మా తాగడుకు మహేష్ బాబే కారణం, ఇద్దరు యువకుల ఫిర్యాదు


Mahesh Babu in Royal Stag Adఇది బొత్తిగా ఊహించని పరిణామం. తాగుడుతో తమ ఒళ్ళు గుల్ల అవడానికి కారణం సినిమా హీరో మహేష్ బాబే అని ఆరోపిస్తూ ఇద్దరు యువకులు రాష్ట్ర మానవ హక్కుల సంస్ధకు ఫిర్యాదు చేశారు. ఒక పేరు పొందిన లిక్కర్ బ్రాండు (రాయల్ స్టాగ్) కు మహేష్ బాబు ప్రచారం చేశాడని, తాము ఆయనకు పిచ్చి ఫ్యాన్ లము కావడంతో తాము కూడా తాగడం ప్రారంభించామని సతీష్ కుమార్, అమ్రు నాయక్ లు ఫిర్యాదు చేశారు.

తాగుడు వలన తమ ఆరోగ్యం క్షీణించిందని ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము మహేష్ బాబును తీవ్రంగా అభిమానిస్తామని, దానితో ఆయన ఇచ్చే బహిరంగ ప్రకటనలను ఆరాధనతో అనుసరిస్తామని ఆ విధంగా తాము మహేష్ ప్రచారం చేసిన లిక్కర్ కు అలవాటు పడ్డామని తెలిపారు. రాష్ట్రమంతటా మహేష్ బాబుతో ఉన్న లిక్కర్ ప్రకటనల హోర్డింగులన్నీ తొలగించాలని కోరారు. మహేష్ బాబుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందున ఆయన ప్రకటనలు మరింతమంది తాగుబోతులను తయారు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాగుడు వలన తన భార్య తనను వదిలిపోయిందని అమ్రు నాయక్ ఫిర్యాదు చేశాడు. సతీష్ కుమార్ అయితే తాగుడు వలన తాను ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్లలేకపోతున్నానని ఫిర్యాదు చేశాడు. తాగుడు కోసం ఇప్పుడు తాను రోజుకు 1000 రూపాయలు తగలేస్తున్నానని సతీష్ తెలిపాడు. పి.జి చదివినా తాగుడు వలన ఆరోగ్యం దెబ్బ తినడంతో పోటీ పరీక్షలకు హాజరు కాలేకపోతున్నానని తెలిపాడు.

ఫిర్యాదు పరిశీలించిన మానవ హక్కుల సంస్ధ సమగ్ర నివేదిక ఇవ్వాలని డి.జి.పి ని కోరింది. తదుపరి విచారణను జూన్ 5 తేదీకి వాయిదా వేసింది. ప్రకటనలో ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనే చట్టబద్ధ సూచన లేదని ఫిర్యాదుదారులు పేర్కోవడం గమనార్హం.

ది హిందు పత్రిక ప్రకారం మహేష్ బాబు రాయల్ స్టాగ్ కు తాను ఇచ్చిన ఎండార్స్ మెంట్ లో “తాగుడు ఆరోగ్యానికి హానికరం కాదు” అని చెప్పాడు. సినిమాల్లో మహేష్ బాబు (ఆ మాటకొస్తే ఏ హీరో లేదా విలన్ అయినా) తాగుతున్న దృశ్యం వచ్చినపుడు “మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అని సందేశం రావడం తెలిసిందే. జనానికి తాగబోయించి వేల కోట్ల రూపాయాల ఆదాయం సంపాదించే ప్రభుత్వాలు సినిమాలో తాగుడు దృశ్యాలు వచ్చినపుడు ‘హానికరం’ అని చెబితే సరిపోతుందని భావించడమే ఒక వింత అయితే, మహేష్ బాబు మరొక అడుగు ముందుకేసి అసలు తాగుడు హానికరమే కాదని చెప్పడం అత్యంత బాధ్యతారాహిత్యం, నేరసమానం.

నటించడం కళ కనుక నటనలో ఏమి చేసినా చెల్లిపోవడం జరుగుతోంది. ఒకేసారి వందలమందిని ఎగరేసి కొట్టినా, దేవుడిని చేసి ఆకుల్నో, పువ్వుల్నో రాల్చినా సినిమా నటన కనుక చెల్లిపోయింది. కానీ ఎంత డబ్బులిస్తే మాత్రం మద్యపానం ఆరోగ్యానికి హాని కాదని చెప్పడం ఏమిటి, డబ్బాశ కాకపోతే?!

