మోడి ఢిల్లీ ప్రయాణానికి దారెటు? -కార్టూన్


ది హిందు

ది హిందు

ఒక దేశానికి ప్రధాన మంత్రి అవాలంటే దేశం మొత్తానికి కనీసంగా ఐనా తెలిసి ఉండాలి. ప్రజలకు ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేకపోయినా ప్రధాన మంత్రి అభ్యర్ధి అనగానే ప్రజల మనసుల్లో ఒక భావన మెదలాలి. బహుశా దానిని ‘మాస్ అప్పీల్’ అని (లూజ్ అర్ధంలో) అనవచ్చేమో. బి.జె.పి పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవికి అభ్యర్ధిగా అనేకమంది బి.జె.పి నాయకుల నోళ్లలో నానుతున్న నరేంద్ర మోడీకి అలాంటిది ఉన్నదా అని ఈ కార్టూన్ ప్రశ్నిస్తున్నట్లుంది.

‘మాస్ అప్పీల్’ సంగతేమో గానీ ‘గోధ్రా అనంతర మారణకాండ అప్పీల్’ మాత్రం మోడీకి దండిగానే ఉంది. ఆ అప్పీలు నుండి తప్పించుకోవడానికే మోడి గత సంవత్సర కాలంగా వివిధ రూపాలు ధరించారు. వివిధ సందర్భాల్లో దీక్షలు కూడా ఆయన చేశారు. ఎన్ని చేసినా ఆయన దేశ నాయకుడు అనిపించుకోవడానికి తగిన పర్యటనలు (యాత్రలు) చేసినట్లు లేదు. పాదయాత్ర కాకపోయినా అద్వానీ లాగా ఆధునిక పళ్ల చక్రాలు నడిపే రధ యాత్రలన్నా ఆయన చేయలేదు. బీహార్ లాంటి చోట్ల ప్రచారానికి కూడా ఆయన్ని రానివ్వలేదు. ఇక దక్షిణ రాష్ట్రాలకు వచ్చిన దాఖలాలు లేవు. కనుక నరేంద్ర మోడి ఎలా నెగ్గుకొస్తారో చూడాల్సిందే.

అసలు ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ గెలవని మన్మోహన్ సింగే తొమ్మిదేళ్లు ప్రధాని కాగా లేనిది మోడి ఎందుకు కాగూడదు అంటారా? అయితే, ఓ.కే.

5 thoughts on “మోడి ఢిల్లీ ప్రయాణానికి దారెటు? -కార్టూన్

 1. ఇక నితిష్ కూమార్ ఆయనను ప్రచారానికి పిలవకపోవటం పాతపడిన విషయం. ప్రధాని పదవికి పోటి పడుతూ కూడా మోడి, నితిష్ కుమార్ ను కాకా పట్టటానికి సిద్దంగాలేడు. ఈ మధ్య ముఖ్యమంత్రిగా గెలిచిన తరువాత ఎక్కడ కూడాను ఆయనతో మాట్లాడటం సంభవించలేదు.
  మోడి నాయకత్వం లో బి జె పి గెలిచి అధికారానికి దగ్గరవస్తే, జయలలిత తప్పకుండా మోడికి పేచి పెట్టకుండా మద్దతు ఇస్తుంది. సౌత్ నుంచి ఒక పెద్దరాష్ట్రం అలా మోడిప్రధాని కావటానికి తోడ్పడుతుంది. సౌత్ లో ఒక్క కర్ణాటకలోనే బిజెపి కష్ట్టపడాలి. మిగతారాష్టాలలో ఆపార్టికి కనీస బలంలేదు.

 2. ఇది నేను ఈ బ్లొగ్ లొ వ్రాసే మొదటి తెలుగు వ్యాక్య, ఇప్పుడే e పలక ద్వారా తెలుగు లొ వ్రాయడం నేర్చుకున్నాను. మొదటిగా తెలుగులొ విజయ శేఖర్ గారికి నా హ్రుదయపూర్వక నమస్కారములు.
  ఇక నరెంద్ర మోడి గురించి ఎంత చెప్పినా ఎక్కువే!(ఎంత చెప్పినా తక్కువే కి వ్యతిరేకంగా వాడాను).ప్రచార పిచ్చి బగా ఎక్కువ, లేకపొతే అమెరికా కాంగ్రెస్ వాల్లకి డబ్బులిచ్చి ఆహ్వానించుకొవడమెమిటి ఖర్మ కకపొతే!!…..

 3. డా. అమర్ గారూ, హృదయ పూర్వక స్వాగతం, మరోసారి.

  అయితే మీరు కూడా త్వరలో తెలుగులో బ్లాగ్ మొదలు పెట్టాలని నా కోరిక. పరిశోధకులు గనుక మీ నుండి తెలుగు బ్లాగ్ పాఠకులు మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

 4. నాకు కూడా బ్లొగ్ వ్రాయాలనే ఉంది శేఖర్ గారు కాని సమయం కుదరడం లేదు. ఎదొ ఉదయం లేవగనె మల్లి సాయంత్రం పడుకునే ముందు దొరికిన సమయం లొ ఇలా మీ బ్లొగ్ మరియు కొన్ని తెలుగు పెపర్లు చదువుతూ ఉంటాను.అసలు మీ బ్లొగ్ నాకు మొన్న స్ర్ప్రింగ్ బ్రేక్ లొ ఈనాడు ద్వారా పరిచయమయింది,అప్పటి నుండి మీ బ్లొగ్ కి అభిమానిని.మీరు చేసే ఈ పని ఖచ్చితంగా అభినందనీయం.
  నాకు సమయం లేక పోవడం వల్ల నేను బ్లొగ్ వ్రాయలేను గాని మీరు గాని లేదా ఎవరయినా పాటకుడు గాని science and technology/engineering అంశం మీద ఎదయినా topic ఇస్తే మంచి వ్యాసం వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s