అవినీతిని నిలదీసేది దళిత మహిళ ఐతే…


Image: Saswat Pattanayak

Image: Saswat Pattanayak

ఆమె ఒక మహిళా సంఘం కార్యకర్త. అవినీతిని నిలదీయడం ఆమె చేసిన నేరం. ఆ మాత్రానికే అత్యంత ఘోరంగా ఆమె పైన అత్యాచారం చేసి, వింటేనే ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో హింసించి చంపేశారు. ఫిర్యాదు చేయబోయిన తండ్రి, కుమారుల పైనే నేరం బనాయించడానికి సిద్ధపడడం పోలీసుల వికృత లీలకు తాజా రూపం.

భూస్వామ్య కుల దురహంకారం ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహించే బీహార్ సీమ ఈ ఘోరానికి వేదిక. దేశం మొత్తం అభివృద్ధి పధంలో సాగడానికి తమ రాష్ట్రమే ఆదర్శమని ముఖ్యమంత్రి పీఠం ఎక్కింది లగాయితు జబ్బలు చరుచుకుంటూ తిరుగుతున్న నితీష్ కుమార్ ఏలుబడి అవినీతి రాక్షసుల మదోన్మాదానికి నేటి ప్రత్యక్ష సాక్షి.

జనవాది మహిళా సమితి కార్యకర్త రింకు దేవి ప్రకారం తమ సంఘం సభ్యురాలి పైన దుండగులు అత్యంత ఘోరంగా అత్యాచారం జరిపి హత్య చేశారు.

“అత్యంత క్రూరంగా మా సభ్యురాలిని అత్యాచారం చేసి చంపేశారు. కుటుంబ సభ్యుల ప్రకారం ఆమె ప్రైవేటు శరీర భాగంలో కర్రలు, మట్టి జొనిపారు. ఆమె నోటిలో గుడ్డలు కుక్కారు. గ్రామంలోని ఒక సైకిల్ షాపు వద్ద ఆమె మృత దేహం దొరికింది. మేము ఆందోళన చేస్తుంటే పోలీసులు మా పైనే కేసులు మోపారు” అని రింకు దేవిని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం రింకు దేవి ఈ విషయాలు చెప్పిందని పత్రిక తెలియజేసింది.

ఇంతకీ బాధితురాలు చేసిన తప్పేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించి అమలు చేస్తున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం’ (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme – MGNREGS) మరియు ‘ప్రజా పంపిణీ వ్యవస్ధ’ లలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడమే ఆమె చేసిన నేరం.

“మొదట పోలీసులు బాధితురాలి తండ్రి, కుమారులనే అరెస్టు చేశారు. కానీ వారిని విడుదల చేయాలని మేము ఆందోళన చేశాము. కుటుంబ సభ్యులు అంత క్రూరమైన దురాగతానికి ఎలా పాల్పడతారు? నేరస్ధులెవరో గ్రామంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ వారంతా భయంతో నోటికి తాళం వేసుకున్నారు” అని రింకు దేవి తెలిపింది.

వివిధ మహిళా సంఘాలు ఆగ్రహంతో ముజఫర్ పూర్ లోని 28వ నెంబరు జాతీయ రహదారి పై ఆందోళన చేపట్టాయి. ముజఫర్ పూర్ జిల్లాలోని మందయి గ్రామంలో దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. జిలా ఎస్.పి, డి.ఎస్.పి లు శనివారం దుర్ఘటన జరిగిన చోటును సందర్శించారు. తాము పోస్టు మార్టం రిపోర్టు కోసం చూస్తున్నామని వారు తెలిపారు. ఇంతవరకూ ఎవరూ అరెస్టు కాకపోవడం బట్టి నేరస్ధులకు ఉన్న పలుకుబడి అర్ధం అవుతోంది.

లైంగిక అత్యాచారం ఆధిపత్యాన్ని రుజువు చేసుకునేందుకు, అహంకారాన్ని మూర్తీభవింప చేసుకునేందుకు సాధనం. భారత దేశంలో అయితే అది కుల దురహంకారానికి, అగ్రకులాధిపత్యానికి ప్రతీకగా నిలవడం కొత్తేమీ కాదు. భూస్వామ్య విలువలు పచ్చిగా వ్యక్తం అయ్యే ఉత్తర భారతంలో అయితే మహిళలు తమ ఉనికిని చాటుకోవడం ఆధిపత్య శక్తులకు అంతకంతకు కంటగింపుగా మారుతోంది. అణిగి మణిగి ఉండవలసిన దళిత మహిళ, అలా ఉండకపోగా గ్రామస్వాముల అవినీతిని నిలదీయడం సహించరాని నేరం అయ్యాక ఇక క్రూరత్వానికి అవధులు ఉండవని మందయి మహిళ ఉదంతం చాటి చెబుతోంది.

పోలీసుల క్రూరత్వం, వారి ధనిక స్వాముల సేవకత్వం మందయి మహిళ అత్యాచారం విషయంలో సరికొత్త రికార్డులు రాసుకుందని చెప్పవచ్చు. ఒక మహిళ అత్యంత ఘోరంగా అత్యాచారానికి గురయితే ఎవరైనా ఆమె కుమారుడిని అనుమానిస్తారా? కుమారుడినే కాక, ఫిర్యాదు చేయబోయిన ఆమె భర్తను కూడా అనుమానించవచ్చని ముజఫర్ పూర్ పోలీసులు చెప్పదలిచారు. మహిళల హక్కులకు ఇంతకంటే దుర్దినం మరొకటి ఉండబోదు.

4 thoughts on “అవినీతిని నిలదీసేది దళిత మహిళ ఐతే…

  1. dhalithula meeda jaruguthunna athyacharalaku iisangatana paraakasta. delhi athyaa charam sangatana anantharam egasina mahilala mukthakantam dhalitha mahilala meedha enni jarigina moogapothundhi. kairlanjilu punaravratham avuthoothne untaaii.

  2. Before independence,people used to support naxalbari movement and telangana armed stuggle against landlords and higher caste people.but now such incidents stimulates suppressed youth to join and support anti social activities against such people.govt will hold resposible for this.govt should come forward to punish people involving such hated incidents. I request poor and dalith people that try to develop educationally,economically and politically.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s