‘యోవాని సాంఛేజ్’ పశ్చిమ దేశాలకు మహా ఇష్టురాలు. క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి ప్రకటించడం దానికి కారణం. ఆమె ఈ మధ్య ప్రపంచ పర్యటనకి బయలుదేరింది. క్యూబాలో జనం ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆవిడ ప్రచారం చేస్తోంది. యోవాని అసమ్మతిని క్యూబా ప్రభుత్వం సహించలేకపోతోందని, ఆమె భావ ప్రకటనా స్వేచ్చని హరిస్తోందని అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాలు మొత్తుకుంటాయి. ఆమె అసమ్మతి సహజంగానే పశ్చిమ కార్పొరేట్ పత్రికలలో ప్రముఖ స్ధానం పొందుతోంది.
యోవాని భావ ప్రకటన స్వేచ్చ కోసం పరితపించే పశ్చిమ పత్రికలు అదే చేత్తో తమ దేశాల అసమ్మతిదారులను మాత్రం అణచిపారేయ్యాలని ప్రభోదిస్తాయి. బ్రిటన్ లో రెండు సంవత్సరాల క్రితం చెలరేగిన తోట్టెన్ హామ్ ప్రజల అసమ్మతిని బ్రిటన్ ప్రధాని కామెరాన్ దగ్గర్నుండి, పోలీసులు, కోర్టుల వరకు ఎంత పాశవిక దృక్పధంతో వ్యవహరించాయో చరిత్ర రికార్డు చేసింది. అమెరికా రాయబారుల చీకటి కార్యకలాపాలను వెలికి తీసిన వికీ లీక్స్ అధినేత జులియన్ అసాంజే పై పశ్చిమ పత్రికల విష ప్రచారం వర్తమాన చరిత్ర. అసాంజే ను ఎలాగయినా అమెరికాకి రప్పించి ఖైదు చేయాలని అమెరికా స్వీడన్ పాలకులను అడ్డు పెట్టుకుని చేస్తున్న కుట్రలు జగద్విదితం.
భావ ప్రకటనా స్వేఛ తమకు తమ అనుకూలురకు ఒక విధంగా అన్వహించే పశ్చిమ దేశాలు, పత్రికలు తమ వ్యతిరేకులకు మాత్రం దానికి వ్యతిరేక దిశలో అన్వయిస్తాయి. తమ కొక న్యాయం, తమ వ్యతిరేకులకు ఒక న్యాయం. అమెరికా తదితర పశ్చిమ దేశాల ద్వంద్వ నీటిని ఈ కార్టూన్లు వెల్లడిస్తున్నాయి. బ్రెజిలియన్ కార్టూనిస్టు కార్లోస్ లాతుఫ్ గీసిన ఈ కార్టూన్ ను మంత్లీ రివ్యూ పత్రిక ప్రచురించింది.
-FREEDOM OF EXPRESSION, MADE IN USA-
double standards of western countries 🙂 …..avakasavadani pettindi peru paschima desau.