ఇలాంటివారికి షటిల్ బాడ్మింటన్ లో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న గోపి చంద్ గురించి తెలిస్తే ‘పిచ్చోడు’ అనుకుంటారేమో. పెప్సి కోసం ప్రకటన ఇవ్వాలని గోపి చంద్ ని కోరినపుడు ఆయన నిరాకరించాడని చాలా మందికి తెలియదు. మొదట కోటి రూపాయలు ఇవ్వజూపిన పెప్సి కంపెనీ, ఆయన నిరాకరణతో ఫీజు కోటిన్నరకు పెంచిందట. “నేను తాగదనిదాన్ని తాగమని జనానికి ఎలా చెప్పమంటారు?” అని ప్రశ్నించి గోపి చంద్ పెప్సి ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు. బహుశా గోపి చంద్ ‘పిచ్చోడు’ అయితే కావచ్చు గాని ‘డబ్బు పిచ్చోడు’ మాత్రం కాదు అని సరిపెట్టుకోవాలేమో!

అప్ డేట్

మహేష్ బాబు పైన తప్పుడు ప్రచారం చేయడానికి ఈ టపా ఇచ్చినట్లు కొందరు పాఠకులు భావిస్తున్నట్లుంది. నాకా ఉద్దేశం లేదు. ఈ టపాకి ఉంచిన ఫీచర్డ్ ఫొటో మార్ఫడ్ ఫొటో అని కింద ఒక వ్యాఖ్యాత ఇచ్చిన లింక్ ద్వారా తెలుస్తోంది. అందువలన దానిని తొలగిస్తున్నాను. 

అయితే మహేష్ బాబు రాయల్ స్టాగ్ కంపెనీకి ఎండార్స్ మెంట్ ఇచ్చిన మాట నిజమేనన్నది గ్రహించాల్సిన విషయం.  ఆ విషయమై కొన్ని పత్రికలు జనవరిలోనే వార్తలు ప్రచురించాయి. ఆ లింక్స్ కింద ఇస్తున్నాను.

tupaki.com

massandhra.com

ది హిందు పత్రికకు లింక్ ఇక్కడ చూడండి.

మహేష్ బాబు ఒక మద్యం బ్రాండ్ ని ఎండార్స్ చేశాడంటే దాని అర్ధం ఆ బ్రాండ్ మద్య తాగొచ్చని చెబుతున్నట్లే. ఆయన ఎండార్స్ చేస్తే మాత్రం తాగుతారా అనేది వేరే ప్రశ్న. తాగేవాళ్లంతా తాగమని చెప్పరు. ఆ అవకాశం ఒక్క సెలబ్రిటీలకు మాత్రమే, అదీ డబ్బులు తీసుకుని మరీ, దక్కుతుంది. ఆ మేరకు మహేష్ బాబు తన ఎండార్స్‌మెంట్ కి బాధ్యత వహించవలసి ఉంటుంది.

26 thoughts on “మా తాగడుకు మహేష్ బాబే కారణం, ఇద్దరు యువకుల ఫిర్యాదు

 1. అందులో చూడండి Music CD అని ఉంది. రేపు మహేష్ చెప్పబోయేది కూడా ఇదే. Royal Stag music CD అని చూసి ఎందుకు అది లిక్కర్ అనుకున్నారబ్బా ?

 2. మహేష్ బాబు లిక్కర్ పెగ్గు ఎత్తి చూపిస్తున్న బొమ్మ హోమ్ పేజి లో ఉంది. కేవలం మ్యూజిక్ సి.డి అయితే రాయల్ స్టాగ్ యాడ్ ఉండదు కదా. (ఎత్తి చూపిస్తున్న పాత్రను ఏమంటారో నాకు తెలియదు. పెగ్గు అనేది నా ఊహ. తప్పయితే కావచ్చు.)

