపార పెట్టుబడి తప్ప మరొకటి కాదు. ఇది అన్నివేళలా సర్క్యులేషన్ రంగంతో చుట్టుముట్టబడి ఉంటుంది. (Ibid, P: 268)

     వర్తక పెట్టుబడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది కేవలం సర్క్యులేషన్ రంగంలో విధులు నిర్వర్తించే పెట్టుబడి మాత్రమే. పునరుత్పత్తి అనే మొత్తం ప్రక్రియలో సర్క్యులేషన్ అనేది ఒక దశ మాత్రమే. సర్క్యులేషన్ క్రమంలో ఏ విలువా సృష్టించబడదు. కనుక అదనపు విలువ కూడా ఉండదు. (Ibid, P: 279)

     వర్తక పెట్టుబడితో కేవలం సరుకుల రూపాంతరాలు మాత్రమే ఇమిడి ఉంటాయి. “ఉత్పత్తి చేయబడిన సరుకుల అమ్మకంలో అదనపు విలువ లభించినట్లయితే, అది అప్పటికే సరుకులలో ఉండడమే దానికి కారణం. కనుక రెండో చర్యలో సరుకుల (ఉత్పత్తి యొక్క అంశాలు –elements of production) తో డబ్బు పెట్టుబడి జరిపే పునఃమార్పిడిలో కొనుగోలుదారు కూడా ఎలాంటి అదనపు విలువనూ పొందలేడు.” (Ibid, P: 279). పారిశ్రామిక పెట్టుబడి లాగా వ్యాపార పెట్టుబడిని ఉత్పాదక పెట్టుబడి నుండి వేరుపరిచే ఈ అవగాహన చాలా ముఖ్యం.

     కనీసం ప్రత్యక్షంగా అయినా వర్తక పెట్టుబడి ఎలాంటి విలువను గానీ, అదనపు విలువను గానీ సృష్టించదని మార్క్స్ స్పష్టంగా చెప్పారు. సర్క్యులేషన్ కాలాన్ని తగ్గిస్తుంది కనుక పరోక్షంగా పారిశ్రామిక పెట్టుబడిదారులు ఉత్పత్తి చేసే అదనపు విలువను పెంచుకోవడానికి ఇంతవరకూ అది సహాయపడి ఉండవచ్చు. (Ibid, P: 280)

     వర్తక పెట్టుబడి యొక్క ఈ విధి పారిశ్రామిక పెట్టుబడి యొక్క ఉత్పాదకతను, దాని పోగుబడిని ప్రోత్సహిస్తుంది. (Ibid, P: 280). వ్యాపార పెట్టుబడితో అదనపు విలువకు ఉండే సంబంధం గురించి మళ్ళీ ప్రస్తావించబడింది:

     “తన వాస్తవ విధి అయిన అమ్మకానికి వీలుగా కొనుగోలు చేసే ప్రక్రియకు పరిమితం అయ్యే వ్యాపార పెట్టుబడి… విలువను గానీ, అదనపు విలువను గానీ సృష్టించదు.” (Ibid, P: 282)

     వర్తక పెట్టుబడి యొక్క మరో లక్షణం ఏమిటంటే, వర్తక పెట్టుబడి యొక్క సాపేక్షక వృద్ధి పునరుత్పత్తి క్రమం యొక్క వృద్ధికి విలోమానుపాతంలో ఉంటుంది. దానిని మార్క్స్ ఈ కింది పేరాలో వివరించారు.

   “ఇతర పరిస్ధితులన్నీ అదే విధంగా కొనసాగుతున్నాయని ఊహించినట్లయితే, వర్తకుల యొక్క సాపేక్షక పెట్టుబడి మొత్తం, (హైబ్రిడ్ రూపాలకు ప్రాతినిధ్యం వహించే చిన్న డీలర్ ను మినహాయించి), సాధారణంగా, దాని టర్నోవర్ యొక్క వేగానికి విలోమానుపాతంలోనూ, తత్పర్యవసానంగా పునరుత్పత్తి యొక్క శక్తికి విలోమానుపాతంలోనూ ఉంటుంది.” (Ibid, P: 287)

     ఆసియా రూపాలలో ఆర్ధిక క్షీణత మరియు రాజకీయ అవినీతిలకు మించి ఇంకేమీ ఉత్పత్తి చేయకుండానే అధిక-వడ్డీ దోపిడి సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. ఎప్పుడైతే మరియు ఎక్కడైతే పెట్టుబడిదారీ ఉత్పత్తుల పూర్వావసరాలు (prerequisites) ఉనికిలో ఉంటాయో, అప్పుడే ఒకవైపు ఫ్యూడల్ ప్రభువులను, చిన్న ఉత్పత్తిదారులను నాశనం చేయడం ద్వారాను, మరో వైపు శ్రామిక పరిస్ధితులను పెట్టుబడిలోకి కేంద్రీకరింపజేయడం ద్వారాను నూతన ఉత్పత్తి విధానం నెలకొనడానికి సహాయం చేసే సాధనాల్లో ఒకటిగా అధిక-వడ్డీ పెట్టుబడి పని చేస్తుంది.