 3. లిక్కర్ ప్రకటనలు నిషేదించిన తర్వాత చాలా కంపెనీలు అదే పేరుతో మంచి నీళ్ళు (బాటిల్డ్ వాటర్), సోడా వంటి ఉత్పత్తులకు (అసలు వీటిని తయారు చేస్తారో లేదో తెలీదు; మార్కెట్లో ఎప్పుడూ చూడలేదు) ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించాయి. కనీసం పేరు అయినా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటుందని కావచ్చు. ఇదొక రకమైన తెలివి. పైన ఇచ్చిన ప్రకటన అటువంటిదే. పేరు రాయల్ స్టేగ్, కాని అది మ్యూజిక్ సీడీ ప్రకటనే. చేతిలో ఉన్నది కళ్ళద్దాలు.

  నిజానికి తాగమని ప్రోత్సహిస్తున్నది, విరివిగా మందును అందుబాటులోనికి తెస్తున్నది, ప్రభుత్వాలు. మరి వీరి మీద కేసులు పెట్టరేం?

 4. కిషోర్ గారు, నేను చెప్పింది ఈ పేజిలో ఉన్న ఫొటో కాదు. హోమ్ పేజిలో ఈ వార్త కోసం ఉంచిన ఫీచర్డ్ ఫొటో. ఫీచర్డ్ ఫొటోని ఈ పేజిలో నేను పెట్టలేదు.

 5. డబ్బు కోసం నటించే వాడు లక్షా తొంభై చెప్తాడు. మహేష్ బాబు చెప్తే మాత్రం…. తాగి చెడ కూడదని ఆ యువ కిశోరాలకు తెలీదా? కోర్టులో ఫిర్యాదు చేయొచ్చనే అతి తెలివి మాత్రం ఉంది పాపం! విశేఖర్ గారూ, మీరు ఆ యువకుల్ని ప్రశ్నించరేం? ఎవరి వ్యక్తి గత జీవితం వాళ్ళ బాధ్యత కాదా?

  నాకు తెల్సి మద్య పాన ప్రకటనల్ని నిషేధించాక అవి ఏవీ డైరెక్ట్ గా మద్యం తాగమని చెప్పేలా ఉండటం లేదు. మంచి నీళ్ళ బాటిళ్ళు, మ్యూజిక్ సీడీలు, జోకుల సీడీలు ఇలా అన్యాపదేశంగానే వాటి బ్రాండ్ ని మార్కెట్ చేసేలా ఉంటున్నాయి. ఇలాంటి లొసుగుల్ని ప్రోత్సహించే ప్రభుత్వాల్ని ప్రశ్నించాలి. డబ్బు కోసం నటించే వాళ్లని కాదు

 6. ఇద్దరు తాగుబోతులు ఏదో పిచ్చిపిచ్చిగా ఫిర్యాదు చేస్తే దాన్ని స్వీకరించే దశకు రాష్ట్ర మానవహక్కుల సంస్థ వచ్చిందా అనీ, అసలుకు ఇది మానవహక్కుల పరిథిలొకి ఎలా వస్తుంది, ఒకవేళ ఇది అలా వస్తే ఇంక ఏది రాదు అనీ నాకు ఆశ్చర్యంగా వుంది.

 7. అతి సర్వత్ర వర్జయేత్ – అన్ని రంగాల్లోనూ అతి మంచిదికాదు, దాన్ని విడనాడాలి అనేది కరెక్టే. కాని అతి మంచిది కాదు కాబట్టి మితంగా తీసుకోవడం లేక ఏదైనా చేయడం కూడా తప్పే నని అనగలమా? మద్యపానం విషయంలోనైనా అంతే. రోజుకు ఒకటి, రెండు పెగ్గులు తాగి, పుష్టికరమైన ఆహారం తీసుకుని చచ్చేదాకా ఎంతో ఆరోగ్యంగా వుండే వాళ్లు కోకొల్లలుగా వున్నారు. కనుక అసలుకు తాగడమే పెద్ద తప్పేననే బూటకపు నీతిసూత్రాలో, ఆరోగ్యసూత్రాలో పాటించదగినవి కావు. అలాగైతే ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు వట్టి వెధవాయిలేనా? బాగా అభివృద్ధిచెందిన దేశాల్లో, ఆమాటకు అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేకంలో సైతం ఈ పిచ్చి నీతి, ఆరోగ్యసూత్రాలు లేవే! కనుక ఒక వేళ ఏదైనా సందర్భంలో మహేష్ బాబు తాగడం తప్పు కాదు అని చెప్పివున్నా దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దాన్ని సందర్భోచితంగా యోచించి మదింపు చేసుకోవాలి గాని ఇలా పిచ్చి పిచ్చి ఫిర్యాదులు చేయడం తగదు.

 8. సుజాత గారు, యువకులను ప్రశ్నించడం చేయవలసిందే. అందులో సందేహం లేదు. కాని అది చాలా తేలిక. వ్యక్తిగతం జీవితం పూర్తిగా వ్యక్తుల చేతుల్లోనే ఉంటే వ్యక్తులను పూర్తిగా బాధ్యులను చేయగలం. కాని పరిస్ధితి అది కాదు కదా.

  మనిషి ప్రాధమికంగా సామాజిక జీవి. సమజాంలో ఉండే వివిధ పరిస్ధితులు ధోరణులే మనుషులను వివిధ రకాలుగా తయారు చేస్తాయి. సామాజిక పరిస్ధితులకు అతీతంగా మనిషి బతకలేడు కనుక ప్రతి అంశంలోనూ సమాజం యొక్క పాత్రను చూడడం అత్యవసరం.

  పైన కిషోర్ గారితో పాటు మీరూ అన్నట్లు ప్రభుత్వాలు ఒకపక్క అట్టహాసంగా వేలం పాటలు నిర్వహించి షాపులు తెరిపించి తాగబోస్తూ మరో పక్క మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడం ఎంత హిపోక్రసి? ఉంటే తాగించడం అన్నా ఉండాలి. లేదా అది వద్దు ఆరోగ్యం చెడుతుంది అనైనా చెప్పాలి. ఆరోగ్యం చెడుతుంది అని నమ్మితే మద్యం లేకుండా చూడాలి. అవేవీ చేయకుండా నీతులు చెప్పి ఊరుకోవడం మోసం కాదా?

  సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉండాలి అని అంగీకరిస్తే అది సెలబ్రటీలకూ ఉండాలి. ‘నాకు డబ్బు ఇస్తున్నారు కాబట్టి నేను ఏమైనా చెబుతాను. నువ్వే జాగ్రత్తగా ఉండు’ అనడం బాధ్యతారాహిత్యం కాదంటారా? తన అభిమానులు చూస్తెనే సినిమా నటులకు డబ్బులు. అలాంటివారికి మంచి చెప్పాలి గాని మంచి కానిదానిని చెప్పడం బాధ్యత కలిగినవారు చేసే పనేనా?

  నాకేమనిపిస్తోందంటే, కేసులు పెట్టినవారు నిజానికి తాగుబోతులు కాదేమోనని. ఒకరు విద్యార్ధి నాయకుడైతే, మరొకరు సోషల్ యాక్టివిస్టు అట. ఒకవేళ తాగుబోతులే అయినా వారు పెట్టిన కేసులు ఒక ప్రయోజనానికి దారి తీయవచ్చు. కోర్టు సరిగ్గా కేసును డీల్ చేసి ఎండార్స్ మెంట్లు ఇచ్చే సెలబ్రిటీలను హెచ్చరిస్తే, ఏదంటే ఆ ఉత్పత్తికి ప్రకటనలకు సిద్ధపడిపోవడానికి సెలబ్రటీలు జంకవచ్చు. ఆ కాస్త జరిగినా ప్రయోజనమే. ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి కదా. ఇది ఒక చిన్న ప్రారంభం ఏమో చూద్దాం, అని నా భావన.

 9. @ ఆ ఉత్పత్తికి ప్రకటనలకు సిద్ధపడిపోవడానికి సెలబ్రటీలు జంకవచ్చు…
  ఆ వస్తువులను మార్కెట్ లోని అనుమతిమ్చినపుడే పూర్తిగా నియమ నిభందనలు విధించాలి.
  ఇది ఆరోగ్యానికి హాని కలుగ చేసే వస్తువు కాబట్టి దీనికి ప్రచారాన్ని ఇవ్వటమూ.ప్రకటనలు ఇవ్వటమూ చేయరాదని.ఈ వస్తువులకు ప్రోమోట్ చేసే ఏ చర్యనూ ఉత్పత్తి దారులు చేపట్టరాదనే షరతులూ…చట్టాలూ తేవాలి.అంటే ప్రజల్లో మరింత విరివిగా ఈ వస్తువు చొచ్చుకు వెళ్ళే అవకాశమివ్వమనీ ప్రభుత్వం స్పష్టం గా చెప్పాలి…బెల్ట్ షాపులు లేక పొతే తాగుడు కొంతయినా తగ్గేది గ్రామాల్లో ఇదీ అలానే..