     ఇక్కడొక విషయాన్ని నొక్కి చెప్పాలి. “అధిక-వడ్డీ పెట్టుబడి, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఉనికిలో లేకుండానే పెట్టుబడిదారీ లక్షణాలున్న దోపిడీ పద్ధతిని ఉపయోగిస్తుంది.” (Ibid, P: 597)

     భూ సంపదనుండి స్వతంత్రంగా ఉన్న డబ్బు సంపద (కూడబెట్టినది) – ఇది కేవలం డబ్బే తప్ప పెట్టుబడి కాజాలదు. కానీ అధిక-వడ్డీ సాధనం ద్వారా అతను అదనపు శ్రమను కొంత భాగంగా గానీ లేదా మొత్తంగా గానీ స్వాయత్తం చేసుకుంటాడు, మరియు ఉత్పత్తి సాధనాలలో కొంత భాగం పైన పట్టు సంపాదిస్తాడు. ఆ విధంగా “అధిక-వడ్డీ (usury), ఉత్పత్తి యొక్క సూక్ష్మ రంధ్రాలలో నివసిస్తుంది.” (Ibid, P: 598)

     వడ్డీ (interest) తో కూడిన పెట్టుబడి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో అత్యవసర అంశం. అధిక-వడ్డీ పెట్టుబడితో పోలిస్తే దీనికి ఉండే విభిన్న లక్షణం పెట్టుబడి యొక్క స్వభావానికి లేదా గుణానికి సంబంధించినది ఎంత మాత్రం కాదు. అది కేవలం తాను ఏ పరిస్ధితుల కింద అయితే ఆపరేట్ అవుతుందో, ఆ పరిస్ధితుల్లో వచ్చిన మార్పు మాత్రమే. అంతేకాక అది ఋణ గ్రహీత స్వభావంలో వచ్చిన మార్పు కూడా. పారిశ్రామిక వేత్త లేదా వర్తకుడి స్ధానంలో ఉండి చెల్లింపులు లేని శ్రమను ఋణ పెట్టుబడి ద్వారా స్వాయత్తం చేసుకోగల ఋణ దాతతో మారిన ఋణ గ్రహీత ఘర్షణ పడతాడు.

     పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క సాధారణ ధోరణి గురించి – మరింత అదనపు విలువను ఉత్పత్తి చేసే సాధనంగా తద్వారా పెట్టుబడిదారులను మరింత సంపన్నులను కావించే సాధనంగా కనిపించే విస్తరించబడిన స్ధాయి (estended scale) సంచయం లేదా ఉత్పత్తి… పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క సాధారణ ధోరణిలోనే ఇమిడి ఉంటుంది. (K.Marx: Capital Vol. II; Progress publishers Moscow, 1986, P: 81)

“కూడబెట్టే విషయానికి వస్తే, అది సరుకు ఉత్పత్తులన్నింటిలోనూ సాధారణంగా కనిపించే అంశం మరియు అభివృద్ధి చెందని పెట్టుబడిదారీ పూర్వ ఉత్పత్తి విధాన రూపంలో దానికదే (కూడబెట్టడం) అంతిమంగా కూడా కనిపిస్తుంది.” (Ibid, P: 85)

రిజర్వ్ ఫండ్:

     సంచిత నిధి (accumulation fund) సబార్డినేట్ స్వభావం కలిగిన ప్రత్యేక సేవ కూడా నిర్వర్తించగలదు. దీనర్ధం ఏమిటంటే, ఈ క్రమం P…P అనే రూపాన్ని పొందకుండానే, తద్వారా పెట్టుబడిదారీ పునరుత్పత్తిలోకి విస్తరించకుండానే, వలయాకారాలలోని పెట్టుబడుల కదలికలోకి అది ప్రవేశించగలదు.

2 thoughts on “పంపిణీ, పెట్టుబడిదారీ పూర్వ అధిక-వడ్డీ మరియు వర్తక పెట్టుబడులు

  1. some articles should be read in english only. They will be understood when read directly. Otherwise when translating in to TELUGU the articles, keeping the central idea in mind, write it as telugu article. I appriciate your efforts in conveying the article to read further. I felt like that I just write to you this.Thank you for your efforts.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s