 10. In the past, Shah Rukh Khan, Saif Ali Khan, M S Dhoni, Harbhajan Singh and various other celebrities had endorsed the brand. Last year, Rana Daggubati was roped in to represent the brand and now Mahesh Babu is likely to replace him.

  v. shekar garu meru cheppedanni batti vellandaru tappu chesinattey ….vallu chestey leni problem mahesh chestey endukochindo nakardham kavatledhu…..tagudu tappaitey govt licence endukandi ichindi….tappu dwandwa pramanalalo vunda ? ledhu mahesh pracharam valla matramey jagirigindho ! funny controversy against mr.clean mahesh babu.

 11. శివమురళి గారు

  పైన అప్ డేట్ లో సెలబ్రిటీస్ అని కూడా చెప్పాను. అంటే సెలబ్రిటీలు ఎవరు చెప్పినా అది తప్పని నా అర్ధం. మహేష్ బాబు చెబితే తప్పనీ, మిగతా వాళ్లు చెబితే రైటనీ నా అర్ధం కాదు. నాకు మహేష్ బాబు అంటే ప్రత్యేక ద్వేషం లేదు. అలాగని ఇష్టమూ లేదు. అతనొక నటుడు. నేను అతన్ని అంతవరకే చూస్తాను.

  అయితే సెలబ్రిటీలకు ఒక ప్రత్యేక బాధ్యత ఉంటుందని నా అభిప్రాయం. వారిని అనుకరించే జనం ఉంటారు గనుక వారికా ప్రత్యేక బాధ్యత ఉంటుంది. తాగమని ఒక సుబ్బారావు చెప్పినా తప్పే, మహేష్ బాబు, షారుక్ లు చెప్పినా తప్పే. కాని ఒక సుబ్బారావుకు అభిమానులు, అనుచరులు, తన తరుపున మాట్లాడి, పోట్లాడే లక్షలాది జనం ఉండరు. వారంతా సెలబ్రిటీలకు ఉంటారు. అందుకే ప్రకటనదారులు వారి వెంటపడతారు. మా ఉత్పత్తిని ఎండార్స్ చేయమని కోట్లు కట్టబెడతారు. ఆ కోట్లు వారికి ఉండే అభిమానుల పుణ్యమే. అభిమానులే లేకపోతే సెలబ్రిటీల మొఖం ఎవరూ చూడరు. కాని ఆ కోట్లు వరకు తీసుకుని అభిమానులు ఏమైతే నాకేంటని ఆలోచించడం స్వార్ధం కాదా? ఈ పాయింటే నేను చెప్పదలిచింది. మీరు ఈ వైపు ఆలోచించి చూడండి.

  మహేష్ బాబు తరపున మీ వకాల్తా నేను కాదనను. కాని ఆయన చేసిన ప్రతిపనినీ సమర్ధిస్తే వ్యక్తిగా మీ ప్రత్యేకత పోతుంది. అది గుర్తించడం మీకూ అవసరమే. మహేష్ బాబు నటుడు కనుక ఆయన నటన బాగుంటే మెచ్చుకుందాం. బాగోకపోతే విమర్శిద్దాం. కాని ఆయన తప్పుల్ని కూడా నెత్తిమీద వేసుకోనక్కర్లేదని నా అభిప్రాయం. కాదు కూడదంటే, అది మీ యిష్టం.

 12. V.SHEKAR GARU MERU VYAKTHI GATAM GA TESKUNNATTUNNARU.. NENU MANDU TAGADANNI SAMARDINCHATLEDHU… “MAHESH” TARAPUNA “VAKALTANU” PUCCHUKOVATLEDHU .KANI GOVT LICENCE ISTUNDI…TAPPULEDHU?…..GOVT INCOME RABATUKKUNTUNDI TAPPULEDHU? MANA STATE LO “MADYAM MAFIYANEY” RUN CHESTUNNA VIJAYANAGARAM AMATYULANU ADIKARAM LO KURCHO BETTAM TAPPULEDHU?…. 66 SAMTSARALA SWATANTRA BARATAVANI LO MADYAM DISTRIBUTE CHEYAKUNDA ELECTIONS JARAGATLEDHU! PRABUTVALU MARATLEDU! “MADYAM” MATRAM PERUGUTUNDI? IVANNI TAPPULE ? >>>>>>>> VYAVASTA MOOLAL LONE LOSUGULUNDI ? VERINI PRASNICHEY DAMMU LEDHU EVARIKI? .. AFTRAL MAHESH BABU ANEY OKA NATUDU PRACHARAM CHEYADAM TAPPANI CHEPPAGAM! KANI ADEY NATUDU PRACHARAM CHESY MADYANNI MATRAM APAM? WHAT A DOUBLE STANDARDS? ANDARIDI AVAKASAVADAMEY…OKARIKI DABBU PICHI….INKODIKI ADIKARA PICHI…PERIGEY VATAVARANAM BATTI OKKADIKI OKKO PICHI VUNTUNDI ? తప్పుల్ని కూడా నెత్తిమీద వేసుకోనక్కర్లేదని chepparu. nenu madayam tagadam tappukadani cheppatledhu? moolalni vadili ….daniki virugu alochinchakunda? movie hero cheppadu mem tagam ani funny ga cheppadam bagundi…idi controversy cheyadam bagundi… “pilli toka eddu maditey eluka dukku erraga chusindanta pilli”…ippudu manam patti veladutundi kuda danney…..v.sher garu meru vyakthi gatam ga teskovaddu…na matala ardam meru ardam chesukolarani bavistunnanu. danyavadalu!

 13. శివ మురళి గారు, అదేం లేదు. నేను వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు. ప్రభుత్వ పెద్దల మోసాన్ని కూడా నేను పైన చెప్పాను. ఒక్క మద్యం మాఫియాయే కాదు. అనేక రకాల మాఫియాలు రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ల అండ లేకుండా మనలేవు.

  మద్యపానం ప్రోత్సహించడం ప్రభుత్వం చేస్తున్న తప్పు. పెద్ద తప్పు ముందు చిన్న తప్పు చిన్నదే అయినా తప్పు కాకుండా పోదు కదా. అలానే మహేష్ బాబు తప్పు. ఎంత చిన్నదే అయినా మహేష్, షారుఖ్, సైఫ్ ఇత్యాదులంతా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాకపోతే మహేష్ బాబుది ఈరోజు చర్చ అయింది. ఈ చర్చ ఉండేది కొన్ని రోజులే. తర్వాత అతని యాడ్ అలానే కొనసాగుతుంది.

  కోర్టులు, విచారణ ఇవన్నీ వ్యవస్ధలో ‘సరిజేసే ప్రక్రియ లాంటిది’ ఎదో జరుగుతోంది అనే భ్రమను కలగజేయడం తప్ప పరిష్కారం జరగడం లేదు. మీరన్నట్లు మూలాలను సవరించుకోవాలి. అదెలాగ అన్నది కూడా ప్రజలే ఆలోచించుకోవాలి. అలాంటి ఆలోచనల్లో ఈ కేసు ఒక ప్రారంభం కావచ్చు. కాకపోనూవచ్చు. కాని ఒక చర్చనైతే ప్రేరేపించింది కదా.

 14. “నాకేమనిపిస్తోందంటే, కేసులు పెట్టినవారు నిజానికి తాగుబోతులు కాదేమోనని”

  ఇదే నిజం అయి ఉండొచు.నాకు ఈ వార్త తెలిసినపుడే డౌట్ వచ్చింది.

  నేను మహేష్ అభిమానిని. ఈ యాడ్ చుసినపుడు సామాజిక బాధ్యత లేదే అని చురుక్కుమంది.

  అలా ఎవరో ఈ విధంగా ప్రతిస్పందించి ఉండొచ్చు.

  సెలెబ్రిటీ అనే హోదా సమాజం ఇచ్చినపుడు సామాజిక బాధ్యత కూడా ఉండాలి.

  టీనేజ్ పిల్లలపై తప్పక హీరొల ప్రభావం ఉంటోంది.

 15. Dabbuloste ae pani aina chaeyatsniki venukadani mentality…. nijamga tagudu entaga kutumbalnu nasanam chaestundo teliste ila chestara…aina janam kutumbala gurunchi mshesh ki aemi avasaram…kani amirkhan ni choosi nerchukovali..putte prati rendava bidda poshakahara lopamto pudutunnarani …malnutrition gurunchi govt. tarupuna endorse chrstunnadu adi janam patla bhadyata gala prema ante..mahesh kuda nijamga premunteexcise department tarupuna endorse chesi madyam hanikaram ani chrppochuga….commercial heroes nunchi anta responsibity asinchatam mana atyase avutundemo…

 16. సుద్దు గారు మీ వాదనను కాసేపు అంగీకరిద్దాం. యాడ్స్ చూసి చెడు అలవాటు చేసుకునేది వెధవలే అయితే, డబ్బులు తీసుకుని మరీ చెడు అలవాటు చేసుకొమ్మని చెప్పేవారు ఇంకెంత….!?

  ఇక్కడ గమనించవలసింది వెధవలు ఎవరు అని కాదు. ఒక వ్యక్తికి ఉండవలసిన సామాజిక బాధ్యత గురించి ఇక్కడ చర్చిస్తున్నాం. ఎవరైనా సరే, వారు సెలబ్రిటీయా కాదా అనేదానితో సంబంధం లేకుండానే, వారికి సామాజిక బాధ్యత ఉంటుంది. లేకపోతే మనకి జంతువులకీ తేడా ఉండదు. ఆ వ్యక్తిని నలుగురూ అనుసరిస్తున్న పరిస్ధితి ఉన్నపుడు అతని బాధ్యత ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. దానిని వారు పాటిస్తున్నారా లేదా అన్నది మరో చర్చ. కాని వారు పాటిస్తున్నారా లేదా అన్నదానితో సంబంధం లేకుండా వారికి బాధ్యత ఐతే ఉంటుంది కదా! ఉంటుంది అని అంగీకరిస్తె మహేష్ విమర్శనార్హుడు. ఉండదు అనేపనైతే… చాలా సమస్యలు ఉంటాయి.

  ఉదాహరణకి ఒకసారి పైరసీ సి.డిలు అమ్ముతున్నాడని వరంగల్ లోనో ఎక్కడో ఒకతనిపైన మహెష్ దాడి చేసాడని, పోలీసులకు అప్పగించాడని కొంత కాలం క్రితం వార్తలొచ్చాయి. పైరసి సి.డి లవల్ల నిర్మాత లేదా అలాంటివారు నష్టపోతున్నారని మహేష్ తదితర సినిమా పరిశ్రమ వ్యక్తుల ఫిర్యాదు. కాని ఆ బాధ్యతను పైరసీ సి.డిలు అమ్మిన వ్యక్తి ఎందుకు మోయాలి? తన డబ్బు కోసం తాను అమ్ముతున్నాడు అని మహేష్ బాబు సరిపెట్టుకుని ఉండొచ్చు కదా? దాడి చేసి, కొట్టినంత పనిచేసి పోలీసులకు ఎందుకు అప్పగించాడు? పైరసీ సి.డిలు అమ్మినందుకు అతనికి కోట్లు కాదు కదా, వేలు కూడా రావేమో. కొన్ని వేల కోసం కక్కుర్తి పడితేనే పోలీసులకి పట్తిస్తే, కోట్ల కోసం కక్కుర్తి పడి తాగమని ప్రోత్సహించినవారు ఇంకెంతటి నేరస్ధులు కావాలి? సెలబ్రిటీలు, వారి సమర్ధకుల వాదనలు తరిచి చూస్తే ఇలాంటి అపసవ్యతలు ఎన్నో కనిపిస్తాయి. చివరికి తేలేదేమిటంటే సామాజిక బాధ్యత సెలబ్రిటీలకు, మామూలు వ్యక్తులకు కూడా అవసరమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s